కినిగె నవలల పోటీ-2014 రిజల్ట్స్ త్వరలో!

కినిగె పాఠకులకు, రచయితలకు గమనిక…
కినిగె నవలల పోటీ-2014 రిజల్ట్స్ కినిగె 5 వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు (1st November 2014) ప్రకటించాల్సి ఉంది. కానీ జడ్జీలు రేటింగ్ కోసం మరికొంత సమయం కోరినందువల్ల ఈ రోజు రిజల్ట్స్ ప్రకటించలేకపోతున్నాం. అనుకున్న సమయానికి రిజల్ట్స్ అనౌన్స్ చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. సాధ్యమైనంత త్వరలోనే రిజల్ట్స్ ప్రకటిస్తామని విన్నవించుకుంటుకున్నాం.
కినిగె బృందం

Related Posts:

 • No Related Posts

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014 – నవలల వివరాలు

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014 గడువు ముగిసింది. పోటీకి వచ్చిన నవలలు ఇప్పటికే కినిగెలో లభిస్తున్నాయి.

 1. అదృష్టం
 2. ఒక ప్రేమ కథ
 3. రాజీ పడిన బంధం
 4. అహానికి రంగుండదు
 5. దీని భావమేమి తిరుమలేశ
 6. క్రిస్మస్ చెట్టు
 7. అన్నపూర్ణ
 8. ప్రేమాలయం
 9. దహనం
 10. అంతిమం
 11. మాతృదేవోభవ
 12. ముఖపుస్తకంలో ముగ్ధ
 13. నికృష్టుడి ఆత్మకథ
 14. 5-3-2
 15. మల్లీశ్వరి
 16. అద్వితీయం
 17. ఫామిలీ.కాం
 18. సాగర తరంగాలు
 19. మరణంతో నా అనుభవాలు
 20. స్ఫూర్తీ! ఐ లవ్ యు
 21. తెలుగు వెన్నెల్లో తేనె మనసులు
 22. స్త్రీలు వర్ధిల్లాలి
 23. ఈ నవలలకు పాఠకులు రేటింగ్ ఇచ్చేందుకు ఆఖరు తేదీ 11 సెప్లెంబర్ 2014. తుది ఫలితాలు 1 నవంబర్ 2014 నాడు ప్రకటించబడతాయి.

  Related Posts:

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014- అందిన నవలలు

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014 గడువు ముగిసింది. పోటీకి వచ్చిన నలలలో ఈ క్రింది నవలలు ఇప్పటికే కినిగెలో లభిస్తున్నాయి.

 1. అదృష్టం
 2. ఒక ప్రేమ కథ
 3. రాజీ పడిన బంధం
 4. అహానికి రంగుండదు
 5. దీని భావమేమి తిరుమలేశ
 6. క్రిస్మస్ చెట్టు
 7. అన్నపూర్ణ
 8. ప్రేమాలయం
 9. దహనం
 10. మాతృదేవోభవ
 11. ముఖపుస్తకంలో ముగ్ధ

ఈ క్రింది నవలలు గడువులోపల అందాయి. ఇవీ త్వరలోనే కినిగెలో ఈబుక్స్‌గా లభిస్తాయి.

 • నికృష్టుడి ఆత్మకథ
 • 5-3-2
 • మల్లీశ్వరి
 • అద్వితీయం
 • ఫామిలీ.కాం
 • సాగర తరంగాలు
 • మరణంతో నా అనుభవాలు
 • పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి
 • స్ఫూర్తీ! ఐ లవ్ యు
 • తెలుగు వెన్నెల్లో తేనె మనసులు
 • స్త్రీలు వర్ధిల్లాలి

మరోక నవల అందింది, కానీ టెక్స్ట్‌లో సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా ఆ రచయితను మళ్ళీ పంపమని కోరడం జరిగింది.
పోటీలో పాల్గొన్న రచయితా/రచయిత్రులందరికీ అభినందనలు.

Related Posts:

 • No Related Posts

ప్రముఖ రచయిత శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారికి అభినందనలు

శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారిని తెలుగులో 100 నవలలు పైగా రాసిన రచయితగా ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇటీవల గుర్తించి ప్రమాణపత్రం జారీచేసింది.
1985లో “మోడల్” అనే మొదటి నవలతో ప్రారంభించిన ఆయన రచనా వ్యాసంగం 2013లో “నా ప్రేయసిని పట్టుకుంటే కోటి” అనే 101 వ నవల వరకూ కొనసాగిందనీ, ఈమధ్యే “ది ఎనిమీ ఆఫ్ మాన్‌కైండ్” అనే ఆంగ్లనవలను అమెరికాలో ముద్రించి, ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో ప్రచురించారని అందులో పేర్కొన్నారు. సూర్యదేవర రచించిన 101 తెలుగు నవలలో 65 కన్నడంలోకి, 5 తమిళంలోకి అనువదించబడ్డాయి.
ఈ ఘనత సాధించినందుకు  శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారికి అభినందనలు తెలియజేస్తోంది కినిగె.

Related Posts:

తురగా జానకీరాణి కథలు

రేడియో అక్కయ్యగా తెలుగు వారందరికీ సుపరిచితురాలైన శ్రీమతి తురగా జానకీరాణి గారి కథల పుస్తకం “తురగా జానకీరాణి కథలు” ఈ దసరా పండుగనాడు ఆవిష్కరించబడడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

ఈ శుభసందర్భంలో వారికి ఇవే మా శుభాకాంక్షలు.

శ్రీ తురగా కృష్ణమోహన్ గారి “మాట కచ్చేరి” పుస్తకాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరి దగ్గరకు ఈ-బుక్స్ రూపంలో తీసుకువెళ్ళడానికి మా కినిగె.కాం సంస్థను తమ భాగస్వామిగా చేసుకున్నందుకు శ్రీమతి తురగా జానకీ రాణి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఈ సందర్భంగా “తురగా కృష్ణమోహనరావు పాత్రికేయ పురస్కారాన్ని” అందుకోబోతున్న ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారికి, మా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము.

ఇంకా ఈ సభకు విచ్చేసిన ప్రముఖులు, మాజీ తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ ఎన్.గోపి గారికి, లోక్‌సత్తా పార్టీ అధినేత, శాసన సభ్యులు శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి, విఖ్యాత పాత్రికేయులు, సంపాదకులు శ్రీ ఎబికె ప్రసాద్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారములు తెలియజేస్తున్నాము.

అభినందనలతో,

అనిల్ అట్లూరి,
కినిగె.కాం బృందం

Related Posts:

రామకృష్ణమఠం వారి ప్రచురణలు కినిగెపై అతి త్వరలో…

కినిగెని ప్రోత్సహించి, ఆదరిస్తున్న పాఠకులకు శుభవార్త.
ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస గ్రంథాల ద్వారా యువతరానికి ప్రేరణ కల్పిస్తూ, వ్యక్తిత్వ నిర్మాణం చేస్తున్న రామకృష్ణ మఠం, తెలుగు విభాగం వారి ప్రచురణలు త్వరలో కినిగెలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రచురణలను కినిగెలో ఉంచడానికి సహాయం చేసిన మా శ్రేయోభిలాషులకు, కినిగె భాగస్వామ్యంతో అమూల్యమైన ఆధ్యాత్మిక సాహితీ సంపదను అంతర్జాల పాఠకులకు అందించేందుకు అంగీకరించిన రామకృష్ణమఠం ప్రచురణలకు ధన్యవాదాలు.
రామకృష్ణమఠం వారి ప్రచురణలు కినిగెపై అతి త్వరలో….
ఎప్పటిలాగే మీ ఆదరణనీ ఆశిస్తూ, మీ నిరంతర ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

Related Posts:

 • No Related Posts

“రాయవాచకము” ఆవిష్కరణ సభ

విశ్వనాథ నాయనయ్య వారి స్థానపతి 16 వ శతాబ్దంలో రచించిన “రాయవాచకము” పుస్తకాన్ని గుంటూరుకి చెందిన మిత్రమండలి ప్రచురణలు వారు శ్రీ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో పటాలు, చిత్రాలు మరియు వివరణలతో ప్రచురించారు.

ఈ పుస్తకం ఆవిష్కరణ సభ ది. 13 జూలై 2013 శనివారం సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్నమయ్య కళావేదిక ప్రాంగణంలో జరుగుతుంది. మహాత్మాగాంధి కళాశాల, గుంటూరు ప్రధానాచార్యులు; ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్లానింగ్ & మానిటరింగ్ బోర్డు సభ్యులు అయిన ప్రొఫెసర్ డి.ఏ.ఆర్. సుబ్రహ్మణ్యం సభకు అధ్యక్షత వహిస్తారు.

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల 19వ తరం వారసుడు రాజా ఆరవీటి శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు.

సాహితీ విమర్శకులు, జేకేసి కళాశాల పూర్వ తెలుగు విభాగాధిపతి డా. కడియాల రామమోహనరాయ్ గ్రంథాన్ని సమీక్షిస్తారు.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, సంగీత విద్వాన్ డా. భూసురపల్లి వేంకటేశ్వర్లు శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం గురించి ప్రసంగిస్తారు.

స్వధర్మ సేవాసంస్థ, గుంటూరు వారు సభకు ఆహ్వానిస్తున్నారు.

Related Posts:

 • No Related Posts

సాక్షి”ఫన్‌డే” 2 జూన్ 2013 – టాప్ ఫైవ్ బుక్స్

సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం “ఫన్‌డే” 2 జూన్ 2013 నాటి సంచికలో కినిగె సౌజన్యంతో టాప్ ఫైవ్ పుస్తకాల జాబితాను ప్రచురించారు. వివరాలు:

1. మిస్టర్ మిరియం
– మల్లాది వెంకట కృష్ణమూర్తి
2. ఆత్మ కధాంశాల ఉత్తరాలు
– రంగనాయకమ్మ
3. రామ్@శృతి.కామ్
– అద్దంకి అనంత్‌రామ్
4. “ది బెస్ట్” ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్
– యండమూరి వీరేంద్రనాథ్
5. ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ
– బొందలపాటి

Related Posts:

యువనేస్తం… ఈ-పుస్తకం!

యువతలో వ్యాపిస్తున్న ఈ-బుక్ రీడింగ్ అలవాటు గురించి, యువరచయితలు తమకు అందుబాటులో ఉన్న ఈ-పబ్లిషింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటున్న తీరు గురించి ఈనాడు ప్రత్యేక పేజి “ఈతరం” లో (తేదీ 1 జూన్ 2013) ఒక వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసం నుంచి కొన్ని పేరాలు ఇక్కడ చదవండి.

* * *

యువగుండెల్లో… భావోద్వేగపు పరిమళాలు… అయినా జనం చేరే మార్గం తెలియదు! కలం కదిపితే కమ్మని రచనలు… అచ్చు వేయిద్దామంటే అదో ప్రయాస! ఇలాంటి కష్టాలకిక కాలం చెల్లినట్టే… కాణీ ఖర్చు లేకుండా రచనల్ని ఈ-పుస్తకాలుగా మలుస్తున్నాయి ఆన్‌లైన్ పుస్తక ప్రచురణ సంస్థలు… సత్తా ఉన్న కొత్త రచయితలకు సదా స్వాగతం అంటున్నాయి… ప్రచారం, మార్కెటింగ్ బాధ్యతా వాళ్లదే!

* * *

కుర్రకారు సరదాలకు సరిదోస్తులే. అనుమానం లేదు! వారితోపాటే సాహిత్య ప్రియులు, జ్ఞాన పిపాసులూ ఉంటారండోయ్. అందుకే కాస్త తీరిక దొరికితే పుస్తకం తిరగేస్తుంటారు. వీలైతే కలం కదిలిస్తుంటారు. కథలు, కథానికలు, కవిత్వాలు, నవలలు.. ఎడాపెడా రాసేవాళ్లకి కొదవే లేదు. ఇప్పుడీ యువ రచనా వ్యాసంగం ‘డిజిటల్’ బాట పట్టింది. బ్లాగులు, సైట్లతో ముందుకెళ్లడమే కాదు, తమ రచనలను ‘ఈ-పుస్తకం’గా వెలువరించే ధోరణిని యువత అందిపుచ్చుకుంటోంది. పెరిగిన సాంకేతిక ఈ కొత్త అభిరుచికి దారులు తెరుస్తోంది. యువతలో పెరుగుతున్న ‘ఈ-రీడింగ్’ అభిరుచి అందుకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ‘ఈ-రీడర్’ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లలో పుస్తకాల డౌన్‌లోడింగ్ పెరుగుతున్న ధోరణి, యువ రచయితలకు ఆన్‌లైన్ మార్గాలు పరుస్తోంది.

* * *

కినిగెలాంటి సంస్థలైతే తమ పుస్తకాల గురించి మీడియాలోనూ ప్రకటనలిస్తున్నాయి. ఇక ఈ-పుస్తకాల్ని కాపీ చేయకుండా, పైరసీకి ఆస్కారం లేకుండా డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్(డీఆర్ఎం) పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు ప్రచురణకర్తలు. కొన్నవాళ్లు మాత్రమే చదవగలరు.

* * *

ఇంకా తన తొలి రచనని కినిగెలో ఈ-బుక్‌గా ప్రచురించిన యువ రచయిత అద్దంకి అనంతరామ్ గురించి కూడా ప్రస్తావించిందీ వ్యాసం.

వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ లింక్‍లో చదవచ్చు.

Related Posts:

 • No Related Posts

రాలిన కథా కుసుమం

తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న త్రిపుర 24 మే 2013 న దివంగతులయ్యారు.

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి.

త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్‌పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు.

త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా ” సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.

“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.

చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో తనవంతు పాత్ర పోషించి, కథనరంగం నుంచి నిష్క్రమించిన త్రిపురకి హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది కినిగె.

Related Posts: