అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014

మాట ఒక విప్లవం. రాత ఒక విప్లవం. పుస్తకం ఒక విప్లవం. సమాజాల్ని సమూలంగా మార్చేసిన విప్లవాలు ఇవి.

సాంకేతిక విప్లవం ఇప్పుడు మనం చవిచూస్తున్నామ్. ప్రపంచ భాషలను వేగంగా ప్రభావం చేస్తుంది నేటి సాంకేతిక విప్లవం. నిన్నటిలా నేడు లేదు. నేటిలా రేపు ఉండబోదు. నేటి సాంకేతిక పరిజ్ఙానం పరిపూర్ణంగా అందుకుంటూ, రేపటి తెలుగు పుస్తకం  కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తెలుగు వారి అభిమాన, విశ్వసనీయ పుస్తక ప్రపంచం కినిగె డాట్ కామ్ తెలుగు సాహితీ ప్రపంచానికి సగర్వంగా సమర్పిస్తుంది అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014కినిగె డాట్ కామ్ తెలుగు పుస్తక ప్రపంచం

బహుమతి ఏమిటి?

మొదటి బహుమతి: లక్ష రూపాయలు.

రెండవ బహుమతి: పాతిక వేల రూపాయలు.

మూడవ బహుమతి: పది వేలు.

ఎలా పాల్గొనాలి?

మీ కొత్త తెలుగు నవలను కినిగెలో ఈపబ్లిష్ చెయ్యండి. డిస్క్రిప్షనులో తెలుగు నవలా పోటీ కోసం అని వ్రాయండి.
ఈ పబ్లిష్ సహాయం కోసం ఇక్కడ నొక్కండి.

గడువు ఎప్పటివరకు?

06/06/2014 వరకూ, అనగా జూన్ ఆరు 2014 మద్యాహ్నం 12:00 గంటలు భారత కాలమానం ప్రకారం. ఈ లోపులో కినిగెలో ఈపబ్లిష్ విజయవంతంగా చేసిన నవలలే పోటీకి అర్హమైనవి.

విజేతలను ఎలా నిర్ణయిస్తారు?

కినిగె పాఠకులు మీ నవలలు చదివి వాటికి రేటింగు ఇస్తారు. ఈ రేటింగు ఆధారంగా ఉత్తమ పది (లేదా ఆపై) నవలలనుండి న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు.

 తవసం (తరచూ వచ్చే సందేహాలు)

1. నా పాత నవల సబ్మిట్ చెయ్యవచ్చా?

లేదు. కేవలం కొత్త నవలలు, ఎక్కడా ప్రచురించబడనివి, ఏ ఇతర పోటీకీ పంపించనివీ మాత్రమే అర్హమైనవి. గమనిక: మీ ఇతర నవలలు భేషుగ్గా కినిగెలో ఈపబ్లిష్ చేసుకొని మరింత మంది పాఠకులను వాటిని చేరువ చెయ్యవచ్చు. ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వివరాలు ఇక్కడ.

2. కినిగె నవలా పోటీకి ప్రచురించాక, ఇతర పోటీలకు పంపవచ్చా?

ఫలితాలు వచ్చేంతవరకూ లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ ఏ ఇతర పోటీలకూ పంపకూడదు.

3. నేను పోటీకి సబ్మిట్ చేసే నవల కినిగెలో ఈపుస్తకంగా ఉంచడం వల్ల పోటీ బహుమతి కాకుండా రాయల్టీ కూడా వస్తుందా?

అవును వస్తుంది.

4. నా పుస్తకం ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించండి.

5. కవర్ పుట కూడా నేనే డిజైన్ చేయించాలా?

అవును కవర్ పుట కూడా మీరే పంపించాలి. గుర్తించుకోండి మంచి కవర్ పుట ఎక్కువమంది పాఠకులను చేరువ చెయ్యడంలో చాలా సహాయం చేస్తుంది.

6. చేత్తో వ్రాసిన మానుస్క్రిప్ట్ పంపించవచ్చా?

లేదు.

7. అను ఫాంట్స్ లో, పేజ్ మేకర్ లో టైప్ చేసినవి పంపించవచ్చా?

అవును. పంపించవచ్చు.

8. స్కాన్ చేసిన డాక్యుమెంట్లు పంపించవచ్చా?

లేదు.

9. యూనీకోడులో టైప్ చేసిన ఫైల్లు పంపించవచ్చా?

అవును పంపించవచ్చు.

10.ఈ పోటీకి ఏమైనా వయో పరిమితి ఉందా?

లేదు అన్ని వయసుల వాళ్లూ పాల్గొనవచ్చు.

11. కనీసం ఎన్ని పుటలు ఉండాలి?

కనీసం 21,000 పదాలు (అక్షరాలా ఇరవై ఒక్క వేల పదాలు) ఉండాలి

12. అనువాదాలు పంపించవచ్చా?

