మధుబాబు కలం నుంచి జాలువారిన మరో థ్రిల్లర్ “బంజాయ్“.
షాడో ఇంకా సిఐబిలో చేరని కాలనికి చెందిన కథ. కులకర్ణిగారినుంచి తప్పించుకోడానికి జపాన్ వచ్చి అక్కడ కుంగ్ఫూ వంటి యుద్ధవిద్యలు నేర్చుకుంటున్నకాలానికి చెందినది.
షాడో, గంగారాంలు చింగ్లీ విద్యాపీఠంలో చేరుతారు. షాడోకి తెలియకుండా విద్యాపీఠం బయటకు వెళ్ళిన గంగారాం ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. అదే సమయంలో నిప్పుల గుండంలో దూకే విద్యని నేర్పిస్తున్న ప్యూజీశాన్ షాడోని అడుగడుగునా అవమానిస్తూంటాడు. గంగారం ప్రమాదకరమైన టోంగా వస్తాదుల చేతిలో చిక్కుకుపోయాడన్న కబురు అందగానే, విద్యాపీఠం నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి కోరుతాడు షాడో. అయితే, ప్యూజీశాన్ నిరాకరిస్తాడు. షాడో అతన్ని ఎదిరించి అక్కడ్నించి బయటపడతాడు.
అదే సమయంలో, గంగారాం కూడా తనని బంధించి ఉన్న వస్తాదులకు టోకరా ఇచ్చి పరుగుదీస్తాడు. దారిలో షాడో, గంగారం కలుసుకుంటారు. టోంగా వస్తాదుల నుంచి తప్పించుకునే క్రమంలో, గంగారాంని కలిసిన ఒక వ్యక్తి ఒక చిన్న మెటల్ మెటల్ ట్యూబ్ అతనికి ఇచ్చి, దాన్ని భద్రంగా లిన్ఫాంగ్ అనే వ్యక్తి అందించమని చెబుతాడు.
షాడో, గంగారం సకాయ్ సిటీకి బయల్దేరుతారు. వారు కలుసుకోవాలనుకున్న లిన్ఫాంగ్ వారికి స్టేషన్లోనే ఎదురుపడతాడు. ఆ మెటల్ ట్యూబ్లో ఉన్న రహస్యాన్ని వివరిస్తాడు. ఇంతలో అక్కడ జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోతాడు లిన్ఫాంగ్. మెటల్ ట్యూబ్ మాయమవుతుంది. షాడో, గంగారాంలపై హత్యానేరం మోపబడుతుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో షాడో, గంగారాంలు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు. అత్యంత ప్రమాదకరమైన బందిపోట్లను ఎదుర్కుంటారు. తర్వాత ఏం జరిగింది? షాడో ఎందుకు బంజాయ్గా మారాడు? బందిపోట్ల పీచమెలా అణిచాడు?
అడుగడుగునా ఉత్కంఠ కలిగించే ఈ నవల పాఠకులకు అమిత ఆసక్తిని కలిగిస్తుంది.
బంజాయ్ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
Please upload all madhubabu books for sale in electronic form
Best regards