పరిచయం (నండూరి రామమోహనరావు గారు 1964లో వేలుపిళ్ళై కథలకు)

వేలుపిళ్లై On Kinige

సి. రామచంద్రరావుగారి కథలంటే నాకు చాలా ఇష్టం. అవి ఇంకా చాలామందికి ఇష్టం కావడానికి కనీసం ఒక శతాంశమైనా నేను కారణం కావడం నా కిప్పటికీ సంతోషం కలిగిస్తుంది.

రామచంద్రరావుగారిని చూస్తే కథలు రాసేవాడిలా, అందులోనూ తెలుగులో రాసేవాడిలా కనిపించరు. తెలుగు కథలు రాసేవారి కొక ప్రత్యేకమైన తరహా వుంటుందని నా ఉద్దేశం కాదు. అయినా, రామచంద్రరావుగారిలో కథా రచయితను చటుక్కున పోల్చుకోవడం కష్టం. తెలుగును, ఇంగ్లీషును కూడా ఇగ్లీషు యాసతో మాట్లాడే ఆయనను టెన్నిస్ ప్లేయరనో, ఏ టీ, కాఫీ ఎస్టేట్ల మేనేజరనో పరిచయం చేస్తే తేలిగ్గా నమ్మవచ్చు. నిజానికి ఆయన ఈ రెండూ కావడమే కాక, కథా రచయిత కూడా కావడం ఒక విశేషం.

ఈ కథలలో స్థలం తెలుగుదేశం కాదు; పాత్రలు, వాతావరణం తెలుగువికావు. అందుచేత వీటిలో తెలుగుదనం లోపించిందంటే నేనేమీ చెప్పలేను – తెలుగు వాతావరణం వుండటమే తెలుగు కథలకు గొప్పదనం కాదని తప్ప. ఈ కథావస్తువులన్నీ రచయిత తనకు తెలిసిన, పరిచితమైన జీవితంలో నుంచి ఏరుకుని, పరిశీలించి, భావనచేసి రాసినవే. అందుచేత, వీటిలో ఒక నిజాయితీ, ఒక వాస్తవికత వున్నాయి. కనుకనే, అవి సజీవంగా కదులుతున్నట్టు వుంటాయి; మనల్ని కదలిస్తాయి. ఈ గుణ విశేషం, వల్ల అవి నిస్సందేహంగా గొప్ప కథలే. అవి రాసినవాడు తెలుగువాడు కావడం మరొక విశేషం.

ఈ సంపుటిలో అన్నిటిలోకి నాకు నచ్చిన కథ ఏదంటే త్వరగా చెప్పలేను. అన్నీ అన్ని రకాలు; దేని వైచిత్రి దానిదే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా మానవ స్వభావేన్మీలనం చేయడంవల్ల ఈ కథల వైవిధ్యం పఠితలను ఎంతైనా ఆకర్షిస్తుంది. అయినా నిగ్గతీసి అడిగితే, ఈ సంపుటిలోని రెండవ కథను, దానికంటే ముందుగా మొదటి కథను పేర్కొంటాను. మొదటికథ నాకు బాగా నచ్చడానికి కారణం వారపత్రిక పోటీలో మొదటి బహుమతి పొందినదని మాత్రమే కాదు. చదవండి, మీకే తెలుస్తుంది.

రామచంద్రరావుగారు తరుచుగా వ్రాయరు. ఒక కథకు, మరొక దానికి మధ్య చాలా వ్యవధి వుంటుంది. ఇవి మొదట్లో ఆంధ్ర వార పత్రికలో ప్రచురిత మవుతున్నప్పుడు మళ్ళీ ఆయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పాఠకులు పెక్కుమంది వుండేవారు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తోచినప్పుడు ఆయన కథ రాస్తారు. ఉద్యోగ విధులు అడ్డురావడం దీనికి ప్రధాన కారణం కాకపోవచ్చు. ఒకసారి అడిగితే ఆయన చెప్పినట్లు జ్ఞాపకం – మంచి కథావస్తువు దొరికేవరకు, దాని ఎత్తుగడనుంచి ముగింపు వరకు సంవిధానమంతా మనస్సులో స్పష్టంగా రూపు కట్టేవరకు తాను కథ రాయలేనని. ఇది నిజం కావచ్చు. కనుకనే, ఈ కథలలో ఇంత మంచి శిల్పం, వైవిధ్యం సాధించారేమో ననిపిస్తుంది. ఏమైనా, ఈ సంపుటిలోని కథలన్నీ నాలుగైదేళ్ళ క్రిందట రాసినవే. ఆ తరువాత ఆయన కథ రాసినట్టు నాకు జ్ఞాపకం లేదు.

ఎందుకు రాయడం లేదు సి.రా.రావు గారూ?

-నండూరి రామమోహనరావు

విజయవాడ,

14-12-64

వేలుపిళ్లై On Kinige

 

This eBook is now available on Kinige @ http://kinige.com/kbook.php?id=142

Related Posts:

పొగడపూలు (వేలుపిళ్ళై కథలకు ముళ్ళపూడి ముందు మాట)

వేలుపిళ్లై On Kinige

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.

రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.

యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!

నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్… మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.

ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.

రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.

ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం…

కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.

అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.

ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ – టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొడుగు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.

రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.

ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!

ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు…. మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.

గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.

అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం…

-ముళ్ళపూడి వెంకటరమణ.

వేలుపిళ్లై On Kinige

The eBook is now available on Kinige @ http://kinige.com/kbook.php?id=142

Related Posts:

కస్తూరి మురళీకృష్ణ – ‘సౌశీల్య ద్రౌపది’ పుస్తక పరిచయం

సౌశీల్య ద్రౌపది నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేయబడ్డాయి. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకోని రచయత రచించిన నవలిక ఈ సౌశీల్య ద్రౌపది. పురాణ  కథలలొ జీవిత సత్యాలు పొందు పరిచి వున్నాయి. తరచి చూస్తే అనేక అద్భుతమైన మనుల్లాంటి విషయాలు అర్థమవుతాయి, సౌశీల్య ద్రౌపది నవల లొ ఇలాంటి విషయాలు యెత్తిచూపే ప్రయత్నం చేసారు కస్తూరి మురళీకృష్ణ, పురాణాలు ఏ రకంగా  సమకాలీన సమాజానికి ఉపయెగపడతాయొ చూపంచే ప్రయత్నం చేసారు కవి. ముఖ్యంగా కస్తూరి మురళీకృష్ణ సౌశీల్య ద్రౌపది లొ  ‘ద్రౌపది’  పాత్రను ఆదునిక సమాజంలొ మహిళకు ప్రతీకగా చేసి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు, తద్వారా మన పురాణ పాత్రలను ఈనాటి సమాజానికి చేరువ చేసే ప్రయత్ణం చేసారు.

సౌశీల్య ద్రౌపది On Kinige

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

మన సంస్కృతి సంప్రధాయాల సమాహారం మీకు కంప్యుటర్ దూరంలో  కినిగే ఫై

Related Posts:

పసుపులేటి రామారావు – ‘నాటి మేటి సినీ ఆణిముత్యాలు తో ముఖాముఖి ఇంటర్య్వులు’ పుస్తక పరిచయం

నాటి మేటి సినీ ఆణిముత్యాలుతో ముఖా ముఖి ఇంటర్వ్యూలు On Kinige

ఈ పుస్తకంలో చిత్ర రంగానికే తలమానికగా నిలిచిన మార్గదర్శకుల, మహానుభావుల  యెందరివో ముఖాముఖి ఇంటర్య్వులు  వున్నాయి.
సినిమాకు తొలి మెట్టు ఐన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి  మన చిత్ర రంగాన్ని తేజోవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు యెందరివో  ఇంటర్య్వులు ఈ పుస్తకంలో వున్నాయి.

“నాటి మేటి సినీ ఆణిముత్యాలను ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఎన్నో రోజులు శ్రమించి పరిశ్రమకు, పాఠకులకు అందిస్తున్న ఈ నేటి మేటి సినీ ఆణిముత్యాలకు ముందుమాట వ్రాయడం నాకెంతో సంతోషంగా ఉంది”. -డాక్టర్. దాసరి నారాయణరావు.

“అరుదైన, నిజాయితీపరుడైన సినీజర్నలిస్ట్ పసుపులేటి రామారావు గత మూడున్నర దశాబ్ధాలుగా సృష్టించిన అక్షర సంపదను పుస్తకరూపంలో తీసుకువస్తున్నందుకు అభినందనలు”. -కె. చిరంజీవి

“రామారావు వ్రాసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ప్రత్యేకత. పరిశ్రమ బాగోగుల గురించి, మన తెలుగు చిత్రాలకున్న మార్కెట్ పరిమితి గురించి, చిత్రాలలోని కథలు, కథనాల గురించి, వ్యక్తుల సాంఘీక బాధ్యతల గురించి ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంటర్వ్యూలు చేసిన పసుపులేటి రామారావు పరిశ్రమకు, పాఠకులకు ప్రీతిపాత్రం కావాలని కోరుకుంటున్నా”. -మురళీమోహన్

రచయత స్వంత మాటల్లో
ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక కారణముంది. కొంత కాలంగా తెలుగు ఫిలిం జర్నలిజంలోకి ఎందరో యువతీ యువకులు వస్తున్నారు. వాళ్ళంతా గతం గురించి తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవడానికి ఆధారాలు లేవు. కనుక ఈనాటి వ్యక్తుల గురించి, చిత్ర రంగంలోని ఈనాటి పరిస్థితుల గురించి తెలుస్తోంది. ఇప్పుడొస్తున్న వాళ్ళంతా గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. మన చిత్రరంగానికి సంబంధించిన గతమెంతో ఘనమైనది. మొత్తం చలనచిత్ర రంగానికే తలమానికంగా నిలిచిన మార్గదర్శకులు, మహానుభావులు ఎందరో ఉన్నారు. సినిమాకు తొలి మెట్టయిన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్రరంగాన్ని తేజోవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఎందరో వున్నారు. వారి ప్రతిభ కారణంగానే తెలుగు చిత్రసీమ పరిపుష్టితమైందనటంలో సందేహం లేదు.

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

మీ అభిమాన తారల గురించి తెలుసుకోవలనుకుంటున్నార ఒకే ఒక క్లిక్ దూరం లో  కినిగే ఫై

Related Posts:

మల్లాది వెంకట కృష్ణ మూర్తి – ‘అ ఆ ఇ ఈ’ పుస్తక పరిచయం

” మనిషి సాదారనంగా డబ్బు కి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడొ అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లొకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు ఉమ్మెత్త మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఈ పుస్తకం లొ మనషి జీవితం లొ ముఖ్యమైనది ఏంటి, మనిషి జీవితం లొ ధర్మం గా యెలా బ్రతకాలి అని కవి మనకు కతల రూపంలో మనకు చెప్పారు”. ఈ కథలు పాటకులను యంతగానో ఆకర్షిస్తూ ఆలోచింప చేస్తాయి.

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

మీకు కంప్యూటర్ దూరం లో  కినిగే ఫై

అ ఆ ఇ ఈ On Kinige

Related Posts:

ఉగాది మహత్వ కవిత్వ సంపద

ఉగాది మహత్వ కవిత్వ సంపద On Kinige

ఉగాది అంటేనే కవిత్వం. ఉగాది కోయిలకు, మామిడి చిగురులకు, కవులకు, కవి సమ్మేళనాలకు ప్రసిద్ధి. ఈ ఉగాది పర్వదినాన మీరు ఇప్పుడు మహత్వ కవిత్వ సంపదల్లో ఓలలాడవచ్చు. నలబై శాతం పైబడి డిస్కౌంట్ తో తొమ్మిత అపురూప కవితా పుస్తకాలను మీకు ఈ ఉగాది కానుకగా కినిగె సమర్పిస్తుంది. ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఆలసించిన ఆశాభంగం! ఒక్క నొక్కుతో తొమ్మిది కవిత్వ పుస్తకాలు కొనండి, లేదా మీ కవి మితృలకు గిఫ్ట్‌గా ఇవ్వండి.

Related Posts:

తనికెళ్ళ భరణి – ‘నక్షత్ర దర్శనం’ పుస్తక పరిచయం

నక్షత్ర దర్శనమ్ On Kinige

తనివితీరా
తారాతీరాన చేరిన
తన్మయత్వాన…
‘తెర’ మరుగైనా, తరతరాలకాదర్శమైన
తపనగా… ఇలా ‘నక్షత్రదర్శనమైన’
తళుకు చెణుకులివి!
తెరలు తెలరలుగా
తరలి వచ్చిన స్మృతి పరిమళాలివి!!

ఉచిత ప్రివ్యు దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

తనికెళ్ళ భరణి రాసిన పుస్తకాలలో ఈ నక్షత్రదర్శనం ఎంతో ఆదరణ పొందింది, ఈ పుస్తకం లో ఎన్నో మధురమైన కవితలు దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి

Related Posts:

మిసిమి ఏప్రిల్ 2011 సంపాదకీయం

మిసిమి – ఏప్రిల్ 2011 On Kinige

గడచిన దశాబ్దంలోని వివిధ సారస్వత ప్రక్రియల పరిశీలన చేయాలని సంకల్పించి రచయిత లెందరినో అడిగాము. మొదటగా కవిత్వధోరణులు గూర్చి తమ అమూల్యమైన పరిశీలనా వ్యాసాలను అందించిన వారు వేగుంట మోహనప్రసాద్. మొదటి భాగం ఈ నెల ప్రచురిస్తున్నాము.

‘నటరత్నాల’ను తెలుగువారికి అందించిన నటరత్నం మిక్కిలినేని అన్ని జానపద కళారూపాల సమాహారం! వారి నిష్క్రమణకు నివాళి.

తెలుగు పాఠకుల, ప్రేక్షకుల మనసుల్లో నవ్వుల జల్లులు కురిపించిన ముళ్ళపూడి వెంకటరమణ ‘కోతి కొమ్మచ్చి’ ఆటలో ఎటో వెళ్ళిపోయారు.

తన అనుభవాలను, ఆలోచనలతో రంగరించి, ఊహలతో రంగులద్ది సార్వజనీనత సాధించిన బషీర్ తన కథలను వినోద సమాసాలుగా పాఠకులకు అందించారు.

ఉగాది వచ్చింది, ఎన్నో సమస్యలతో. సమస్య లేకపోతే పరిష్కారమూ ఉండదు కదా! ఇల్లు వదినిల దగ్గరనుంచి మళ్ళీ ఇంటికి చేరేవరకు కనపడని శత్రువుతో పోరాటం సాగిస్తూ అలసిపోతున్న సగటుమనిషికి పండగ రోజే కాస్త ఊరట!

మే నెల సంచిక ‘బుద్ధ జయంతి’ ప్రత్యేకం. బౌద్ధతత్వాన్ని, సాహిత్యాన్ని ఆకళింపు జేసుకుని తెలుగులో సరళంగా తెలియజేయగలిగిన రచనలు ప్రచురిస్తామని తెలియజేస్తూ ఈ దిశగా రచనలు పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

– సంపాదకులు మిసిమి – ఏప్రిల్ 2011 On Kinige

 

This wonderful magazine is now available for just 30Rs in Digital format on Kinige. Click on above thumbnail for more details.

Related Posts: