“వంగూరి ఫౌండేషన్ అమెరికా” వారి ఎంపిక చేసిన పుస్తకాలపై 50% ప్రత్యేక తగ్గింపు

ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి కినిగె ఈ-బుక్స్  పై 50% ప్రత్యేక డిస్కౌంటు లభిస్తుంది.ఈ అవకాశం ఉగాది వరకు మాత్రమే గమనించగలరు.

వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కినిగెలో డిస్కౌంటు లభ్యమయ్యే వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి పుస్తకాలు:

 

vanguriF

1 తూర్పు బడి… పడమర గుడి… కలశపూడి శ్రీనివాసరావు
2 అమెరికామెడీ నాటికలు వంగూరి చిట్టెన్‍ రాజు
3 అమెరికా తెలుగు కథానిక – పదవ సంకలనం మల్టిపుల్ ఆథర్స్
4 ప్రవాసాంధ్రుల ఆశాకిరణం పూడిపెద్ది శేషుశర్మ
5 ఆత్మార్పణ పెమ్మరాజు వేణుగోపాలరావు
6 అమెరికా తెలుగు కథా సాహిత్యం – ఒక సమగ్ర పరిశీలన వంగూరి చిట్టెన్‌రాజు మరియు తన్నీరు కళ్యాణ్ కుమార్
7 విదేశీ కోడలు కోసూరి ఉమాభారతి
8 అమెరికా తెలుగు కథానిక – తొమ్మిదవ సంకలనం మల్టిపుల్ ఆథర్స్
9 అవంతీ కళ్యాణం లలితా రామ్
10 ఘర్షణ – కథలు అపర్ణ మునుకుట్ల గునుపూడి
10 ఘర్షణ – కథలు అపర్ణ మునుకుట్ల గునుపూడి
11 అమెరికా తెలుగు కథానిక – 12 వ సంకలనం మల్టిపుల్ ఆథర్స్

Related Posts:

రామకృష్ణమఠం వారి ప్రచురణలు కినిగెపై అతి త్వరలో…

కినిగెని ప్రోత్సహించి, ఆదరిస్తున్న పాఠకులకు శుభవార్త.
ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస గ్రంథాల ద్వారా యువతరానికి ప్రేరణ కల్పిస్తూ, వ్యక్తిత్వ నిర్మాణం చేస్తున్న రామకృష్ణ మఠం, తెలుగు విభాగం వారి ప్రచురణలు త్వరలో కినిగెలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రచురణలను కినిగెలో ఉంచడానికి సహాయం చేసిన మా శ్రేయోభిలాషులకు, కినిగె భాగస్వామ్యంతో అమూల్యమైన ఆధ్యాత్మిక సాహితీ సంపదను అంతర్జాల పాఠకులకు అందించేందుకు అంగీకరించిన రామకృష్ణమఠం ప్రచురణలకు ధన్యవాదాలు.
రామకృష్ణమఠం వారి ప్రచురణలు కినిగెపై అతి త్వరలో….
ఎప్పటిలాగే మీ ఆదరణనీ ఆశిస్తూ, మీ నిరంతర ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

Related Posts:

 • No Related Posts

“రాయవాచకము” ఆవిష్కరణ సభ

విశ్వనాథ నాయనయ్య వారి స్థానపతి 16 వ శతాబ్దంలో రచించిన “రాయవాచకము” పుస్తకాన్ని గుంటూరుకి చెందిన మిత్రమండలి ప్రచురణలు వారు శ్రీ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో పటాలు, చిత్రాలు మరియు వివరణలతో ప్రచురించారు.

ఈ పుస్తకం ఆవిష్కరణ సభ ది. 13 జూలై 2013 శనివారం సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్నమయ్య కళావేదిక ప్రాంగణంలో జరుగుతుంది. మహాత్మాగాంధి కళాశాల, గుంటూరు ప్రధానాచార్యులు; ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్లానింగ్ & మానిటరింగ్ బోర్డు సభ్యులు అయిన ప్రొఫెసర్ డి.ఏ.ఆర్. సుబ్రహ్మణ్యం సభకు అధ్యక్షత వహిస్తారు.

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల 19వ తరం వారసుడు రాజా ఆరవీటి శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు.

సాహితీ విమర్శకులు, జేకేసి కళాశాల పూర్వ తెలుగు విభాగాధిపతి డా. కడియాల రామమోహనరాయ్ గ్రంథాన్ని సమీక్షిస్తారు.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, సంగీత విద్వాన్ డా. భూసురపల్లి వేంకటేశ్వర్లు శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం గురించి ప్రసంగిస్తారు.

స్వధర్మ సేవాసంస్థ, గుంటూరు వారు సభకు ఆహ్వానిస్తున్నారు.

Related Posts:

 • No Related Posts

సంగీత కళానిధి డా. శ్రీపాద పినాకపాణి గారికి నివాళి

పినాకపాణి గారు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్ట్ 3వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు. సంగీతంలో తొలిపాఠాలు రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద నేర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు. వైద్యం అభ్యసించి, రాజమండ్రిలోనూ, విశాఖపట్నంలోనూ, కర్నూలు లోను ప్రభుత్వ వైద్యునిగా పనిచేసారు.
వీరి శిష్యులు ఎందరో వైద్య రంగంలోనే కాకుండా, సంగీతంలోను ప్రఖ్యాతి గడించారు. సంప్రదాయ సంగీతం తెలుగునాట వర్ధిల్లాలని ఆకాక్షించిన పినాకపాణిగారు పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకాలు రచించారు.
సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి. పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.
పినాకపాణి గారి పుస్తకాలలో ఈ క్రింది మూడు పుస్తకాలు కినిగెలో లభిస్తున్నాయి.
అభ్యాసమ్ On Kinige

స్వరరామమ్ On Kinige

ప్రపత్తి On Kinige

ఈ పుస్తకాలు డిజటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాలను తక్కువ ధరకి పొందవచ్చు.
నాదయోగులు బ్రహ్మశ్రీ పినాకపాణి గారిని సంస్మరించుకుంటూ శాస్త్రీయ సంగీతానికి వారు చేసిన సేవలకు వందనాలు అర్పిస్తోంది కినిగె.

Related Posts:

కినిగె పేమెంటు ఆప్షన్లు …

పై బొమ్మలో కినిగె పేమెంటు ఐచ్చికాలు ఉన్నాయి, పరిశీలించండి.

అలానే యన్నారైలు పేపాల్ కూడా వాడవచ్చు.

 

 

Related Posts:

 • No Related Posts

“భీమాయణం” పుస్తకావిష్కరణ సభ

భీమాయణం అనేది గ్రాఫిక్ రూపంలో చెప్పబడిన డా. బి. ఆర్. అంబేద్కర్ జీవితచరిత్ర. పార్థాన్‌ గోండు చిత్రకారులైన దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాంలు అద్భుతమైన బొమ్మలు అందించగా, శ్రీవిద్య నటరాజన్, ఎస్. ఆనంద్‌లు కథనం అందించారు. ఈ చిత్రకళ విలక్షణమైనది. దట్టమైన అవుట్‌లైన్లతోనూ, నీడలతోనూ నిండి వుండే బొమ్మలు, బాధని. క్రూరత్వం పట్ల మునుపు తెలియని వేదనని వ్యక్తం చేస్తాయి. వివక్షకి గురవడానికి దక్షిణాఫ్రికా వెళ్ళాల్సిన అవసరం లేని ఓ వ్యక్తి కథ భీమాయణం. చరిత్ర పుస్తకాలలో భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే పేరుపొందిన వ్యక్తి కథ భీమాయణం. అంబేడ్కర్ అంటరానితనపు అనుభవాలను వెల్లడిస్తునే, దేశంలోని ప్రస్తుత కుల వ్యవస్థని ఎండగడుతుందీ పుస్తకం. ఎనిమిది భాషలలో వెలువడింది ఈ పుస్తకం.

సిఎన్‌ఎన్‌ ప్రకటించిన ‘ఐదు అత్యుత్తమ రాజకీయ కామిక్స్‌ పుస్తకాల్లో భీమాయణం ఒకటిగా నిలిచింది.

భీమాయణం పుస్తకం ఆవిష్కరణ సభ 29 జూలై 2012 నాడు సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు హైదరాబాదులో జరుగుతుంది.

వేదిక: లమాకాన్, సి-బే బిల్డింగ్ తర్వాతి సందు, జివికె మాల్ ఎదురుగా, రోడ్ నెంబరు 1, బంజారా హిల్స్.
మరిన్ని వివరాలకు 9642731329 నెంబరుని సంప్రదించవచ్చు.

* * *

“భీమాయణం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

భీమాయణం1 On Kinige

Related Posts:

షార్ట్ స్టోరీస్ ఆఫ్ విశ్వనాథ – పుస్తకావిష్కరణ

“షార్ట్ స్టోరీస్ ఆఫ్ విశ్వనాథ” అనే శీర్షికతో విశ్వనాథ సత్యనారాయణ గారి కథలని ములుకుట్ల యోగ ఆంగ్లంలోకి అనువదించారు.

ఈ సంకలనం తేదీ: 21 మార్చి 2012 నాడు ఆవిష్కృతమవుతోంది. రేపు సాయంత్రం ఆరు గంటలకి విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షులు శ్రీ వెలిచాల కొండలరావు ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ విశ్వనాథ సాహిత్య పీఠం ప్రాంగణంలో (నీలోఫర్ హాస్పిటల్ వద్ద, రెడ్ హిల్స్, హైదరాబాద్.) జరుగనుంది.

శ్రీ విజయరామారావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీ మండలి బుద్ధప్రసాద్ సభకి అధ్యక్షత వహిస్తారు. శ్రీ సి.సుబ్బారావు పుస్తకాన్ని పరిచయం చేస్తారు.

ఆహ్వానపత్రికని ఈ లింక్‍లో చూడగలరు.

Related Posts:

మిసిమి మార్చి 2012 సంపాదకీయం

భామనే… సత్యభామనే… అంటూ కూచిపూడి నృత్యరీతులను సత్యభామ వాలుజడ తాకిడితో నేల నాలుగు చెరుగులా తీసుకువెళ్ళిన కళాకారులు వేదాంతం సత్యనారాయణ శర్మ – సత్యభామకు ఏ విధంగా అంచెలంచెలుగా మెరుగులు దిద్దారో ఆయన వివరణ చదవండి.

శ్రీకాకుళంలో ఎగళ్ళ రామకృష్ణ అని సాహిత్య కళాభిమాని వున్నారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు రంగరంగ వైభవంగా జరిపి అన్ని రంగాల ప్రతినిధులకు పూలదండలు వేస్తారు, పురస్కారాలు ఇస్తారు. ఆ సందర్భంగా ‘ఆధునిక సాహిత్య ధోరణులు’పై సదస్సు నిర్వహించి వ్యాసాలను ఆహ్వానించారు. అందులో కొన్నింటిని వారి సౌజన్యంతో మిసిమి పాఠకులకు అందిస్తున్నాము.

మనకు రంగుల పండగ దసరానే. కాని ఒకప్పుడు రెడ్డి రాజుల కాలంలో ‘వసంతోత్సవం’ -ఇప్పటి హోళీ లాంటిదే – నిర్వహించేవారని వేదుల రాజేశ్వరి తెలియజేస్తున్నారు.
రేడియోతో పెరిగాము ఒక తరం. అప్పతి కవులు, సాహిత్యకారులు, ఆకాశవాణిని ఎంతో పరిపుష్టం చేసారు. ఆకాశవాణి బాణిని, చరిత్రను ఓలేటి పార్వతీశం అ, ఆ ల దగ్గర్నించి వివరిస్తున్నారు.

కుప్పడు ఎలా అక్షరభిక్ష పెట్టాడో ఈ నెల ‘సామాన్యుడి సాహిత్యం’లో తెలుసుకుంటే మనసు ఆర్ద్రమై పోతుంది.

మనకు స్వాత్రంత్ర్య భిక్ష పెట్టిన వారిలో ఎందరో మనకు తెలియనే తెలియదు. ఉరితాడుని పూలదండలా వేసుకుని దేశం కోసం నవ్వుతూ ప్ర్రాణాలర్పించిన ‘బిస్మిల్’ ఉత్తరాన్ని చదివితే మన బాధ్యత కొంతవరకైనా తెలుస్తుందేమో.

నాలుగు ‘అట్టమీది బొమ్మలు’ నల-దమయంతి కథకు సంబంధించినవి -రష్యన్ చిత్రకారుడు పెన్‌బర్గ్ ఆవిష్కరణ.

అమ్మ సత్యమని, నాన్న నమ్మకమని వింటుంటాము. తమ ఆశయం కోసం, తల్లి లేని కొడుకుని పెంచి ప్రపంచానికివ్వటానికి, తన వయసును పేదల సేవల ఆవిరి చేస్జుకున్న తండ్రి విశ్వాసమే సత్యమనిపిస్తుంది – ‘డాక్టరు గారు’ చదవండి.

సంపాదకులు

* * *

మిసిమి మార్చి 2012 సంచిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ అనుసరించండి.

మిసిమి మార్చి 2012 On Kinige

Related Posts:

“మహార్ణవం” కథాసంపుటికి పురస్కారం

కొల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్ 1974లో స్థాపించబడింది.

భారతీయ సాహిత్యం కోసం ఎనలేని సేవ చేస్తున్న సంస్థ ఇది. ఒక భాషలో వెలువడిన పుస్తకాన్నిఇతర భాషలలోకి అనువదింపజేసి, ఆ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి.

అన్ని భారతీయ భాషలలోని సాహిత్యకారులను ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా, ఈ సంస్థ 1980 నుంచి వార్షిక పురస్కారాలను అందిస్తోంది.

2011 వ సంవత్సరానికి భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం – తెలుగులో- సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి టి.శ్రీవల్లీరాధిక రచించిన “మహార్ణవం” కథాసంపుటికి – ప్రకటించబడింది.

ది 18 – 19 ఫిభ్రవరి 2012 తేదీలలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి ఈ అవార్డుని స్వీకరించారు. రచయిత్రికి అభినందనలు.

మహర్ణవం కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మహార్ణవం On Kinige

Related Posts:

కినిగెలో రాబోయే ఈపుస్తకాలు

పర్‌స్పెక్టివ్స్ వారి ఈ క్రింది ప్రచురణలు త్వరలో కినిగెలో ఈ-పుస్తకాలుగా లభించనున్నాయి.

 • అల్లం రాజయ్య సాహిత్యం (కథలు) -1
 • అల్లం రాజయ్య సాహిత్యం (కథలు) -2 (సృష్టికర్తలు)
 • సంభాషణ
 • మోదుగుల పూలవనం/ప్రాణహిత
 • కొమరం భీం
 • ఇలా మిగిలేం
 • పతంజలి భాష్యం
 • సహచరులు
 • మన చలం
 • విభిన్న
 • మృగన

Related Posts:

 • No Related Posts