సదా స్మృతీయం!

గోగు శ్యామల రాసిన ‘నేనే బలాన్ని – టి. ఎన్. సదాలక్ష్మి బతుకు కథ’ అనే పుస్తకాన్ని సాక్షి దినపత్రికలో సమీక్షిస్తూ, “తొలి మహిళా దళిత మంత్రి చూపిన తెగువ సాక్షాత్తు ప్రధానమంత్రిని ఆకట్టుకుందంటూ” ఆ వైనాన్ని వివరించారు పున్నా కృష్ణమూర్తి.

టి. ఎన్. సదాలక్ష్మి నీలం సంజీవరెడ్డి కాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి. కేవలం రాష్ట్ర మంత్రిగా మాత్రమే కాదు, మాదిగల ఉపకులం అయిన మహతర్‌ల ఇంట పుట్టి, ‘అరుంధతీ’ నక్షత్రంలా ఎదిగారని కృష్ణమూర్తిగారు పేర్కొన్నారు.

సాక్షి దినపత్రికలో వచ్చిన ఆ సమీక్షని ఈ దిగువ చిత్రంలో చదవగలరు.

 

ఎంతో నిబద్ధతతో, ధనికుల పక్షాన కాకుండా, సామాన్యుల పక్షం నిలబడి, ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకంగా తన నిరసనగళాన్ని వినిపించిన ఆ సంఘటన తెలుసుకోడం ఎంతో ఆసక్తిదాయకం. ఆ వార్త జాతీయ పత్రికలో రావడం, అప్పటి ప్రధాని నెహ్రూని ఆకర్షించడం జరిగింది. నెహ్రూ సదాలక్ష్మి గారిని ఎందుకు పదే పదే అభినందించారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.162/-. ఈ పుస్తకాన్ని నెలకి రూ. 60/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

నేనే బలాన్ని సదాలక్ష్మి బతుకు కథ On Kinige

సోమ శంకర్ కొల్లూరి.

Related Posts: