“విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” పుస్తకంపై సమీక్ష

తెలుగు చలన చిత్ర చరిత్రలో డెబ్బయ్యవ దశకంలో అనేక విధాలుగా సంచలనాలు సృష్టించిన చిత్రం ‘అల్లూరిసీతారామరాజు’ సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయమిది. ఎనిమిదేళ్ళ ఆలోచన, తొమ్మిది నెలల కష్టానికి ప్రతిఫలంగా ఈ చిత్రానికి గొప్ప విజయం లభించింది.

1955లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలని ఎన్టీఆర్ విఫలయత్నం చేశారు. తర్వాత శోభనబాబుతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత డి.ఎల్.నారాయణ కథ సిద్ధం చేసుకుని కూడా ఆగిపోయారు. తర్వాత జ్యోతి పిక్చర్స్, వాణీ ఆర్ట్ కంబైన్స్ వారూ కూడా యత్నించి కమర్షియల్ హిట్ కాదనే భయంతో వదిలేశారు. కానీ కృష్ణ మాత్రం వీరందరికీ భిన్నంగా ఆలోచించారు. తెలుగువారి పౌరుషాగ్నిని చాటి చెప్పేందుకు కంకణబద్దులై ఒక టీమ్ ఏర్పాటు చేసి సీతారామరాజు చరిత్ర వెలికితీశారు. ఆయన తిరిగిన ప్రదేశాలను గుర్తించారు. అష్టకష్టాలూ పడి ఆ మహనీయుని చరిత్రను చిత్తశుద్ధితో సెల్యులాయిడ్ పై ఎక్కించి కష్టానికి తగ్గ విజయం సాధించారు. తొలుత ఎన్టీఆర్ సైతం ఒక సారి కృష్ణను పిలిచి డబ్బు పాడుచేసుకోవద్దని సలహా ఇచ్చినా ఆయన వినలేదు. దాంతో ఎన్టీఆర్ ఆగ్రహించారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ప్రత్యేకంగా ఆ సినిమాను ఎన్టీఆర్ వీక్షించారు. ’ఇంతకంటే గొప్పగా మరెవ్వరూ తియ్యలేరు’ అని కృష్ణను ప్రశంసించారు. ఇలాంటి ఎన్నో తెరవెనుక సంగతులతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ జర్నలిస్టు యు.వినాయకరావు పాఠకజనరంజకంగా వ్రాశారు. సినీరంగానికి చెందిన ఎన్నో గొప్ప పుస్తకాలను ఆయన వెలువరించారు. సినీ ప్రేమికులను మెప్పించి అబ్బురపరచే అసాధారణ సమాచారాన్ని ఇందులో క్రోడీకరించారు. సీతారామరాజు జీవిత చరిత్ర, దానికి సంబంధించిన అపురూప చిత్రాలు, ఆయన తిరుగాడిన ప్రదేశాలు వంటి సమాచారాన్ని ఆసక్తికరంగా వివరించారు. ఈ చిత్ర నటీనటుల అనుభవాలు, భావోద్వేగాలను కళ్ళకు కట్టిపడేసే అలనాటి ఫోటోలను ఇందులో జతచేశారు.

 

 

 

 

 

 

 

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు on kinige

 

Related Posts:

One thought on ““విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” పుస్తకంపై సమీక్ష

  1. …..సీతారామరాజు చరిత్ర వెలికితీశారు. ఆయన తిరిగిన ప్రదేశాలను గుర్తించారు. అష్టకష్టాలూ పడి ఆ మహనీయుని చరిత్రను చిత్తశుద్ధితో సెల్యులాయిడ్ పై ఎక్కించి ….

    నిజమా?

    సీత అనే అమ్మాయి నిజంగా ఆయన జీవితంలో ఉన్నదా?
    ఇది కేవలం‌ సినిమాకోసం‌అల్లిన కల్పన కాదా?
    సినిమాల వాళ్ళ చిత్తశుధ్ధిని నమ్మటం నిజంగా కష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>