ఆరున్నొక్క రాగం — ఆంధ్రజ్యోతి వివిధ పై.

 

ఆరున్నొక్క రాగం శీర్షికతో సీతారం వ్రాసిన ‘మో’ కవితా సంపుటి ‘నిషాదం’ ముందుమాటలోంచి కొన్ని భాగాలు ఈ రోజు ఆంధ్రజ్యోతి వివిదలో ప్రచురించారు.

లింకుhttps://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2011/feb/28/vividha/28vividha2&more=2011/feb/28/vividha/vividhamain&date=2/28/2011 

 

 

ఈ పుస్తకం కినిగె పై లభిస్తుంది. చదవండి మీకు కంప్యూటర్ దూరంలో, మరెప్పుడూ లేనట్టు.

నిషాదం (మో) On Kinige

కవి ఏమంటున్నాడు? నేను వికృతి స్వరంలో పాడుతున్నాను ఈ సమాజ వికృతాన్ని, దుష్కృతాన్ని, దష్మృత్యాన్ని, దురాగతాన్ని, దుర్మార్గాన్ని అని. .

Related Posts:

మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రింట్లో పుస్తక రూపంలో అలభ్య రచనలు ఇప్పుడు కినిగె పై లభ్యం!

 

మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రింట్లో పుస్తక రూపంలో అలభ్య రచనలు ఇప్పుడు కినిగె పై లభిస్తున్నాయి. అవి –

1. ఓ మంచి మాట

2. తాత్విక కథలు

3. సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర

 

వివరాలు –

ఓ మంచి మాట

రామాయణం, మహాభారతం లాంటి పురాణాలలో, వివిధ ధర్మ శాస్త్రాలలో పెద్దలు చెప్పిన అనేక సుభాషితాలు, ఆథ్యాత్మిక సూత్రాలు ఈ పుస్తకంలో చదవ్వచ్చు. పాఠకులకి విసుగు పుట్టకుండా ఆద్యంతం ఆసక్తిగా చదివించేలా, ప్రతి మంచి మాటకి ముందు ఓ జోక్ ని కలిపి, తరువాత దానికి సరిగ్గా జోడయ్యే సుభాషితం చెప్పడం జరిగింది. ఆథ్యాత్మిక పాఠకులకే కాక, హాస్యాన్ని ప్రేమించే పాఠకులందరికీ ఓ మంచి మాట ఆసక్తికరంగా ఉంటుంది. ఆంధ్రజ్యోతి డైలీ శుక్రవారం నివేదన పేజీల్లే ఇవి వెలువడ్డాయి.

ఓ మంచి మాట On Kinige

 

తాత్విక కథలు

రకరకాల సాధనలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు తెలుసుకోదగ్గ అనేక సూక్ష్మ విషయాలని అతి చిన్న కథలుగా మలిచి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన కథా సంకలనం ‘తాత్విక కథలు.’ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించే విషయాలని, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకొనే ఆలోచనలని మనకి ఈ కథలు అందిస్తాయి. చిన్న పిల్లల చేత ఈ తాత్త్విక కథలని చదివిస్తే వారికి బాల్యంలోనే దైవభక్తి, పాపభీతి ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ పాఠకులను కూడా ఈ ‘తాత్త్విక కథలు’ ఆకర్షిస్తాయి.

తాత్విక కథలు On Kinige

 

సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర

కేరళలో పుట్టి, హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి, కర్నాటకలో కొంతకాలం అనేక ప్రదేశాలలో ఉండి, చివరికి మహారాష్ట్రలోని ముంబయికి నూరు కిలోమీటర్ల సమీపంలో ఉన్న గణేష్ పురిలో స్థిరపడ్డ జీవన్ముక్త అవధూత ‘సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర’ ఇది. ఎందరికో ఎన్నో చమత్కారాలని బాబా చూపించారు. ‘సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర’ ఆథ్యాత్మిక సాధకులని, సాధారణ పాఠకులని కూడా అలరిస్తుంది.

సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర On Kinige

Related Posts:

సైన్స్ ఫిక్షన్ కథలు

సైన్స్ ఫిక్షన్ కథలు On Kinige

 

వైజ్ఞానిక శాస్త్రాంశాల ఆధారంగా సృజించిన హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ కథలు ఇవి. నిజానికి దగ్గరగా ఉంటూ భవిష్యత్తులో ఇలా నిజంగా జరగవచ్చన్నట్టనిపించే కథలివి. ఇందులోని కొన్ని కథలు ఇప్పటికే నిజమవుతున్నాయి. కస్తూరి మురళీకృష్ణ బహుగ్రంథకర్త. సాహిత్యక్షేత్రంలో ‘ఆల్ రౌండర్’గా పరిగణించవచ్చు. ఆంధ్రభూమి వారపత్రికలో ‘పవర్ పాలిటిక్స్’ శీర్షికను గత దశాబ్దంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, సౌశీల్యద్రౌపది, అసిధార, పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్, రియల్ స్టోరీస్, భారతీయ వ్యక్తిత్వవికాసం వంటి రచనలు బహు పాఠకాదరణ పొందుతున్నాయి. అలా ఆదరణ పొందిన పుస్తకాలజాబితాలోకి ఈ పుస్తకం కూడా చేరుతుందన్నది మా విశ్వాసం.

http://kinige.com/kbook.php?id=56 

Read this
on Kinige.

Related Posts:

మాఁ హసన్‌బీ తెలుగు వాచకము

మాఁ హసన్‌బీ తెలుగు వాచకము On Kinige

Kinige Review:

’తెలుగువారి గర్వ కారణం’ అనే ఉపశీర్షికతో ముదురు నీలం రంగు అట్టతో ఆకర్షణీయంగా కనపడుతుందీ పుస్తకం. తెలుగు పుస్తకాల్లో అదీ పిల్లలకోసం వచ్చిన వాచకంలో ఇటివంటి నాణ్యమైన, మంచి రంగుల కలబోత ఉండటం అరుదు అనే చెప్పుకోవాలి. అచ్చులు, హల్లులు, తేలిక పదాల తర్వాత ప్రతి హల్లుకీ గుణింతరూపాలు పట్టీ రూపంలో ఇవ్వబడ్డాయి. గుణింతాల్లో ఉన్న కొమ్ములు, దీర్ఘాలకు అచ్చులకు ఉన్న సంబంధాన్ని వివరించారు. ఒత్తులు, ద్విత్వాక్షరాలకు ఆధారాలు, ఉదాహరణలు చేర్చారు. సంయుక్త/సంశ్లేషాక్షరాలు రాసే పద్ధతి, దాని సూత్రీకరణ నేర్చుకోవచ్చు.

ప్రత్యేక శబ్ధాలను, పదాలను పలికే విధానంపై మంచి వివరణలతో పాటు ఉభయాక్షరాలు, వాడుకలో లేని,అశాస్త్రీయమైన అక్షరాల పరిచయము కూడా ఉంది. తెలుగులిపిలోని హ్రస్వములు, పరుషములు, అనునాసికములు వంటి వివిధ విభాగాల యొక్క సాంకేతిక నామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు వారాలు, సంవత్సరాలు వగైరా వివరాలతో పాటు మహాకవుల సంక్షిప్త పరిచయాలు పుస్తకం చివర్లో ప్రత్యేక అనుబంధం.

— Swathi. http://swathikumari.wordpress.com

ముందుమాట
వంద రూపాయలకు తెలుగు వాచక పుస్తకాన్ని ఎవరైనా కొంటారా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ ఎందరో తెలుగు ఉపాధ్యాయులు ఇష్టపడి మరీ కొన్నారు. వ్యాపార పరిమాణం ఆకర్షణీయంగా ఉండటంతో ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా పాఠశాల విద్యార్థుల సౌలభ్యం కోసం విడుదల చేశాము. గత నాలుగు సంవత్సరాలుగా మా పుస్తకాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కష్టపడకుండా ఎంతో సులభంగా తెలుగు లిపిని బోధిస్తూ/నేర్చుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెంది బీహార్ రాష్ట్రంలోని వైశాలి పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయలో తెలుగు బోధిస్తున్న ఒక ఉపాధ్యాయుడు మా పుస్తకం కోసం ఎన్నో విక్రయ కేంద్రాలలో విచారించారని తెలిసి ఆనందం, బాధ రెండూ కలిగాయి. మా పుస్తకానికి లభించిన గుర్తింపుకు ఆనందం, అందరికీ అందుబాటులోకి తేలేకపోయినందుకు బాధ. అందుకే మళ్ళీ ప్రచురించి అందరికీ సులభంగా అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు ప్రారంభించాము.
పుస్తకాలకు ఆకర్షణీయమైన బొమ్మలు అదనపు అలంకారం. పువ్వులని నేపధ్యంగా తీసుకుని బొమ్మలు ప్రచురించాము. మన భూ ప్రపంచాన్ని అందాల రంగుల ప్రపంచంగా మార్చేవి రంగు రంగుల పువ్వులే! మన దైనందిన జీవితంలో పూలు ఒక ముఖ్య అంతర్భాగం. భక్తిలో, అలంకరణల్లో, సన్మానాల్లో, ప్రేమ, శృంగారంలో పూలకు ప్రత్యేక స్థానముంది. పూల అందాల్ని ఆస్వాదించని వాళ్ళుంటారా? మల్లెపూల పరిమళానికి పరవశించని మనసుంటుందా? మనల్ని మురిపించి, మరపించే అందాల పూతోటలు ఇంటిని స్వర్గంగా మార్చటం లేదా?
తెలుగు లిపిపై నాకు ఎంతో విలువైన విజ్ఞానాన్ని ప్రసాదించిన దయామయుడైన అల్లాకు వేనవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ…..

-షేక్ బడే సాహెబ్

 

మాఁ హసన్‌బీ తెలుగు వాచకము On Kinige 

Related Posts:

మారుతున్న విలువల్ని తెలుగు కథ ప్రతిబింబిస్తోందా ? (వాసిరెడ్డి నవీన్)

కథ 2006 నుండి:

కథ 2006 On Kinige

సామాజిక అంశాలను అర్థం చేసుకోవడానికి సామాజిక, ఆర్థిక విషయాలపై చర్చ ఎంత అవసరమో, సాహిత్యాన్ని సరైనదారిలో నడపడానికి, దిశానిర్దేశానికి అర్థవంతమైన సాహితీ విమర్శ అంతే అవసరం. గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగులో వెలువడుతున్న కథాసాహిత్యాన్ని పరిశీలిస్తే సరైన విమర్శలేని లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కథా రచనలో, నిర్మాణంలో అలసత్వం కనబడుతోంది. ఓ విమర్శకుడన్నట్లు చాలా కథలు సగం చెక్కిన శిల్పాలుగా, గొప్ప కథలు కావాల్సిన ఎన్నో కథలు కేవలం మంచి కథలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఈ విషయంపై సరైన చర్చ లేకపోవటం, ఒకవేళ అలాంటి చర్చ ఏదో ఒక రూపంలో మొదలైనా అది ప్రక్కదారి పట్టడం కథా సాహిత్యానికి, దాని ఎదుగుదలకూ ఆటంకంగా తయారైంది.

మన సమాజంలో ఇవాళ ఎన్నో విషయాలు చర్చకు వస్తున్నాయి. సామాజిక చిత్రం మారిపోతుంది. ప్రతి అంశాన్నీ ఆర్థిక విషయాలు శాసిస్తున్నాయి నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమై గ్లొబలైజేషన్ దిశగా సమాజం పరుగులు పెట్టడంతో వస్తున్న విపరీత పరిణామాలను మనం ప్రత్యక్ష్యంగా చూస్తూనే ఉన్నాం. గత పదేళ్ళ క్రితం ఉన్న అస్పష్టత, అయోమయం, అర్థంగానితనం ఇప్పుడేమీ లేదు. ఇప్పుడంతా నలుపు తెలుపుల్లో స్పష్టంగా ఒక వికృత సమాజం మన కళ్ళ ముందు నిలబడి ఉంది.

ఈ పెను మార్పులన్నీ మానవ జీవితాల్లోకి ఇంకిపోయి – మానవ విలువల స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేస్తున్నాయి. వ్యవస్థీకృత విలువల పునాదులు కదిలి పోతున్నాయి. ఈ మార్పులు మనల్ని ఎటువైపు నడిపిస్తాయో అర్థం కాకుండా ఉంది. ఈ దశలో అనేక కొత్త అంశాలు, కొత్త విషయాలు, సంబంధాలు కథా వస్తువులుగా తెరమీద కొచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో, వాటిని కథలుగా మలచటంలో మన కథా రచయితలు నైపుణ్యాన్ని, పరిణితిని చూపలేకపోతున్నారు.

గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగనంత చర్చ, ఉద్యమాలు మన రాష్ట్రంలో జరిగాయి. గ్లోబలైజేషన్ ప్రక్రియ ఆగలేదు గాని దాని ఫలితాల పట్ల ఒక అవగాహనని ఈ ఉద్యమాలు ఇవ్వగలిగాయనే అనుకొంటున్నాను. తీరా దాని పరిణామాలు తీవ్రరూపం దాల్చాక, అవి మానవ సంబంధాలను, విలువలను తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళాక ఈ విషయంపై మన కథకులెందుకో లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నారు.

ఉదాహరణకి భూమినే తీసుకొందాం. దానికి రెక్కలొచ్చాయి. ఎక్కడెక్కడికో ఎగిరి పోతోంది. త్వరితగతిన అనేక చేతులు మారి చివరికి మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఈ ప్రక్రియ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాదు, చిన్నపాటి పట్టణ ప్రాంతాల్లోనూ వేగవంతం అయింది. ఈ క్రమంలో భూమి విలువలలో వచ్చిన అనూహ్యమైన పెరుగుదలను మన సమాజపు మానవ సంబంధాలు తట్టుకోగలవా? భూమి ఇంక ఎంతమాత్రమూ పంటలు పండించే క్షేత్రం కాదు. కోట్లు కుమ్మరించగలిగే సాధనం కూడా. పోనీ ఈ ఫలితాలు అందరికీ అందుతున్నాయా అంటే అదీ లేదు. అతి తక్కువ ధరకు చేతులు మారిపోయి కోట్ల విలువను సంతరించుకొనే ఈ మాయ అంత తేలిగ్గా అర్థం కాదు. ఒకవేళ ఈ అనూహ్య సంపద సామాన్యుల చేతి కొచ్చినా దాని వెన్నంటి వచ్చే కృతకమైన విలువలు, విశృంఖల భావనలు, అనుమానాలు, ఆరాటాలు, హత్యలు, ఆత్మహత్యలు… ఇలా బహు ముఖాలుగా విస్తరించిన సమాజపు వికృత స్వరూపం ఇంకా మన కథల్లోకి రావటమే లేదు.

గతంలో ఉన్న అస్పస్టత ఇప్పుడు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా కథా వస్తువుని ఎంచుకొని తదనుగుణమైన శైలిలో కథారచన కొనసాగాలి. కథారచన, ఆ మాట కొస్తే సాహితీసృజన ఎప్పుడూ ఆషామాషీ వ్యవహారం కాదు. మనల్ని శోధించుకొని అంతరంగం నండి తన్నుకు రావాలి.

***

ఈ సంకలనంలోని 13 కథలను ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు అనేక విషయాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి.

మారుతున్న విలువల్ని సందర్భాలను కొత్తకోణం నుంచి పరిశీలించిన గేటెడ్ కమ్యూనిటీ, మా నాన్న నేను మా అబ్బాయి, యూ… టర్న్ కథల వంటివి ఇంకా విస్తృతస్థాయిలో రావలిసిన అవసరం ఉంది. అత్యంత సున్నితమైన విషయాలను నేర్పుగా చెప్పిన కథలివి. విలువల మధ్య అంతరాలు, తరాల మధ్య అంతరాలుగా పైకి కనబడినా వాటి నేపథ్యం మాత్రం మారిన సామాజిక స్థితిగతులే. పోగుపడుతున్న సంపద తెచ్చే అశాంతికి, వితరణశీలతకి ఉన్న సంబంధం కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు… కానీ వాస్తవం కదా!

మారిన సమీకరణాలు, పల్లెల్ని సైతం విడవకుండా ఆవరించినా ఇంకా సజీవ సంబంధాలు కొనసాగడానికి కారణం. ఈ దేశ సంస్కృతి, ఇక్కడ పోరాట సంప్రదాయం కారణం. అందుకే ఊడల్లేన్ని మర్రి కథలో చెల్లవ్వకు ఓ ఆసరా దొరికింది. కుటుంబాల పట్ల ఎంత శతృత్వమున్నా మూగజీవాలను సైతం ఆప్యాయంగానే చూడగలిగారు (మాయిముంత). యవనిక కథలో నేపథ్యం మారిందే తప్ప విషయం అదే. మారిన విలువలు మనుషులను దూరంగా ఉంచినా ఇంకా తడి ఇంకిపోని మానవ హృదయం ఒకటి ఆవిష్కృతమయిందీ కథలో.

అయితే ఈ సంప్రదాయాన్ని ఇలా నిలుపుకోవడానికి ఎన్ని పోరాటాలు చేయాలో మరెంత వేదనను భరించాలో? ఇది భవిష్యత్తు తేల్చాల్సిన సమస్య.

గ్లోబలైజేషన్ దేశానికి, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులను, ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలను తెచ్చింది, ఎంత వ్యాపారాభివృద్ధి జరిగిందీ గణాంకాలతో సహా లెక్కలు వేసి చెప్పగలం కానీ అత్మహత్యల సంస్కృతిని ఈ స్థాయిలో తెచ్చింది అన్న విషయం మాత్రం అలవోకగా మర్చిపోతాం. వందలాది అత్మహత్యలు మన కంటికి సామాన్యంగా కనబడతాయి. ఎన్ని కుటుంబాలు రోడ్ల పాలైనాయో. ఎంతమంది ఉసుళ్ళలాగా ఎరవేసి వేటాడబడ్డారో (వేట)! ఎలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళంతా ఒకచోటా మాట్లాడుకోగలిగితే (ఆత్మలు వాలిన చెట్టు) ఎన్నెన్ని సామాజిక కోణాలు ఆవిష్కృతమౌతాయో కదా !

ఎన్ని ప్రభుత్వాలు మారినా, గ్లోబల్ పెట్టుబడులు దేశంలోకి వరదగా వచ్చినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఫ్లొరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయాయి? మరే దేశంలోనయినా ఈ వికృతమైన అశ్రద్ధ సాధ్యమేనా? (జీవచ్ఛవాలు).

ఈ సంకలనంలో వస్తురీత్యా, శిల్పరీత్యా విలక్షణమైన రెండేసి కథలు ఉన్నాయి.

పురాణ చారిత్రిక గాథల్ని కొత్త కోణం నుండి దర్శించడం కథగా మలచటం తెలుగు సాహిత్యానికి కొత్తకాదు కానీ, ఈ సంకలనంలోని మృణ్మయనాదం కథలో సీత,అహల్యల సంభాషణ అనేక కొత్త విషయాలను చర్చకు తెస్తుంది. తెలుగులో బౌద్ద జాతక కథలను తిరిగి చెప్పడం దాదాపుగా లేదనే చెప్పాలి. ఆనాటి వాతావరణాన్ని ఆసరా చేసుకొని నేడు హింస, అహింస గురించి చర్చించడమే ఈ కథ (జాతక కథ) లోని ప్రత్యేకత.

అతడు… నేను.., లోయ చివరి రహస్యం కథ మళ్ళీ త్రిపురను గుర్తు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి అబ్సర్డ్ కథలు ఎవరూ పెద్దగా రాసినట్లు లేదు. రచయిత కొత్తవాడైనా ఒడుపుగా కథ చెప్పటంలో, మానవ మస్తిష్కంలో సుడులు తిరిగే ఆలోచనలను సమన్వయం చేయడంలో విజయం సాధించినట్లే. అతను, అతనిలాంటి మరొకడు కథ 20 ఏళ్ళు మనల్ని వెనక్కి తెసుకెళ్ళి,ఆ రాజకీయ వాతావరణాన్ని కళ్ళముందు నిలబెట్టడంతో పాటు ఇప్పటి అవకాశవాద విద్యార్ధి రాయకీయాలను, వాటిని నడిపే శక్తుల మోసపూరిత తత్వాన్ని విలక్షణశైలిలో చిత్రించింది.

***

చివరిగా ఒక ప్రశ్న,మారిన సామాజిక విలువల్ని , మానవ సంబంధాల్ని సమగ్రంగానూ, కళాత్మకంగానూ తెలుగు కథ చిత్రించగలుగుతోందా?

9 ఏప్రిల్ 2006 ,హైదరాబాద్

Read Complete Katha 2006 eBook on Kinige @ http://kinige.com/kbook.php?id=119

కథ 2006 On Kinige

Related Posts:

బ్లడీ బోర్డర్–ప్రీవ్యూ (మధుబాబు విరచిత వీరోచిత ధీర షాడో స్పై ధ్రిల్లర్)


బోర్డర్

షాడో స్పై ధ్రిల్లర్.

-మధుబాబు

© మధుబాబు

ఈ పుస్తకాన్ని డిజిటల్ పబ్లిష్ చేసిన వారు :

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.

సర్వ హక్కులూ రక్షించబడ్డాయి.

బ్లడీ బోర్డర్

(షాడో స్పై ధ్రిల్లర్)


పగలంతా నిర్జీవంగా , నిర్మానుష్యంగా కనిపించిన మైజీ పట్టణం చీకటి పడేసరికి…విపరీతమైన సందడితో నిండిపోయింది.

దుకాణాలు, హోటళ్లు, బార్లు…వచ్చేపోయే కస్టమర్స్ తో కిక్కిరిసి వున్నాయి.

ఒక పక్కగా నిలబడి మెయిన్ రోడ్ మీది జనసందోహాన్ని పరికిస్తున్నాడు హవల్దార్ అభిరామ్ సింగ్.

అక్కడికి పాతికమైళ్ల దూరంలో వున్న రాంచీ కంటోన్మెంట్ నుంచి వచ్చాడతను. నెల రోజులు రాత్రి పగలు అనే బేధం తెలీనట్లు బోర్డర్ ఏరియాలో డ్యూటీ చేశాడు. అతి కష్టం మీద గ్రాంట్ అయింది ఒక రోజు లీవు. ఆ ఒక్కరోజును.. మళ్లీ నెలరోజులకు సరిపోయే విధంగా ఎంజాయ్ చేయాలి.

అభిరాం సింగ్ కాళ్లు మెయిన్ రోడ్డుకి దూరంగావున్న ఒక చెట్ల తోపువైపు కదిలాయి వాటంతట అవే.

"సార్! అక్కడ ఏముంది సార్… అంతా పాత సరుకు. నాతో రండి. నెంబర్ వన్ లాంటి పిట్టల్ని చూపిస్తాను" అభిరాం వెనుకనుంచి వినవచ్చిందొక బొంగురు గొంతు.

గిరుక్కున వెనుతిరిగాడు. గారపళ్లు బయటపెట్టి వెకిలిగా చూస్తున్న ఒక పొట్టిమనిషి కనిపించాడు.

"ఎంతలో వుంటాయి?" జేబులో వున్న డబ్బును తడుముకుంటూ అప్రయత్నంగా అడిగాడు అభిరామ్.

"మీకు అందుబాటులో వుండేవే సార్… పది నుంచి పాతిక దాకా, ముప్పై నుంచి తొంభైదాకా, మీ ఓపిక.” వికృతంగా నవ్వుతూ అన్నాడతను.

రెండు నిముషాలు తటపటాయించాడు అభిరామ్. ఎందుకో అతనికి అటు పోవడానికి మనస్కరించలేదు.

"రండి సార్… కత్తులు సార్…పిడిబాకులు" అభిరాం చెయ్యి పట్టుకొని ఒక సందువైపు లాగాడు ఆ వ్యక్తి.

వద్దు వద్దు అనుకుంటూనే అతని ఫాలో అయ్యాడు హవల్దార్ అభిరామ్ సింగ్.

*****************************

పమిటను కిందికి వదిలి జాకెట్ బటన్స్ వూడదీయడం ప్రారంభించింది ఆ యువతి.

అభిరామ్ శరీరంలో రక్తం శరవేగంతో ప్రవహిస్తోంది. ఇష్టం వచ్చినట్టుగా వేడెక్కిపోయింది వళ్ళంతా.

"నీ పేరేంటి?" ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడూ.

"పేరుతో పనేముంది? నీకు యిష్టమైన పేరు పెట్టి పిలుచుకో" అంటూ వెనక్కి జరిగిందామె.

ముందుకు జరిగి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు అభిరాంమ్. మంచం మీద పడేశాడు అమాంతంగా ఎత్తి.

చటుక్కున పక్కకు దొర్లిందామె.

"అవునూ సరిహద్దుల్లో కాపలావుండే సైనికుడివేనా నువ్వు?" అడిగింది అదోలా చూస్తూ.

అభిరామ్ నొసలు ముడిపడింది.

"నీ వాటం చూస్తుంటే ఆడదాని ముఖం చూసి చాలా కాలం అయినట్లు కనిపిస్తోంది. అందుకు అడిగాను." వివరించిందామె.

"తెలివైనదానివే!" అంటూ ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి లాగాడు అభిరాం. ఎడమచేతితో జాకెట్‌ని లాగేశాడు.

"ఈ మధ్య మిజో గెరిల్లాలు సరిహద్దులు దాటటానికి ప్రయత్నిస్తున్నారంట గదా?" అతని చేతులకు అనుగుణంగా మెలికలు తిరుగుతూ అడిగిందామె.

తల వూపాడు అభిరామ్…తమకంతో ఆమె బుగ్గల్ని తడి చేస్తున్నాడు.

"దట్టమైన ఆ పొదల్లో… సరిహద్దులు దాటేవాళ్లని మీరు ఎలా కనిపెట్టగలరు? చెట్లు పుట్టలు చాటు చేసుకొని బోర్డర్ దాటితే మీరు ఏం చేయగలరు?"

శరీరం మీద వున్న వలువలన్నింటినీ తొలగించటానికి ప్రయత్నిస్తున్న అభిరామ్ కి హెల్ప్ చేస్తూ అడిగిందామె యధాలాపంగా.

అప్పటికే అభిరామ్ మెదడు ఆలోచించే పొజిషన్‌ని దాటిపోయింది. ఎటు తిప్పితే అటు తిరుగుతూ.. చేతికి నిండుగా అమరుతున్న ఆ యువతి అవయవాలు, అందాలు అతన్ని పిచ్చివాణ్ని చేశాయి.

 

End of Preview.

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=113

బ్లడీ బోర్డర్ (షాడో స్పై థ్రిల్లర్) On Kinige

Related Posts:

అందమైన జీవితం–మల్లాది వెంకట కృష్ణమూర్తి

స్త్రీ పురుషుల మధ్య సెక్స్ కి దారితీయని సుగంధ స్నేహ సుధ సాధ్యమని నిరూపించే నవల ఇది. చిన్న చిన్న సరదాలతో నిండిన జీవితమే అతి పెద్ద ఆనందం అన్న మెసేజ్ నిచ్చే దీంట్లో, జీవితాలను ప్రభావితం చేసే ఆర్ద్రత చూడవచ్చు. నల్లేరు మీద నడకలా సాగే మధ్య తరగతి జీవితాల్లో గోప్యంగా ఉండే మృదువైన సెంట్ మెట్స్ ని శాంతి, ప్రియతమ్ పాత్రల ద్వారా మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇందులో సూటిగా చెప్పారు. స్పందన, భావావేశం గల పాఠకులందరికి ప్రియమైన నవల "అందమైన జీవితం."

అందమైన జీవితం On Kinige

 

పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో రమణి గారి రివ్యూ, మరియు విశేషమైన కామెంట్స్ చదవండి. ఇది తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం – శైలి పరంగా అయినా, కథా పరంగా అయినా అద్భుతమైన పుస్తకం. ( http://pustakam.net/?p=2249 )

యండమూరికి నచ్చిన మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకం ఈ అందమైన జీవితం.

నేడే చదవండి కినిగె పై, మీకు కంప్యూటర్ దూరంలో లభించును.

http://kinige.com/kbook.php?id=52

Related Posts:

బ్లడీ బోర్డర్ ఇప్పుడు కినిగె పై

మధుబాబు విరచిత, వీరోచిత, షాడో స్పై ధ్రిల్లర్, “బ్లడీ బోర్డర్” ఇప్పుడు కినిగె పై లభిస్తుంది. నేడే చదవండి.

మాంచి క్వాలిటీ ఈబుక్ కేవలం కినిగెపై మాత్రమే.

 

బ్లడీ బోర్డర్ (షాడో స్పై థ్రిల్లర్) On Kinige

 

తీవ్రవాదులు బోర్డర్ దాటకుండా నిరంతరం కావలా కాస్తుండే సైనికులపై కత్తుల్లాంటి పిడిబాకుల్ని ప్రయోగించి వారి రహస్యాలను తెలివిగా తెలుసుకోని దేశ రక్షణను ప్రమాదంలో పడేసిన శతృవులపైకి భారత సైన్యం షాడో అస్త్రాన్ని ప్రయోగిస్తే, కిల్ మాస్టర్ ఎలా దేశ రక్షణ బాధ్యత వహించాడో ఈ రోమాంఛితమైన థ్రిల్లర్‌నందు చదివి ఆనందించండి. మధుబాబు కలం నుండి జాలువారిన ఈ అద్భుత షాడో స్పై థ్రిల్లర్‌ను సగర్వంగా మీకు సమర్పిస్తున్న వారు కినిగె డిజిటల్ టెక్నాలజీస్.

Related Posts:

కినిగె టిప్ #1–ఉచితంగా ప్రీవ్యూ

కినిగె పై పుస్తకాలను ఉచితంగా ప్రీవ్యూ చెయ్యవచ్చు. మీరు ఆసక్తిగల పుస్తకానికి వెళ్లి కుడివైపున ఉన్న ఫ్రీ ప్రివ్యూ అనే మీట నొక్కండి అంతే. లాగిన్ అయి ఉండవలెను సుమూ. అన్నట్టు రిజిస్ట్రేషన్ కూడా ఉచితమే. నేడే మీకు ఆసక్తి గల పుస్తకం ప్రీవ్యూ ఉచితంగా చెయ్యండి. దర్శించండి http://kinige.com

Related Posts:

  • No Related Posts

కొత్త బంగారు లోకం–ఇప్పుడు కినిగె పై

 

కొత్త బంరులోకం On Kinige

వెల కేవలం 50 రూపాయలు మాత్రమే. లేదా కేవలం ముప్పై రూపాయలకు కూడా మీరు ఈ-పుస్తకాన్ని అద్దెకు తీసుకోవచ్చు – ముప్పైరోజుల్లో, అనగా నాలుగు వారాంతాల్లో చదివెయ్యవచ్చు. !

 

 

రచయత స్వంత మాటల్లో


నేను కథలు ఎందుకు వ్రాశాను?
రాక్షసులు దేవతల్లాగా వేషాలు వేసుకుని
మేం దేవతలమే అని దబాయిస్తుంటే
వాళ్ళు రాక్షసులే అని
వేలెత్తి చూపగల ధైర్యమూ,
పారదర్శకత లేని విధానాలూ, రాజకీయ నాయకులకి
సాగిలపడి అధికార్ల వ్యవస్థా,
లోపభూయిష్టమైన న్యాయశాస్త్రం –
ఇవే ప్రజాస్వామ్యాన్ని కోమాలోకి నెట్టాయనే ఎరుకూ,
వీటికి బాధ్యత అనే ఔషదం దివ్యంగా పని చేస్తుందనే గ్రహింపూ,
పద్మవ్యూహం లోనుండి రంగులరాట్నం ఎక్కి ఎక్కడకీ చేరలేమనే జ్ఞానమూ మీకుంటే
మిమ్మల్ని అభినందించడానికీ, ఉత్సాహపరచడానికీ కథలు వ్రాశాను.
పై భావనలేవీ మీకు లేకపోతే మీలో వాటిని ప్రోదిచెయ్యడానికీ, బాధాసర్పదష్టులకి
కొత్త బగారులోకాన్ని మనమే సృష్టించగలమనే నమ్మకం కలిగించడానికీ
మీ కోసమే (ఈ)కథల్ని వ్రాశాను.
- అనిసెట్టి శ్రీధర్

 

పాపినేని శివశంకర్ అభిప్రాయం

పాత్రపోషణలో మనస్తత్వ విశ్లేషణ ప్రధానమైంది. కానీ ఆధునిక రచయితలు ఈ మధ్య ఉద్యమావేశాల వల్ల గాని, ఇంకెందువల్లనైనా గాని – ఈ అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అంతేకాకుండా వైవిధ్యభరతమైన కథా వస్తువుల్ని ఎన్నుకొవడం కూడా అవసరం. ఉద్యమాలు స్ప్రుశించాల్సిన జీవిత విభాగాలు అనేకం మిగిలి ఉన్నాయి. ఈ చూపుతో పరిశీలిస్తే అనిసెట్టి శ్రీధర్ వ్రాసిన ‘మగాడి పశ్చాత్తాపం’ అనే కథ పురుష మనోవిశ్లేషణతో అద్భుతంగా సాగింది. దేశ పర్యటన అనే సరికొత్త ఇతివృత్తం గ్రహించి శ్రీధర్ ‘కొలంబస్’ అనే ఆసక్తికరమైన కథ వ్రాశాడు. యాంత్రిక జీవన విధానంతో కలుషితమైన నిలవనీటి బ్రతుకుల కొక కదలిక ఈ కథ.
(దక్షిణ తీరాంధ్ర కథ, వ్యాసం నుండి)
- పాపినేని శివశంకర్.

మరిన్ని వివరాలు

ఈ పుస్తకం రచన, ఆంధ్రజోతి, నవ్య, ఇండియా టుడే, విపుల వంటి పత్రికల్లో ప్రచురించబడి విమర్శకుల ప్రశంసలు విరివిగా అందుకున్న అనిసెట్టి శ్రీధర్ కథల సంకలనం. మునిపల్లెరాజు గారి ముందుమాటతో, మొత్తం పదిహేను కథలు ఇందు కూర్చబడ్డాయి.

 

మేలిమి కథా సంకలనం – ఇండియా టుడే

జి.వి.ఎస్. మూర్తి
మానవ ప్రపంచం అందంగా ఎందుకుండదని నిలదీసే యువ రచయిత అనిసెట్టి శ్రీధర్ కథా సంకలనం: ‘కొత్త బంగారు లోకం’. గోపాలం మంచి బాలుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ కాలం వాడు కాదు. అలాంటి గోపాలానికి కావలసిందేమిటో వివరించిన కథ మద్దతుతో కొత్త బంగారు లోకం పాఠకుల ముందు తలుపులు తెరచుకుంటుంది. గోపాలానికి ఏం కావాలో కనుగొనడం ద్వారా రచయిత మరో మంచి బాలుడుగా సాక్షాత్కరిస్తారు.
అదే సమయంలో ఈ రచయిత ఓ అసాధ్యుడు కూడా అని రెండో కథలోకి వెళ్ళేసరికే మనకు స్ప్రుహ కలుగుతుంది. సర్దుకు పోవడమేమిటని ప్రశ్నించే విశాలిని, సర్దుకు పోకపోవడమా అని ఆశ్చర్యపడే లీలను ఒక కోళ్ళ ఫారం నేపధ్యంలో ఇలా మాటల్లో పెట్టి, అలా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని గురించి కొక్కొరొకో అని అలారం మోగించేస్తారు రచయిత. "పాత సామాను మధ్యలో ఎక్కడ కలిసి పోయిందో గమనించి ఉండను" అంటూ ముసలి అవ్వ నిర్లక్ష్యానికి గురవుతున్న తీరును ధ్వనించడం ద్వారా మూడో కథలో, రచయిత అక్షరాలను బంగారు శిల్పమంత అపురూపంగా చెక్కడం పాఠకులకు ముచ్చట గొలుపుతుంది. పిల్లలకు సున్నితత్త్వాన్ని విశదం చేయడానికి తల్లులు ఎవరైనా సిలబస్‌కోసం వెదుకుతున్నట్లైతే, అందుకు సిద్ధంగా దొరికే పాఠ్యపుస్తకంగా కొత్త బంగారు లోకంను హాయిగా సిఫార్సు చెయవచ్చు. అందుకు ఈ పాత సామాను కథ ఒక్కటే చాలు. ఒకానొక పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఈ కథతో పాటు, అలాంటివే అనేక ఉత్తమ కథలను పొదిగిన ఈ సంకలనానికి ముందు మాట వ్రాస్తూ ప్రముఖ కథకులు మునిపల్లె రాజు, అకళంక అంతర్ముఖుడుగా రచయితను పరిచయం చేస్తారు. నిశ్శబ్దంగా, కుర్చీలో ముడుచుకుని కూర్చుని కనిపించాడీ రచయిత అని ఆయన వ్రాశారు. కొంత జోడించి చెప్పాలంటే, చుట్టూ జరుగుతున్న దానిని డేగ అంత నిశితంగా గమనించడం కోసమే ఆ నిశ్శబ్దాన్ని సైతం విశ్లేషించి, స్వరాలు కట్టే నైపుణ్యం ఈ రచయిత సొంతమూ అనిపిస్తుంది ఈ పుస్తకంలోని కథలను చదువుతుంటే, పాత్రల నిజ జీవితాలలోని అపస్వరాలు అన్నింటినీ నిశ్శబ్దంగా కనిపెట్టేసి, వాటిని తన అక్షరాలలో ఏ అపస్వరం లేకుండా చెబుతారు శ్రీధర్. సహాయం అనే కథలో శ్రీధర్‌లోని యుక్తిపరుడు ప్రత్యేకంగా ఉట్టిపడుతాడు. కులపిచ్చి గురించి వ్రాసేటప్పుడు ఏ కులం పేరు పెట్టి వ్రాసినా చిక్కే. అందుకే శ్రీధర్ ‘కా ‘ అనే కులాన్ని తీసుకుని కథ నడిపించేశారు. "కా " అనేది ఏ కులమా అని ఎవరూ బుర్ర బద్దలు కొట్టుకోనవసరం లేదు. అది అన్ని కులాలనూ ఉద్దేశించి వ్రాసినదని సవినయంగా మనవి చేసుకోవడం, గడసరి రచయిత సృజనాత్మతకు కొసమెరుపు. డబ్బు కాటు తిన్నాక ఆధ్యాత్మికం సైతం ఎలా నల్లబడిపోతుందో రచయిత నెత్తురు కూడు అనే కథలో అద్దం పట్టారు. ఈ కథ, ఆయనలోని ఆవేదనాభరిత అంతరంగాన్ని చాటుతుంది. 15 కథల సంపుటంలో రచయిత దృష్టిలో హైలైట్ సహజం గానే టైటిల్ కథ: కొత్త బంగారు లోకం కావాలి. చదివించే ఉత్కంఠ, ఆఖరికి మనకు తెలిసిన సందేశాన్నే మనం ఊహించలేనంత బలంగా, అందంగా, కొస మెరుపుగా మెరిపిస్తారు శ్రీధర్. "మొన్నొక ఆఫీసరు వాళ్ళ నాన్న తద్దినానిక్కూడా డబ్బులు వసూలు చేశాట్ట" లాంటి చురకలు కూడా వేసే ఈ రచయితలో ఆవేశం చాలా ఉన్నా, దానిని చాటుకోవడానికి ఎక్కడైనా దుర్బాషను వాడారా అంటే, బొత్తిగా అలాంటి ప్రసక్తే లేదు. అందుకే చెప్పి తీరాలి: నలుసంత రాగి అయినా కలపని కొత్త బంగారు లోకం ఈ కథల పుస్తకం.

వైవిధ్యభరత కథాసంపుటి (వార్తా దిన పత్రిక)


ప్రముఖ కథా రచయిత అనిసెట్టి శ్రీధర్ రచించిన "కొత్త బంగారు లోకం" కథా సంపుటిలో వైవిధ్యభరత మనస్తత్వ విశ్లేషణాత్మకమైన 15 కథలున్నాయి. ఇందులో మానవతా దృక్పథానికి అద్దం పట్టే కథలున్నాయి. పురుషాధిక్యతను నిరసించే స్త్రీ వాద భావుకతలున్నాయి. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాలైన ఉదాత్త ఇతివృత్తాలున్నాయి. ప్రయోగాత్మక వ్యంగ్య కథలున్నాయి.
నీతి, నిజాయితీతో కూడిన ఊహాత్మక ఆదర్శ సమాజాన్ని సృష్టించడమే కొత్త బంగారులోకం ఇతివృత్తం. కథలన్నింటా కొత్త బంగారు లోకాన్ని సృష్టించడానికి అనువైన ఇతివృత్తాలు, ఉదాత్తమైన పాత్రలున్నందున ఈ కథాసంపుటి శీర్షిక ఔచిత్యంగా ఉంది.
కథలన్నింటా ఉత్కంఠతో కూడిన ఆరంభం, ఔచిత్యమైన ముగింపు, పాఠకులచేత చదివించే సంవాద చాతుర్యం వంటి లక్షణాలున్నాయి. వీటికితోడు సంక్షిప్తత, ఏకాంశవ్యగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత వంటి ఉత్తమ కథానిక లక్షణాలు పాటించబడ్డాయి. పాత్రలన్నీ ఉదాత్తంగా చిత్రించబడ్డాయి. కొత్త బంగారులోకం రావాలన్న రచయిత ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిద్దాం.
- డాక్టర్. పి.వి.సుబ్బారావు.

pustakam.net review link = http://pustakam.net/?p=222 

 

అదీ సంగతి. ఈ అద్భుతమైన కథలను చదవటానికి నేడే విచ్చేయండి కినిగెకు. http://kinige.com/kbook.php?id=75

Related Posts: