శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారిని తెలుగులో 100 నవలలు పైగా రాసిన రచయితగా ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇటీవల గుర్తించి ప్రమాణపత్రం జారీచేసింది.
1985లో “మోడల్” అనే మొదటి నవలతో ప్రారంభించిన ఆయన రచనా వ్యాసంగం 2013లో “నా ప్రేయసిని పట్టుకుంటే కోటి” అనే 101 వ నవల వరకూ కొనసాగిందనీ, ఈమధ్యే “ది ఎనిమీ ఆఫ్ మాన్‌కైండ్” అనే ఆంగ్లనవలను అమెరికాలో ముద్రించి, ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో ప్రచురించారని అందులో పేర్కొన్నారు. సూర్యదేవర రచించిన 101 తెలుగు నవలలో 65 కన్నడంలోకి, 5 తమిళంలోకి అనువదించబడ్డాయి.
ఈ ఘనత సాధించినందుకు శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారికి అభినందనలు తెలియజేస్తోంది కినిగె.
Category Archives: రచయత
బియాండ్ కాఫీ గురించి యండమూరి వీరేంద్రనాథ్ అభిప్రాయం.
ఖదీర్ బాబు వ్రాసిన బియాండ్ కాఫీ కథా సంకలనం గురించి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అభిప్రాయం.
ప్రియమైన ఖదీర్ బాబు,
వైజాక్ నుండి వస్తూ ఇప్పుడే మీ పుస్తకం చదివాను. బియాండ్ కాఫీ. రెండు తప్ప అన్ని కథలూ మైండ్ బ్లోయింగ్. నాకు తెలిసినంతవరకూ ఆత్మ ఒంటరితనాన్ని కెలెడోస్కోపులో చూపిన తొలి రచయితవు నువ్వే.
మచ్చ సింబాలిక్ గా అప్పీలింగ్ గా ఉంది.
‘టాక్ టైమ్’ లేడీస్ కొత్త కాదు. ఫోనులో ఇబ్బంది పెడుతున్న వారిపై నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టులో పెండిగులో ఉన్నాయి. నీ కథలు చదువుతున్నప్పుడు మెటాఫిజికల్ శూన్యం పై వ్రాసిన శామ్యూల్ బాకెట్ మరియు అతని డ్రామా వెయిటింగ్ ఫర్ గోడోట్ మదిలో మెదిలాయి. ఇంకా నేను వ్రాసిన ఆనందో బ్రహ్మ నీ వహీద్ కథ చదువుతున్నప్పుడు గుర్తు వచ్చింది. యూ హేవ్ డన్ ఏ గ్రేట్ జాబ్.
అభినందనలు.
యండమూరి.
ఈ బియాండ్ కాఫీ పుస్తకం చదవడానికి ఇక్కడ నొక్కండి.
Related Posts:
తెలుగులో మొట్టమొదటిసారి వైద్య విజ్ఞాన నేపథ్యంతో థ్రిల్లర్ నవలలు రాసిన రచయిత
డా. చిత్తర్వు మధు విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ హైస్కూల్లో, హయ్యర్ సెకండరీ వరకు. ఆ తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజిలో ఎం.బి.బి.ఎస్; విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండి; ఆ తరువాత అల్జీరియాలో మెడికల్ స్పెషలిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్‌గా పని చేసి ప్రస్తుతం 1986 నుంచి హైదరాబాద్‌లో కన్సల్టింగ్ ఫిజీషియన్ అండ్ కార్డియాలజిస్ట్‌గా పైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
“ఐ.సి.సి. యూ“, బైబై పోలోనియా, ఔనా, సాలెగూడు అనే నవలలు రచించారు. ఇవి కన్నడంలోకి కూడా అనువాదమై ప్రచురించబడ్డాయి.
కథలు కళాఖండాలు లాగాను, నవలలు వేగంగా ఉత్కంఠభరితంగాను రాయాలని వీరి అభిలాష.
మానవతా దృక్పథం, శాస్త్రీయ దృక్పథం, సున్నిత మనస్తత్వ చిత్రణ, మారిపోతున్న సమాజంలో మారుతున్న విలువలు, పరస్పర సంబంధాలు – ఇలాంటివన్నీ చిత్రిస్తూ కథలు నవలలు రాయాలని వీరి ఆశ, ఆశయం.
సాహిత్యం, సంగీతం, పుస్తక పఠనం వీరి హాబీలు.
తెలుగులో మొట్టమొదటిసారి వైద్య విజ్ఞాన నేపథ్యంతో థ్రిల్లర్ నవలలు రాసిన రచయితగా వీరికి గుర్తింపు లభించింది.
ఐ.సి.సి.యు. On Kinige
మధుమేహంపై విజయపథం On Kinige
కుజుడి కోసం On Kinige
బై, బై, పోలోనియా On Kinige
ఔనా…! On Kinige
ది ఎపిడమిక్ On Kinige
సాలెగూడు
www.utopia.com On Kinige
Related Posts:
Books from Author: Ranganayakamma
Basically she is a novelist and short story writer. She wrote about 15 novels (some are of 2 or 3 volumes each), 70 stories and many more essays. She published about 60 volumes in all. The main theme is gender-equality and depiction of women’s family life.
The most outstanding feature of Ranganayakamma’s books is that she writes in the most lucid manner and even her opponents/adversaries acknowledge this fact.
Her eBooks are available from Kinige. Click here now.
Related Posts:
హాపీ బర్త్ డే టూ ‘అమృతం కురిసిన రాత్రి’ తిలక్!
తిలక్ అనగానే గుర్తొచ్చేది… అమృతం కురిసిన రాత్రి. తిలక్ పేరు తలచుకోగానే ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్న వాక్యం స్ఫురించకతప్పదు. తిలక్ కవిగానే కాదు, కథకుడిగా కూడా తనదైన ముద్ర వేసారు.
తిలక్ మద్రాస్ లయోలా కాలేజిలోనూ, విశాఖ ఎ.వి.ఎన్. కాలేజిలోనూ ఇంటర్ చదువుతూ, అనారోగ్య కారణాల వల్ల ఆపేసారు. తణుకులో విజ్ఞాన పరిషత్ స్థాపించారు. తర్వాతి కాలంలో దానినే ‘సాహితీ సరోవరం’గా మార్చారు. తిలక్ కవితలు, కథలే కాదు, నాటకాలు కూడా రాసారు. బృందావన కళా సమితి అనే సంస్థని స్థాపించి నాటకాలు వేయించారు.
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను ఉపయోగించుకున్నారు. రోజూవారీ జీవితంలో మనకు తారసపడే అభాగ్యులను, మోసగాళ్లను ఆయన పాత్రలుగా తీసుకుని అసలు రూపాలతో మన ముందు నిలబెట్టారు.
తిలక్ తన మొదటి కథని 11 వ ఏట రాసారు. ‘మాధురి’ పత్రికలో ప్రచురితమైన ఆ కథ ఇప్పటికీ అలభ్యం. ఆయన 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు ‘ప్రభాతము – సంధ్య’ పేరుతో 1938లో తొలి సంపుటిగా వచ్చింది.
గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి ఇతర కవితా సంకలనాలు. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు తిలక్ కథా సంకలనాలు. సుశీల పెళ్లి, సుప్త శిల, సాలె పురుగు తిలక్ రాసిన నాటకాలు. 1956-66 మధ్య కాలం తిలక్ రచయిత శిఖరారోహణ చేసిన కాలం.
Related Posts:
ముద్రా కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి. కృష్ణమూర్తి
ముద్రా కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి. కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడితోనూ, ఒకే ఒక క్లయింట్తోనూ అడ్వర్టయిజింగ్ ఏజన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్ళలో ముద్రా భారతదేశంలోని అతి పెద్ద అడ్వర్టయిజింగ్ ఏజన్సీలలో మూడవ స్థానాన్ని, భారతీయ అడ్వర్టయిజింగ్ ఏజన్సీలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది.
ప్రభుత్వంలో చిన్న గుమాస్తా ఉద్యోగంతో జీవితాన్ని, ప్రారంభించి, ఆ ఉద్యోగాన్ని వదిలివేసి అడ్వర్టయిజింగ్ రంగంలోకి ప్రవేశించిన ఎ.జి.కె. భారతీయ కార్పోరేట్ రంగంతో అతి చేరువగా కలిసి పనిచేసి అతి కొద్ది కాలంలోనే తెలుగువారు గర్వించదగ్గ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు.
ముద్రా కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్ను స్థాపించారు. కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోనూ, తెలుగులోనూ పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. వారి పుస్తకాలు అతి కొద్దికాలంలో పలు భారతీయ భాషల్లో ప్రచురింపబడి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి.
ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాదు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.
ఎ.ఎ.ఎ.ఐ – ప్రేం నారాయణ్ అవార్డు,1999.
ఇంటర్నేషనల్ హూ ఈజ్ యు ఆఫ్ ప్రొఫెషనల్స్ 2002-2003 ఎడిషన్‌లో స్థానం
2003లో మా టీవి సన్మానం
To read his books click here now.
ధీరూభాయిజమ్ On Kinige
ధీరూభాయి అంబానీ ఎదురీత On Kinige
నేస్తమా…. బి పాజిటివ్! On Kinige
జయహో On Kinige
లీడర్షిప్ ముచ్చట్లు On Kinige
మనందరం విజేతలు కావచ్చు On Kinige
నేస్తమా…. డ్రీమ్ బిగ్ On Kinige
అందిన ఆకాశం On Kinige
నేస్తమా…. నీ కలలను జీవించు On Kinige
నేస్తమా.. జయమ్ము నిశ్చయమ్ము! On Kinige
ఆకాశానికి నిచ్చెనలు On Kinige
Related Posts:
రాలిన కథా కుసుమం
తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న త్రిపుర 24 మే 2013 న దివంగతులయ్యారు.
సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి.
త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు.
త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా ” సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.
“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.
చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు.
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో తనవంతు పాత్ర పోషించి, కథనరంగం నుంచి నిష్క్రమించిన త్రిపురకి హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది కినిగె.
Related Posts:
మాస్టర్ స్టోరీటెల్లర్ -వల్లంపాటి వెంకటసుబ్బయ్య
ప్రముఖ రచయిత, విమర్శకుడు, అనువాదకుడు అయిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలపై సాక్షి దినపత్రికలో “ఒక కథావిమర్శకుడి తొలి అడుగుజాడలు” అనే శీర్షికతో వెలువడిన సమీక్ష ఇది.
* * *
కథలు ఎలా రాయాలో కథాశిల్పం అంటే ఏమిటో అని పుస్తకాలు రాసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు ఎలా ఉంటాయి అనే కుతూహలం పాఠకులకు రావడం సహజం. వాటిని చదవాలని ఆశపడటమూ సహజం. అయితే మంచి తేయాకు ఏదో ఆ తేయాకు నుంచి మంచి డికాక్షన్ వస్తుందో రాదో పరీక్షించి చెప్పే నిపుణుడికి తేయాకు పండించడం తెలియకపోవచ్చు. బహుశా వల్లంపాటి ఈ ఎరుకతోనే కథలు రాయడం మానేశారా? లేదా సృజనలో నిమగ్నమైతే తానొక్కడే లబ్ధి పొందుతాడు… సృజన కోసం ప్రయత్నించేవాళ్లకు సహాయకారి కాగలిగితే అనేకమందికి ఉపయోగపడతాడు అనే సూత్రం కనిపెట్టడం వల్ల కథాసృజనను వదిలిపెట్టి కథావిమర్శను స్వీకరించారా?
ఏమైనాగాని ఆయన చనిపోయిన రెండుమూడేళ్లకు ఆయన కథలన్నీ ‘వల్లంపాటి కథలు’గా రూపుదాల్చడం చాలామంది పాఠకులకు సంతోషం కలిగించే విషయం. అసలు వల్లంపాటి ఇన్ని కథలు రాశారా అని ఆశ్చర్యపోయే నేటి తరం రచయితలు కూడా ఉన్నారు. 1958లో కథలు రాయడం ఆరంభించిన వల్లంపాటి 1970ల వరకూ కథలు రాసినట్టున్నారు. ఆ తర్వాత రాయలేదు. ఈ కథలన్నింటిని పరిశీలిస్తే వీటిలో కూడా ఆ రోజుల్లోని కథల ధోరణి, పేదరికం, మధ్యతరగతి విలువలు, రచయిత తననుతానే రచయితగా ప్రధానపాత్రగా ప్రవేశపెట్టి రాయడం వంటివి కనిపిస్తాయి. రాసిన ప్రతి కథా ఏదో ఒక సమస్యను చూపడానికి ఏదో ఒక విలువను ప్రతిపాదించడానికి ఏదో ఒక పతనాన్ని సూచించడానికి ప్రయత్నించడం అర్థమవుతుంది. అదే సమయంలో దృక్పథం అంటూ ఏమీ లేకుండా కలం నుంచి జారిన కథలు కూడా లేకపోలేదు. అందుకే వీటిని వల్లంపాటి ప్రామాణికమైన రచనలుగా ఎంచకుండా తొలి అడుగుజాడలుగానే చూడాలి. అందుకనే ఏమో తాను జీవించి ఉండగా, వీటి అవసరం ఉందా లేదా అనే సంశయంతో వల్లంపాటి వీటిని పుస్తకంగా తెచ్చి ఉండరు.
కాని- కథాపాఠకులు, మరీ ముఖ్యంగా కథారచయితలు ఈ కథలను తప్పక చదవాలి. ఒకకాలపు జీవితం గురించి తెలుసుకోవడానికి కథాపాఠకులు, ఒక రచయిత/విమర్శకుడు కథారచనను సాధన చేసిన పద్ధతిని ఆ పద్ధతిలో అతడి జయాపజయాలను అర్థం చేసుకోవడానికి కథా రచయితలు ఈ పుస్తకాన్ని చదవాలి.
వల్లంపాటి ఈ సంకలనంలో కచ్చితంగా కొన్ని కథలతో గాఢమైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. ‘రానున్న శిశిరం’ వంటి కథల్లో తన చేయి తిరిగిన రచనాశైలితో ఆశ్చర్యం గొలుపుతారు. కథకు అవసరంలేని వృధావర్ణనలు, వృధా సంఘటనలు కథలో ఉండరాదు అని నమ్మిన వల్లంపాటి తన కథలన్నింటిలోనూ ఆ సూత్రాన్నే పాటించారనిపిస్తుంది. స్ట్రయిట్‌గా పాయింట్లోకి దిగడం చూడవచ్చు.
అయితే ఇవి ఇప్పుడు ఔట్ డేటెడా?
మధ్యతరగతి ఉన్నంతకాలం మధ్యతరగతి గురించి రాసిన ఏ కథా ఔట్‌డేటెడ్ కాదు. కాకపోతే కాసింత మేకప్ మార్చుకొని మళ్లీ మళ్లీ కనిపిస్తుంటుందంతే. ఆ సంగతి అటునుంచితే- ప్రతి రచయితా చేసిన కృషి రికార్డు కావాల్సిందే. ఆ మేరకు వల్లంపాటి కథలకు సంబంధించి ఈ సంపుటి ఒక నాణ్యమైన రికార్డు. రాయలసీమ భాషకు, జీవితానికి దర్పణం లాంటి నవలను రాయాలన్న కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వల్లంపాటి తన కోరికను తీర్చుకోలేకపోవడం ఒక లోటైతే అలాంటి ఎన్నో కలలు కనే సాహిత్యకారులకు స్ఫూర్తిగా వారిని ప్రోత్సహించే శక్తిగా ఉండి వారి కలలు సాకారం కావడానికి ప్రయత్నించిన ఆయన ప్రెజెన్స్ లేకపోవడం చాలా పెద్ద లోటు. పుస్తకం ప్రింటింగ్, క్వాలిటీ చాలా బాగున్నాయి.
– కె.సువర్చల
“వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.
వల్లంపాటి కథలు On Kinige
Related Posts:
మాస్టర్ స్టోరీ టెల్లర్ – దేవరకొండ బాలగంగాధర తిలక్
దేవరకొండ బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న జన్మించారు.
తిలక్ అనగానే గుర్తొచ్చేది… అమృతం కురిసిన రాత్రి. తిలక్ పేరు తలచుకోగానే ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్న వాక్యం స్ఫురించకతప్పదు. తిలక్ కవిగానే కాదు, కథకుడిగా కూడా తనదైన ముద్ర వేసారు.
తిలక్ మద్రాస్ లయోలా కాలేజిలోనూ, విశాఖ ఎ.వి.ఎన్. కాలేజిలోనూ ఇంటర్ చదువుతూ, అనారోగ్య కారణాల వల్ల ఆపేసారు. తణుకులో విజ్ఞాన పరిషత్ స్థాపించారు. తర్వాతి కాలంలో దానినే ‘సాహితీ సరోవరం’గా మార్చారు. తిలక్ కవితలు, కథలే కాదు, నాటకాలు కూడా రాసారు. బృందావన కళా సమితి అనే సంస్థని స్థాపించి నాటకాలు వేయించారు.
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను ఉపయోగించుకున్నారు. రోజూవారీ జీవితంలో మనకు తారసపడే అభాగ్యులను, మోసగాళ్లను ఆయన పాత్రలుగా తీసుకుని అసలు రూపాలతో మన ముందు నిలబెట్టారు.
తిలక్ తన మొదటి కథని 11 వ ఏట రాసారు. ‘మాధురి’ పత్రికలో ప్రచురితమైన ఆ కథ ఇప్పటికీ అలభ్యం. ఆయన 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు ‘ప్రభాతము – సంధ్య’ పేరుతో 1938లో తొలి సంపుటిగా వచ్చింది.
గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి ఇతర కవితా సంకలనాలు. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు తిలక్ కథా సంకలనాలు. సుశీల పెళ్లి, సుప్త శిల, సాలె పురుగు తిలక్ రాసిన నాటకాలు. 1956-66 మధ్య కాలం తిలక్ రచయిత శిఖరారోహణ చేసిన కాలం. అద్భుతమైన సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తూ 1966 జూలై 1 న చిన్న వయసులోనే తిలక్ కీర్తి శేషులయ్యారు.
* * *
ఆనాటి సమాజాన్ని తన కథల్లో ఎలా వ్యక్తీకరించారో చెప్పడానికి ఆయన కథల్లోని ఈ క్రింది వాక్యాలు చాలు.
ఆశాకిరణం కథ నుంచి:
నలభై ఏళ్ళు పైబడిన తాను, తన సభ్యతకీ, స్వభావానికీ విరుద్ధమైన పనులన్నీ బతకడంకోసం చేశాడు. కాని దాని ఫలితంగా మరింత అవమానాన్ని, దుఃఖాన్ని కొనితెచ్చుకున్నాడు. ఇంకా తనిలాగ ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు? తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు? భయంకరమైన నిస్సహాయత అతన్ని చుట్టుకుంది. అతనికి చీకట్లోకి జారిపోతున్నట్లు చీకటి నీళ్ళలో పీకలోతు మునిగిపోతూన్నట్టు ఉంది. నీరసంవల్ల అతని కాళ్ళూ చేతులూ లాగుతున్నాయి. అతనికలాగ గోడ నానుకుని ఆలోచించే వోపిక కూడా లేకపోయింది.
అలా మగతగా నిస్త్రాణగా వున్న అతనికి ‘నాన్నా’ అన్న పిలుపుతో మెలకువ వచ్చింది. కళ్ళుతెరచి చూశాడు. అతని పెద్దకొడుకు పదేళ్ళవాడు ‘అమ్మరమ్మంటోంది’ అన్నాడు.
“ఏం?”
“తింటానికి.”
* * *
పలితకేశం కథ నుంచి:
అతనికి చిరాకు కలిగింది. ఆశ్చర్యం కలిగింది. భయంవేసింది. ఇంతవరకూ ఉన్న మనస్స్వాస్థ్యం చెడిపోయినట్టయింది. ఎక్కడిదీ తెల్లవెంట్రుక? ఎప్పుడు ఎలా వచ్చింది? అభేద్యమనుకొన్న యీ కోటగోడకి పగులు ఎలా ఏర్పడింది. ప్రసాదరావు మొహంలో రంగులు మారాయి. అతనికి చీకట్లో వొంటరిగా నడుస్తూంటే ఎవరో శత్రువులు చుట్టుముట్టి నట్లనిపించింది. అతను సరదాగా మంచుమీద స్కేటింగ్ చేస్తుంటే చటుక్కున అంచు విరిగి అగాధమైన లోయలోకి జారిపోతున్నట్టు అనిపించింది తన నిస్సహాయత తనకి తెలియవచ్చింది. ఈ తెల్ల వెంట్రుక యిక నల్లబడదు. ఈ ఒక్క తెల్లవెంట్రుక ఆసరాతో తక్కిన వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి. అతను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పరిష్కరించాడు. కాని యిది తన చేతిలోలేదు. ఏదో బలవత్తరమైన శక్తి అతన్ని ఆక్రమిస్తోంది. ఓడిస్తోంది. శ్రీమంతుడైన ప్రసాదరావు. హేతువాది అయిన ప్రసాదరావు, ఆప్టిమిస్టు అయిన ప్రసాదరావు. గౌరవమూ ప్రతిష్టాగల ప్రసాదరావు. సిసలైన వ్యక్తిత్వం కల ప్రసాదరావు తెల్లబోయి కంగారుపడి అద్దంముందు వెర్రిగా నిలుచునిపోయాడు.
* * *
సముద్రపు అంచులు కథ నుంచి:
వీరయ్య మౌనంగా అంచనా వేస్తున్నాడు. ఆకలీ – రేపటిని గూర్చిన భయమూ లేకుండా గౌరవంగా బతకాలని కోరని వారుండరు. కాని ఆ పేదరికం పొలిమేర దాటడం కష్టం అని వీరయ్యకి తెలియదు. ఆ పొలిమేర దగ్గర నీచత్వమూ నిరాశా రోగమూ లాంటి పెద్ద పెద్ద అగడ్తలుంటాయి. పై అంతస్తులోనికి ఎగరడానికి చేసే ప్రయత్నం అతి కష్టమైనదీ అపాయకరమైనదీకూడా. కాని వీరయ్య ధనం దేనికైనా మూలం అని గుర్తించాడు. కేవలం తన కష్టంవల్లనే తప్ప మరోమార్గం సంపాదనకి లేదనీ తెలుసుకున్నాడు. ఆ వచ్చిన ధనం తన్ని అంటిపెట్టుకుని ఉండాలి. కాని యీ చంచల పదార్థం ఉన్న చోటికే వెళ్లే దుర్గుణం కలిగి ఉందనీ అతనికి తెలియదు. ఏమైనా దారిపొడుగునా జయించుకుపోవాలనే పట్టుదల అతనిలో వుంది. అందుకోసమే తక్కిన తన వాళ్ళల్లో ఉన్న అలసటనీ అవినీతినీ తనలోంచి తుడిచిపెట్టి నియమబద్దంగా బతకాలనుకున్నాడు. అందుకోసమే నరసమ్మ నెత్తురులేని వలపుకి దూరంగా తొలగాడు.
పడవ సముద్రంలో వూగింది. రెండుకుండలలో గంజీ కూడూపెట్టి పడవలో ఉంచారు. తెరచాప గాలికి వయ్యారంగా ఆడింది. ఎండముదిరిన వేడికిరణాలు చల్లని సముద్రాన్ని తాకుతున్నాయి. “నాను కూడువొండి ఎదురు చూపులు చూత్తూంటాను.” అంది చంద్రి.
* * *
నవ్వు కథ నుంచి:
“అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్ళంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండవంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా వున్నాయి. కాని సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా వున్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి.
కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాదరేఖగానీ, విసుగుగానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరచుకున్నాడు?”
* * *
పై వాక్యాలు చదువుతుంటే మాస్టర్ స్టోరీ టెల్లర్స్‌లో తిలక్ ఒకరనేందుకు ఏ మాత్రం సంశయించనక్కర్లేదని మనకి అర్థమవుతుంది. కినిగెలో తిలక్ రచనల కోసం ఈ లింక్‌ని అనుసరించండి.
Related Posts:
‘అసలిది నేను వ్రాయగలిగానా?’ – యండమూరి వీరేంద్రనాథ్
ఆనందోబ్రహ్మ నవల గురించి రచయిత అభిప్రాయం:
* * *
ఈ పుస్తకం ఇన్ని ఎడిషన్లు రావటం చాలా ఆశ్చర్యంగా వున్నది. ఈ నవలలో భరద్వాజకి కలిగిన ఆశ్చర్యం లాటిదే ఇది. ఇది వ్రాస్తున్నంతకాలం (దాదాపు పదిహేనేళ్ళ క్రితం) ఈ పుస్తకం, ఇంత కవిత్వ ధోరణి వున్నది – ప్రజల్లోకి వెళ్తుందా అన్న అనుమానంతోనే వ్రాయటం జరిగింది. ఇన్నేళ్ళయిన తరువాత కూడా, ప్రజలు మరింత మెకానికల్‌గా మారిన తరువాత కూడా, ఇన్ని ఎడిషన్లు ఇప్పటికీ రావటం చాలా సంతోషం కలిగిస్తోంది.
ఈ కొత్త ప్రచురణలో అచ్చు తప్పులు స్వయంగా దిద్దటం కోసం దీన్ని ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ చదువుతూంటే, ‘అసలిది నేను వ్రాయగలిగానా?’ అన్న అనుమానం, కించిత్ గర్వం కలిగాయి. స్వోత్కర్ష కాదు.
ఈ పుస్తకంలో చికాగో గురించీ, ఫ్రాన్స్, రష్యాల గురించీ వ్రాయటం జరిగింది. అప్పటికి అమెరికా ఇంత గొప్ప (ఏకైక) దేశం కాదు. రష్యా ఇంకా అప్పటికి తన బలం కోల్పోలేదు.
అప్పటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని చదవవలసిందిగా పాఠకులకి అభ్యర్థన.
* * *
ఆనందోబ్రహ్మ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె ద్వారా ఆర్డర్ చేసి తగ్గింపు ధరతో ప్రింట్ బుక్‌ని పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ దిగువ లింక్‌ని అనుసరించండి.