ఎ మినిట్ ఇన్ హెల్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన షాడో స్పై థ్రిల్లర్ “ఎ మినిట్ ఇన్ హెల్“.

డాక్టర్ హుయత్సాన్ చైనా దేశపు ఆటమిక్ సైంటిస్ట్. తన ప్రభుత్వాన్ని వప్పించి ఏడు శక్తివంతమైన అణుబాంబులను తయారు చేశాడు. వాటిని మోయటానికి ఏడు ఖండాంతర రాకెట్లు నిర్మించాడు. మొదట ప్రపంచం మీదగాని, భారతదేశంమీద గాని దండెత్తేందుకు కావాల్సిన బాంబులు తయారు కావటానికి రెండు సంవత్సరాలు పడుతుందని మనకు చేరిన వార్తలు నిజం కాదని, మరో పదిహేను రోజుల్లో ప్రపంచాన్నంతా మట్టి కలపాలని హుయత్సాన్ నిర్ణయించుకున్నాడని ఖచ్చితమైన సమాచారం లభించింది.

వెంటనే సి. ఐ. బి తరపున షాడో రంగంలోకి దిగుతాడు. “రాజూ…. ఆ రాకెట్లు నాశనం అయిపోవాలి. వాటితో పాటు ఆ బాంబులు కూడా” అని కులకర్ణిగారు ఆర్డర్ వేసారు.

ముందుగా హాంగ్‌కాంగ్ చేరుతాడు షాడో. అక్కడ రష్యన్ లేడీ ఏజంట్ టాన్యాని కలిసి ప్రణాళికలు రూపొందిస్తాడు. క్వాంటుంగ్ ఏరియాలో చిల్లంగ్ రైలు మార్గానికి వుత్తరదిశన ఎక్కడో డాక్టర్ హుయత్సాన్ తన స్థావరాన్ని నిర్మించుకున్నాడని, ఆ స్థావరంలోనే రాకెట్స్ బాంబులతో సిద్ధంగా వున్నాయని, వాటిని ఎప్పుడు. ఎలా ప్రయోగించాలి? అన్న విషయాలన్నీ డాక్టర్ హుయత్సాన్‌కే వదిలి వేయబడ్డాయని తెలుసుకుంటాడు షాడో.

ఈ ఎస్సైన్‌మెంట్‌లో టాన్యాకి ఆమె సోదరి నాద్యా తోడవుతుంది. ముగ్గురు కలసి ఆ స్థావరం కోసం వేట ప్రారంభిస్తారు. ఓ బోటు లో హ్యు ఛానెల్ దాటుతారు.

మార్గమధ్యంలో ఎన్నో ప్రమాదాలను, ఆటంకాలని ఎదుర్కుని ఆ స్థావరం చేరుకుంటారు. షాడో భుజంలో ఉన్న ఎలెక్ట్రానిక్ పరికరాన్ని హుయత్సాన్ స్థావరంలోని యంత్రాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి? పట్టుబడిన టాన్యా, నాద్యాలను ఎటువంటి చిత్రహింసలకి గురిచేసారు హుయత్సాన్? షాడో ఆ రాకెట్లను ఎలా ధ్వంసం చేసాడు? ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు? తనని వెంటాడిని మిలిటరీ అధికారులను ఎలా ఏమార్చాడు? చైనా లోంచి ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

“ఎ మినిట్ ఇన్ హెల్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఎ మినిట్ ఇన్ హెల్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: