మీ కినిగె ఖాతా వాడుకరి పేరు లేదా సంకేతపదాన్ని మర్చిపోతే ఏం చెయ్యాలి?

మీరు మీ కినిగెఖాతా వాడుకరి పేరు లేదా సంకేతపదాన్ని మరిచిపోయారా?

కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్క వేగు ద్వారా మీ సంకేతపాదాన్ని మీరే నిర్దేశించవచ్చు మరియు మీ వాడుకరి పేరుని తిరిగి చూడవచ్చు.

ఔను, ఇది చాలా సులభం. కావల్సిందల్లా మీరు కినిగెలో ఖాతా రూపొందించేప్పుడు వాడిన వేగు చిరునామా, అంతే.

సంకేతపదాన్ని పునర్నిర్దేశించడం లేదా వాడుకరి పేరును కనుగొనటం ఎలానో ఇక్కడ చూద్దాం:

సోపానం 1 : కినిగె.కాం ముఖ పేజీలో కుడి పక్క పైన Login అనే లంకె గలదు. ఆ లంకెను వత్తండి

 

 

సోపానం 2 : తరువాత వచ్చే లాగిన్ తెర లో  Forgot Password or Username అన్న లంకెను వత్తండి.

 

సోపానం 3 : తరువాత మీరు కొన్ని గడులు ఉన్న ఒక పేజీని చూస్తారు. ఇక్కడ ఇచ్చిన మొదటి గడిలో మీ వేగు చిరునామా, రెండవ గడిలో పక్కన బొమ్మలో చూపిన అక్షరాలను ప్రవేశపెట్టి

 

Submit అని ఉన్నా మీటను నొక్కండి.

సోపానం 4 : ఇందాక మీరు ప్రవేశ పెట్టిన వేగు చిరునామా కు  support at kinige.com నుండి Reset your Kinige account Password అనే ఒక వేగు వస్తుంది.

ఈ వేగులో ఇచ్చిన లంకెను దర్శించి మీ సంకేతపదాన్ని పునర్నిర్దేశించవచ్చు.

సోపానం 5 : ఈ పేజీలో నే మీ వాడుకరి పేరు ఇంకా సంకేతపదాన్ని ప్రవేశ పెట్టేందుకు గడులు ఉంటాయి. ఒకవేళ మీరు మీ వాడుకరి పేరును మరిచిపోయుంటే ఇక్కడ అది చూడవచ్చు. మనం వాడుకరి పేరును మార్చలేము. అలానే ఒక సరికొత్త సంకేతపదాన్ని నిర్దేశించవచ్చు.

 

మీరు మీ సంకేత పదాన్ని నిర్దేశించాక కింద చూపిన విధంగా నిర్ధారణ పేజీ వస్తుంది.

 

ఇక మీరు కొత్తగా నిర్దేశించిన సంకేతపదంతో కినిగె లోకి ప్రవేశించవచ్చు.

Related Posts:

  • No Related Posts

ఇంతకు ముందు కొనుగోలు చేసిన పుస్తకాన్ని తిరిగి దింపుకోవటం

ఇదివరికే కినిగె లో కొన్న పుస్తకాలను కానీ, అద్దెకు తీస్కున్నా పుస్తకాలనుకానీ(అద్దె సమయానికి లోబడి)  మరోసారి దిగుమతి చేసుకోవచ్చు. ఇది చెయ్యడం చాలా సులువు కూడా.

 

సోపానం 2 : ఏ పుస్తకాన్ని తిరిగి దింపుకోవాలనుకున్నారో(మీరు ఇదివరకే కొన్న పుస్తకం), ఆ పుస్తక పేజీకి వెళ్ళండి.

 

సోపానం 3 : కుడి పక్కన గల లంకెల్లో Download purchased book అనే ఒక లంకె ఉంటుంది, దానిపై క్లిక్ చెయ్యండి.

 

సోపానం 4 : URLLink.ascm అను ఒక దస్త్రం మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ దస్త్రాన్ని అడొబె డిజిటల్ ఎడిషన్స్ లో తెరవండి.

నోట్ : మీరు మీ ఖాతా ద్వారా కినిగె లో కొన్న/అద్దెకు తీస్కున్నా పుస్తకాలన్నీ My Books అను లంకె గల పేజీలో ఉన్నాయి. అంచేత మీ కంప్యూటర్ ఒకవేళ ఫార్మాట్ చేయబడినా లేదా నిర్వహణా వ్యవస్థను పునఃస్థాపించినా తిరిగి పుస్తకాలను మీరు దింపుకోవచ్చనమాట.

 

మీరు కినిగె పుస్తకాలు చదవడానికి కొత్త అయితే ఈ లంకె చూడగలరు.

Related Posts:

కినిగె కూపన్ ను బహూకరించడం ఎలా?

కినిగె.కాం లో మీ స్నేహితులకు పుస్తకాలే కాకుండా కొంత మొత్తాన్ని కూడా బహూకరించవచ్చు. ఇలా చెయ్యటం ద్వారా, వారికి నచ్చిన పుస్తకాలు వారు కొనుక్కుంటారు, అదే సమయంలో మీరు బహుమతిగా పుస్తకాలను వారికి అందించినట్టూ ఉంటుంది.

ఇది పుస్తకాన్ని బహూకరించడమంత సులభం. మీక్కావల్సిందల్లా మీరు మొత్తాన్ని బహూకరించబోయే వ్యక్తి వేగు చిరునామా.

సోపానం 1 : kinge.com ను దర్శించండి. ముఖపేజీలో కుడి పక్కన పైన Profile అనే పాఠ్యం గల లంకె ఒకటి ఉంటుంది.

ఇది మీ ప్రవర పేజీ అనమాట, ఇక్కడ మీ ఖాతా వివరాలు ఉంటాయి.

సోపానం 2 : ప్రవర పేజీలో గల లంకెల్లో  Send a Gift అనే పాఠ్యం గల లంకె ను క్లిక్ చెయ్యండి.

క్లిక్ చేసాక కొన్ని గడులు ఉన్న పేజీకి వెళ్తారు.

సోపానం 3 : మీరు ఎంత మొత్తాన్ని బహూకరించాలనుకుంటున్నారు, ఎవరికి అందించాలనుకుంటున్నారో వారి వేగు చిరునామా, మరియు టిప్పణి ఇక్కడ ప్రవేశ పెట్టాలి.

వివరాలు ప్రవేశ పెట్టాక Send Gift అన్న మీటను నొక్కండి.

సోపానం 4 : అంతే! మీరు విజయవంతంగా మీ స్నేహితునికి కినిగె లో పుస్తకాలు కొనేందుకు ఉపయోగపడే విధంగా కొంత మొత్తాన్ని బహూకరించారు.

మీరు విజయవంతంగా బహుమతి కూపన్ ను మీ నేస్తానికి అందించినట్టు సందేశం వస్తుంది. అలానే మీ స్నేహితునికి గిఫ్ట్ కూపన్ యొక్క కోడ్ వేగు ద్వారా పంపించబడుతుంది.

నోట్ : 1. మీ స్నేహితునితో పాటే గిఫ్ట్ కూపన్ గల వేగు మీకూ పంపబడుతుంది. ఒకవేళ ఏదయినా కారణం చేత వేగు మీ స్నేహితునికి అందని పక్షంలో ఈ వేగును మీరు మరళా మీ స్నేహితునికి పంపవచ్చు.

2. మీ స్నేహితుల్లో ఎవరికయినా రిచార్జ్ చెయ్యటం కుదరకపోతే, ఉదాహరణకు వారు విదేశాల్లో ఉంటూ పేపాల్ వంటివి వారికి అందుబాటులో లేకపోయినా లేదా రీచార్జ్ చేస్కోవటంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నా, మీ ఖాతా లోని డబ్బుని వారికి బహూకరించవచ్చు.

Related Posts:

ఈ-పుస్తకాన్ని బహుమతి ఇవ్వడం ఎలా?

మనకు ప్రియమైనవారికి ఒక పుస్తకం బహుమతి ఇవ్వడం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. సాంకేతిక పరిజ్ఞానం మారిపోతున్న నేటి కాలానికి తగ్గట్టు కినిగె నుండి మీరు ఈపుస్తకాలను తేలిగ్గా బహుమతిగా, ప్రపంచంలో ఎక్కడ ఉన్న మీ వారికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. ఇంకెందుకు ఆలస్యం కినిగెను దర్శించి మీకు నచ్చిన పుస్తకాన్ని మీప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వండి నేడే.

ఈ దిగువ వివరణాత్మకంగా ఈ బహుమతి పద్దతి ఉంది పరిశీలించండి.

1. http://kinige.com ను దర్శించండి.

2.

మీ పుస్తకాన్ని ఎన్నుకోండి.

మీకు నచ్చిన పుస్తకం పేజీకి వెళ్ళండి. అక్కడ, కుడి వైపున కొన్ని లంకెలు చూడవచ్చు.

బహుమతి బొమ్మ తో మూడు (సాధారణంగా) లంకెలు కలవు. Gift Rent Copy, Gift this e-book and Claim your gift అనే పేర్లతో లంకె పాఠ్యాలు ఉంటాయి.

3.

బహుమతి పద్ధతి ఎంపిక

మీరు ఏ విధమయిన బహుమతి చెయ్యాలనుకుంటున్నారు (పూర్తి ఈ-పుస్తకాన్నా లేక ఒక నెల పాటు అద్దెకా?) అనేది నిర్ణయించుకొని, సంబంధిత లంకెను నొక్కండి. మీరు ఈ కింద చూపిన తెరకు వెళ్తారు.

4.

బహుమతి పంపుట

మీరెవరికి ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారో, వారి వేగు చిరునామా ను ఇక్కడ ప్రవేశ పెట్టండి. వేగు చిరునామా తో పాటుగా ఒక చిన్ని టిప్పణిని కూడా జత చేసి Send Gift అన్నా మీటను వొత్తండి. అంతే! మీరు మీ నేస్తానికి ఈ-పుస్తకాన్ని బహూకరించారు. మీ స్నేహితుడి వేగు చిరునామా కి మరియు మీ వేగు చిరునామాకి పుస్తకాన్ని ఎలా దింపుకోవాలో తెలిపే సమాచారంతో ఒక వేగు వస్తుంది. మరియు మీకు ఈ దిగువ చూపిన తెర ద్వారా బహుమతి పంపినట్టు ధృవీకరించే సందేశం వస్తుంది.

Related Posts:

కినిగె బహుమతిని క్లెయిం చేసుకోవడం

కినిగె ద్వారా ఎవరయినా వారి స్నేహితులకి పుస్తకాల్ని బహూకరించవచ్చు లేదా వారి బ్యాలెన్స్ నుండి కొంత మొత్తాన్ని గిఫ్ట్ కూపన్ గా బహూకరించవచ్చు. ఆ విధానమేమిటో ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

మీకు అటువంటి బహుమతి వస్తే పుస్తకం కినిగెపై ఎలా చదవాలో ఇక్కడ చూద్దాం.

బహుమతిగా పుస్తకం పొందిన వారికి ఈ కింద చూపిన విధంగా వేగు వస్తుంది.

అలానే గిఫ్ట్ కూపన్ ద్వారా డబ్బుని స్నేహితుల ద్వారా పొందిన వారికి ఈ కింద చూపిన విధంగా వేగు వస్తుంది.

ఇలా బహుమతి పొందిన వారు వారి వేగులో ఇవ్వబడిన గిఫ్ట్ యాక్టివేషన్ కోడ్(Gift Activation Code అన్న పాఠ్యం ముందు బొద్దు అక్షరాలుగా ఉన్న పొడి అక్షరాలు) ను భద్రపరుచుకుని, అక్కడే ఇచ్చిన లంకెను దర్శించాలి.

ఆ తరువాత గిఫ్ట్ యాక్టివేషన్ కోడ్ నకలు తీసుకోని క్రింద చూపిన గిఫ్ట్ కోడ్ డబ్బాలో ఎంటర్ చేసి క్లెయిం అనే మీట నొక్కాలి. అంతే మీ బహుమతి క్లెయిం అవుతుంది.

 

రీచార్జ్ విజయవంతం అయ్యాక కింది బొమ్మలో చూపించిన విధంగా కూపన్ అందిన సమాచారం మరియు పుస్తక పేజీకి లంకె ఉన్న సందేశం కనిపిస్తాయి.

లేదా

Book అనే పాఠ్యం ఉన్న ఆ లంకెను దర్శిస్తే బహుమతి పొందిన పుస్తక పేజీకి వెళతారు. కుడి పక్కన గల లంకెల్లో పుస్తక డౌన్లోడ్ లంకె ఉంటుంది బహుమతిగా పొందిన పుస్తకం కొన్నదా లేక అద్దెకు తీసుకున్నదా అన్న దాన్ని బట్టి Download Rented Book లేదా Download purchased book అని లంకె పాఠ్యం ఉంటుంది.

ఆ లంకెను క్లిక్ చెయ్యగానే ascm దస్త్రం(URLLink.ascm) ఒకటి కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతుంది.

ascm పొడిగింత గల ఆ దస్త్రం డౌన్లోడ్ పూర్తి అయ్యాక దానిని అడోబె డిజిటల్ ఎడిషన్స్ తో తెరవాలి.

అంతే, అయిపోయింది.

పుస్తకాన్ని ఇక చదవవచ్చు.

మీరు కినిగెలో పుస్తకాలు చదవడానికి కొత్త అయితే ఈ లింకులో ఉన్న సహాయ పుట చూడగలరు.

Related Posts:

  • No Related Posts

సరికొత్త తెలుగు యూనికోడ్ ఖతి

కినిగె ద్వారా ఒక వజ్రం అనే పేరుతో కొత్త తెలుగు ఖతి వెలువడింది అని తెలియచేయటానికి మేము సంతోషిస్తున్నాం.

ఈ ఖతి లో అక్షరాలు వజ్రాల ఆకృతిలో కనిపిస్తాయి. అందుకనే ఈ ఖతికి వజ్రం అని పేరుపెట్టడం జరిగింది.

వజ్రం ఖతి గురించి

వజ్రం ఖతి కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రై. లిమిటెడ్ వారి ద్వారా తయారుచేయబడింది.

ఈ ఖతి లో అక్షరాలు పెద్ద ఆకారంలో శీర్షికలకు వాడటానికి అనువుగా ఉంటాయి.  ఇది మీకు చాలా ఉపయోగ పడుతుంది.

లైసెన్స్

ఈ ఖతి SIL OFL లైసెన్స్ తో వెలువడింది. ఈ లైసెన్స్ యొక్క ప్రతిని మీరు ఖతి దింపుకోలు లో పొందగలరు.
http://scripts.sil.org/ వద్ద కూడా మీరీ లైసెన్స్ ను పొందవచ్చు.
(http://scripts.sil.org/cms/scripts/render_download.php?&format=file&media_id=OFL_plaintext&filename=OFL.txt)


మేమీ ఖతిని ఎలా రూపొందించాం?

లోహిత్ తెలుగు ఖతితో మొదలుపెట్టి, దాని ఆధారంగా వజ్రం ఖతిని రూపొందించాం. రెండు బిందువుల మధ్య గల చాపములను(వక్ర రేఖలను) సరళరేఖలుగా మార్చడం ద్వారా ఈ ఖతి రూపొందినది.

సమస్యలను, లోటులను, సూచనలను ఎక్కడ తెలుపాలి?

మీకు వజ్రం ఖతిలో ఏమయినా సమస్య తలెత్తినా, మీరు మాకు ఏదయినా సలహా లేదా సూచన అందించ దలచినా support at kinige.com కు ఒక వేగు రాయండి.

వజ్రం ఖతి అని వేగు విషయంలో చేర్చండి.

ఖతిని ఎక్కడ నుండి దింపుకోలు చేస్కోవాలి?

వజ్రం ఖతి యొక్క తాజా ప్రతిని http://kinige.com/fonts/vajram వద్ద నుండి దింపుకోలు చేస్కోవచ్చు.

ఎలా స్థాపించాలి?

vajram.zip ను అన్జిప్ చేసి vajram.ttf దస్త్రాన్ని తీస్కోండి.

  • విండోస్ ఎక్స్పీ, విస్టాల్లో  vajram.ttf ను c:\windows\fonts సంచయంలోకి చేర్చండి.
  • విండోస్ 7 లో , vajram.ttf దస్త్రాన్ని డబల్ క్లిక్ చేసి ఎడమ పైన ఉన్న మీటను నొక్కి స్థాపించవచ్చు.
  • లినక్స్ ఉబుంటూలో : vajram.ttf దస్త్రాన్ని డబల్ క్లిక్ చేసి కుడి పక్క కింద Install Font అని ఉన్న మీటను నొక్కి స్థాపించవచ్చు.(fontviewer application).

 


Related Posts: