జూలై 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

జూలై 2015 రెండవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

Top12

 

1 ఒక్కడే సూర్యదేవర రామమోహన రావు న్యూ-ఎంట్రీ
2 మనీపర్స్ 8 వంగా రాజేంద్రప్రసాద్ రీ-ఎంట్రీ
3 రుద్రుడు మధుబాబు రీ-ఎంట్రీ
4 శబ్ద రత్నాకరం బి. సీతారామాచార్యులు న్యూ – ఎంట్రీ
5 కొమ్మకొమ్మకో సన్నాయి డా. వేటూరి సుందర రామ మూర్తి వరుసగా 5 వారాలుగా
6 ఒక వర్షాకాలపు సాయంత్రం యండమూరి వీరేంద్రనాధ్ న్యూ-ఎంట్రీ
7 స్టాక్‌మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా ? శ్రీనివాస్ రీ ఎంట్రీ
8 ఉమన్ సూర్యదేవర రామమోహన రావు న్యూ – ఎంట్రీ
9 విశ్వదర్శనం – భారతీయ చింతన నండూరి రామమోహన రావు వరుసగా 3 వారాలుగా
10 నవ్విపోదురుగాక… కాట్రగడ్డ మురారి వరుసగా 5 వారాలుగా

Related Posts:

  • No Related Posts

సరికొత్త శిల్పం – ‘ఈ కథకి శిల్పం లేదు’ పుస్తకంపై సమీక్ష

‘కథను చదవడం ఎలా?’ అనే వల్లంపాటి వెంకటసుబ్బయ్య వ్యాసంతో పుస్తకం ప్రారంభం అవుతుంది. తెలివైన పాఠకుడు ఏకాంతంగా చదువుకోడానికి ఉద్దేశించిన సాహిత్య ప్రక్రియ కథ అని వల్లంపాటివారు ఆ వ్యాసంలో సూత్రీకరించారు. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి కథా సంకలనం ‘ఈ కథకి శిల్పం లేదు‘ చదువుతున్నప్పుడు ఆమాట నిజమే అనిపిస్తుంది. కొన్ని కథలైతే, మన మనసును మనమే చదువుతున్న భావన కలిగిస్తాయి. ఈ కథల్లో చెట్లు మాట్లాడతాయి, పర్యావరణం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తాయి. ఏ వ్యక్తికైనా తనను తాను ఎలా వ్యక్తం చేసుకోవాలో తెలియకపోతే ఆ వ్యక్తికి ఎదుగుదల ఉండదు – తరహా సమకాలీన నీతిని బోధిస్తాయి. మానవత్వానికి మాడీ కట్టిన ఎంగటవ్వలు కనిపిస్తారు. సంకలనంలో పదహారు కథలున్నాయి. తన కథలకు మార్కులేయమని పాఠకుల్ని అడుగుతున్నారు రచయిత.

– రమణ, ఈనాడు-ఆదివారం, 12/04/2015.

“ ఈ కథకి శిల్పం లేదు ” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

ఈ కథకి శిల్పం లేదు on kinige

EeKathakiShilpamLedu600

 

 

Related Posts:

  • No Related Posts

మే2015 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే2015 మూడవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

Capture

 

1 ఇన్‌కమ్ టాక్స్ గైడ్ శ్రీనివాస్ రీ ఎంట్రీ
2 ఇదండీ మహాభారతం రంగనాయకమ్మ వరుసగా 19 వారాలుగా
3 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరేంద్రనాథ్ రీ ఎంట్రీ
4 ఎవరితో ఎలా మాట్లాడాలి
ఉషశ్రీ మరియు గాయత్రీదేవి రీ-ఎంట్రీ
5 ఆనంద జ్యోతి మధుబాబు రీ-ఎంట్రీ
6 త్రివేణి సూర్యదేవర రామ్మోహనరావు రీ-ఎంట్రీ
7 శబ్బాష్‌రా శంకరా! తనికెళ్ళ భరణి రీ-ఎంట్రీ
8 చాణక్య శ్రీ శార్వరి వరుసగా 2 వారాలుగా
9 పరుసవేది పాలో కొయిలో రీ-ఎంట్రీ
10 ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడటం ఎలా? చక్రవర్తి డి ఎస్ న్యూ-ఎంట్రీ

Related Posts:

“వంగూరి ఫౌండేషన్ అమెరికా” వారి ఎంపిక చేసిన పుస్తకాలపై 50% ప్రత్యేక తగ్గింపు

ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి కినిగె ఈ-బుక్స్  పై 50% ప్రత్యేక డిస్కౌంటు లభిస్తుంది.ఈ అవకాశం ఉగాది వరకు మాత్రమే గమనించగలరు.

వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కినిగెలో డిస్కౌంటు లభ్యమయ్యే వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి పుస్తకాలు:

 

vanguriF

1 తూర్పు బడి… పడమర గుడి… కలశపూడి శ్రీనివాసరావు
2 అమెరికామెడీ నాటికలు వంగూరి చిట్టెన్‍ రాజు
3 అమెరికా తెలుగు కథానిక – పదవ సంకలనం మల్టిపుల్ ఆథర్స్
4 ప్రవాసాంధ్రుల ఆశాకిరణం పూడిపెద్ది శేషుశర్మ
5 ఆత్మార్పణ పెమ్మరాజు వేణుగోపాలరావు
6 అమెరికా తెలుగు కథా సాహిత్యం – ఒక సమగ్ర పరిశీలన వంగూరి చిట్టెన్‌రాజు మరియు తన్నీరు కళ్యాణ్ కుమార్
7 విదేశీ కోడలు కోసూరి ఉమాభారతి
8 అమెరికా తెలుగు కథానిక – తొమ్మిదవ సంకలనం మల్టిపుల్ ఆథర్స్
9 అవంతీ కళ్యాణం లలితా రామ్
10 ఘర్షణ – కథలు అపర్ణ మునుకుట్ల గునుపూడి
10 ఘర్షణ – కథలు అపర్ణ మునుకుట్ల గునుపూడి
11 అమెరికా తెలుగు కథానిక – 12 వ సంకలనం మల్టిపుల్ ఆథర్స్

Related Posts:

పల్లవించిన పల్లె సోయగం..”డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు” పుస్తకం పై సమీక్ష

కథకురాలు వాసా ప్రభావతిగారు విలక్షణమైన వ్యక్తిత్వం కలదని వేదగిరి రాంబాబు గ్రంథాదిలో చెప్పినట్టుగా కావచ్చు. కాని ఆమె తన కథల్లో గ్రామీణమైన వస్తువుతోనే ఎక్కువ కథల్ని రాసినట్టు చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో ఆమె పదహారు కథల్ని గుదిగుచ్చి తెలుగు కథా సరస్వతి అలంకరించడం విశేషం. ‘ఊరగాయ జాడీ’తో ప్రారంభించి ‘నాకూ ఓ మనసుంది’తో ముగించారు. ఈ సంపుటిలో మూడొంతుల కథలు పల్లె వాసనల గుబాళింపులు, ‘కొత్తవెలుగు’ వంటి తుళ్లింతలు, ‘అనసూయ లేచిపోయింది’ వంటి పలవరింతలు ఈనాటి సమాజాన్ని దృశ్యమానం చేస్తాయి. ప్రతీ కథా పాఠకుడ్ని చివరి వరకు చదివిస్తాయి. ‘న్యాయం గుడ్డిది’ కథ ద్వారా ఆమె కూటికి పేదరాలైనా నిజాయితీగల స్ర్తి ఔన్నత్యాన్ని ఆ ఇంటి యజమానురాలి కొడుకు సానిదానికి సమర్పించిన నగల గురించి చివర్లో ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడన్న నీతిని ప్రదర్శించారు. దీనిలో యజమానుల అభియోగం, పోలీసుల జులుం, పేదల పట్ల చులకన ఉంది.
‘ఊరగాయ జాడీ’ కథలో కొంత సాంప్రదాయ వాసన కనిపించినా చుట్టాల కంట్లో అది పడకూడదని యజమాని అది తీస్తూ కిందపడి జాడీ బద్దలవ్వడం, ఊరగాయ బూజు పట్టడం వంటివి సహజత్వానికి దగ్గరగా నిలుస్తాయి. ‘సంధ్య అంచున’ అన్న కథ ఒక ప్రధానోపాధ్యాయురాలు పదవీ విరమణ చేస్తూ భర్తతో తాను ఎక్కువ సమయాన్ని గడపలేకపోయానే అనే ఆవేదన కనిపిస్తుంది. జీవితం చివరిలోనైనా మనం ఒకరికొకరమయ్యాం అనే కొసమెరుపు హాయిగా ఉంది. ‘సిలకమ్మ’ కథలో ఆమె కాస్త విద్యాగంధం కలిగినందువల్ల చిన్నయ్యకు తాకట్టుపెట్టిన పొలం కూలి నాలి చేసి అప్పు తీర్చి పొలం దక్కించుకున్న తీరు బాగుంది. ‘నాన్న కావాలి’ కథలో తన పుట్టుకకు తండ్రిగాని తండ్రి అయిన అతనినే ఆరాధించే బిడ్డలున్న తీరును రచయిత్రి చిత్రించిన తీరు ఆకట్టుకునే దిశలో సాగింది.
‘కామాక్షి కాసులపేరు’ కథలో కథకురాలు ఒక గమ్మతె్తైన ఎత్తుగడతో నగలమీద మోజున్న కూతురిని కష్టపెట్టడం ఇష్టంలేక వెండిదాన్ని కొని దానికి బంగారు మలాము చేయిస్తుంది. అది కొన్ని రోజులకే రంగు మారిపోతుంది. ఆ కాసుల పేరు పుణ్యాన కూతురికి పెళ్లి కుదురుతుంది. ఈ కథలో నిజ జీవితంలో నగల్ని చూసి పెళ్లిళ్లయిపోతే ఆడకూతుళ్లకు అత్తింటి ఆరళ్లు అసలుండవా అనిపిస్తుంది. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా విషయం తెలియక తప్పదు. ‘వీధి దీపాలు’ కథ ద్వారా భిన్న మతస్తులలో గుడ్డినమ్మకం, అంధ విశ్వాసాలు విడిచిపెట్టి అంతా సోదరులలా జీవించాలని రచయిత్రి సహేతుకంగా వస్తువులో చూపించారు. ‘మిసెస్ రామనాథం’ కథలో పెద్దగా పట్టులేకపోయినా సామాజిక స్పృహతోబాటు స్ర్తిలు కూడా గౌరవార్హులు కావాలన్న బాధ్యతల్ని సూచిస్తుంది. ‘మా బతుకులింతేనా’ కథానికలో వస్తువు మనిషి జీవన పోరాటంగా చిత్రితమైంది. దానిలో తల్లి, కొడుకు వీరితోబాటు ఓ మూగజీవం కుక్క. అట్టడుగు బడుగు జీవులకు తమకురోజులు వెళ్లకపోయినా మరో ప్రాణిని పోషించగల ఉదారగుణం ఉంటుందన్న కారుణ్య దృక్పథాన్ని ఆవిష్కరిస్తుంది.
‘తోడు-నీడ’ ఈ కథానికలో వస్తువు పాతదైనా భార్యాభర్తలలో భర్త ఆమెనే శాసించడం, బాస్‌లా పీడించడం వంటివి సాధారణ విషయాలైనప్పటికీ మహిళల పట్ల మగవారి అలసత్వాన్ని అక్షరీకరించిన వైనం అగుపిస్తుంది. ‘చుక్క’ కథలో నీలిమ అనే యువతిని ఒక దొమ్మరాట వాడు కిడ్నాప్ చేసి తీసికెళ్లి ‘గడసాని’గా చేస్తాడు. ఆమె తాను జీవితాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే విద్యను ప్రదర్శిస్తూ తాడుమీంచి పడి ప్రియుని ఒడిలో కన్ను మూస్తుంది. ఇది కరుణరస పూరితమైన కథ. ‘అంగడి వినోదం’ నేటి వస్త్ర దుకాణాలలో బొమ్మలుగా మనుషుల్ని పెట్టి వారి వ్యాపారం పెంచుకునే తీరును రచయిత్రి చిత్రించారు. దీనిలో బొమ్మలా నిలుచున్న వ్యక్తి తిండి తిననీయకుండా ప్రదర్శిస్తూ పడిపోతే యజమాని జనం వత్తిడికి జడిసి అనుకున్న దానికన్నా పైకం ఎక్కువిస్తే అందులో కొంత దళారీ మింగేస్తాడు. అతని తల్లి ఆ కుర్రాడిని ఆసుపత్రికి తీసికెళ్లడంతో కథ ముగుస్తుంది.
‘గెద్ద’ కథానికలో అత్తగారు ఎరుకల సానిగా సోది చెబుతూ, కోడలు పురుళ్లు పోస్తూ, కొడుకు పందులు మేపుతూ వారు తమదైన శైలిలో జీవిస్తుంటారు. వారి కలిమిలేములను చిత్రిస్తుందీ కథ. డా. వాసా ప్రభావతిగారి కథలు కొన్ని నాటి నేటి వస్తువుల జమిలి నేతతో హృద్యంగా సాగుతాయి.

-మంతెన,22/11/2014,ఆంద్రభూమి – శనివారం – అక్షర

డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు on kinige

 

DoctorVaasaaPrabhavathiKathanikalu600 (1)

Related Posts:

  • No Related Posts

రసగుళికలు – “కృష్ణమోహన్ కథాస్రవంతి భాగం- 1″ పుస్తకంపై సమీక్ష

చిక్కని గోదావరి మాండలికాలు పండిస్తూ డా.దవులూరి శ్రీకృష్ణమోహనరావు కలం నుంచి జాలువారిన కథలన్నింటిలోనూ సామాజిక అధ్యయనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది . మొత్తం కథలన్నీ కోనసీమ అందాలకు అద్దంపట్టి ఆహ్లాదం పండిస్తాయి . ముఖ్యంగా ‘ లేడిగాడు ‘,’ కన్నెరికం ‘ కథల్లోని పాత్రలు మన మధ్యలోనే ఉన్నట్లుంటాయి . గోదావరి జిల్లాల మంచి , మర్యాద , అవసరమైతే చావుదెబ్బ తీయగల నైపుణ్యాన్ని ఎత్తిచూపే ‘ సంక్రాంతి అల్లుడు ‘ , డిఫ్టీతాసిల్దారుగారుల్లోని పాత్రలు కళ్ళకు కడతాయి . మతం మాటున ఎదిగిన మనుషులను చెప్పే కథ ‘ మరియదాసు స్వస్థత సభలు ‘ , ఆశ పరిధి దాటితే మిగిలేది ఏమిటో చెప్పే ‘ రెడ్‌లైట్-డెడ్‌లైఫ్ ‘ , స్వార్ధంతో ఎదుటివారిని వినియోగించుకొని తామూ సర్వం కోల్పోయిన ‘ ముగ్గురు మటాషీలు ‘ అన్నిచోట్లా తారసపడతారు . వివిధ సామాజిక వర్గాల విశ్లేషణను ‘ పెట్టుబడి ‘ లో చక్కగా చెప్పారు . ‘ హారతి ‘ అగ్రహారం వ్యవహారాలకు నిలువుటద్దంగా నిలుస్తుంది . చాలాకధలు సెహభాష్ అనిపించిన కొన్నింటిలో ‘ రసజ్ఞత ‘ ఎక్కువైందనిపిస్తుంది .

 

పట్నాయకుని వెంకటేశ్వరరావు , ఈనాడు ఆదివారం .

KrishnaMohanKatha1

కృష్ణమోహన్ కథాస్రవంతి విభాగం- 1” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కృష్ణమోహన్ కథాస్రవంతి విభాగం- 1 on kinige

8dcb7c7a-0040-441a-8ae8-7872189cebfd

Related Posts:

సీమ “వేగు చుక్కలు”

భౌతికంగా చూస్తే రాయలసీమ రాళ్ళసీమలానే కనిపిస్తుంది కానీ,తాత్విక కోణం లోంచి ఇది రతనాలసీమ. పద్యం ఎంత లోతుగా , ఎంత బలంగా ఈ సీమలో వేళ్ళూనికొని పోయిందో , తత్వం అంతకన్నా ఎక్కువగా జనం నోట వినిపిస్తుంది. శృంగార , విలాస వస్తువై బ్రాహ్మణ పండితుల భుక్తిమార్గమై , రాజుల లోగిళ్ళలో దొర్లిపడిన పద్యమే , విచిత్రంగా అన్ని బంధాలను తెగతెంచుకొని ,రెక్కలు విచ్చుకొని ఊళ్ళలో,వాడల్లో తిరుగులాడిన దృశ్యమూ రాయలసీమలో కనిపిస్తుంది. పండిత గోష్ఠి లో రాగయుక్తంగా ధ్వనించి ఒకప్పుడు గండభేరుండాలను తొడిగించుకున్న పద్యమే , ఇప్పుడు ఊరి చివర ఎనుమును కోసి భాగాలేసే మాదిగల నోట కమ్మగా వినిపిస్తుంది.ఈ వైరుధ్యపు లోతుల్ని వెతికే పని సాహిత్యంలో ఇప్పటికీ బలంగా జరగలేదనే చెప్పాలి.అయితే ఈ వైరుధ్యపు తీరుతెన్నులను కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం మాత్రం వినోదిని ఇటీవల చేశారు .ఉద్యోగ రీత్యా కడపలో ఉన్న వినోదిని , కడప జిల్లాలో పుట్టి పెరిగిన ముగ్గురు వాగ్గేయకారుల సాహిత్యాన్ని సామాజిక కోణంలోంచి విశ్లేషించారు. ఈ ముగ్గురిలోని సారూప్యతలను పట్టుకున్నారు.తేడాలను గుర్తించారు. అన్నమయ్య ,వేమన, వీరబ్రహ్మం – ఈ ముగ్గురినీ కడప జిల్లా వాసులగానే భావిస్తారు. అన్నమయ్య 15వ శతాబ్దానికి చెందినవాడు , మిగిలిన ఇద్దరూ 17వ శతాబ్దానికి చెందినవారు. అన్నమయ్య బ్రాహ్మణకులంలో పుట్టినవాడు కాగా , వేమన శూద్రుడు, కాపు కులంలో పుట్టాడు . వీరబ్రహ్మం శ్రామిక కులంలో పుట్టిన శూద్ర బహుజనుడు. అయితే ముగ్గురూ , వారి కాలాల్లోని సమాజాన్ని లోతుగా చూసిన వాళ్ళు . ఈ పరిశీలన వీళ్ళలో అలజడిని రేపింది .అసమానతపై ఆగ్రహాన్ని కలిగించింది.లోలోపల జరిగిన ఘర్షణే ఈ ముగ్గురినీ కవులుగా మార్చింది.సమాజంలోని దుర్మార్గపు రీతులను చూసి కలిగిన వైరాగ్యం వీళ్లని తాత్వికులగా మార్చింది. పరిస్థితులని చూసి కలిగే వేదన , ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం ,తిరుగుబాటు తత్వం ఈ సీమ కవిత్రయంలో కనిపిస్తాయి.

అన్నమయ్య , వీరబ్రహ్మం లు దేవున్ని అడ్డం పెట్టుకొని సమాజంలోని కుళ్ళుని బయటపెడితే , వేమన ఏకంగా దేవుడినే కడిగేస్తాడు. దురదృష్టం ఏమంటే , ఈ ముగ్గురు మహాకవులనీ కులాలవారీగా పంచేసుకోవడం . దేవుళ్ళను విగ్రహాలుగా మార్చేసుకోవడం . 32వేల కీర్తనలు రాసిన అన్నమయ్యను తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా జనంలోకి తీసుకువచ్చినా , అది కేవలం భక్తి కోణానికే పరిమితమయ్యింది.వేల కీర్తనల్లో జనం నోట పలికేది వందలే.వాటిల్లోనూ ఎక్కువ భక్తి పదాలే. కొద్దిగా భక్తి చాటున శృంగారమూ కనిపిస్తుంది. కానీ , అట్టడుగు వర్గాల బతుకుచిత్రాన్ని అన్నమయ్య పాటకట్టిన తీరు రావల్సినంతగా జనంలోకి రాలేదు . ‘అన్నమయ్య సామాజిక ధృక్పధం’ అనే శీర్షికతో వినోదిని రాసిన వ్యాసంలో ఆమె ఉదహరించిన పదాలను చూస్తే అన్నమయ్యని ఇంత మిస్సయ్యామా అనిపిస్తుంది.పోతులూరి వీరబ్రహ్మం విషయంలోనూ దారుణమైన అన్యాయము జరుగుతోందని అర్ధమవుతుంది.

గొప్ప సామాజికవేత్తను , ఒట్టి కాలజ్ఞానిగా పరిమితం చేస్తున్న తీరు భాధపెడుతుంది.వీరబ్రహ్మం మహత్యాలను ప్రచారం చేసినంతగా , ఆయన కవిత్వాన్ని జనంలోకి తీసుకెళ్ళడం లేదు . సామాజిక అసమానతలపై దేవుడి చాటునే అయినా , వీరబ్రహ్మం కవిత్వాన్నే ఆయుధంగా మలచుకొని పోరాడిన వైనాన్ని ‘ పోతులూరి వీరబ్రహ్మం’ అనే వ్యాసంలో వినోదిని వెల్లడిస్తారు. పై ఇద్దరిలా కాకుండా లోకరీతిని తప్పుపడుతూ ఎడాపెడా వాయించేసిన కవి వేమన. కుల వైషమ్యాలనీ , దేవుడి పేరిట సాగే దురాచారాలనీ వివక్షని వాడుక మాటల్లోనే దుయ్యబట్టిన వేమన ఇప్పటికీ జనం నాలుక మీద నిలిచిపోయాడు.దళితకోణం నుంచీ , స్త్రీల కోణం నుంచీ కూడా వినోదిని ఈ ముగ్గురు మహాకవుల సాహిత్యాన్ని పరిశీలించారనీ ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. వీరి సాహిత్యం మీద ఇంకా లోతైన అధ్యయనం జరగవలసిన అవసరాన్ని వినోదిని వేగుచుక్కలు’ గుర్తుచేస్తుంది.

– ఆర్.యం.ఉమామహేశ్వరరావు , ఆదివారం ఆంధ్రజ్యోతి , 22 జూన్ 2014 .

 

Andhrajyothi_22nd June 2014

 

“వేగు చుక్కలుడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

వేగు చుక్కలు on kinige

 

Veguchukkalu600

Related Posts:

  • No Related Posts

రెక్కలగుర్రం ఎక్కించి చుక్కలలోకం చూపించే కథలు – “నెమలీక” పుస్తకంపై సమీక్ష

మానసిక రుగ్మతలతో భాధపడేవారిసంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.ప్రతి ముగ్గురి లోనూ ఒకరు మానసిక రోగేనట! ఇలాంటి ధోరణులకు బాల్యం నుండే చికిత్స జరగాలి.అలాంటి చికిత్స చేసేది పిల్లల కధలే.అందుకే పూర్వీకులు జానపద కథలు,నైతిక విలువలు నేర్పే సాంఘిక కథలూ విస్తారంగా మనకు అందించారు.

సమాజ మార్పులకు అనుగుణంగా బాలసాహిత్యం విస్తరిస్తున్నప్పటికీ అది వారికి సక్రమంగా చేరకపోవడం వల్లే మనకిప్పుడిన్ని తంటాలు! పిల్లల సాహిత్యం వారిని ఆకర్షించాలి , చదవడానికి సులభమైన శైలిలో ఉండాలి.ఆసక్తి రేకెత్తించాలి.ఇంకా ఇంకా చదివేటట్టు చేయాలి.ఆ తృష్ణ వారిని అలా అలా జ్ఞానభాండాగారం వైపు నడిపించుకుపోవాలి.గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్ళగలం.కానీ దానితో నీళ్ళు తాగించలేం. పిల్లలకు మంచి రంగుల పుస్తకం కొనివ్వగలం ,చదివించలేం. కానీ జగన్నాధశర్మగారు రాసిన జానపదకథల పుస్తకం తీరే వేరు.పిల్లలకోసం ప్రత్యేకంగా రాసిన కధలివన్నీ.ఆయన గతంలో పాలపిట్ట కథలు ,ప్రపంచ జానపద సాహిత్యం, మహాభారతం, కధాసరిత్సాగరం వంటివన్నీ పెద్దలను,పిల్లలనూ ఎంతగానో ఆకట్టుకొన్నాయి.ఆ కోవలోకి చెందిందే ఈ “నెమలీక”.

దీని ముఖచిత్రం పిల్లలను ఇట్టే ఆకర్షిస్తుంది.చూడగానే చందమామ పుస్తకంలా , పుస్తకం తెరిచి చదవాలనే తహతహ పెంచుతుంది.

పేజీ తీసి లోపలికి వెళ్ళగానే కళ్ళు విచ్చుకొంటాయి.పినిశెట్టి బొమ్మలు చూడగానే ముఖం విప్పారుతుంది.అక్షరాల వెంట పరుగులు తీసే కళ్ళు పేజీలు చకచకా తిప్పమని చేతి వ్రేళ్ళని ఆత్రంగా అభ్యర్ధిస్తాయ్.అలా అలా ఇందులోని పదకొండు కథల్నీ చదవడం పూర్తిచేసిన కళ్ళు ఆలోచనల్ని ప్రేరేపించి మనోనేత్రాన్ని తెరుచుకొనేటట్లు చేస్తాయి.ఇందులోని జానపదగాధలన్నీ ఇంతకు మునుపు ఎవరూ చదవనివే! మనచుట్టూ లేని ఓ సరికొత్త ప్రపంచంలో విహరింపజేస్తాయి.సప్తసముద్రాల్ని దాటించి, దీవుల్లో విహరింపజేసి , మనస్సును గుర్రాలపై పరుగులు తీయించి వనవిహారం చేయిస్తాయీ కథలు.మాయలు,మంత్రాలు,తంత్రాలు,యంత్రాలు పాత్రల రూపం ధరిస్తాయి.రాకుమారులు,రాకుమార్తెలు , రెక్కల గుర్రాలు, గండభేరుండాలు ఈ కథలన్నిటా కనిపిస్తాయి. జంతువుని రాకుమారిగా మార్చడం,రాకుమారున్ని ఓ గొప్ప అన్వేషకునిగా, ఆలోచనశీలిగా మార్చేయడం , చెట్టుమీద దెయ్యమే వరాలిచ్చే దేవతగా మారిపోవడం , గొప్పనిధి లభించడానికి సాహసకృత్యాలు చేయడం, ఎన్నో వింతలు , విశేషాలు మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి.పిల్లలు మారాం చేయకుండా ఉండాలన్నా, వారికి హాయిగా,కమ్మగా నిద్రపట్టాలన్నా , చందమామపై ఆడుకుంటూ,నక్షత్రాలను తాకుతూ వారు హాయిగా కలల ప్రపంచంలో విహరిస్తూ ర్యాంకులు సంపాదించుకోవాలన్నా, విలువల సమాజాన్ని వారు నిర్మించాలన్నా ఇప్పుడీ కథాసాహిత్యం చదువుకోవాల్సిందే!

 

-నవ్య వారపత్రిక , 2 జూలై 2014 .

 

Nemaleeka_2jul2014@NavyaWeekly

 

“నెమలీకడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నెమలీక on kinige

 

Nemaleeka600

Related Posts:

  • No Related Posts

పురుషాధిక్యంపై ధిక్కారం..త్యాగసేవాసక్త – బెంగుళూరు నాగరత్నమ్మ పుస్తకంపై సమీక్ష

నల్లని శరీరచ్ఛాయ.. పదమూడేళ్లకే అనాథ… దేవదాసి. అయినా.. తల్లి పుట్టలక్ష్మమ్మ ఆకాంక్షలకు అనుగుణంగా భరతనాట్యం, కర్నాటక సంగీతం నేర్టుకుని లలిత కళలకు కాణాచిగా మారింది బెంగుళూరు నాగరత్నమ్మ. 26 ఏళ్లకే 146 పట్టణాలలో 1235 కచేరీలు చేసి, విద్యాసుందరి, గానకళావిశారద, త్యాగసేవాసక్త బిరుదులు పొంది, గృహలక్ష్మి స్వర్ణకంకణధారియై 1905 నాటికే ఆదాయపు పన్ను చెల్లించిన స్త్రీమూర్తి. నేను దేవదాసీని అని గర్వంగా చెప్పుకుని, ఓ గొప్ప కళాకారిణిగా నాగరత్నమ్మ ఎలా రాణించారో ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు ఆకట్టుకునేలా రాశారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, ఆచంట జానకీరామ్, మరుపూరి కోదండరామరెడ్డి.. నాగరత్నమ్మ ఔన్నత్యాన్ని జ్ఞాపకాల సహాయంతో వివరించారు. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంలోని పురుషాధిక్యతను ప్రశ్నించి సంచలనం సృష్టించిన నాగరత్నమ్మ, త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో స్త్రీలు పాడరాదనే నిషేధాన్ని ధిక్కరించి మరో మార్పుకు నాంది పలికాలు. నాగరత్నమ్మకు శక్తినిచ్చిన అంశాలు, ప్రతికూల పరిస్థితుల నుంచి ఆమె ఎదిగిన తీరు, పురుషాధిక్యంపై ఆమె ధిక్కారం, ఆమె దాతృత్వం.. ఆమె ఆధ్యాత్మికంపై మరింత దృష్టిసారిస్తే ఇంకా బాగుండేదేమో!

– కె. భాస్కర్, ఆంధ్రజ్యోతి, 27th Jul 2014

 

 

 

 

 

 

 

 

 

బెంగుళూరు నాగరత్నమ్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

బెంగుళూరు నాగరత్నమ్మ on kinige

 

 

Related Posts:

జూన్ 2014 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

జూన్ 2014 నాలుగవ వారంలోkinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి అద్దంకి అనంతరామ్ న్యూ ఎంట్రీ
2 ఆనంద జ్యోతి మధుబాబు వరుసగా 9 వారాలుగా
3 ఆంధ్రనగరి సాయి పాపినేని న్యూ ఎంట్రీ
4 భారతీయ యోగ సమ్మేళనం కేకలతూరి క్రిష్ణయ్య రీ ఎంట్రీ
5 వజ్రాల దీవి అడపా చిరంజీవి న్యూ ఎంట్రీ
6 చాణక్య శ్రీశార్వరి వరుసగా 13 వారాలుగా
7 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ వరుసగా 5 వారాలుగా
8 మనీపర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ వరుసగా 3 వారాలుగా
9 ఉపనిషత్ సుధాలహరి యువ భారతి న్యూ ఎంట్రీ
10 వోడ్కా విత్ వర్మ సిరాశ్రీ రీ-ఎంట్రీ

Related Posts: