కినిగె కు కొత్తా

మీరు కినిగె కు కొత్తా? అయితే ఈ లింకు చూడండి. 

http://help.kinige.com/index.php?title=New_to_Kinige

Related Posts:

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన స్టాల్ నంబర్ 156 నుండి ఏమి ఆశించవచ్చు.

కినిగె స్టాల్ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నందు 156వ నంబర్ స్టాల్ నందు కలదు.

ఇక్కడ మీరు

1. చాక్లేట్లు తీసుకోవచ్చు – ఉచితంగా.

2. కినిగె పాంప్లేట్ తీసుకోవచ్చు.

3. లోపలికి వచ్చి కినిగె.కాం సైట్ అంకోపరిపై జల్లించవచ్చు.

4. మీ చిరునామా కార్డు డ్రాప్ చెయ్యవచ్చు.

5. ఇంకా 250 రూపాయల విలువ గల కినిగె గిఫ్ట్ కూపన్లు  కొనవచ్చు.

Related Posts:

  • No Related Posts

కినిగె ఇప్పుడు లైవ్ !

 

http://kinige.com ఇప్పుడు లైవ్ . గమనిక – ఇది మునుజూపు మాత్రమే.

ఈ రిలీజ్ యొక్క పరిమితులు

1. ప్రధాన పేజీ ప్రస్తుతానికి అలా ఉంది, కాని ఇంకా మెరుగవ్వబోతుంది.

2. వర్గాలు ఇంకా కలపలేదు. తోకలు మాత్రం ఉన్నాయి, ఆ లోటు బర్తీ చెయ్యటానికి.

3. ఇంకా మేము నగదు చెల్లింపు పద్దతి కలపలేదు. ప్రస్తుతానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ స్టాల్ నంబర్ 156 వద్ద గిఫ్ట్ కూపన్లు కొనవచ్చు.

4. పుస్తకాల సంఖ్య – రోజు రోజుకీ కొత్త పుస్తకాలు కలుపుతున్నాము. మా కొత్త పుస్తకాలపై http://kinige.com/kfeed.php ఈ లింకు ద్వారా ఒక కన్నేసి ఉంచవచ్చు.

5. రచయతలు తమ అమ్మకాల రిపోర్టు చూసే పేజీ ఇంకా కలపలేదు.

6. ఒక్కసారి కొన్నాక మళ్లా రెండవ సారి ఉచితంగా దిగుమతి చేసుకోటానికి అనే ఫీచర్ ఇంకా లైవ్ కాలేదు.

మీ అభిప్రాయం మాకు విలువైనది. ఇక్కడ వ్యాఖ్యానించడం ద్వారా లేదా మా సపోర్ట్ పేజీ ద్వారా కాని మీ అభిప్రాయం చెప్పగలరు. http://kinige.com/ksupport.php

Related Posts:

  • No Related Posts

పేరులో నేముంది ? కినిగె

మేము ఈ ఆలోచన గురించి ఆలోచించి, చెయ్యగలగము అని నమ్మకం కుదిరినంక, చేస్తే మంచి పని అవుతుంది అని అనుకున్నాక చేసిన మొదటి పని పేరు పెట్టడం. పేరు గురించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నవి. క్లుప్తంగా ఉండాలి, బాగుండాలి, అందరికి నచ్చాలి, .కాం లభించాలి, .ఇన్ కూడా లభించాలి, పుస్తకం కు సంబంధించినదై ఉండాలి. ఇలా మాకు తెలిసిన భాషలలో, ఆ తరువాత కొంచెం తెలిసిన భాషలలో ప్రయత్నించాక చివరకు యాకుత్ భాషలో (వీరినే శఖులు అని కూడా అంటారు) కినిగె అంటే పుస్తకం అని తెలుసుకున్నాము. ఆ పేరు అందరికి నచ్చటం వల్ల, మా కండీషన్లన్నీ మీటవట్టం వల్ల ఒక అధ్యాయం మొదలైంది.

Related Posts:

పుస్తక ప్రియులకు నమస్కారం!

 

 

.com

 

భారతీయ పుస్తకాల కోసం అంతర్జాల దుకాణం

 

పుస్తక ప్రియులకు నమస్కారం!

కినిగె.కామ్ గురించి:

కినిగె.కాం అంతర్జాలం ద్వారా పుస్తకాలను కొనడానికి మరియు అద్దెకు తీసుకోడానికి వీలుకల్పించే సైటు. ఈ సైటు ద్వారా పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్లలో ప్రపంచంలోని ఎవరైనా, ఎక్కడనుండైనా కొనుక్కోడానికి లేదా కొన్నిరోజులపాటు అద్దెకు తీసుకొనడానికి అవకాశం ఉంటుంది.

కినిగె.కామ్ ద్వారా మీకు కలిగే సదుపాయాలు

1. కినిగె.కాంలో పుస్తకాలు డిజిటల్ ఫార్మాట్లలో ఉండటం వల్ల, మీరు ప్రపంచంలో ఎక్కడనుంచయినా పుస్తకాలను కొనవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు.

2. మీరు మీ కంప్యూటరులోనే కాకుండా, పుస్తక రీడర్లలో(కిండిల్, ఐప్యాడ్, సోనీ రీడర్ మొ.) కూడా మీ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

3. అద్దెకు ఇచ్చిన పుస్తకం గడువు తీరిన తరువాత దానంతట అదే తొలగింపబడుతుంది, దీనివల్ల అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని మీరు గుర్తుంచుకుని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

4. ఏదైనా కారణం వల్ల మీరు కొన్న పుస్తకాలను కోల్పోయినట్లయితే, తిరిగి ఈ సైటు నుండి ఉచితంగా దింపుకోవచ్చు.

ఈ సైటు గురించి మరిన్ని వివరాలకు http://kinige.comను దర్శించండి లేదా support@kinige.com లో సంప్రదించండి.

Related Posts:

రచయితలకు నమస్కారం!

 

.com

 

భారతీయ పుస్తకాల కోసం అంతర్జాల దుకాణం

రచయితలకు నమస్కారం!

కినిగె.కామ్ గురించి:

అంతర్జాలం ద్వారా పుస్తకాలను విక్రయించడానికి మరియు అద్దెకివ్వడానికి రచయితలకు వీలుకల్పించేందుకు కినిగె.కాం ఒక వేదిక. ఈ సైటు ద్వారా పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్లలో ప్రపంచంలోని ఎవరైనా కొనుక్కోడానికి లేదా కొన్నిరోజులపాటు అద్దెకు తీసుకొనడానికి అవకాశం ఉంటుంది.

కినిగె.కామ్ ద్వారా మీకు కలిగే సదుపాయాలు

1. మీ పుస్తకాలను దేశ, విదేశాలలోని పాఠకులకు ebook ఫార్మాటులో అమ్మవచ్చు, అద్దెకు ఇవ్వవచ్చు

2. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ పుస్తక అమ్మకాలను, అద్దెలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు

3. వాడుకదారులు వారి కంప్యూటరులోనే కాకుండా, వారి పుస్తక రీడర్లలో(కిండిల్, ఐప్యాడ్, సోనీ రీడర్ మొ.) కూడా మీ పుస్తకాన్ని చదువుకోవచ్చు

4. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పుస్తకాన్ని ఒకరి కంటే ఎక్కువ మంది చదవకుండా నిరోధింపబడుతుంది

5. పుస్తకం మొత్తాన్ని ప్రింటు తీయకుండా నిరోధించే అవకాశం

6. అద్దెకు ఇచ్చిన పుస్తకం గడువు తీరిన తరువాత, వాడుకదారుల కంప్యూటరు మరియు రీడర్లనుండి దానంతట అదే తొలగింపబడుతుంది

మీ పుస్తకాలను ఈ సైటు ద్వారా వినియోగదారులకు అందుబాటులోనికి తేవడానికి support@kinige.com లో సంప్రదించండి లేదా http://kinige.comను దర్శించండి.

మా ఫోను నంబరు: 81 426 426 19/38

Related Posts: