“చమత్కారం” పుస్తకంపై సమీక్ష

పుస్తకం పేరు ‘చమత్కారం’. చమక్కులు సరే నషాళానికి అంటే కారం కూడా ఉన్నదేమోనని వెదికితే చలవ మిరియాల కారమే దొరుకుతుంది. కబుర్లు చెప్పుకోనివాళ్లు కలసిమెలసి ఉండలేరు. మునిమాణిక్యం మొగుడూ పెళ్లాల సరసాలూ, విరసాలూ కలబోసిన స్వారస్యాన్ని మనకి అందించారు. శ్రీపాద వారూ తమ కథల్లో కొంత వాటా పంచుకున్నారు. పక్కవాళ్లని పలకరించకుండా ఉండలేరు కొంతమంది ప్రయాణాల పదనిసలలో. లోకాన్ని పట్టించుకోని రచయిత అందరూ అనుకునేట్లు నరకానికే పోతాడు. భమిడిపాటి ఎంచుకున్న గురుశిష్యుల సరస సంభాషణలు చదివితే ఏవో సినిమా పాటలు గుర్తొస్తాయి. ఒకోసారి ‘చెపితే వింటివ గురూ గురూ’ అంటే ‘వినకే చెడితిర శిష్యా శిష్యా’ అన్నట్టుంటుంది. భమిడిపాటి నూరిన చమత్కారాల్లో రాజకీయాలూ, విద్యారంగం, మహిళా లోకం, ప్రభుత్వ పథకాలూ, నరుల బలహీనతలూ వగైరా వగైరాలన్నీ ప్రస్తావనకొచ్చాయి.

ఆంధ్రభూమి,13-09-2014.

 చమత్కారం…! డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

చమత్కారం…! on kinige

 

Chamatkaram600

Related Posts:

సరదా కథల రచయిత “సత్యం మందపాటి” పుస్తకాలపై 20% ప్రత్యేక తగ్గింపు!

satyam mandapati

చమక్కులు, చురుక్కులుతో సరదా సరదాగా కథనాన్ని నడిపే రచయిత ‘సత్యం మందపాటి‘.
దీపావళి సందర్భంగా సత్యం మందపాటి గారి కినిగె ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ పై 20% ప్రత్యేక డిస్కౌంటు లభిస్తుంది.
సత్యం మందపాటి గారి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కినిగెలో లభ్యమయ్యే సత్యం మందపాటి గారి పుస్తకాలు:

ఎన్నారై కబుర్లు (ఒకటి)
ఎన్నారై కబుర్లు (మరోటి)
అమెరికా వంటింటి పద్యాలు
చీకటిలో చందమామ
అమెరికా బేతాళుడి కథలు
మేడ్ ఇన్ అమెరికా
తెలుగువాడు పైకొస్తున్నాడు – తొక్కేయండి!
చెట్టుక్రింద చినుకులు
ఎన్నారై కథలు

 

 

Related Posts:

తేనెపట్టులాంటి హాస్యామృతం

అరె! ఎవరిదో పది రూపాయలు నోటు పడిపోయిందే అని ఒకరనగానే- నాదే.. నాదే.. అంటూ రెండో వ్యక్తి వెనక్కి తిరిగి వంగి తీసుకోవాలని వెతుకుతుంటాడు. సరిగ్గా అదే అదనుగా మొదటి వ్యక్తి రెండోవ్యక్తిని వెనుకనుంచి ఒక్క తన్ను తన్నడంతో ప్రాంగణమంతా పగలబడి నవ్వుతుంది. ఒకరి చెంప ఛెళ్లుమంటుంది. ఎందుకుసార్ కొడతారు? -చెంపదెబ్బ తిన్నవాడి ప్రశ్న. మళ్ళీ చెంప ఛెళ్ళు. క్లారిటీ మిస్సవుతోంది. చెప్పి కొట్టొచ్చు కదా సార్! మళ్ళీ చెంప ఛెళ్ళు. చెప్పి కొట్టడానికి పర్మిషన్ తీసుకుని కొట్టడానికి నువ్వేమైనా వి.ఐ.పి.వేంట్రా? ఉత్త…??? మళ్లీ గొల్లుమని నవ్వులు. వెండితెరైనా, బుల్లితెరైనా ఇదే పరిస్థితి. ఇప్పటితరం ఈ సన్నివేశాల్ని బాగా ఆస్వాదిస్తోంది. కానీ, హాస్యమంటే ఇదేనా? మన పిల్లలకి చెప్పడానికి ఇదే మిగిలిందా? ఇంతకుమించి మన పిల్లలకు హాస్యాన్ని గురించి ఏమైనా తెలుసా? ఇదో అయోమయ స్థితి. ఇలాంటి నేపథ్యంలో మనమున్నప్పుడు, ద్వానా శాస్ర్తీ ఒక గొప్ప లోకోపకారం చేశారు. పూర్వకాలం నుండి ఇటీవలి కాలం వరకు వచ్చిన సాహిత్యాన్ని బాగా పిండి, తేనె బిందువుల్లాంటి హాస్యాన్ని దోసిళ్ళకొద్దీ పట్టిపోశారు. అదే ‘తెలుగు సాహిత్యంలో హాస్యామృతం’ పేరిట వచ్చిన ద్వానా శాస్ర్తీ కొత్త పుస్తకం. అనాదిగా తెలుగు సాహిత్యంలో వచ్చిన హాస్యరచనల్ని తన వ్యాఖ్యలతో విశే్లషణలతో కలిపి సంపుటీకరించిన గ్రంథం, ఈ కొత్త పుస్తకం సరైన సమయంలో వర్తమాన తరానికి ఈ పుస్తకం అంది వచ్చింది. అందుకు శాస్ర్తీగారు బహు ధా ప్రశంసాపాత్రులు.
నిజానికి ఈ పుస్తకం సరైన సమయంలో వచ్చిందని సంబరపడటంతోపాటు చాలా ప్రణాళికాబద్ధంగా వచ్చిందని సంతోషపడాలి. లిఖిత వ్యవహారానికి నోచుకోని జానపదుల కాలం నుండి, చాటుపద్యాలు, చమత్కార పద్యాలు పుట్టుకొచ్చిన నాటినుండి, అవధానాలు రాజ్యమేలిన నాటినుండి, ఆశుకవితా ధారలు ప్రవహించిన నాటినుండి, ఆధునిక సాహిత్యంలో మైలురాళ్లు పాతి, అటువైపు మార్గాన్ని మళ్లించి, ఆ కొత్త సాహిత్యంలో దీపస్తంభాలై నిలిచిన, గురజాడ, కందుకూరి, చిలకమర్తి గిడుగు వంటి వాళ్ళు మొదలుకొని, విశ్వనాధ, శ్రీశ్రీ, మునిమాణిక్యం, మొక్కపాటి, భమిడిపాటి వంటివారు మొదలుకొని, ముళ్లపూడి, గోపాలచక్రవర్తి, శ్రీరమణ, శంకరమంచి పార్థసారధి వంటివారు మొదలుకొని, తానే వ్రాసిన పేరడీల వరకు, హాస్యరసాన్ని జీవనదిలా ప్రవహింపజేశారు. దాదాపుగా ఒక సంపూర్ణత్వాన్ని చేరుకొనే ప్రయత్నం చేశారు. తేనెటీగ ఒక్కొక్క పువ్వుమీద వ్రాలి అక్కడి తేనెను సంగ్రహించి తేనెపట్టు గదుల్లో దాచినట్టు తెలుగు నాట హాస్యరచనలకు చిరునామాలుగా నిలిచిన, ఎందరో చెయ్యి తిరిగిన రచయితల రచనల్లోని కితకితలు పెట్టే కొన్ని మంచి ఖండికల్ని మనకి పరిచయం చేశారు. వాటికి ముందూ, వెనుకా కూడా తనదైన వ్యాఖ్యానమూ వుంది.
తెలుగువాళ్ళకి తొలి జ్ఞానపీఠాన్ని బహుమతిగా ఇచ్చిన విశ్వనాధ సత్యనారాయణగారు, మహాగంభీరుడన్న విషయం ఆయనె్నరిగిన వాళ్ళందరికీ తెలిసున్నదే. అటువంటి విశ్వనాధ మంచి హాస్యప్రియుడన్న విషయాన్ని వెతికిపట్టిన ఒక వ్యాసంలోంచి వెలికితీశారు శాస్ర్తీగారు. ఒక ఉద్యోగి ఆంగ్లేయుడైన తన అధికారిని శ్రావణ శుక్రవారం సెలవు కావాలని అడిగాడు. వెంటనే ఆ అధికారి తన సహాయకుణ్ణి ‘‘నిరుడు శ్రావణ శుక్రవారం సెలవిచ్చామా?’’ అని అడిగాడు. వెనువెంటనే ఆ సహాయకుడు ‘‘శ్రావణ శుక్రవారం నిరుడు ఆదివారంనాడు వచ్చింది’’ అన్నాడట.
అలాగే మనందరికీ సుపరిచితమైన రచయిత రావిశాస్ర్తీ. ఆయన పేరు చెప్పగానే సారాకథలు మాత్రమే తెలిసిన జనానికి, ఆయనలోని హాస్యాన్ని పట్టంకట్టి మరీ చూపారు ద్వా.నా. అప్పుడెప్పుడో, ఓ సినిమాకి మాటలు వ్రాయడానికి మద్రాసు వెళ్లివచ్చిన రావిశాస్ర్తీని ఓ అభిమాని అడిగాడు, ‘‘గురువుగారూ! ఎలా వుంది సినిమా ప్రపంచం’’ అని. రావిశాస్ర్తీ ఎంత చమత్కారంగా జవాబు చెప్పారో గమనించండి. ‘‘సినిమా వాళ్ళతో చాలా సుఖముంది. మన గదికి మనల్ని అద్దె చెల్లించనివ్వరు, వాళ్లే చెల్లిస్తారు. మన సిగరెట్టు మనం కొనే పనిలేదు, వాళ్ళే కొనిస్తారు. మన మందు మనం కొనఖ్ఖర్లేదు, వాళ్ళే కొనిస్తారు. మన తిండి మనల్ని తిననివ్వరు, వాళ్ళే ఏర్పాటుచేస్తారు. మన డైలాగులు మనల్ని రాయనివ్వరు, వాళ్ళే రాసుకుంటారు’’. తర్కించుకోవడం కాసేపు ప్రక్కన పెట్టేస్తే, హాయిగా నవ్వుకోడానికి ఈ ముక్క ఎంత బావుందో కదా!
కాస్త పరిశీలనగా గమనిస్తే, ఈ పుస్తకంలో ద్వానాశాస్ర్తీగారు, చాలా పార్శ్వాలను స్పృశించినట్టుగా తోస్తుంది. మొదటిది రచయితల పరంగా చాలామందిని పట్టి చూపారు. ప్రక్రియల పరంగా, తెలుగులో వచ్చిన అనేక సాహితీ విభాగాలలోని హాస్యస్ఫోరకమైన సన్నివేశాల్ని సంభాషణల్ని ఉటంకించారు. ఇంకా వ్యంగ్యం, వక్రోక్తి, చమత్కారం, వెటకారం, వేళాకోళం, హేళన, ఇటువంటి ఎన్నో ముఖాలలోని హాస్యజనిత సన్నివేశాల్ని ఉటంకించారు. ఇంకా చెప్పాలంటే, భాషవల్ల యాసవల్ల, వాక్య నిర్మాణంవల్ల, వ్యాకరణ దోషాలవల్ల, అనుకరణలవల్ల ఆనాటి ఆచార వ్యవహారాలవల్ల కాలమాన పరిస్థితులవల్ల, వ్యక్తులవల్ల, వ్యక్తిత్వాలవల్ల, హాస్యమెలా సంఘటిల్లుతుందో ఉటంకించినట్లు తోస్తుంది. ఇదంతా పరిశోధన గ్రంథ ప్రణాళికలా వుంది. అంతేనా, ఆయా రచనల్లోనే కాదు, వ్యక్తిముఖంగా సేకరించిన వాటిని కూడా ఇందులో చేర్చడం విశేషంగా అనిపిస్తోంది.
మొత్తంమీద తేనె పట్టులోకి బొట్టు, బొట్టుగా తేనె సేకరించినట్టు ద్వానాశాస్ర్తీ ఎక్కడెక్కడివో, ఎప్పటెప్పటివో హాస్యస్ఫోరకమైన సన్నివేశాల్ని, సంఘటనల్ని, సంభాషణల్ని, వర్ణనల్ని, ఒక్కచోట పదిలపరిచారు. శాస్ర్తీగారి కృషి గమనార్హమైనది. పది చోట్ల వెతుక్కోవలసిన నవ్వుల్ని ఒక్కచోట పోగేశారు. ఈ గ్రంధంలోని పరిమళం, కాలంతో కలిసి కొంతదూరం తప్పక ప్రయాణిస్తుంది.

వోలేటి పార్వతీశం , ఆంధ్రభూమి అక్షర పేజి, 12/10/2013

“తెలుగు సాహిత్యంలో హాస్యామృతం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈక్రింది లింక్‌ని అనుసరించండి.

తెలుగు సాహిత్యంలో హాస్యామృతం On Kinige

Related Posts:

మల్లాది వెంకట కృష్ణ మూర్తి – చిద్విలాసం పుస్తక పరిచయం

చిద్విలాసం On Kinige

నామ సంకీర్తన, ప్రార్థన, ధ్యానం, మంత్ర స్మరణ, ఆలయ దర్శనం మొదలైనవన్నీ దైవాన్ని మన మనసులో నిలుపుకోడానికే. ఈ పుస్తకం చిద్విలాసం కూడా సరిగ్గా ఇందుకు ఉపయోగిస్తుంది. దాదాపు ప్రతీ జోక్ లో దేవుడు ఉంటాడు కాబట్టి ఈ జోక్స్ ద్వారా కూడా ఆయన్ని స్మరించినట్లు అవుతుంది. శివరాత్రి జాగరణ, ఆధ్యాత్మిక ప్రయాణాల్లాంటి సందర్భాల్లో దీనితో కాలక్షేపం చేసి మనసుని దేవడు మీదే లగ్నం చేయవచ్చు. అనేక జోక్స్ పుస్తకాలు వెలువరించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించి, అనేక శీర్ణికల కింద విభజించి ఇచ్చిన ఈ పుస్తకంలో మిమ్మల్ని నవ్వించే దేవడు ఉన్నాడు.

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి

కడుపుబ్బా పడీ పడీ నవ్వించి మనసును హాయి  చేసి  ఉల్లాస పరిచే జోక్స్ ఈ పుస్తకం నిండా వున్నాయి. నేడే చదవండి మీకు కంప్యూటర్ దూరం లో  కినిగే ఫై  http://kinige.com/kbook.php?id=43

Related Posts: