“విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” పుస్తకంపై సమీక్ష

తెలుగు చలన చిత్ర చరిత్రలో డెబ్బయ్యవ దశకంలో అనేక విధాలుగా సంచలనాలు సృష్టించిన చిత్రం ‘అల్లూరిసీతారామరాజు’ సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయమిది. ఎనిమిదేళ్ళ ఆలోచన, తొమ్మిది నెలల కష్టానికి ప్రతిఫలంగా ఈ చిత్రానికి గొప్ప విజయం లభించింది.

1955లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలని ఎన్టీఆర్ విఫలయత్నం చేశారు. తర్వాత శోభనబాబుతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత డి.ఎల్.నారాయణ కథ సిద్ధం చేసుకుని కూడా ఆగిపోయారు. తర్వాత జ్యోతి పిక్చర్స్, వాణీ ఆర్ట్ కంబైన్స్ వారూ కూడా యత్నించి కమర్షియల్ హిట్ కాదనే భయంతో వదిలేశారు. కానీ కృష్ణ మాత్రం వీరందరికీ భిన్నంగా ఆలోచించారు. తెలుగువారి పౌరుషాగ్నిని చాటి చెప్పేందుకు కంకణబద్దులై ఒక టీమ్ ఏర్పాటు చేసి సీతారామరాజు చరిత్ర వెలికితీశారు. ఆయన తిరిగిన ప్రదేశాలను గుర్తించారు. అష్టకష్టాలూ పడి ఆ మహనీయుని చరిత్రను చిత్తశుద్ధితో సెల్యులాయిడ్ పై ఎక్కించి కష్టానికి తగ్గ విజయం సాధించారు. తొలుత ఎన్టీఆర్ సైతం ఒక సారి కృష్ణను పిలిచి డబ్బు పాడుచేసుకోవద్దని సలహా ఇచ్చినా ఆయన వినలేదు. దాంతో ఎన్టీఆర్ ఆగ్రహించారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ప్రత్యేకంగా ఆ సినిమాను ఎన్టీఆర్ వీక్షించారు. ’ఇంతకంటే గొప్పగా మరెవ్వరూ తియ్యలేరు’ అని కృష్ణను ప్రశంసించారు. ఇలాంటి ఎన్నో తెరవెనుక సంగతులతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ జర్నలిస్టు యు.వినాయకరావు పాఠకజనరంజకంగా వ్రాశారు. సినీరంగానికి చెందిన ఎన్నో గొప్ప పుస్తకాలను ఆయన వెలువరించారు. సినీ ప్రేమికులను మెప్పించి అబ్బురపరచే అసాధారణ సమాచారాన్ని ఇందులో క్రోడీకరించారు. సీతారామరాజు జీవిత చరిత్ర, దానికి సంబంధించిన అపురూప చిత్రాలు, ఆయన తిరుగాడిన ప్రదేశాలు వంటి సమాచారాన్ని ఆసక్తికరంగా వివరించారు. ఈ చిత్ర నటీనటుల అనుభవాలు, భావోద్వేగాలను కళ్ళకు కట్టిపడేసే అలనాటి ఫోటోలను ఇందులో జతచేశారు.

 

 

 

 

 

 

 

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు on kinige

 

Related Posts:

మల్లాది వెంకట కృష్ణ మూర్తి – ‘అ ఆ ఇ ఈ’ పుస్తక పరిచయం

” మనిషి సాదారనంగా డబ్బు కి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడొ అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లొకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు ఉమ్మెత్త మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఈ పుస్తకం లొ మనషి జీవితం లొ ముఖ్యమైనది ఏంటి, మనిషి జీవితం లొ ధర్మం గా యెలా బ్రతకాలి అని కవి మనకు కతల రూపంలో మనకు చెప్పారు”. ఈ కథలు పాటకులను యంతగానో ఆకర్షిస్తూ ఆలోచింప చేస్తాయి.

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

మీకు కంప్యూటర్ దూరం లో  కినిగే ఫై

అ ఆ ఇ ఈ On Kinige

Related Posts:

మల్లాది వెంకట కృష్ణ మూర్తి – ‘ది ఎండ్’ పుస్తక పరిచయం.

ది ఎండ్ On Kinige

ది ఎండ్ ఒక సందేశాత్మక నవల. రాష్ట్రం  లోని అవినీతిని ఇతివృత్తం గా తీసుకుని మల్లాది వెంకట కృష్ణ మూర్తి  వ్రాసిన నవలే ఈ ది  ఎండ్. మన దేశం,మన రాష్ట్రం లో పెరిగిపోతున్న అవినీతి ని మన కళ్లకు కట్టినట్లు ఈ నవలలో మల్లాది వెంకట కృష్ణ మూర్తి మనకు చూపిస్తారు. ప్రతి భారతీయ వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకోవలసిన అవసరం యంతైనా వుంది, అలా మన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవడానికి మల్లాది వెంకట కృష్ణ మూర్తి వ్రాసిన ఈ ది ఎండ్ మనకు యెంతగానో ఉపయోగపడుతుంది. భారతీయులు ప్రతి ఒక్కళ్ళు తప్పని సరిగా చదవ వలసిన పుస్తకం ఈ ‘ది ఎండ్’.
ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.
మన దేశం లో జరుగుతున్న అవినీతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఐతే ఇక్కడ నొక్కండి.

Related Posts:

కస్తూరి మురళి కృష్ణ – “తీవ్రవాదం” పుస్తక పరిచయం

తీవ్రవాదం On Kinige

కస్తూరి మురళి కృష్ణ ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన తీవ్రవాదానికి సంబంధించి రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఇందులో, సెప్టెంబర్ 2001 కన్నా ముందునుంచీ తీవ్ర వాదం వల్ల ప్రపంచానికి వున్న ముప్పును గురించి హెచ్చరిస్తూ వ్రాసిన వ్యాసాలున్నాయి.

తీవ్రవాదం నిర్వచనంతో సహా, తీవ్రవాదానికి కారణాలు, అది పెరిగిపోవటానికి దోహదపడే పరిస్థితులు, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు తీసుకోవలసిన చర్యల వంటివి సందర్భానుసారంగా ఆయా వ్యాసాలలో పొందుపరచివున్నాయి.

అఫ్ఘనిస్తాన్, లిబియా, పాకిస్తాన్, చెచెన్యా, ఇండోనేషియా లతో సహా భారత దేశంలో ఈశాన్య భారతంలోని తీవ్రవాదం వంటి అంశాలను మూలాల్లోకి వెళ్ళి ప్రకటించే వ్యాసాలివి. అంటే, ఈ వ్యాసాలు వేర్వేరు సమయాల్లో రచించినవయినా వీటిలో పొందుపరచిన అంశాలు ఈనాటికీ పనికివస్తాయి. విలువ తరగనివి. ఎల్లప్పటికీ రెఫెరెన్స్ కు పనికివస్తాయి.

మొత్తం 36 వ్యాసాలున్నాయీ సంకలనంలో. 2000 నుంచి 2008, 31 డిసెంబరు వరకు తీవ్రవాదానికి సమబంధించిన వ్యాసాల సంకలనం ఇది.

తీవ్రవాదం సామాన్యుని జీవనం నుండి దేశాధినేతల దిన దిన నిర్ణయాలవరకు ప్రతీ చోటా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో తీవ్రవాదం గురించి తటస్త దృక్కోణంతో ప్రచురించిన ఈ పుస్తకం అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

ఉచిత ప్రివ్యు కోసం ఇక్కడ నొక్కండి.

ప్రజల మనోభావాలు రెచగొట్టి మామూలు సంఘటనలను మహత్తరమైన విస్ఫోటనాత్మకాలుగా మార్చటం తీవ్రమవుతుంది, ఇలాంటి పరిస్తితుల్లో తీవ్రవాదం గురించి అది ఆవిర్బవించి, వ్రేళ్లూనుకుని, విశ్వమంతా వ్యాపించే విష వృక్షం లా ఎదగటం గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకే ఒక క్లిక్ దూరం లో కినిగే పై .

Related Posts: