షాడో! షాడో!! షాడో!!!

డైనమిక్ రైటర్ మధుబాబు కలం నుంచి జాలువారిన థ్రిల్లర్ “షాడో! షాడో!! షాడో!!!

ఇది షాడో గజదొంగగా జీవిస్తున్నప్పటి కథ. “రన్ ఫర్ ది బోర్డర్” నవలకి ఇది కొనసాగింపు.

షాడోని పట్టుకోవాలని నీడలా వెంటాడుతున్న సి.ఐ.డి. ఆఫీసర్ ఫెర్నాడెంజ్ కన్నుగప్పి పారిపోతుంటారు షాడో, గంగారాంలు. పాకిస్తాన్ పారిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒక్కో ఊరుని దాటుతూ, అక్కడి ఘరానా దొంగలని దోచుకుంటూ ముందుకు సాగుతుంటారు. పోలీసులు సైతం మారువేషాలు వేసుకుని వాళ్ళిద్దరిని అనుసరిస్తూంటారు.

సీతాపూర్ అనే ఊర్లో హర్బజన్ సింగ్ అనే కాంట్రాక్టర్ ఇంటి మీద దాడి చేస్తారు షాడో, గంగారం. అతడు కాంట్రాక్టుకి తీసుకున్న వంతెన నిర్మాణంలో కూలీలను దారుణంగా మోసం చేస్తున్నాడని విన్న షాడో అతనికి బుద్ధి చెబుతాడు. ఇక్కడ్నించి తప్పించుకునే క్రమంలో ఫెర్నాండెజ్‌కి దాదాపుగా దొరికిపోయినంత పని అవుతుంది.

అసహాయులకు సాయం చేయాలనే తన లక్షణాన్ని వదుల్చుకోలేని షాడో ఓ మధ్యవయస్కుడి మాయమాటలు నమ్మి అతనికి సాయం చేసి, అతని ఇంటికి వెళ్ళి అక్కడ పోలీసులకు చిక్కుపడతాడు. తను మళ్ళీ ఇరవై నాలుగు గంటలలో తప్పించుకుంటానని ఫెర్నాండెజ్‌తో పందెం వేస్తాడు షాడో. మరి తప్పించుకోగలిగాడా? ఎలా తప్పించుకున్నాడు? షాడోకి ఎవరు సాయం చేసారు?

ఈ ఎస్సైన్‌మెంట్‌లో సి.ఐ.బి చీఫ్ కులకర్ణి తనకు తానుగా ఎందుకు కలగజేసుకోవాల్సి వచ్చింది? షాడోని పట్టుకుని ఏం చేయలనుకుంటున్నారాయన? షాడోకీ నాగదేవతలకీ ఉన్న సంబంధం గురించి కులకర్ణి ఎలాంటి కథలు విన్నారు? నాట్యరాణి చాందినీకీ షాడోకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన షాడో అక్కడ నరమేధం ఎందుకు సృష్టించాడు? ఇండియా పోలీసులనే కాకుండా పాకిస్తాన్ సైన్యాన్ని సైతం షాడో ఎందుకు ముప్పతిప్పలు పెట్టాడు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

చివరిదాక ఆసక్తికరంగా చదివించే “షాడో! షాడో!! షాడో!!!” నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

షాడో! షాడో!! షాడో!!! On Kinige

Related Posts: