కస్తూరి మురళి కృష్ణ రచించిన శ్రీకృష్ణదేవరాయలు నవలపై వారాంతపు ప్రత్యేక తగ్గింపు. ఇప్పుడు కొనండి 50 శాతం తగ్గింపు పొందండి. కేవలం ఈ వారాంతం మాత్రమే –
Special Weekend offer 50% discount on శ్రీకృష్ణదేవరాయలు నవల On Kinige
కస్తూరి మురళి కృష్ణ రచించిన శ్రీకృష్ణదేవరాయలు నవలపై వారాంతపు ప్రత్యేక తగ్గింపు. ఇప్పుడు కొనండి 50 శాతం తగ్గింపు పొందండి. కేవలం ఈ వారాంతం మాత్రమే –
Special Weekend offer 50% discount on శ్రీకృష్ణదేవరాయలు నవల On Kinige
Special weekend discount on నాటి మేటి సినీ ఆణిముత్యాలుతో ముఖాముఖి ఇంటర్వ్యూలు . This is a wonderful book from a genuine career of a cine Journalist. Must read book for all Telugu Movie Lovers.
స్పెషల్ వీకెండ్ ఆఫర్ – 50 శాతం తగ్గింపు – నాటి మేటి సినీ ఆణిముత్యాలుతో ఇంటర్వ్యూలు On Kinige
రచయత స్వంత మాటల్లో
ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక కారణముంది. కొంత కాలంగా తెలుగు ఫిలిం జర్నలిజంలోకి ఎందరో యువతీ యువకులు వస్తున్నారు. వాళ్ళంతా గతం గురించి తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవడానికి ఆధారాలు లేవు. కనుక ఈనాటి వ్యక్తుల గురించి, చిత్ర రంగంలోని ఈనాటి పరిస్థితుల గురించి తెలుస్తోంది. ఇప్పుడొస్తున్న వాళ్ళంతా గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. మన చిత్రరంగానికి సంబంధించిన గతమెంతో ఘనమైనది. మొత్తం చలనచిత్ర రంగానికే తలమానికంగా నిలిచిన మార్గదర్శకులు, మహానుభావులు ఎందరో ఉన్నారు. సినిమాకు తొలి మెట్టయిన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్రరంగాన్ని తేజోవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఎందరో వున్నారు. వారి ప్రతిభ కారణంగానే తెలుగు చిత్రసీమ పరిపుష్టితమైందనటంలో సందేహం లేదు.
"నాటి మేటి సినీ ఆణిముత్యాలను ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఎన్నో రోజులు శ్రమించి పరిశ్రమకు, పాఠకులకు అందిస్తున్న ఈ నేటి మేటి సినీ ఆణిముత్యాలకు ముందుమాట వ్రాయడం నాకెంతో సంతోషంగా ఉంది". -డాక్టర్. దాసరి నారాయణరావు.
"అరుదైన, నిజాయితీపరుడైన సినీజర్నలిస్ట్ పసుపులేటి రామారావు గత మూడున్నర దశాబ్ధాలుగా సృష్టించిన అక్షర సంపదను పుస్తకరూపంలో తీసుకువస్తున్నందుకు అభినందనలు". -కె. చిరంజీవి
"రామారావు వ్రాసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ప్రత్యేకత. పరిశ్రమ బాగోగుల గురించి, మన తెలుగు చిత్రాలకున్న మార్కెట్ పరిమితి గురించి, చిత్రాలలోని కథలు, కథనాల గురించి, వ్యక్తుల సాంఘీక బాధ్యతల గురించి ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంటర్వ్యూలు చేసిన పసుపులేటి రామారావు పరిశ్రమకు, పాఠకులకు ప్రీతిపాత్రం కావాలని కోరుకుంటున్నా". –మురళీమోహన్
http://www.ragalahari.com/localevents/2144/chiranjeevi-dasari-launches-pasupuleti-ramarao-cine-aanimuthyalu.aspx – Launch function Photos. Presided by Murali Mohan, Chiranjeevi, Dasari
పుస్తకం కోసం పైన ఉన్న శోదన పెట్టె ఉపయోగించి వెతక వచ్చు, లేదా ఎడమవైపున ఉన్న రకరకాల జల్లింపు ఐచ్చికాల ద్వారా కావల్సిన పుస్తకాన్ని జల్లెడపట్టి చూడవచ్చు.
ప్రస్తుతానికి మనం మధుబాబు రచించిన చైనీస్ బ్యూటీ పుస్తకం ఎన్నుకుందాం.
చైనీస్ బ్యూటీ బొమ్మపై ఒక నొక్కు నొక్కండి.
మరో పుట తెరుచుకున్నది. మంచిది. దీంట్లో ఏముందో తరిచి చూద్దాం. కవర్ పేజీ, పుస్తకం గురించిన కొంత వివరణ, మరియు ఇతర వివరాలు ఉన్నాయి. కుడివైపు స్క్రాల్ పార్ దిగువకు జరిపి చూద్దాం మరిన్ని వివరాలు కనిపిస్తాయేమో.
దిగువ మరి కొన్ని వివరాలు ఉన్నాయి. వాటిని కూడా చదివేద్దాం. ఇంతకీ ఈ పుస్తకం కొనాలా వద్దా. నిర్ణయం తీసుకోటానికి ఇంకేదన్నా పనికొచ్చే సమాచారం ఉందేమో చూద్దాం. అక్కడ కుడివైపున Download Free Preview అని ఒక మీట ఉంది. దాన్ని నొక్కి చూద్దాం.
ఉచిత ప్రీవ్యూ నొక్కగానే ఏదో జరిగింది. ఏం జరిగింది? లాగిన్ స్క్రీన్ వచ్చింది. మనకు కినిగె పై లాగిన్ లేదే, సరే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం.
Register అని ఉన్న లింకు నొక్కుదాం.
పైన చూపించిన విదంగా మరో తెర తెరుచుకుంది. అక్కడ అడిగిన ఐదారు వివరాలు ఇద్దాం.
వివరాలు ఇచ్చి సబ్మిట్ నొక్కాక, వేగుకు వెళ్లి చేతనం చేసుకోమంటుంది. తప్పేదేముంది చేతనమవుదాం.
పైన చూపించిన విధంగా నాకు ఒక వేగు వచ్చింది. మీరు కూడా మీరు పైన ఇచ్చిన వేగు చిరునామా చూసుకోండి.
ఆ వేగు తెరిచి చూస్తే పైన చూపిన విదంగా కనిపించింది. అక్కడి లింకు నొక్కండి.
పైన చూపిన విదంగా విజయవంతంగా చేతనమొందిన మెస్సేజ్ కనిపించింది.
మళ్లా మొదటి కచ్చి http://kinige.com తెరుద్దాం.
చైనీస్ బ్యూటీ బొమ్మపై మరోసారి నొక్కుదాం.
Download Preview మీట మరోసారి నొక్కదాం. మళ్లా లాగిన్ అడుగుతుంది.
అయితే ఈసారి మనకు కినిగెలో సభ్యత్వం ఉంది కదా, ఆ వివరాలు ఎంటర్ చేద్దాం.
వివరాలు ప్రవేశపెట్టి గో మీట నొక్కండి.
మళ్లా చైనీస్ బ్యూటీ మన్ని పలకరించిద్ది, మరో పాలి Download Preview మీట నొక్కుదాం.
పైన చూపించినట్టు (ఫైర్ ఫాక్స్ లో – మిగతా బ్రౌజర్లలో కూడా తగినట్టు ) కనిపిస్తుంది. మనకు పది పేజీలు ఉచితంగా వచ్చాయి. వాటిని చదువుదాం. బాగానే ఉంది. సరే ఈ పుస్తకం కొని చదవవచ్చు. ఎలా కొనాలి ?
చైనీస్ బ్యూటీ పుట చూస్తే అక్కడ Buy eBook: Rs 50 అని ఒక మీట ఉంది. దాన్ని నొక్కుదాం.
Buy eBook: Rs 50 నొక్కితే ఏమైంది? ఏమవుతుంది. నగదు లెవ్వు అని ఎరుపు రంగు అక్షరాల్లో మెస్సేజ్ వచ్చింది. సరే నగదు ఎలా కట్టాలంట? ఆ మెస్సేజ్ చివరలో క్లిక్ హియర్ అని ఉంది కదా అది నొక్కుదాం.
పైన చూపించిన పుట తెరుచుకుంది. అక్కడ మూడు ఐచ్చికాలు ఉన్నాయి.
మొదటిది – ఎవరన్నా మనకు కినిగె గిఫ్ట్ కూపన్ పంపితే వాడవచ్చు.
రెండోది – ప్రధానంగా భారతీయులకు ఇక్కడ రకరకాల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వసతుల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా మన రైల్వే రిజర్వాషన్ ఆన్లైన్లో చేసుకునేటప్పుడు నగదు చెల్లింపులాగా ఉంటుంది.
మూడోది –ప్రధానంగా విదేశాలలో ఉంటున్న భారతీయులకోసం. పది డాలర్లు కడితే పేపాల్ ద్వారా నాలుగు వందలు కినిగె అకౌంటులో రీచార్జ్ అవుతాయి.
మీకు కావాల్సిన ఐచ్చికం ద్వారా రీచార్జ్ చేసుకోండి.
రీచార్జ్ చేసుకున్న తరువాత Buy eBook Rs. 50 మీట నొక్కండి.
దిగువ చూపించిన పుట తెరుచుకుంది.
ఏదో దిగుమతి చేసుకోమంటున్నాడు. దిగుమతి చేసుకుందాం.
కానీ ఎలా ఓపెన్ చెయ్యాలి? సరే ఆ కినిగె డౌన్లోడ్ పుటలో ఏమన్నా సహాయం ఉందేమో చూద్దాం. సరిగ్గా చదివితే అక్కడ రెండో లైన్లో అడోబ్ డిజిటల్ ఎడిషన్ దిగుమతి చేసుకోమని చెప్పారు.
ఆ లింకు నొక్కుదాం. బ్రౌజర్లో ఓపెన్ అయింది.
ఆ పేజీలో కుడిపైపున ఉన్న Download లింకు నొక్కితే ఈ దిగువ పుట వస్తుంది.
Install మీటను నొక్కుదాం.
మరోసారి Install మీట నొక్కుదాం.
ఏదో చేస్తుంది.
Yes నొక్కి ముందుకు వెళ్దాం.
ఈ దిగువ చూపిన పుటలు కనిపిస్తాయి.
క్లోజ్ మీట నొక్కండి.
I Agree మీట నొక్కండి.
get an Adobe ID online నొక్కండి.
Create an Adobe Account లింకు నొక్కండి.
ఇది కొత్త వెగు క్రియేట్ చెయ్యటం లాంటిది. అక్కడ ఎరుపు రంగు నక్షత్రపు రంగు గుర్తు ఉన్న ఫీల్డులు నింపి ముందుకు వెళ్లాలి.
Continue నొక్కండి.
మనం మన డిజిటల్ ఎడిషన్ కు మరళి కొత్తగా సృష్టించిన ఐడీలు ఎంటర్ ప్రవేశపెట్టండి.
Done, Finished మీట నొక్కండి.
చాలా దూరం వచ్చాము. ఇంతకీ ఎక్కడ మొదలు పెట్టాము? కినిగెపై చైనీస్ బ్యూటీ వద్ద మొదలు పెట్టాము. మరళా అక్కడికి వెళ్దాము.
http://kinige.com (ఒకవేళ లాగిన్ అయి ఉండకపోతే లాగిన్ అవ్వండి. )
చైనీస్ బ్యూటీ పై నొక్కండి. (కనపడకపోతే, My Books నొక్కండి. )
పైన చూపినట్టు కనిపిస్తుంది. Download Purchased Book మీట నొక్కుదాం. దిగువ చూపిన పుట వస్తుంది.
తెరుద్దాం.
ఎడమవైపున ఉన్న బద్దె కూడా తొలగించవచ్చు. మధ్యలో ఉన్న బాణం గుర్తుపై డబుల్ క్లిక్ చెయ్యండి.
ఇలా రెండు పేజీల్లో చదవవచ్చు. పైన కుడివైపున ఉన్న మీటలు నొక్కి ప్రయోగం చెయ్యండి.
ఆనంద పఠనం.
చురకత్తులు
ప్రజా పక్షం వహించిన మూర్తులు
చర్నకోళతో తాకించే దెబ్బలు
సూటిగా చెప్పే సుద్దులు
అందమైన బొమ్మలు
ధైర్యమైన ధీర వచనాలు
ఈ శేఖర్ కార్టూన్లు.
తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
శేఖర్ ఈ పుస్తకంలోని కార్టూన్లు అన్నీ ఆనాటి ముఖ్యమంత్రి అయిన నారా.చంద్రబాబు నాయుడు పై వేసినవే. చంద్రబాబు నాయుడు కాలంలో ఆయన స్వభావాలు, విధానాలు కలగలిపి రూపుదిద్దుకున్న కార్టూన్లు ఇందులో యెన్నొ వున్నాయి. ఈ కార్టూన్లను పరిశీలిస్తే చంద్రబాబు స్వభావం, వ్యక్తిత్వం, పనితనం, ఎత్తుగడలు, వ్యూహాలు మనకు అర్దమవుతాయి.
ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.
మనల్ని నవ్వించి, ఆలోచింపచేసే పుస్తకాన్ని చదివి ఆనందించాలనుకుంటున్నారా, ఐతే వెంటనే కినిగే లోకి ప్రవేశించండి.
తనికెళ్ల భరణి రచించిన పరికిణీ పుస్తకంపై వారాంతపు ప్రత్యేక తగ్గింపు. ఇప్పుడు కొనండి 50 శాతం తగ్గింపు పొందండి. కేవలం ఈ వారాంతం మాత్రమే –
http://kinige.com/kbook.php?id=122
ముందుగా అందరకూ ఉగాది మరియు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
ఈ పండుగకు కినిగె నుండి ఆసక్తికరమైన ఆఫర్.
1. మీరు కినిగెపై బాలన్స్ రీచార్జ్ చేసుకోండి.
2. తరువాత http://kinige.com/krecharge.php నక వెళ్లి HAPPYSRIRAMANAVAMI అని టైప్ చేసి 5 శాతం ఎక్కువ నగదు పొందండి, పూర్తి ఉచితంగా.
* ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి.
ఆనంద పఠనం,
కినిగె టీం
కొన్ని రచనలు వడియాలు పెట్టినట్టుంటాయి.
కొన్ని జంతికలు పోసినట్టుంటాయి.
కొన్ని మాత్రం ముగ్గులు వేసినట్టుంటాయి.
పై రెండూ తింటే కరుసైపోయినట్టే-
ఇవాళ వేసే ముగ్గులు చూస్తూండగా రేపులోపు చెదురుతాయి; చెరుగుతాయి.లేకపోతే కొత్త ముగ్గులు రావు గదా. అంచేత ముగ్గులు చెదరడం, చెరగడం సహజం అవసరం. అదే జీవితం!
ఇంతకీ ముగ్గుల రంగేమిటి?
వైటా? బ్రౌనా? రెండు కలిస్తేనే రూపం కదా. దాంపత్య తాంబూల రాగం అదే గదా!
“నిన్న” కన్న బిడ్డ “ఇవాళ”.
“ఇవాళ”లు – రేపటికి పేరెంట్సూ, ఎల్లుండికి తాతలూ అవ్వలూను. ఏడాదికి ఆరు ఋతువులున్నట్టే ఆలుమగల దాంపత్య కాలచక్రంలోనూ వుంటాయి.
పెళ్ళి, సంతోషం, సంసారం, సంగరం, సంతానం, సంతృప్తి అనే మజిలీల మీదుగా – కామం పెరిగి, విరిగి, తరిగి నిష్కామభరితమైన స్నేహంగా, ప్రేమగా పరివర్తనం చెంది పంపడమే దాంపత్య జీవన ఋతుచక్రం. దాలిగుంట మీద పాలదాకలో పాలు నిదానంగా కాగి, మరిగి, పొంగి పొంగి, కుంగి స్థిరపడి ఎర్రడాలు మీగడ తేలడం దాంపత్య సౌభాగ్యం.
ఏమిటలా చదవడం ఆపి, కళ్లు తేలేస్తున్నారు?
సరదానంద వాక్యాలు గంభీరానంద సన్యాసానంద ప్రసంగ పాఠాల్లా కనబడుచున్నాయా? ఏం లేదు. ప్రేమలో పడడం, పెళ్లాడడం, కామించడం, రెచ్చిపోవడం, అలిసి పోవడం, క్రమంగా కోరికలు వెలిసి పోవడం – కొండొకచో కలుపు గడ్డి కల్పవృక్షంలా కనబడడం, తేలిగ్గా నాలిక్కరుచుకోవడం, నవ్వుకోవడం – ఇదీ వరస! ఇదే తాత్పర్యం!!
సీతారాముళ్లనే బావమరదళ్ల – ధరిమిలా ఆలూమగళ్ల – ఆ పైన తల్లీతండ్రుళ్ల – ఆ పిమ్మట అవ్వాతాతళ్ల కథలివి. వీళ్ళందరూ కలిపి ఇద్దరే!
చిన్ని చిన్న ఉబలాటాల ఆరాటాల పోరాటాల చెలగాటాల పరీమళాల (నీ జుట్టు నిశి – నీ ముఖం శశి; కళ్ళు చూస్తే మొగ్గలు – తిరిస్తే పువ్వులు) ఘుమ ఘుమలతో నోరూరించే – తింటే ‘వ-హల్వా’ అనిపించే ఆలుమగల ముత్యాల ముగ్గులు. విశేషం ఏమిటంటే సుద్ద ముగ్గుల్లా ఈ ముగ్గులు చెదరవు. చెరగవు.
ఇవి హృదయాకాశంలో అ-క్షరాలు. ఆరంభంలో ఆలుమగల కసి ముద్దులు. ఆనక అమ్మానాన్నల పసి ముద్దులు. ఆ తరువాత అవ్వాతాతల బోసి నవ్వుల ముగ్గులు. ఇవి రాసిన అనామకుడికీ, రాయించిన అనామికకూ శతమానంభవతి!
-ముళ్ళపూడి వెంకటరమణ
ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.
దాంపత్య జీవితం లోని మాధుర్యాన్ని చదివి ఆనందించాలనుకుంటున్నారా ఐతే ఇక్కడ నొక్కండి.
ఈ రంగురంగుల 16 పుటల అందమైన పుస్తకం 0 – 6 సంవత్సరాల వయసు పిల్లలకోసం మంచి పుస్తకం వారు ప్రత్యేకంగా డిజైన్ చేసి వెలువరించినది. దిసీజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ అనే ఆంగ్ల మూలం దీనికి ప్రేరణ. చిన్నారి పొన్నారి పాపాయిలు తెలుగు ఆనందించటానికి ఈ పుస్తకం బహుదా దోహదం చేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం కినిగే పై డిజిటల్ రూపంలో కేవలం ౩౦ రూపాయలకే అందుబాటులో వుంది.
ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.
ఆంగ్ల భాష పై మోజుతో తెలుగు మరిచిపోతున్న ఈరోజుల్లో మీ పిల్లలకు మన మాత్రు భాష ఐన తెలుగు ను నేర్పించాలనుకుంటే వెంటనే ప్రవేశించండి.
తెలుగు పిల్లలు టపటపలాడించే ప్రతి కంప్యూటర్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకం!
చైనాలోని దుష్ట సైంటిస్టులు భూకంపాలు సృష్టించే యంత్ర సామాగ్రి కనుగొని భారతదేశాన్ని, చైనాను గడగడలాడిస్తుంటే – అదే సమయంలో భారతదేశం షాడోను రంగంలోకి దించితే, కలిసి పనిచేద్దాం అనే మిషతో షాడోను హతమార్చడానికి చైనీస్ బ్యూటీ రంగంలోకి దిగితే ఆ కథ చివరకు ఏ మజిలీ చేరుకుంటుందో ఈ మధుబాబు విరచిత రోమాంఛితమైన స్పై ధ్రిల్లర్ నందు చదివి ఆనందించవలసినదే.
ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.
మధుబాబు విరచిత రోమాంఛితమైన స్పై ధ్రిల్లర్ ను చదివి ఆనందించాలనుకుంటున్నారా ఐతే ఆలస్యం యెందుకు వెంటనే ప్రవేశించండి.
తెలుగులో ఉన్న బహుకొద్దిమంది మంచి కార్టూనిస్టుల్లో శేఖర్ ఒకరు. ఆయన కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాలపైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి. — ఈనాడు
వామపక్ష భావజాలం అందించిన లోచూపుతో పరిశీలించే శేఖర్ రేఖలు వీక్షకులకు కూడా లోచూపును అందిస్తాయి. — ఇండియా టుడే
Shekar deserves a place among Indian cartoonists. At a time when regional cartoonists do not get enough recognition, ‘Shekar’s book comes as an eye openr. — The Hindu.
సమకాలీన సమాజంలో ఓ కావలిదారుడైన కార్టూనిస్టుగా పారాహుషార్ అంటూ తన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు శేఖర్. — నవ్య.
శేఖర్ కార్టూన్లు నవ్వించేవే కాదు. లోతుగా ఆలోచింపజేస్తాయి కూడా. — ఆంధ్రప్రభ
రాజకీయ నేపథ్యంతో చురకలు వేసే కార్టూన్లను పుస్తక రూపంలో తీసుకు రావడానికి చాలా సాహసం కావాలి. అది శేఖర్ చేసాడు. — వార్త.
పొలిటికల్ కార్టూనిస్టులు మరీ తగ్గిపోతున్న నేటి కాలంలో శేఖర్ లాంటి కార్టూనిస్టులు తమ వర్క్స్ ను పుస్తక రూపంలో తేవడం కొత్తతరానికి కాస్తయినా స్పూర్తిదాయకంగా ఉంటుంది. — ఆంధ్రజ్యోతి.
సమాజాన్ని పట్టిపీడిస్తున్న చీడపురుగులను ఏరిపారేయడానికి, సమాజ మార్పుకోసం నిరంతరం ప్రయత్నిస్తూ అద్భుతమైన కార్టూన్ లు మనకు అందిస్తున్నారు శేఖర్. — ప్రజాశక్తి.
మొహం పై నవ్వు పుట్టించి, గుండె లోతుల్లో ఆలోచన పుట్టించి, మనల్సి మౌనంగా వెంటాడే కవితలే ఈ కార్టూన్లు. ప్రతి తెలుగు వాడు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.
రాజకీయ నేపథ్యంతో చురకలు వేసే కార్టూన్లను చదివి ఆనందించాలనుకుంటున్నారా ఐతే ఆలస్యం యెందుకు
వెంటనే ప్రవేశించండి.