కినిగె ఉగాది కానుక: ఉచితంగా శ్రీ జయనామ సంవత్సర(2014-2015) పంచాంగం!

కినిగె పాఠక మిత్రులకు శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

శ్రీ జయనామ సంవత్సర ఉగాది సందర్భంగా కినిగె పాఠకులకు ఉచితంగా అందిస్తోంది “శ్రీ విఖసన ఆర్షధర్మ పీఠం వారి దృక్‌సిద్ధాంత పంచాంగం 2014-15″.

తిధి, వార౦, నక్షత్ర౦, యోగ౦, కరణ౦ మొదలైన వివరాలను అందిస్తూ, వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి, విజయదశమి వంటి పండుగలను ఎలా నిర్ణయించాలో ఈ పంచాంగంలో సవివరంగా తెలియజేసారు పంచాగకర్తలు శ్రీయుతులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ మరియు నారాయణం తాండవకృష్ణ చక్రవర్తి.
వివిధ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం వివరాలు చెబుతూ శ్రీ జయనామ సంవత్సరంలో ఆయా రాశులలో జన్మించిన వ్యక్తుల రాశి ఫలితాలను వెల్లడించారు.
వివిధ శుభకార్యాలకు కావల్సిన ముహూర్త నిర్ణయాలు, వివిధ పీడా/బాధా నివారణలకు పాటించవలసిన చర్యలు ఈ పంచాంగం సూచిస్తుంది.

శ్రీ జయనామ సంవత్సర పంచాంగం on kinige

 

 

Related Posts:

కినిగె రచయిత్రుల ఈ-పుస్తకాలపై 25% ప్రత్యేక తగ్గింపు!

కినిగె పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కినిగె పాఠకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది.
కినిగె రచయిత్రుల ఈ-పుస్తకాలను 25% ప్రత్యేక తగ్గింపు ధరకే పొందండి. ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే!

రచయిత్రుల పుస్తకాలు on Kinige

 

Related Posts:

కినిగె ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు

కినిగె.కాం రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, మీ ఆదరణకి, సహాయానికి, ప్రోత్సాహానికి మా ధన్యవాదాలు.

అంతర్వర్తి

ఇప్పుడు మరింత అందమైన, ప్రపంచ శ్రేణి నాణ్యతతో మా కొత్త అంతర్వర్తిని మీకు పరిచయం చేస్తున్నాము.

Kinige new UI

ఉచిత కానుక

ఏదైనా ఒక పుస్తకాన్ని కొనండి,దాన్ని మీ మిత్రులతో పంచుకోండి ఉచితంగా!

కినిగె పట్ల మీ ఆదరణకు ఈ సంతోష సమయంలో మరోసారి కృతజ్ఞత తెలుపుతున్నాం. కినిగె.కాం ద్వితీయ వార్షికోత్సవ కాలంలో మీరు కొన్న ఏ ఈ-బుక్‌నైనా మీకిష్టమైన వ్యక్తితో ఉచితంగా పంచుకోవచ్చు, ఆ ఈ-బుక్‌ని మీకు నచ్చిన వారికి ఉచితంగా బహుకరించవచ్చు. మీకు నచ్చిన దాన్ని మీకిష్టమైన వారితో పంచుకునే బహు చక్కని అవకాశం ఇది!

పేపాల్ సౌలభ్యం

మీరు చేసే కొనుగోళ్ళకు పేపాల్ ద్వారా చెల్లింపు జరపడం మీలో చాలా మందికి వాడుక. మీరు మీ పేపాల్ ఎకౌంట్ ఉపయోగించి కినిగె.కాం పై చెల్లింపులు జరపే సౌలభ్యం కల్పించామిప్పుడు.

ఆదా
డబ్బు ఆదా చేసుకోవడం అందరికీ ఇష్టమే. మీరు డబ్బు ఆదా చేసుకోడానికి మేమో మార్గం చూపుతున్నాం. కినిగె.కాం ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా సురవర తెలుగు కీబోర్డును ప్రత్యేక తగ్గింపు ధరకు అందిస్తున్నాం. ఇది పరిమిత కాలపు ఆఫర్. కొనండి, ఆదా చేసుకోండి. ఈ కీబోర్డు కొనేందుకు ఇక్కడ నొక్కండి.

