కినిగె కొత్త ఫీచర్లు – ఇప్పుడు పుస్తకాలు ఎంచుకోవడం మరింత ఆసక్తికరం.

ఈ వారం కినిగెలో మూడు కొత్త ఫీచర్లు.

ఈ-పుస్తకాలు Vs ప్రింట్ పుస్తకాలు

గతంలోని షో ఓన్లీ ప్రింట్ బుక్స్ అనే పద్దతి బదులుగా ఇప్పుడు రెండు చెక్ బాక్సులు కినిగె హోమ్ పుటపై ఎడమవైపున వచ్చాయి. వీటి ద్వారా మీకు కావాల్సినవి ఈ-పుస్తకాలు మాత్రమే అయితే కేవలం ఈపుస్తకాలు చెక్ బాక్స్ ఎంపిక ఉంచి ప్రింట్ బుక్స్ చెక్ బాక్స్ ఎంపిక తొలగించవచ్చు. అదే మీకు కావాల్సింది కేవలం ప్రింట్ పుస్తకాలు అయితే కేవలం ప్రింట్ బుక్స్ మాత్రం ఎంపిక ఉంచి ఈపుస్తకాలు తొలగించవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే కినిగె దర్శించి తెలుగు పుస్తకాలలో మీకు కావాల్సినవి చదివెయ్యండి! లేదా మీ ఇంటికే తెప్పించుకోండి. అన్నట్టూ మీకు తెలుసా, ఇప్పుడు కినిగె నుండి భారతదేశం వెలుపలికి కూడా ప్రింట్ పుస్తకాలు తెప్పించుకోవచ్చు!

Kinige Home Page Filters

Kinige Home Page Filters

 

ధరల పట్టీ బట్టి ఎంపిక

ఇప్పుడు మీరు కేవలం మీకు కావల్సిన ధరల్లోని పుస్తకాలను మాత్రమే చూడవచ్చు. దీవి ద్వారా మీరు పుస్తకాలు మరింత సులబంగా ఎంచుకోని చదువుకోవచ్చు.

Kinige Price Band

Kinige Price band

అవరోహణ, ఆరోహణ అమరికలు.

ఇప్పటివరకు కినిగె పుస్తకాలను ఇంటర్నల్ కినిగె ర్యాంకు (పాపులర్) ద్వారా మాత్రమే మీరు వరుసగా చూసే వీలుండేది. ఇహ నుండి మీరు కినిగె పుస్తకాలను మరిన్ని వరుసల్లో, శ్రేణుల్లో పేర్చుకొని చూసుకోవచ్చు.

Kinige Books Sorting Options

Options available while sorting Kinige books

1. పాపులర్ – ఈ పద్దతిలో మీరు పాపులర్ పుస్తకాలను ముందుగా చూవచ్చు.

2. ఫ్రెష్లీ పాపులర్ – ఈ పద్దతిలో మీరు తాజా పాపులర్ పుస్తకాలు చూడవచ్చు. ఇది చాలా ఆసక్తికరమైన శ్రేణి. కినిగెకు మాత్రమే ప్రత్యేకమైనది సుమా.

3. లేటెస్ట్ – తాజా పుస్తకాలు.

4. ఓల్డ్ – ముందు పాత పుస్తకాలు

5. ధరలు కనిష్టం నుండి గరిష్టం.

6. ధరలు గరిష్టం నుండి కనిష్టం.

అయితే ఈ సార్టింగ్ అమరికలు హోమ్ పుటపై, తాజా పుస్తకాల పుటపై కాకుండా అన్నిపుస్తకాలు, పాపులర్ పుస్తకాలు, రచయిత పుటలు (ఉదా: యండమూరి, మధుబాబు, సూర్యదేవర, రంగనాయకమ్మ), ప్రచురణకర్త (ఉదా:రామకృష్ణ మఠం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్) , కొసలు (ఉదా: స్త్రీ రచయితలు, యన్నారై రచయితలు, తెలంగాణా పుస్తకాలు), వర్గాలు (ఉదా: కవిత్వం, చిన్న కథలు, నవలలు, నాన్ ఫిక్షన్) లపై లభిస్తాయి.

ఆనంద తెలుగు పుస్తక పఠనం.

సదా మీ సేవలో,

కినిగె.

 

 

Related Posts:

  • No Related Posts

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014

మాట ఒక విప్లవం. రాత ఒక విప్లవం. పుస్తకం ఒక విప్లవం. సమాజాల్ని సమూలంగా మార్చేసిన విప్లవాలు ఇవి.

సాంకేతిక విప్లవం ఇప్పుడు మనం చవిచూస్తున్నామ్. ప్రపంచ భాషలను వేగంగా ప్రభావం చేస్తుంది నేటి సాంకేతిక విప్లవం. నిన్నటిలా నేడు లేదు. నేటిలా రేపు ఉండబోదు. నేటి సాంకేతిక పరిజ్ఙానం పరిపూర్ణంగా అందుకుంటూ, రేపటి తెలుగు పుస్తకం  కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తెలుగు వారి అభిమాన, విశ్వసనీయ పుస్తక ప్రపంచం కినిగె డాట్ కామ్ తెలుగు సాహితీ ప్రపంచానికి సగర్వంగా సమర్పిస్తుంది అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014కినిగె డాట్ కామ్ తెలుగు పుస్తక ప్రపంచం

బహుమతి ఏమిటి?

మొదటి బహుమతి: లక్ష రూపాయలు.

రెండవ బహుమతి: పాతిక వేల రూపాయలు.

మూడవ బహుమతి: పది వేలు.

ఎలా పాల్గొనాలి?

మీ కొత్త తెలుగు నవలను కినిగెలో ఈపబ్లిష్ చెయ్యండి. డిస్క్రిప్షనులో తెలుగు నవలా పోటీ కోసం అని వ్రాయండి.
ఈ పబ్లిష్ సహాయం కోసం ఇక్కడ నొక్కండి.

గడువు ఎప్పటివరకు?

06/06/2014 వరకూ, అనగా జూన్ ఆరు 2014 మద్యాహ్నం 12:00 గంటలు భారత కాలమానం ప్రకారం. ఈ లోపులో కినిగెలో ఈపబ్లిష్ విజయవంతంగా చేసిన నవలలే పోటీకి అర్హమైనవి.

విజేతలను ఎలా నిర్ణయిస్తారు?

కినిగె పాఠకులు మీ నవలలు చదివి వాటికి రేటింగు ఇస్తారు. ఈ రేటింగు ఆధారంగా ఉత్తమ పది (లేదా ఆపై) నవలలనుండి న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు.

 తవసం (తరచూ వచ్చే సందేహాలు)

1. నా పాత నవల సబ్మిట్ చెయ్యవచ్చా?

లేదు. కేవలం కొత్త నవలలు, ఎక్కడా ప్రచురించబడనివి, ఏ ఇతర పోటీకీ పంపించనివీ మాత్రమే అర్హమైనవి. గమనిక: మీ ఇతర నవలలు భేషుగ్గా కినిగెలో ఈపబ్లిష్ చేసుకొని మరింత మంది పాఠకులను వాటిని చేరువ చెయ్యవచ్చు. ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వివరాలు ఇక్కడ.

2. కినిగె నవలా పోటీకి ప్రచురించాక, ఇతర పోటీలకు పంపవచ్చా?

ఫలితాలు వచ్చేంతవరకూ లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ ఏ ఇతర పోటీలకూ పంపకూడదు.

3. నేను పోటీకి సబ్మిట్ చేసే నవల కినిగెలో ఈపుస్తకంగా ఉంచడం వల్ల పోటీ బహుమతి కాకుండా రాయల్టీ కూడా వస్తుందా?

అవును వస్తుంది.

4. నా పుస్తకం ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించండి.

5. కవర్ పుట కూడా నేనే డిజైన్ చేయించాలా?

అవును కవర్ పుట కూడా మీరే పంపించాలి. గుర్తించుకోండి మంచి కవర్ పుట ఎక్కువమంది పాఠకులను చేరువ చెయ్యడంలో చాలా సహాయం చేస్తుంది.

6. చేత్తో వ్రాసిన మానుస్క్రిప్ట్ పంపించవచ్చా?

లేదు.

7. అను ఫాంట్స్ లో, పేజ్ మేకర్ లో టైప్ చేసినవి పంపించవచ్చా?

అవును. పంపించవచ్చు.

8. స్కాన్ చేసిన డాక్యుమెంట్లు పంపించవచ్చా?

లేదు.

9. యూనీకోడులో టైప్ చేసిన ఫైల్లు పంపించవచ్చా?

అవును పంపించవచ్చు.

10.ఈ పోటీకి ఏమైనా వయో పరిమితి ఉందా?

లేదు అన్ని వయసుల వాళ్లూ పాల్గొనవచ్చు.

11. కనీసం ఎన్ని పుటలు ఉండాలి?

కనీసం 21,000 పదాలు (అక్షరాలా ఇరవై ఒక్క వేల పదాలు) ఉండాలి

12. అనువాదాలు పంపించవచ్చా?

రచన తమ సొంతమై ఉండాలి, ఏ ఇతర భాషలలోని రచనలకు అనువాదం గాని, అనుకరణగానీ, అనుసరణ గానీ కాకూడదు

13. కాపీరైట్ ఎవరికి ఉంటుంది.

కాపీరైట్ నవల రచయితకే ఉంటుంది.

14. పుస్తకాన్ని కేవలం ఈపుస్తకంగానే ఉంచాలా, లేదా ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చా?

బహుమతులు ప్రకటించే వరకూ, లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ మీ పుస్తకం కేవలం ఈపుస్తకంగా మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చు.

15. కినిగె నా పుస్తకాన్ని ప్రింటు పుస్తకంగా తీసుకువస్తుందా?

లేదు.

16. గెలుపొందిన పుస్తకాలను కినిగె ప్రింటు పుస్తకాలుగా తీసుకువస్తుందా?

లేదు.

13. ఇతర నిబంధనలు ఏమిటి?

అ. మీ నవలను ఎంపిక చేసిన పాఠకులకు కినిగె తక్కువ ధరకు లేదా పూర్తి ఉచితంగా ఇస్తుంది.

ఆ. అంతిమ నిర్ణయం కినిగెదే. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.

ఇ. పోటీ ముగిసిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాలు గెలుపొందిన నవలలు కినిగెలో మాత్రమే ఈపుస్తకంగా ఉండాలి. వేరే ఎక్కడా ఈపుస్తకంగా అందుబాటులో ఉంచకూడదు.

ఈ. మీకింకా ఏవైనా సందేహాలు ఉంటే కినిగె సపోర్టును సంప్రదించండి. support@kinige.com

ఉ. ఈ పబ్లిష్ చేయడంలో సందేహాలకు  9704605854  సంప్రదించండి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు (భారత కాలమానం) మాత్రమే.

ఊ. ఏదైనా నవలను పోటీలో ఉంచడానికి, అనర్హమైనవాటిగా నిర్ణయించడానికీ కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.

ఋ. Subjected to the jurisdiction of Hyderabad only.

ౠ. కినిగె ఇతర నియమనిబంధనలు వర్తిస్తాయి.

ఎ. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోటీ నియమ నిబంధనలు మార్చడానికి, పోటీని పూర్తిగా రద్దు చెయ్యడానికి కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.

కినిగె డాట్ కామ్ తెలుగు పుస్తక ప్రపంచం

కినిగె డాట్ కామ్ పత్రిక ఉచితంగా చదవండి

గమనిక – మీ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కనీస పదాల సంఖ్య ఇరవై ఒక్క వేల పదాలుగా ఉంచాము. ఈ విషయంలో ఇంకే మార్పులూ చేర్పులూ ఉండవని గమనించ ప్రార్థన.

Related Posts:

వందరోజుల విజయోత్సాహం నింపుకున్న వోడ్కా విత్ వర్మ కు అభినందనలు …

సిరాశ్రీ విరచిత వోడ్కా విత్ వర్మ పుస్తకం ఈ రోజుతో విడుదలయి వంద రోజులు పూర్తయినాయి.
ఈ వంద రోజుల్లో మూడు సార్లు పునర్ముద్రణలు,
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో టాప్ సెల్లింగ్ పుస్తకం,
విజయవాడ పుస్తక ప్రదర్శనలో టాప్ సెల్లింగ్ పుస్తకం,
కినిగె ఆన్ లైన్ అమ్మకాల్లో విడుదలనుంచి నేటి వరకూ వీక్లీ టాప్ టెన్ పుస్తకాల్లో పదిలం.

పలువురిని చదివించిన సిరాశ్రీకి అభినందనలు ….

వోడ్కా విత్ వర్మ On Kinige

Related Posts:

  • No Related Posts

షార్ట్ స్టోరీస్ ఆఫ్ విశ్వనాథ – పుస్తకావిష్కరణ

“షార్ట్ స్టోరీస్ ఆఫ్ విశ్వనాథ” అనే శీర్షికతో విశ్వనాథ సత్యనారాయణ గారి కథలని ములుకుట్ల యోగ ఆంగ్లంలోకి అనువదించారు.

ఈ సంకలనం తేదీ: 21 మార్చి 2012 నాడు ఆవిష్కృతమవుతోంది. రేపు సాయంత్రం ఆరు గంటలకి విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షులు శ్రీ వెలిచాల కొండలరావు ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ విశ్వనాథ సాహిత్య పీఠం ప్రాంగణంలో (నీలోఫర్ హాస్పిటల్ వద్ద, రెడ్ హిల్స్, హైదరాబాద్.) జరుగనుంది.

శ్రీ విజయరామారావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీ మండలి బుద్ధప్రసాద్ సభకి అధ్యక్షత వహిస్తారు. శ్రీ సి.సుబ్బారావు పుస్తకాన్ని పరిచయం చేస్తారు.

ఆహ్వానపత్రికని ఈ లింక్‍లో చూడగలరు.

Related Posts:

“మహార్ణవం” కథాసంపుటికి పురస్కారం

కొల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్ 1974లో స్థాపించబడింది.

భారతీయ సాహిత్యం కోసం ఎనలేని సేవ చేస్తున్న సంస్థ ఇది. ఒక భాషలో వెలువడిన పుస్తకాన్నిఇతర భాషలలోకి అనువదింపజేసి, ఆ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి.

అన్ని భారతీయ భాషలలోని సాహిత్యకారులను ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా, ఈ సంస్థ 1980 నుంచి వార్షిక పురస్కారాలను అందిస్తోంది.

2011 వ సంవత్సరానికి భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం – తెలుగులో- సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి టి.శ్రీవల్లీరాధిక రచించిన “మహార్ణవం” కథాసంపుటికి – ప్రకటించబడింది.

ది 18 – 19 ఫిభ్రవరి 2012 తేదీలలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి ఈ అవార్డుని స్వీకరించారు. రచయిత్రికి అభినందనలు.

మహర్ణవం కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మహార్ణవం On Kinige

Related Posts:

పుస్తకానికి కొత్త కళ

పుస్తకానికి కొత్త కళ అనే శీర్షికతో ది. 22 డిసెంబరు 2011 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్ ఎడిషన్‍లో వెలువడిన వార్తా కథనంలో నగరంలో జరుగుతున్న 26వ పుస్తక ప్రదర్శన గురించి ప్రస్తావించారు.

విజ్ఞానానికి సాంకేతికత తోడవుతోందని చెబుతూ, ప్రపంచీకరణ నేపధ్యంలో ఎగువ మధ్యతరగతి ప్రజలలో మార్పు వచ్చిందని, వారి అవసరాలు తీర్చడం కోసం ప్రచురణకర్తలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని ఈ కథనం పేర్కొంది. టెక్నలజీ ఆలంబనలో పుస్తకం కొత్త కళని సంతరించుకుంటున్న వైనాన్ని ప్రస్తావించింది.
కినిగె గురించి వ్యాఖ్యానిస్తూ, “కినిగె పుస్తకం కేవలం కాగితానికే పరిమితం కాకుండా సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకుని, కొత్త తరానికి అందుబాటులోకి వచ్చింది” అని ఈ కథనం పేర్కొంది.

పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్ నొక్కండి.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

చరిత్ర పరిశోధనల్లో ఘనాపాటి

ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు అయిన సయ్యద్ నశీర్ అహమ్మద్ గురించి 20 నవంబర్, 2011 నాటి ఆంధ్రభూమి దినపత్రిక లోని “కవులూ.. రచయితలూ” శీర్షికలో సుప్రసిద్ధ విశ్లేషకులు విహారి పరిచయం చేసారు.

పరిశోధన ఒక అసిధారావ్రతమని, అందునా చారిత్రక పరిశోధన మరీ వ్యయప్రయాసలకోర్చినదని విహారి పేర్కొన్నారు. సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలను, చేసిన పరిశోధనల గురించి ఈ వ్యాసంలో విశ్లేషించారు రచయిత.

ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ దిగువ చిత్రంలో చదవగలరు.


సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తున్నాయి.

ఈ పుస్తకాలపై తగ్గింపు కూడా ఉంది. వివరాలకు ఈ లింక్ చూడండి.

సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ పుస్తకాలు 25 శాతం తగ్గింపు ధరకు On Kinige

Related Posts:

హ్యాపీ బర్త్ డే టూ కినిగె

ఒక వర్షం!

సంవత్సరం క్రితం, ఈ రోజే మేము కినిగెకు తొలి సాప్ట్ వేర్ కోడ్ వ్రాశాము.

ఈ సంవత్సర ప్రయాణం అద్భుతంగా ఉంది. ప్రతి క్షణాన్నీ మేము ఆస్వాదించాము.

చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అజ్ఞాత శ్రేయోభిలాషులు పలు విధాలుగా మాకు సహాయ సహకారాలందించారు. వారందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

భవిష్యత్తు ప్రయాణాన్ని కూడా కినిగెకు, భాగస్వాములకు, మిత్రులకు, పాఠకులకు, సమాజానికి మరింత ఉపయోగకరంగా మలుస్తాము.

ఈ సందర్బంగా చిరు కానుకలు –

1. ఈ రోజు రీచార్జ్ చేసుకోని HAPPYBIRTHDAY అని కినిగె గిఫ్ట్ డబ్బాలో చెప్పండి మీరు రీచార్జే చేసుకున్న మొత్తానికి 5శాతం ఎక్కువ కినిగె బ్యాలన్స్ పొందండి.

2. మేము తెలుగు ఆల్ఫాబెట్స్ అనే చరముట్టుపై(Mobile application) పనిచేస్తున్నాము. వివరాలు ఇక్కడ. దాని ప్రివ్యూ పరిశీలించండి.

మీ సపోర్టుకు నెనర్లు. http://kinige.com దర్శించండి తెలుగు పుస్తకాలను ఆస్వాదించండి.

Related Posts:

డా. రాళ్ళబండికి నాయని స్మారకపురస్కార ప్రదానం రేపు

హైదరాబాద్, అక్టోబర్ 27 : సుప్రసిద్ధకవి, కళాప్రపూర్ణ నాయని సుబ్బారావు స్మారక పురస్కారాన్ని సుప్రసిద్ధ అవధాని, కవి డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్‌కు శుక్రవారం (29వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ప్రదానం చేయనున్నారు.

నాయని సుబ్బారావు ట్రస్ట్, మానస ఆర్ట్ థియేటర్స్ సంయుక్తాధ్వర్యంలో నిరన్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రధానకార్యదర్శి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహిస్తారని, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య నాయని కృష్ణకుమారి అవార్డును ప్రదానం చేస్తారు.

జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 5లో(ఇందిరానగర్ అప్స్) విదూషి, ఫ్లాట్‌నెంబర్ 68, రోడ్‌నెంబర్ 7/ఎ, ఉమెన్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటిలో జరిగే ఈ కార్యక్రమానికి సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులేనని మానసకార్యదర్శి రఘుశ్రీ తెలిపారు

 

Source = Andhrajyothy https://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2011/oct/27/latest/27new52 

 

Rallabandi gaari Books are now available on Kinige @ http://kinige.com/kbrowse.php?via=author&id=120

సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ! On Kinige

అగ్నిహంస On Kinige

అవధాన విద్య – ఆరంభ వికాసాలు On Kinige

Related Posts:

  • No Related Posts

‘మో’ స్మృతికి అంజలి

ప్రముఖ రచయిత , కవి వేగుంట మోహన్ ప్రసాద్ ది ౩ ఆగష్టు 2011 నాడు మృతి చెందారు. రెండు రోజుల క్రితం బ్రెయిన్ హెమరేజ్‌తో ఆయన కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరు గ్రామం. ఆయన కాలేజి లెక్చరర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మరణంతో సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందరెందరో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

వేగుంట మోహన్ ప్రసాద్ సాహితీ ప్రపంచంలో ‘మో’గా సుపరిచితులు. తెలుగు కవిత్వానికి కొత్త పరిభాషను పరిచయం చేసారు ‘మో’. చితి-చింత, పునరపి, రహస్యతంత్రి, నిషాదం, సాంధ్యభాష, వెన్నెల నీడలు మొదలైనవి ఆయన రచనలు. ఆయన రచించిన ‘నిషాదం’కు ఇటీవలే తనికెళ్ల భరిణి సాహితీ పురస్కారం లభించింది.

వారి స్మృతికి అంజలి ఘటిస్తూ, ‘మో’ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం, ఆయన కవిత్వం గురించి నరేష్ నున్న ఏమంటున్నారో చూద్దాం.

” ‘మో’ కవిత్వం కత్తిరించిన క్రోటన్ మొక్కల వరుసలాగో, అడితిలో పేర్చిన కట్టెల మోపుల్లానో పొందికగా ఉండదు. పసిపిల్లలు చిందరవందర చేసిన ఇల్లులా, ఆంక్షలకు లొంగని సెలపాటలా ఉంటుంది. అదే ఆయన కవితలో మృదు బీభత్స సౌందర్యం. అథోజ్ఞాపికల ఆసరా, అర్థవివరణల సాయం, ప్రపంచ సాహిత్యాల పరిచయం… ఇవేవి లేకుండానే కవిత మొత్తంగా ఓ భావాన్ని బట్వాడా చేస్తుంది. ఆ భావం ఏ ఇద్దరికీ ఒక్కలా ఉండక పోవచ్చు. సముద్ర ఘోషని ఏ ఇద్దరూ ఒక్కలా అర్థం చేసుకోనట్టు. భావం భవాన్ని దాటి అనుభవమవుతుంటే, టీకా టిప్పణి అనవసరమనే స్థితికి చేరుస్తుంది ‘మో’ కవిత. ”
” ఇంతకాలం ఒక జీవ నదిలా ప్రవహించి వస్తున్న ‘మో ‘ కవిత్వాన్ని ఒక విస్మృత గీతంలా నేటికీ చూస్తున్నందువల్లే తెలుగు సాహిత్యం [………] జ్ఞానస్థాయిని అందుకోలేదనిపిస్తోంది”

మో రాసిన నిషాదం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/- నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

నిషాదం (మో) On Kinige

కొల్లూరి సోమ శంకర్

 

 

Related Posts: