నల్లని శరీరచ్ఛాయ.. పదమూడేళ్లకే అనాథ… దేవదాసి. అయినా.. తల్లి పుట్టలక్ష్మమ్మ ఆకాంక్షలకు అనుగుణంగా భరతనాట్యం, కర్నాటక సంగీతం నేర్టుకుని లలిత కళలకు కాణాచిగా మారింది బెంగుళూరు నాగరత్నమ్మ. 26 ఏళ్లకే 146 పట్టణాలలో 1235 కచేరీలు చేసి, విద్యాసుందరి, గానకళావిశారద, త్యాగసేవాసక్త బిరుదులు పొంది, గృహలక్ష్మి స్వర్ణకంకణధారియై 1905 నాటికే ఆదాయపు పన్ను చెల్లించిన స్త్రీమూర్తి. నేను దేవదాసీని అని గర్వంగా చెప్పుకుని, ఓ గొప్ప కళాకారిణిగా నాగరత్నమ్మ ఎలా రాణించారో ఆర్ఎం ఉమామహేశ్వరరావు ఆకట్టుకునేలా రాశారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, ఆచంట జానకీరామ్, మరుపూరి కోదండరామరెడ్డి.. నాగరత్నమ్మ ఔన్నత్యాన్ని జ్ఞాపకాల సహాయంతో వివరించారు. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంలోని పురుషాధిక్యతను ప్రశ్నించి సంచలనం సృష్టించిన నాగరత్నమ్మ, త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో స్త్రీలు పాడరాదనే నిషేధాన్ని ధిక్కరించి మరో మార్పుకు నాంది పలికాలు. నాగరత్నమ్మకు శక్తినిచ్చిన అంశాలు, ప్రతికూల పరిస్థితుల నుంచి ఆమె ఎదిగిన తీరు, పురుషాధిక్యంపై ఆమె ధిక్కారం, ఆమె దాతృత్వం.. ఆమె ఆధ్యాత్మికంపై మరింత దృష్టిసారిస్తే ఇంకా బాగుండేదేమో!
– కె. భాస్కర్, ఆంధ్రజ్యోతి, 27th Jul 2014
“బెంగుళూరు నాగరత్నమ్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***
బెంగుళూరు నాగరత్నమ్మ on kinige