Suravara Telugu Keyboard
కినిగె.కాం తరపు నుంచి మీ ప్రతీ ఒక్కరికీ మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెరుగైన సేవలందిస్తామని భరోసా ఇస్తున్నాము.
కినిగె బృందం

Related Posts:

 • No Related Posts

“భరతఖండంబు చక్కని పాడియావు” 40% తగ్గింపు ధరకి

చిలకమర్తి వారి ఆత్మకథ “స్వీయచరిత్రము”

Special 40% discount on “Sweeyacharitramu”, autobiography of eminent poet, freedom fighter and social reformer Chilakamarthi Lakshmi Narasimham. Hurry, offer valid only for couple of days. To purchase the eBook at 40% discount Click here now.
చిలకమర్తి వారి ఆత్మకథ “స్వీయచరిత్రము” 40% తగ్గింపు ధరకి On Kinige

“భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”
అంటూ భారత స్వాతంత్ర్య సమరం సందర్భంగా తెలుగువారిని కార్యోన్ముఖులను చేసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ఆత్మకథ “స్వీయచరిత్రము”.

* * *

చిలకమర్తి వారి జన్మదినం (26 సెప్టెంబరు) సందర్భంగా ఈ పుస్తకంపై 40 శాతం ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది కినిగె.

త్వరపడండి. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే.

* * *

పండిత కుటుంబంలో పుట్టిన చిలకమర్తి సంస్కృతాంధ్రాల్లో ప్రావీణ్యం సంపాదించి, రాజమండ్రి కళాశాలలో ఆంగ్లాన్నీ అభ్యసించాడు. రాజమండ్రిలో చదువుకొంటున్నప్పుడే, వీరేశలింగం భావాలవైపు ఆకర్షింపబడి, ఆయన అనునూయులలో అగ్రగణ్యుడైనాడు. అప్పటికే, రాజమండ్రిలో నెలకొనివున్న సంస్కరణ వాతావరణం, కళాశాల చదువు, అప్పుడప్పుడే రాజుకొంటున్న జాతీయభావజాలం చిలకమర్తిపై తీవ్రప్రభావాన్ని కలిగించాయి. 21 అధ్యాయాల్లో రాసిన ‘స్వీయ చరిత్రము’లో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం, గ్రంథరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్‌ యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – యివన్నీ సవివరంగా రాశాడు. చిలకమర్తి ఏకసంథాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు. చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశాడు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో పరికించాడు.

వకుళాభరణం రామకృష్ణ

చిలకమర్తి వారి ఆత్మకథ “స్వీయచరిత్రము” 40% తగ్గింపు ధరకి On Kinige

Special 40% discount on “Sweeyacharitramu”, autobiography of eminent poet, freedom fighter and social reformer Chilakamarthi Lakshmi Narasimham. Hurry, offer valid only for couple of days. To purchase the eBook at 40% discount Click here now.

Related Posts:

కాకతీయుల పౌరుషం… రెడ్డి రాజుల ప్రతాపం…

ఇది వీరభద్రారెడ్డి కథ

ఇది రాణీ రుద్రమ గాథ

ఇది గోనగన్నారెడ్డి ఆట

ఇది చెంచుల సమరభేరి

ఇది పొన్నమ్మ ప్రాణసఖుని కథ

ఇది వీరభద్రారెడ్డి కథ

25శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో ఈపుస్తకం పొందటానికి ఇప్పుడే ఇక్కడ నొక్కండి. త్వరపడండి, ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే.


వీరభద్రారెడ్డి On Kinige

అంతే కాకుండా ఇప్పుడు కినిగె మీకు ఈపుస్తకం కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తుంది. ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి. వీరభద్రారెడ్డి ఈపుస్తకం కొనుగోలు చెయ్యడానికి ఇప్పుడే ఇక్కడ నొక్కండి.

ఈపుస్తకం కొనుగోలు చెయ్యగానే మీకు Veerabhadrareddy by Madhubabu eBook coupon అనే ఈమెయల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు మీ స్నేహితులకు ఫార్వార్డ్ చేసి వారికి డిస్కౌంట్ అందించండి, అంతే కాకుండా మీ స్నేహితులు ఆ కూపన్ వాడిన ప్రతీసారి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

త్వరపడండి నేడే ఈ అద్భుతమైన చారిత్రక నవల 20శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో మీ స్వంతం చేసుకోండి. ఇప్పుడే దర్శించండి వీరభద్రారెడ్డి హోం పేజీ కినిగెపై

Related Posts:

 • No Related Posts

‘అసలు’ వీళ్ళు తెలుగువాళ్లే కదూ?

తెలుగు భాషా దినోత్సవ కానుక.

బూదరాజు రాధాకృష్ణ గారి తెలుగు సంగతులు అనే ఈపుస్తకంపై 40శాతం ప్రత్యేక తగ్గింపు.

త్వరపడండి, కేవలం రెండు రోజులే ఈ ప్రత్యేక తగ్గింపు. ఈ ప్రత్యేక తగ్గింపు గురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ నొక్కండి

తెలుగు సంగతులు 40 శాతం తగ్గింపునకు On Kinige

‘అసలు’ వీళ్ళు తెలుగువాళ్లే కదూ? ‘అసలు’ తెలుగుకాదు. హిందీ నుంచి వచ్చింది. తెలుగు మాట అసలుకు బురద అని అర్థం! అవునో కాదో తేల్చుకోవటం మంచిదేకదా. మాటలనుబట్టి కళ్లు, ముక్కు, చెవులు, కనుబొమ్మలు, పెదిమలు, చెంపలు, నుదురు, నోరు, మెడ, తల, గుండె, పొట్ట, బొడ్డు, చేతులు, కాళ్లు, వేళ్లు, గోళ్లు, అడుగులు, అరచేతులు, జుట్టు, కొప్పు, మీసం, గడ్డం, దవడలు, కణతలు, చివరికి వెంట్రుకలు కూడా తెలుగు మాటలేగాని ఇల్లాలి ‘జడ’ సంస్కృతంలోని ‘జట’ నుంచి వచ్చిన మాట…..

విషయసూచిక

 1. భాష
  1. మన తెలుగులో తెలుగెంత?
  2. స్వాతంత్ర్య సమరం : కొత్తమాటల పుట్టుక
  3. ప్రాచీన సాహిత్య భాష
  4. శాసన పరిశోధకులుగా ప్రభాకరశాస్త్రిగారు
 2. సాహిత్యం
  1. విషాద నాటకమా? విషాదాంత నాటకమా?
  2. విషాద నాటకము – లక్షణాలు
  3. స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి జాతీయ కవితలు
  4. తెలుగు సాహిత్యంలో జాతీయత, ఉపజాతీయత, అంతర్జాతీయత
  5. తెలుగులో సాహిత్య విమర్శ
  6. అవధాన ప్రదర్శనలు
 3. గ్రంథ సమీక్షలు
 4. అనుబంధం : ఇంటర్వ్యూలు

తెలుగు సంగతులు 40 శాతం తగ్గింపునకు On Kinige

Related Posts:

 • No Related Posts

ఋతుపవనాల ప్రత్యేక ఆఫర్ – RAIN RAIN COME TO ME

చల్లని జల్లులతో వేసవి తాపాన్ని మరిపించి అందరినీ మురిపిస్తున్న ఋతుపవనాలతో పాటు కినిగె మీకు ప్రత్యేకమైన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పుడు 400 రూపాయలు లేదా అంతకు పైబడి కినిగె బాలన్స్ రీచార్జ్ చేసుకోండి ఆ తరువాత ఎంచక్గా http://kinige.com/krecharge.php దర్శించి అక్కడి గిఫ్ట్ పెట్టెలో RAINRAINCOMETOME (RAIN RAIN COME TO ME ఖాళీలు లేకుండా) అని టైప్ చేసి మీరు రీచార్జ్ చేసిన మొత్తానికి అదనంగా 5% పొందండి. త్వరపడండి, ఈ ఆఫర్ కొద్దికాలం మాత్రమే, ఈ చిరుజల్లులు తఫానులుగా మారకముందే సద్వినియోగం చేసుకోండి.

 

ఆనంద కినిగె పుస్తక పఠనం. ఇప్పుడు మరింత ఆనందకరం.

 

 

Related Posts:

 • No Related Posts

మిసిమి మే 2012 సంపాదకీయం

గాంధీ విద్యార్థి దశలో లండన్ లో ఉన్నప్పుడు మాథ్యూ ఆర్నాల్డ్ వ్రాసిన “లైట్ ఆఫ్ ఏషియా” గ్రంథాన్ని ఒకటికి రెండుసార్లు చదివి ఎంతో ప్రభావితుడయ్యాడు. “కార్య కారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఏకైక ఆచార్యుడు, గౌతముడే” నని గాంధీ వక్కాణించాడు.

ఇరవైయవ శతాబ్దపు ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్త, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా బౌద్ధధర్మాన్ని “ఆధునిక శాస్త్ర విజ్ఞాన అవసరాలకు సరితూగే ధర్మం ఏదైనా ఉందంటే అది బౌద్ధమే” అని ప్రశంసించారు.

ఆధునిక జీవితంలో విజ్ఞాన పరిశోధనకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో బౌద్ధంలో సత్యశోధనకూ అలాంటి ప్రాముఖ్యతే ఉంది. ఈ విషయానికి కాలామ సుత్త లో ఒక ఉదాహరణ: కాలాములు నివాసమున్న కేసపుత్త అనే నిగమాన్ని భగవానుడు దర్శించినపుడు కాలాములు ఆయన వద్దకు వచ్చి ఇలా అడిగారు: “భగవాన్! ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులు, శ్రమణులు ఇతరుల సిద్ధాంతాలను, విశ్వాసాలని ఎండకడుతూ, తమ ధర్మాలను ఘనమైనవిగా ఘోషిస్తున్నారు. మరొక వర్గీయులైన బ్రాహ్మణులు, శ్రమణులుకూడా వారి వారి సిద్ధాంతాల ప్రాముఖ్యతను ప్రశంసిస్తూ ఇతరుల ధర్మాన్ని నిరసిస్తున్నారు. ఈ సంఘటన మమ్ములను సంశయంతో, సంఘర్షణతో నింపివేస్తోంది. వీరిలో ఎవరు సత్యాన్ని చెబుతున్నారు, ఎవరు అసత్యాన్ని చెబుతున్నారు?”

కరుణాసముద్రుడైన భగవానుడు ఇలా అన్నాడు. “అవును కాలాములారా, మీరు లోనైన సందిగ్ధంలో ఈ సందేహం రావడం సహజమే. ఒకరు చెప్పింది కానీ, మరొకరు చేరవేసింది కానీ, సంప్రదాయంలో ఉన్నదని కాని, మీరు దేనినీ విశ్వసించి గుడ్డిగా అనుసరించకండి. మత గ్రంథాలలో పేర్కొన బడిందని, తర్కంతో లేదా సూచనల వలన, ఊహాజనిత విషయాల వలన, సాధ్యాసాధ్యాల వలన, అభిప్రాయాల వలన ప్రేరేపితులు కాకండి. కానీ, మీ విజ్ఞతతో మీరు కొన్ని విషయాలు సర్వజన సమ్మతం కావని తెలుసుకొన్నపుడు వాటిని వదిలివేయండి; మీ విజ్ఞతతో మీరు కొన్ని విషయాలు సర్వజన సమ్మతమని తెలుసుకొన్నపుడు వాటిని గ్రహించి ఆచరించండి.”

ముఖ్యంగా ఈ ప్రాథమిక అంశాల సంయోగ సహకారాల వలననే బౌద్ధం శాస్త్ర పరిశోధనకు సమాంతరస్థాయిలో ఉంటుంది. విశ్వాసం కంటే పరిశోధనా ప్రమాణాలే బౌద్ధానికి ప్రధానాంశాలు. ఈ ముఖ్యలక్షణమే బౌద్ధాన్ని ప్రపంచంలో ఇతర మతాలనుంచి భిన్నంగా ఉంచుతోంది. బౌద్ధం ఒక దైవదత్తమైన మతవిశ్వాసం కాదు. దీనికి దైవప్రోక్తమైన గ్రంథమేదీ లేదు. ఒక ప్రవక్త లేడు, అందువలన మూఢనమ్మకాలనూ, పిడివాదాన్ని ఆశ్రయించదు. వీటిపై ఆధారపడిన మతవిశ్వాసాలు, ఈనాటి సాంకేతిక సమాచార ప్రభావంతో పేకమేడల్లా కూలిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో బౌద్ధం ఒక్కటే శాస్త్రవిజ్ఞానం, హేతుసంకేత పరంగానే ఉన్నదని, ఇప్పటి ప్రాచ్య, పాశ్చాత్య దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా అక్షరాస్యత అధికంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో బౌద్ధానికి గుర్తింపు ఎక్కువగా లభిస్తున్నది.

2556 బుద్ధ జయంతి సంచికలో బౌద్ధ ధర్మంలోని లోతుపాతులను పరిశీలించి చిక్కని రచనలందించిన రచయితలకు మా కృతజ్ఞతలు.

సంపాదకులు

* * *

మిసిమి మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మిసిమి తాజా సంచిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిసిమి మే 2012 On Kinige

మిసిమి వార్షిక చందాపై రాయితీ లభిస్తోంది. ఆ వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

Misimi 2012 Subscription On Kinige

Related Posts:

చరిత్రకు పదునుపెడుతున్న చరిత్రకారుడు

ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు అయిన సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన “భారత స్వాతంత్ర్యోద్యోమం: ఆంధ్రప్రదేశ్ ముస్లింలు” పుస్తకం గురించి 12 డిసెంబర్, 2011 నాటి హైదరబాద్ మిర్రర్ దినపత్రిక లోని “అక్షర మిర్రర్” శీర్షికలో సుప్రసిద్ధ రచయిత, విశ్లేషకులు కత్తి పద్మారావు విశ్లేషించారు.

ఆధునిక ఆంధ్రుల సాహితీ చరిత్రను పునర్మించడంలో సయ్యద్ నశీర్ అహమ్మద్ గారిది ఉన్నతమైన పాత్రని కత్తి పద్మారావు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆద్యుడైన సబాల్ట్రన్ హిస్టోగ్రఫీ విధానంలోనే నశీర్ అహమ్మద్ రచన సాగిందని కత్తి పద్మారావు అభిప్రాయపడ్డారు. నశీర్ అహమ్మద్ రచనా క్రమంలో విజువలైజేషన్ ఉంటుందని, అందువల్లే ఆయన పుస్తకాలు ఆయనతో పాటుగా పాఠకుడిని సుదూరాలకు తీసుకువెడతాయని పద్మారావు పేర్కొన్నారు.

సబాల్ట్రన్ స్టడీస్‍కు అమూల్య గ్రంథం చేర్చిన నశీర్ అహమ్మద్ కాంట్రిబ్యూషన్ మరువలేనిదని కత్తిపద్మారావు వ్యాఖ్యానించారు.

ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ లింక్‍లో చదవగలరు.

సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తున్నాయి.

ఈ పుస్తకాలపై తగ్గింపు కూడా ఉంది. వివరాలకు ఈ లింక్ చూడండి.

సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ పుస్తకాలు 25 శాతం తగ్గింపు ధరకు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

నూరు రూపాయలు విలువైన నూరు కినిగె కూపన్లు ఉచితంగా

నూరు రూపాయలు విలువైన నూరు కినిగె కూపన్లు ఉచితంగా

మరిన్ని వివరాలు ఇక్కడ , కంప్యూటర్ ఎరా బ్లాగుపై చూడండి.

 

ఈ అవకాశం మరో రెండు దినాలు మాత్రమే, త్వరపడండి.

Related Posts: