షాడో ది స్పై కింగ్

ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు రాసిన మరో స్పై ఎడ్వెంచర్ “షాడో ది స్పై కింగ్“.

భారత దేశంలో వివిధ రాష్ట్రాలలోని పట్టణాలు, గ్రామాలలో వందలాది మంది హఠాత్తుగా చనిపోతున్నారు. అందుకు కూడా కారణాలు ఎవరికీ అర్థంకాలేదు. ఒక రోజు ఒక ఊరిలో దుర్ఘటన జరిగితే, మర్నాడు మరొక చోట. దేశమంతా కల్లోలంగా మారకముందే ఈ మిస్టరీ డెత్‍ల సంగతి తేల్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనిలో కిల్లర్స్ గాంగ్ హస్తం ఉన్నట్లు గ్రహించింది సి. ఐ. బి.

“కిల్ దెమ్ మిస్టర్ షాడో! మనదేశానికి పట్టిన ఆ చెదపురుగులను ఒకటొకటిగా ఏరి సర్వనాశనం చెయ్యి. అవసరం అనుకుంటే అడ్డువచ్చిన వారందర్నీ హతమార్చు. మిగిలిన విషయాలు మేము సరిచూసుకుంటాం” అంటూ షాడోకి పైనుంచి ఆదేశాలు వచ్చాయి.

కూపీలాగి, రెండవ ప్రపంచ యుధ్ధంలో హిట్లర్ కింద అనేకమంది సైంటిస్టులు పనిచేశారని, హిట్లర్ మరణంతో వారికి నిలువ నీడలేకపోయిందని, అటువంటి వారిలో మిజుల్ ఖాన్ ఒకడని తెలుసుకుంటాడు షాడీ. హిట్లర్ అంటే అతనికి విపరీతమైన అభిమానం ఉన్న మిజుల్ ఖాన్, హిట్లర్ చేయలేని పనిని చేయటానికి తాను చేసి చూపాలని… ప్రపంచాన్ని హిట్లర్ లాగా జయించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసుకుంటాడు షాడో. ఈ మిస్టరీ మరణాలకు అతనే కారణమని గ్రహిస్తాడు షాడో.

మిజుల్ ఖాన్ ఆచూకీ కోసం బొంబాయి, పూనే, నాగపూర్, షిల్లాంగ్, ఆనాడీ, ఫాతీమా ఏజన్సీలు అన్నీ తిరుగుతాడు. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటాడు. తనని చంపడానికి ఓ అందాల సుందరి అనేక విచిత్రమైన ఆయుధాలతో తిరుగుతోందని తెలుసుకుంటాడు షాడో. ఆమె ఎవరు? తనెక్కడికి వెడితే, అక్కడ తారసపడుతున్న పూర్ణిమనా? లేక పూర్ణిమకి కొత్తగా పరిచయమైన డాలీయా? షాడోని చంపమని పురమాయించింది ఎవరు? కిల్లర్స్ గ్యాంగా? మిజుల్ ఖానా?

మిస్టరీ డెత్‌లకు కారణమవుతున్న విషాన్ని మిజుల్ ఖాన్ ఎలా తయారు చేస్తున్నాడు? షాడోని తొలగిస్తే, మిజుల్ ఖాన్‌కి కలిగే ప్రయోజనం ఏమిటి? మిజుల్ ఖాన్‍ని, అతని అనుచరుల్ని షాడో ఎలా అడ్దుతొలగించాడు? ఇంతకీ పూర్ణిమ ఎవరు? షాడోకి స్పై కింగ్ అని పేరు రావడం ఎంత వరకు సమంజసం?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

షాడో ది స్పై కింగ్ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

షాడో ది స్పై కింగ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>