రచన తమ సొంతమై ఉండాలి, ఏ ఇతర భాషలలోని రచనలకు అనువాదం గాని, అనుకరణగానీ, అనుసరణ గానీ కాకూడదు

13. కాపీరైట్ ఎవరికి ఉంటుంది.

కాపీరైట్ నవల రచయితకే ఉంటుంది.

14. పుస్తకాన్ని కేవలం ఈపుస్తకంగానే ఉంచాలా, లేదా ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చా?

బహుమతులు ప్రకటించే వరకూ, లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ మీ పుస్తకం కేవలం ఈపుస్తకంగా మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చు.

15. కినిగె నా పుస్తకాన్ని ప్రింటు పుస్తకంగా తీసుకువస్తుందా?

లేదు.

16. గెలుపొందిన పుస్తకాలను కినిగె ప్రింటు పుస్తకాలుగా తీసుకువస్తుందా?

లేదు.

13. ఇతర నిబంధనలు ఏమిటి?

అ. మీ నవలను ఎంపిక చేసిన పాఠకులకు కినిగె తక్కువ ధరకు లేదా పూర్తి ఉచితంగా ఇస్తుంది.

ఆ. అంతిమ నిర్ణయం కినిగెదే. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.

ఇ. పోటీ ముగిసిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాలు గెలుపొందిన నవలలు కినిగెలో మాత్రమే ఈపుస్తకంగా ఉండాలి. వేరే ఎక్కడా ఈపుస్తకంగా అందుబాటులో ఉంచకూడదు.

ఈ. మీకింకా ఏవైనా సందేహాలు ఉంటే కినిగె సపోర్టును సంప్రదించండి. support@kinige.com

ఉ. ఈ పబ్లిష్ చేయడంలో సందేహాలకు  9704605854  సంప్రదించండి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు (భారత కాలమానం) మాత్రమే.

ఊ. ఏదైనా నవలను పోటీలో ఉంచడానికి, అనర్హమైనవాటిగా నిర్ణయించడానికీ కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.

ఋ. Subjected to the jurisdiction of Hyderabad only.

ౠ. కినిగె ఇతర నియమనిబంధనలు వర్తిస్తాయి.

ఎ. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోటీ నియమ నిబంధనలు మార్చడానికి, పోటీని పూర్తిగా రద్దు చెయ్యడానికి కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.

కినిగె డాట్ కామ్ తెలుగు పుస్తక ప్రపంచం

కినిగె డాట్ కామ్ పత్రిక ఉచితంగా చదవండి

గమనిక – మీ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కనీస పదాల సంఖ్య ఇరవై ఒక్క వేల పదాలుగా ఉంచాము. ఈ విషయంలో ఇంకే మార్పులూ చేర్పులూ ఉండవని గమనించ ప్రార్థన.

Related Posts:

యువనేస్తం… ఈ-పుస్తకం!

యువతలో వ్యాపిస్తున్న ఈ-బుక్ రీడింగ్ అలవాటు గురించి, యువరచయితలు తమకు అందుబాటులో ఉన్న ఈ-పబ్లిషింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటున్న తీరు గురించి ఈనాడు ప్రత్యేక పేజి “ఈతరం” లో (తేదీ 1 జూన్ 2013) ఒక వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసం నుంచి కొన్ని పేరాలు ఇక్కడ చదవండి.

* * *

యువగుండెల్లో… భావోద్వేగపు పరిమళాలు… అయినా జనం చేరే మార్గం తెలియదు! కలం కదిపితే కమ్మని రచనలు… అచ్చు వేయిద్దామంటే అదో ప్రయాస! ఇలాంటి కష్టాలకిక కాలం చెల్లినట్టే… కాణీ ఖర్చు లేకుండా రచనల్ని ఈ-పుస్తకాలుగా మలుస్తున్నాయి ఆన్‌లైన్ పుస్తక ప్రచురణ సంస్థలు… సత్తా ఉన్న కొత్త రచయితలకు సదా స్వాగతం అంటున్నాయి… ప్రచారం, మార్కెటింగ్ బాధ్యతా వాళ్లదే!

* * *

కుర్రకారు సరదాలకు సరిదోస్తులే. అనుమానం లేదు! వారితోపాటే సాహిత్య ప్రియులు, జ్ఞాన పిపాసులూ ఉంటారండోయ్. అందుకే కాస్త తీరిక దొరికితే పుస్తకం తిరగేస్తుంటారు. వీలైతే కలం కదిలిస్తుంటారు. కథలు, కథానికలు, కవిత్వాలు, నవలలు.. ఎడాపెడా రాసేవాళ్లకి కొదవే లేదు. ఇప్పుడీ యువ రచనా వ్యాసంగం ‘డిజిటల్’ బాట పట్టింది. బ్లాగులు, సైట్లతో ముందుకెళ్లడమే కాదు, తమ రచనలను ‘ఈ-పుస్తకం’గా వెలువరించే ధోరణిని యువత అందిపుచ్చుకుంటోంది. పెరిగిన సాంకేతిక ఈ కొత్త అభిరుచికి దారులు తెరుస్తోంది. యువతలో పెరుగుతున్న ‘ఈ-రీడింగ్’ అభిరుచి అందుకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ‘ఈ-రీడర్’ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లలో పుస్తకాల డౌన్‌లోడింగ్ పెరుగుతున్న ధోరణి, యువ రచయితలకు ఆన్‌లైన్ మార్గాలు పరుస్తోంది.

* * *

కినిగెలాంటి సంస్థలైతే తమ పుస్తకాల గురించి మీడియాలోనూ ప్రకటనలిస్తున్నాయి. ఇక ఈ-పుస్తకాల్ని కాపీ చేయకుండా, పైరసీకి ఆస్కారం లేకుండా డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్(డీఆర్ఎం) పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు ప్రచురణకర్తలు. కొన్నవాళ్లు మాత్రమే చదవగలరు.

* * *

ఇంకా తన తొలి రచనని కినిగెలో ఈ-బుక్‌గా ప్రచురించిన యువ రచయిత అద్దంకి అనంతరామ్ గురించి కూడా ప్రస్తావించిందీ వ్యాసం.

వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ లింక్‍లో చదవచ్చు.

Related Posts:

  • No Related Posts

చరిత్ర పరిశోధనల్లో ఘనాపాటి

ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు అయిన సయ్యద్ నశీర్ అహమ్మద్ గురించి 20 నవంబర్, 2011 నాటి ఆంధ్రభూమి దినపత్రిక లోని “కవులూ.. రచయితలూ” శీర్షికలో సుప్రసిద్ధ విశ్లేషకులు విహారి పరిచయం చేసారు.

పరిశోధన ఒక అసిధారావ్రతమని, అందునా చారిత్రక పరిశోధన మరీ వ్యయప్రయాసలకోర్చినదని విహారి పేర్కొన్నారు. సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలను, చేసిన పరిశోధనల గురించి ఈ వ్యాసంలో విశ్లేషించారు రచయిత.

ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ దిగువ చిత్రంలో చదవగలరు.


సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తున్నాయి.

ఈ పుస్తకాలపై తగ్గింపు కూడా ఉంది. వివరాలకు ఈ లింక్ చూడండి.

సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ పుస్తకాలు 25 శాతం తగ్గింపు ధరకు On Kinige

Related Posts:

రచయితలకు నమస్కారం!

 

.com

 

భారతీయ పుస్తకాల కోసం అంతర్జాల దుకాణం

రచయితలకు నమస్కారం!

కినిగె.కామ్ గురించి:

అంతర్జాలం ద్వారా పుస్తకాలను విక్రయించడానికి మరియు అద్దెకివ్వడానికి రచయితలకు వీలుకల్పించేందుకు కినిగె.కాం ఒక వేదిక. ఈ సైటు ద్వారా పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్లలో ప్రపంచంలోని ఎవరైనా కొనుక్కోడానికి లేదా కొన్నిరోజులపాటు అద్దెకు తీసుకొనడానికి అవకాశం ఉంటుంది.

కినిగె.కామ్ ద్వారా మీకు కలిగే సదుపాయాలు

1. మీ పుస్తకాలను దేశ, విదేశాలలోని పాఠకులకు ebook ఫార్మాటులో అమ్మవచ్చు, అద్దెకు ఇవ్వవచ్చు

2. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ పుస్తక అమ్మకాలను, అద్దెలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు

3. వాడుకదారులు వారి కంప్యూటరులోనే కాకుండా, వారి పుస్తక రీడర్లలో(కిండిల్, ఐప్యాడ్, సోనీ రీడర్ మొ.) కూడా మీ పుస్తకాన్ని చదువుకోవచ్చు

4. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పుస్తకాన్ని ఒకరి కంటే ఎక్కువ మంది చదవకుండా నిరోధింపబడుతుంది

5. పుస్తకం మొత్తాన్ని ప్రింటు తీయకుండా నిరోధించే అవకాశం

6. అద్దెకు ఇచ్చిన పుస్తకం గడువు తీరిన తరువాత, వాడుకదారుల కంప్యూటరు మరియు రీడర్లనుండి దానంతట అదే తొలగింపబడుతుంది

మీ పుస్తకాలను ఈ సైటు ద్వారా వినియోగదారులకు అందుబాటులోనికి తేవడానికి support@kinige.com లో సంప్రదించండి లేదా http://kinige.comను దర్శించండి.

మా ఫోను నంబరు: 81 426 426 19/38

Related Posts: