వారాంతపు ప్రత్యేక 50శాతం తగ్గింపు – తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు

 

Weekend special offer on Talisetti Ramarao , Telugu first cartoonist book.

Visit now @ http://kinige.com/koffer.php?id=23

About the book:

వారాంతపు ప్రత్యేక 50శాతం తగ్గింపు – తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు On Kinige

ఈ సంకలనం అపూర్వమైనది.

-ఎ.బి.కె.

తెలుగు కార్టూన్ పితామహుడు

-హెచ్. రమేష్ బాబు

తెలుగువారిలో పత్రికాముఖంగా సుపరిచితుడైన తొలి కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు. ఆంధ్రపత్రికలో అసంఖ్యాకంగా వ్యంగ్యచిత్రాలు వేశాడు. ఆనాడివి బహుళ ప్రజాదరణ పొందాయి. తలిశెట్టి రామారావు హాస్యం – వ్యంగ్యం సున్నితమైనవి. ….

-చలసాని ప్రసాదరావు

తలిశెట్టి వారి కూర్టూన్లు పరిశీలిస్తే ఒక నిఘంటువు రాయొచ్చునేమో ననిపించింది. వారి కార్టూనుల్లో అంత సత్తా వుంది. ….

-కార్టూనిస్ట్ జయదేవ్

ఎనభైఏళ్లనాడు వీటిలో ఎంతో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండి ఉండాలి. జనం విస్తుపోయి నవ్వలేక చచ్చి ఉండాలి.

-మోహన్. ఆర్టిస్ట్, కార్టూనిస్ట్

కార్టూనింగ్ ఒక ఆల్కెమీ; ఒక మార్మిక విద్యేమో అని అనిపిస్తోంది. రసవాదం తెలిసినవాడే క్షుద్రలోహాల్ని బంగారం చేయగలిగినట్టు. ఆమర్మం తెలిసినవాడే వేయగలడేమో అనిపిస్తుంది. తలిశెట్టి రామారావు గారి కూర్టూన్లు చూస్తే. తెలుగునాట రామారావు గారు ఒక అద్భుతం. "ఇలాంటి విషయాలపైన కూడా కార్టూన్లు వేయవచ్చా?" అని అబ్బురపడతాం ఆయన కార్టూన్లు చూశాక.

-శ్రీధర్. ఈనాడు కార్టూనిస్ట్

మార్గదర్శకుడు ఈ తలిశెట్టి రామారావు.

-సురేంద్ర. ది హిందూ కార్టూనిస్ట్

ఎప్పుడో 1930లోనే గీసిన కార్టూన్లు 2011లో కూడా అవి ఇప్పటికీ కాంటెంపరరీ కార్టూన్లుగానే అనిపించాయి.

-శంకర్. కార్టూనిస్ట్ సాక్షి డైలీ.

జై తలిశెట్టి… జై తెలుగు కార్టూన్…

-శేఖర్. కార్టూనిస్ట్, ఆంధ్రజ్యోతి డైలీ.

ఇంత అపురూపమయిన ఈ బొమ్మలు, ఈ శైలీ, ఈ వాస్తవికత అప్పటితరం వారి ఆలోచనా శైలిగా దొరకడం మన అదృష్టం.

-బాలి

తెలుగు వ్యంగ్య చిత్రకారుల్లో తొలిశెట్టి రామారావు తలిశెట్టి.

-బాపు

మాట్లాడే బొమ్మలు

-శ్రీరమణ

తెలుగు కార్టూన్ పితామహుడు తలిశెట్టి.

-కళాసాగర్

ఆరుద్ర – కూనలమ్మపదాలు
చిలిపి కుంచెను పట్టి
శ్రీకారమును చుట్టి
నవ్వించె తలిశెట్టి
ఓ కూనలమ్మా!

Related Posts:

గమనం

రచయిత సత్యభాస్కర్ రాసిన కథల సంపుటి గమనం. రచయిత ఓ ప్రభుత్వరంగ పరిశ్రమలో పనిచేస్తుండడం వలన చాలా కథలలోని ఇతివృత్తం ఫాక్టరీలు, అక్కడి వాతావరణం, ‘ పెద్దసార్లు’, వారి లీలలు, సూపర్‌వైజర్ల గూఢచర్యాలు, యూనియన్లు, ఎన్నికలు, మొదలైన వాటి చుట్టూ తిరుగుతుంది. ఇందులో చాలా కథలను కార్మికుల కోసం ఉద్దేశించిన పత్రిక కోసం రాసినా, అవి మాములు పాఠకులని సైతం చివరిదాక చదివిస్తాయి.

ఈ సంకలనంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

ముందడుగు” కథలోని ఆడపిల్లలు తమ చిన్నతనంలో తండ్రి పురుషాహంకారంతో ప్రవర్తిస్తే ఎదురు చెప్పలేరు, ఓ స్నేహితురాలి సాయంతో కొత్తగాలి పీల్చుకోడానికి చేసే ప్రయత్నాలను తండ్రి అడ్డుకుంటాడు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఆ స్నేహితురాలి సాయంతోనే ఆ కుటుంబంలోని మరో అమ్మాయి తన భర్తతోను, కూతురితోను కలసి జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తుంది

ఆర్ధికావసరాలు ఎక్కువగా ఉన్న ఓ కార్మికురాలిని యజమాని కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేసి, ఓ ఆదివారం పూట ఆయనగారు ఉండగా డ్యూటీ పడేట్లు చేస్తుంది ఆమెపై అజమాయిషీ చేసే మరో మహిళ. అయితే, తోటి కార్మికురాలికి తన గోడు వెళ్ళబోసుకుంటే, సాటి కార్మికురాళ్ళతో కలసి వారంతా పెద్దసారుని చితక్కొట్టి, ఆమెకి క్షమాపణ చెప్పిస్తారు. ఆయనకి మొదటిసారిగా పనివాళ్ళంటే వణుకు పుట్టిన విధానాన్ని చెబుతుంది “ఎర్ర కలువలు” కథ.

తమ ఫాక్టరీని అక్రమంగా లాకౌట్ చేస్తే, తన భవిష్యత్తుని తలచుకుని బెంగపడతాడు ప్రభాకరం. లాకౌట్ త్వరగా ముగిసి పని మొదలైతే బాగుండని అనుకుంటాడు. కానీ యాజమాన్యం దిగిరావడం లేదు, కార్మికులు పట్టువీడడం లేదు. తన కన్నా తక్కువ జీతం ఉన్న కార్మికులు తాడో పేడో తేల్చుకోవాలనుకుంటుంటే ప్రభాకరం మాత్రం భయపడతాడు. రాములు అనే కార్మికుడు పోరాడుతునే కూరగాయలు అమ్మడం, తన భార్య, తోటి ఉద్యోగి భార్య రెడీమేడ్ వస్త్రాలు కుట్టివ్వడానికి అంగీకరించడం, పెద్ద కూతురు ట్యుటోరియల్ కాలేజిలో క్లాసులు తీసుకుని ఆర్ధికంగా భరోసా కల్గించడం వంటి చర్యలతో ప్రభాకరంలోనూ ధైర్యం వస్తుంది. “పరిష్కారం” కథ చివరి దాక చదివిస్తుంది.

కుంచెవాడు” ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఫాక్టరీ వర్కర్ కథ. బ్రతుకు తెరువు కోసం ఇళ్ళకి సున్నాలు వేసుకుని జీవిస్తూంటాడు. వేరే ఫాక్టరీ ఉద్యోగి ఇంట్లో సున్నం వేయడానికి పిలిస్తే, బేరం కుదరదు, వాళ్ళ బావమరిది మాట తూలితే, సున్నం వేసే వ్యక్తి “నేనూ ఒకప్పుడు మీలాంటి ఫాక్టరీ వర్కర్‌నే అని చెబుతాడు. ఆ క్షణంలో అతని పట్ల తృణీకార భావంతో ఉన్న ఇంటి యజమాని అతను అడిగిన మొత్తానికే సున్నం వేయించడానికి అంగీకరిస్తాడు. కార్మికుల మధ్య ఉండే సౌభాతృత్వాన్ని తెలియజేస్తుందీ కథ.

ఉద్యమంలో పనిచేసే భార్యభర్తలు పార్టీ కోసం చెరో దిక్కుకీ పోతే, వారికి పుట్టిన బిడ్డ వేరే వారి దగ్గర పెరుగుతాడు, బాగా చదువుకుంటాడు. కానీ అతను కూడా….విప్లవ ఉద్యమానికి ఊతం ఇవ్వసాగాడు. ఈ కుటుంబం కథే “గమనం” .

తాను ఫాక్టరీలో చేసే పనంత పనీ ఇంట్లో తన భార్య చేస్తుందని గ్రహించిన వ్యక్తి తన అలవాట్లు మార్చుకుని వంటింటి పనిలో భార్యకి సాయం చేయడం మొదలు పెడతాడు. సామాజిక ప్రయోజనం ఉన్న కథ “కష్టజీవి“.

కార్మిక సంఘాల ఎన్నికలలో వస్తున్న మార్పులను, చోటు చేసుకుంటున్న అవినీతిని వర్ణిస్తూ, కార్మికులు ఎలా మసలుకుంటే వారికి ప్రయోజనకరంగా ఉంటుందో చెబుతుంది “చైతన్య పథం” కథ.

ఒకప్పుడు ఆత్మాభిమానంతో బ్రతికిన రైతు, సర్వం కోల్పోతే ఏమవుతాడో తెలుసుకోవాలంటే.. “రోడ్డున పడ్డ మనిషి ” కథ చదవాలి.

ఈ పుస్తకంలో మొత్తం 15 కథలున్నాయి. “జీవితం పట్ల ప్రేమ, మనిషి పట్ల విశ్వాసం, జీవనం పట్ల అచంచలమైన నమ్మకం ఈ కథానికలకు శక్తి సంపన్నతలో పాటు సాహిత్యపు విలువలు అందించాయని” ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. జనమిత్ర ప్రచురణలు ఈ కథాసంపుటిని నవంబరు 2010 ప్రచురించారు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల 67/- రూపాయలు. నెలకి 30/- రూపాయల అద్దెతో ఈ కథల సంపుటిని చదువుకోవచ్చు.

గమనం-కథల సంపుటి On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

రూపాయి చెట్టు

సుప్రసిద్ధ రచయిత సలీం రాసిన కథల సంకలనం ఇది. ఆయన సాహిత్య స్వభావం మానవతావాదం. మానవ సంబంధాలలోని మంచినీ, చెడుని, కథలుగా మలుస్తారు. వాదాల జోలికి పోని రచయిత సలీం. మనిషే ఆయన వస్తువు.

ఓ వ్యక్తి హైదరాబాద్ నగరంలో స్థలం కొనుక్కుని, కొంత ప్రదేశంలో ఇల్లు కట్టుకుని, ఖాళీ స్థలం మొక్కలు పాతుతాడు. కాలం గడిచేసరికి అదో చిన్న తోటలా మారుతుంది. తన పిల్లల్ని ఎంత శ్రద్ధగా, ప్రేమగా పెంచాడో, ఆ మొక్కలనీ అట్లాగే పెంచాడు. కాని పిల్లలు పెద్దవాళ్ళై బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడ్డాక, వాళ్ళకి డబ్బు జబ్బు చేస్తుంది. తల్లిని ఒత్తిడి చేసి తండ్రితో బలవంతంగా ఆ ఇల్లు స్థలం అమ్మించి, వచ్చిన డబ్బులో వాళ్ళిద్దరూ చెరో ఇరవై లక్షలు తీసుకుని తండ్రికి ఓ అపార్ట్‌మెంట్ కొనిచ్చి, మిగిలిన డబ్బు బ్యాంకులో వేసి వెళ్ళిపోతారు. మొక్కల మీద, తోట మీద మమకారం వదులుకోని తండ్రి గుండె నొప్పి తెచ్చుకుంటాడు, స్వచ్ఛమైన ఆక్సీజన్ కొనుక్కోవలసి వస్తుంది. “అమ్మకానికి ఆక్సీజన్” కథ హృద్యంగా ఉంటుంది.

ఓ బాల మేధావి బాల్యానికి అతని తల్లిదండ్రులు ఏ విధంగా నాశనం చేసారో “బోన్సాగి” కథ చెబుతుంది. తోటి పిల్లలతో ఆటపాటలకి దూరమై, తన కన్నా పెద్దవారి ఎగతాళికి గురైన ఆ బాలుడి మనసు విలవిలలాడిపోతుంది.

జీవితంలోని మూడు చలికాలాల్లో ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరుని చెబుతుంది “మూడు చలికాలాలు” కథ. బాలుడుగా ఉన్నప్పుడు చలికాలంలో తల్లి పొద్దున్నే లేచి చలికి వణికిపోతు ఇంటి పనులు చేసుకోడం చూసి తల్లి మీద సానుభూతి చూపిస్తూ, అమ్మకి సాయం చేయనందుకు నాన్నని తిట్టుకుంటాడు. అదే బాలుడు పెరిగిపెద్దయ్యాక, పెళ్ళి చేసుకున్నాకా, చలికాలంలో తన భార్యకి ఎలాంటి సాయం చేయడు. భార్యకి లోకువై పోతానని భావిస్తాడు. అదే వ్యక్తి ముసలాడయిన తర్వాత తన లోపాన్ని గ్రహించి చలికాలంలో కోడలికి సాయం చేస్తాడు.

కాలువలో కొట్టుకొచ్చే శవాల మీద బంగారాన్ని దోచుకుని దానితో జీవితాన్ని గడిపేసే వ్యక్తి కోటేశు. పెళ్ళయిన చెల్లెలు కట్నం పూర్తిగా ఇవ్వలేని కారణంగా పుట్టింటికి తిరిగొచ్చేస్తుంది. వేరే ఏ పని చేయని కోటేశు చెల్లెల్ని కాపరానికి పంపలేడు. తను చేసే పని దుర్మార్గమైనదని తెలిసినా గత్యంతరం లేక దానినే కొనసాగిస్తుంటాడు. ఓ రోజు నీటిలో ఓ శవం కొట్టుకు రావడం కనిపిస్తుంది, సంతోషపడతాడు. ఆ శవం మీద ఏదైనా బంగారం ఉంటే దాంతో తన చెల్లెల్ని కాపురానికి పంపేయచ్చని ఆశ పడతాడు, గబగబా ఈదుకుంటూ వెళ్ళి బోర్లా పడున్న శవాన్ని తన వైపుకు తిప్పుకోగానే…..ఆ శవం తన చెల్లిదని గ్రహిస్తాడు. హృదయ విదారకంగా ఉంటుంది “లాకులు” కథ.

వైద్యం ‘సేవ’ నుంచి ‘వ్యాపారం’గా మారిపోడాన్ని, రోగులు డాక్టర్ల కంటికి వంద రూపాయల నోట్లు గుత్తులు గుత్తులుగా పూసిన పూల చెట్టులా కనిపించడాన్ని “రూపాయి చెట్టు” కథలో వర్ణించారు.

మందుల తయారీ కంపెనీల మాయాజాలానికి అమాయకులు, నిరక్ష్యరాశ్యులు అయిన పేదవారు ఏ విధంగా బలైపోతారో “వలయం” కథ చెబుతుంది.

నిజమైన మానవత్వం అంటే ఏమిటో నిరూపించిన వ్యక్తి కథే “వామనుడు”. అప్పటి దాక తన మిత్రులు వారి బిడ్డల గొప్పతనాన్ని వర్ణించి చెబుతుంటే, తన బిడ్డని తలచుకుని కించిత్ న్యూనతకి గురైన ఓ తండ్రి సమజాంలో హోదాలు సంపాదించేలా పిల్లల్ని పెంచడం కన్నా, వారిని మానవత్వం ఉన్న మనుషులుగా పెంచడమే గొప్పని గ్రహిస్తాడు.

ఓ వ్యక్తి నిర్జీవమైన శిధిల కళాఖండాల వెంటబడి, సజీవురాలైన మాతృమూర్తిని వృద్ధాశ్రమంలో పడేసిపోతాడు. ఆమె గురించి పట్టించుకోడు. తల్లి చనిపోయిందని చెప్పడానికి వచ్చిన ఆశ్రమం వ్యక్తిని ఎవరిలానో పొరబడి మర్యాదలు చేసి తన సేకరించిన పురాతన వస్తువులన్నింటినీ చూపుతాడు. చివరికి విషయం తెలుసుకున్నాక, తను సేకరించిన ఆ విగ్రహాల మధ్య తనూ ఓ నల్లని విగ్రహంగా నిలబడిపోతాడు. “శిధిల శిల్పాలు” కథ హృదయాన్ని బరువెక్కిస్తుంది.

ఉత్సాహవంతుడైన ఓ ముస్లిం నటుడు తమ వర్గం వారిలో అవగాహన పెంచేందుకు వారి ఆర్ధిక సాంఘిక సమస్యలపై ఓ నాటకాన్ని వేయాలనుకుంటాడు. సహనటిగా తన భార్యతో కలసి నాటకానికి సిద్ధమవుతాడు. నాటకంలో ఓ సన్నివేశంలో భాగంగా మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అని అంటాడు. నాటకం చూస్తున్న ప్రేక్షకులలో ఉన్న పెద్దలు, ఖాజీ వారిద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నట్లు నిర్ణయిస్తారు. ఏ నాటకం వల్ల తోటి ముస్లింలకు ప్రయోజనం కలగాలని కోరుకున్నారో అదే నాటకం వలన తమ జీవితాలు చీకటిమయం అవుతాయని ఆలోచించలేకపోయిందా జంట. చివరికి భార్యాభర్తలిద్దరూ ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తారు. “తలాక్” కథ ఆలోచింపజేస్తుంది.

” ఆరో అల్లుడు” కథ కూడా ముస్లిం జీవితాలకి సంబంధించినదే. డబ్బువస్తుందని ఆశపడి చిన్నపిల్లని దుబాయ్ షేక్‌కిచ్చి పెళ్ళి చేసి పంపేసి, ఆ తర్వాత అక్కడ్నించి ఆ అమ్మాయి కబుర్లు తెలియక, విలవిలలాడిపోతారు. చివరికి చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి నుంచి ఉత్తరం వస్తుంది “నాన్నా మీకు ఆరో అల్లుడు” అని మాత్రమే రాసుంటుంది.

జల్లెడలోంచి జారిన నూక ప్రభుత్వోద్యోగులుగా మిగిలిపోయి – జల్లెడలో మిగిలిన నాణ్యమైన గింజలు ప్రైవేటు సంస్థల పరవవడాన్ని “నూకలు” కథలో వివరిస్తారు.

నిరుద్యోగులతో ఆటలాడుకునే గోముఖవ్యాఘ్రాల నిజస్వరూపాన్ని “భవదీయుడు” కథ తెలియజేస్తుంది. చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ కథ అమాయక నిరుద్యోగుల పట్ల సానుభూతిని కలిగిస్తుంది.

ఒంటరితనమే తన జబ్బని తెలుసుకోలేని ఓ ముసలి తండ్రి తనకి ఏవేవే జబ్బులున్నాయని భ్రమపడుతూ ఓ కుర్ర డాక్టర్‌ని వేధిస్తూంటాడు. ఓ సారి గుండె నొప్పి అంటూ వస్తాడా ముసలాయన. ఒంటరితనమే ఆయన జబ్బని గ్రహించిన డాక్టరు కొడుకు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపొమ్మని చెబుతాడు. తన కొడుకు కూడా డాక్టరేనని చెబుతూ… వేరెవరితో మాట్లాడిన కొడుకుతో మాట్లాడినట్లు ఉండదని, రెండు మూడు రోజులకి ఈ డాక్టరుతో మాట్లాడే కొన్ని నిముషాలే తనకి గుండె నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తాయని అంటాడాయన. ” పిడికెడు గుండె” కథ చదువరులను కదిలిస్తుంది.

ఏ బంద్ జరిగినా, ఏ ఉద్యమం జరిగినా ముందుగా బలయ్యేవి ఆర్టీసీ బస్సులేనని చెబుతూ, ఓ బస్ చేత తన కథ చెప్పిస్తారు “చేతులుంటే ఎంత బావుణ్ణు!” కథలో. ఈ కథ చదివి బస్‌లపై దాడి చేసేవారిలో ఒక్కరైనా మారితే ఎంతో బాగుంటుంది.

“ఆశ్రమం” కధ గురించి చెప్పడం కంటే చదవడమే బావుంటుంది.

ఇరవై కథలున్న ఈ సంకలనం చదువరులను ఏ మాత్రం నిరాశపరచదు.

ఈ సంకలనాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 2004లో ప్రచురించారు. ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. వెల 90 రూపాయాలు. ఈ పుస్తకాన్ని నెలకు 30 రూపాయల అద్దెతో కూడా చదువుకోవచ్చు.

రూపాయి చెట్టు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

శ్యామ్‌యానా

మెడికో శ్యామ్‌గా సుప్రసిద్ధులైన డా. చిర్రావూరి శ్యామ్ రాసిన కథల సంకలనం ఇది. “సాహిత్య కుటుంబంలో జన్మించిన శ్యామ్ చిన్ననాటి నుంచే గొప్ప సాహితీపరుల సాంగత్యంలో పెరిగారు. తండ్రీ, రోణంకీ, చాసో…వంటి వారి మాటలు….వాదనలు…. ఇంటినుండా ఉన్న ఉత్తమమైన పుస్తకాలు – వీటన్నింటికీ తోడు గొప్ప ధారణా శక్తితో శ్యామ్‌లో రిఫ్లెక్టివ్ థాట్‌కి పునాది పడింది” అని అంటారు ఈ కథల గురించి, కథకుడి గురించి రాసిన చాగంటి తులసి గారు.

రచయిత మెడికో అయినప్పటికీ, ఈ సంకలనంలో వైద్యం, ఆసుపత్రి, రోగుల నేపధ్యంలో అల్లిన కథలు తక్కువే. ఈ పుస్తకంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

మధ్యతరగతి మనస్తత్వాలను, ఓ ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ క్రిందటి మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని ” ఇదీ మా కథ“లో చక్కగా చిత్రించారు.

తేడా” అనే చిన్న కథ సరదాగా ఉంటుంది. చురుక్కుమనిపిస్తుంది.

గీతలు” కథలో ప్రేయసికి తనకిష్టమైన హిందీ పాటలు వినిపించాలనుకుంటాడు ప్రియుడు. ప్రేయసికేమో తెలుగు పాటలిష్టం. ఏవేవో మాట్లాడనుకుంటాడు ప్రియుడు, కానీ వారు కలిసినప్పుడు ఆ సమావేశం – ఇద్దరు మేధావులు పావుగంట సేపు కలుసుకున్నంత మౌనంగా ఉంటుంది. ప్ర్రేమంటూ అమ్మాయిల వెంట పడేవారి మనస్తత్వాన్ని ఈ కథలో వివరించే ప్రయత్నం చేసారు రచయిత.

రామం ఇంజనీరింగ్ పాసయి ఉద్యోగం చేస్తూ, పెళ్ళికి సిద్ధంగా ఉంటాడు. పెళ్ళిచూపుల కోసం ఓ పల్లెటూరు వెడితే, అక్కడ అతన్ని స్వాగతించడానికి కాబోయే పెళ్ళికూతురు రాధే స్వయంగా వచ్చేసరికి రామం ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరూ నడుస్తూ రాధ వాళ్ళింటికి బయల్దేరుతారు. రాధ ఆధునిక యువతని, ఆమె ఇష్టాలు, తన ఇష్టాలు కలవవని రామం అర్థం చేసుకుంటాడు. ఇల్లు చేరాక, రాధ కుటుంబ సభ్యులతో పరిచయాలవుతాయి. అందరూ అతనిని ఆకట్టుకుంటారు. ” నాకు ఆంధ్ర వనిత కావాలి గానీ, ఆధునిక వనిత కాదని ఎలా చెప్పడం?” అని రామం తటాపటాయిస్తాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే “వేయబోవని తలుపు” కథ చదవాల్సిందే.

వారిజాక్షులందు” కథలో రైలు ప్రయాణంలో జరిగే పదనిసల్ని హాస్యంగా వివరిస్తారు రచయిత. ప్రయాణంలో ఆడ మగల మధ్య అనవసరంగా సాగే సంభాషణల పట్ల చిరాకు వ్యక్తం చేస్తారు. ‘ అసలెందుకు వారిజాక్షులందు కుర్రాళ్ళు చిత్తం చిత్తం అంటారో ‘ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ‘ చిత్తం చిత్తమే ‘నని నవ్వుతారు. ఈ కథలోని ఓ వాక్యం ‘ రైల్లో పరిచయాలు రైల్లోనే. రైల్లో లవ్ అంటే సినిమాల్లో హర్షిస్తారేమో గానీ బైట తంతారు…. ‘ చాలా వాస్తవికంగా ఉంటుంది.

‘మనుషుల మీద నమ్మకం లేకపోతే జీవితం జిడ్డుగా అయిపోతుంది. స్మూత్‌నెస్ నశిస్తుంది’ అని అంటారొకరు. ఎందుకు? ఏ సందర్భంలో అలా అనాల్సివచ్చిందో తెలుసుకోవాలంటే “సన్నాయి పాట” కథ చదవాలి.

‘కొందరు ముందు సంపాదిస్తారు, కొందరు వెనుక. కొందరు ఎక్కువ సంపాదిస్తే మరికొందరు తక్కువ.. కొందరు న్యాయంగా, కొందరు అన్యాయంగా… ఏది కావలిస్తే అది ఎన్నుకో. దేని సుఖాలు దానివి, దేని కష్టాలు దానివి’ అంటారు రచయిత “సరాగమాల” కథలో.

‘ప్రతీ విషయానికి కదిలీ, అసంతృప్తి స్థితిలో, అసహాయ స్థితిలో, క్షణక్షణం స్ట్రెస్‌కి స్టెయిన్‌కీ లోనౌతూ ఏదో చేయాలని తెలిసినా ఏం చేయాలో తెలీక ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న యువతీయువకుల కథ “హంతకుడి కథ“.

‘మనుషులు ఎందుకు వాళ్ళ తెలివితేటలని చూపాలని ప్రయత్నిస్తారు?’ అని అడుతుతూ, ‘బ్రిలియన్సీ మస్ట్ బీ ఎపారెంట్, బట్ నాట్ టు బీ ఎక్టివేటెడ్’ అని అంటారు “ముక్కు పుడక” కథలో. ఓ అతివ అతిశయం గురించి చెబుతుందీ కథ. ఓ వైద్యుడు ఆసుపత్రిలో వివిధ రోగులతో ప్రవర్తించే తీరుని తెలియజేస్తుందీ కథ.

క్రేన్” అనే చిన్న కథని చదువుతుంటే, అందులోని వ్యంగ్యానికి మన ముఖంపై చిరునవ్వు కదలాడుతుంది.

ఉత్తమ రచనలు ఉన్నాయా లేవా అంటూ ఈనాడు మనం వాపోతున్నట్లే, దాదాపు ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ క్రితం రచయిత కూడా వాపోయారు. ‘ నీకు చూడాలని ఉండాలే గాని ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తుంది ఉత్తమ రచన. మనం గ్రహించడంలో ఉంటుంది’ అంటారు రచయిత “నత్తివాడి కథ“లో. నత్తితో ఆత్మన్యూనతకి గురైన ఓ వ్యక్తి పుస్తకాలతో స్నేహం చేస్తాడు. రేడియో వినడం అలవాటైన అతనికి రేడియోలో మాట్లాడేవారిలో చాలామంది అనేక పదాలను సరిగా పలకలేకపోతున్నారని అర్థమవుతుంది. ‘నాకు తెలిసినా పలకలేను’ అనుకుంటాడు. ఆర్ద్రత నిండిన కథ ఇది.

కథకుడి కథ” లోని ఘటనలు దాదాపుగా అందరు రచయితలకు ఎదురయ్యేవే.

లీవిట్” కథ తాము సంస్కారవంతులం అనుకునేవారి సంస్కారాన్ని బయటపెడుతుంది.

సాహిత్యం కథ” లో రచయిత వర్ణించిన పరిస్థితులు ఈనాటికీ కొనసాగుతునే ఉన్నాయి. ‘సాహిత్యం కూడా బురఖావే’ అయిపోయిందని వాపోతూ, ఎక్కడో సుదూర సీమలో సాహిత్యాన్ని జీవితం కంటే విలువైనదిగా భావిస్తూ, సాహిత్యాన్ని పీలుస్తూ, సాహిత్యాన్ని జీవిస్తూ, ప్రపంచం దృష్టిలో పడని వారి కోసం రాసిన కథ ఇది.

కట్నం తీసుకోడాన్ని ఇద్దరు ప్రేమికులు ఎలా సమర్థించుకున్నారో, ఎంత గడుసుగా ప్రవర్తించారో తెలుసుకోవాలంటే “డౌరీ హౌ మచ్” కథ చదవాలి.

కుష్టు వ్యాధిగ్రస్తుడు బస్ ఎక్కితే, అతన్ని ఆ బస్ ఎక్కేందుకు అనుమతించినందుకు తోటి ప్రయాణీకులు విసుక్కుంటారు, ఆ ప్రయాణం చేయాల్సివచ్చినందుకు తమని తాము నిందించుకుంటారు. అయితే అదే బస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ వ్యాధి అంత ప్రమాదకరం కాదని, సరైన మందులు వాడితే తగ్గిపోతుందని బిగ్గరగా అరచి చెప్పాలనుకుంటాడు. కానీ ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోతాడు. అప్పటి దాక తనని తాను – రోగుల వ్యధని గుర్తించగలిగే వైద్యునిగా ఊహించుకున్న అతను కూడా ఓ రోగే. గొంతు కాన్సర్ కారణంగా అతని స్వరపేటిక తొలగించబడింది. “సాటి మనిషి కష్టాలు అర్థం చేసుకోడానికి నువ్వు అలాంటి కష్టాన్ని పడివుండాలి అనే సత్యాన్ని చెబుతున్నట్లుగా రెండు కన్నీటి చుక్కలు రాలి నేల మీద పడతాయి. “వెన్నెల సోన” అనే కథ చదవండి.

ఈ కథలను రచయిత 1971/72 నుంచి 1979 మధ్యలోనూ, ఐ.సి.సి.యు అనే కథని 1981-82 మధ్యకాలంలోను రాసారు. వీటిని ఓ సంకలనంగా తెచ్చే ప్రయత్నం 2010 నాటికి సాధ్యమైంది. ఈ కథా సంకలనాన్ని జులై 2010లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు.

మంచి కథలున్న ఈ శ్యామ్‌యానా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది
శ్యామ్‌యానా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

రన్ ఫర్ ది బోర్డర్ Run For the border

 

రన్ ఫర్ ది బోర్డర్

(షాడో స్పై థ్రిల్లర్)

రచన:

మధుబాబు


© Author

© Madhu Baabu

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.

సర్వ హక్కులూ రక్షించబడ్డాయి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior written permission of the author. Violators risk criminal prosecution, imprisonment and or severe penalties.


రన్ ఫర్ ది బోర్డర్

ఫెళ ఫెళా రావాలు చేస్తూ పైకి లేచాయి అగ్నిజ్వాలలు. సుడులు తిరుగుతూ గాలిలో కలుస్తున్నాయి నల్లటి పొగలు. ఎర్రటి నాలుకల్ని విరజాచి కనిపించిన వస్తువు నల్లా మాడ్చి మసి చేస్తున్నాడు అగ్నిదేవుడు. హాహాకారాలు చేస్తూ ఆ మంటలమీద కలబడుతున్నారు హమీర్ పురపౌరులు.

“నారాయణ్ సాబ్ బయటకి రండి నారాయణ్ సాబ్ ’’ అన్న అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి దిక్కులన్నీ.

గాఢ నిద్రలో వున్న నారాయణ్ వులిక్కిపడి లేచి కూర్చున్నాడు. గదినిండా ఆవరించుకున్న పొగలను చూసేసరికి అతనికి మతిపోయింది. గబగబా లేపాడు భార్యను. పక్కగదిలో కూతుళ్ళను మేల్కొలిపి బయటికి వచ్చాడు.

ఉన్నట్లుండి దురుసుగా వీచటం ప్రారంభించింది ఈదురుగాలి. మరో పది గజాల ఎత్తుకు లేచాయి మంటలు. భవనం మొత్తం వాటి బారిన పడింది. ఖణేల్ ఖణేల్ మంటూ పగులుతున్నాయి కిటికీలకు వున్న కొయ్య పలకలు.

మంటల్ని ఆర్పటానికి ప్రయత్నిస్తున్న హమీర్ పురాపౌరులకు, అది అసాధ్యమైన పనిగా తోచింది. పైకి లేచిన మంటలు ఎర్రటి నిప్పురవ్వల్ని నలుదిక్కులకు విరజిమ్ముతున్నాయి.

గోలుగోలున ఎడుస్తున్న భార్యను ఎడమ చేత్తో గుండెలకు అదుముకుని, కుడిచేత్తో పెద్దకూతుర్ని సందిట యిముడ్చుకుని రాతిబొమ్మలా నిలబడి వున్నాడు నారాయణ్. కట్టుబట్టలతో బయటకి వచ్చాడతను. అతని సర్వస్వం ఆ యింట్లో వున్నది- అగ్నిదేవుడికి ఆహుతి అవుతూ.

మిగిలిన యిళ్ళు మంటలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం. ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయటం జరిగింది. అది వచ్చే సూచనలు కనిపించటం లేదు.

ఉన్నట్లుండి అందరి దృష్టి మంటలకు ఆహుతి అవుతున్న నారాయణ్ భవంతి – పై భాగానికి మరలింది . అయ్యో అయ్యయో అన్న అరుపులు ఆకాశాన్ని అంటుకున్నాయి.

రెండవ అంతస్తులో వున్న పిట్టగోడ మీదికి ఎక్కింది కుక్కపిల్ల – జాలిగా అరుస్తూ క్రిందవున్న జనాన్నంతా కలియచూస్తున్నది తన యజమాని కోసం.

బయటికి వచ్చిన క్షణం నుంచీ దానికోసమే వెదుకుతున్నది నారాయణ్ చిన్న కూతురు కార్తి. అది తమతో పాటు పారిపోయి వచ్చిందనే అనుకుంటున్నదామె.

బాల్కనీ మీదవున్న కుక్కపిల్లను చూడగానే కెవ్వున అరిచి ముఖద్వారం వైపు పరుగు తీసింది.

"అమ్మా కార్తీ!!” పెద్దగా అరిచాడు నారాయణ్.

భవనం ముందు నిలబడి వున్న పదిమంది పౌరులు కార్తిని వడిసి పట్టకొని వెనక్కి లాక్కు వచ్చారు.

"నాన్నా! నా టైగర్ !! నా టైగర్ చచ్చిపోతుంది నాన్నా …. నన్ను వదలండి నాన్నా ….” గోలు గోలున ఏడ్వసాగింది కార్తి.

ముఖద్వారంలో నుంచి పైకి పోవటానికి అవకాశం ఏమైనా వుందేమోనని ప్రయత్నించారు కొందరు పౌరులు. కొలిమిలో నుంచి వెలువడుతున్న నిప్పురేకుల్లా – వేగంగా బయటకి వస్తున్నాయి మంటలు. చూస్తుండగానే విరిగి నిప్పులు వెదజల్లుతూ నేలన పడింది ద్వారబంధం.

బాల్కానీ మీది నుంచి జంప్ చేయటానికి సిద్ధంగా వుంది టైగర్ ….

"నారాయణ్ సాబ్ ! మేమందరం కాచుకుంటాం….. దూకమని చెప్పండి…” ఆత్రుతగా అన్నాడొక పౌరుడు.

కూతుర్ని వదిలి భవనం దగ్గరికి పరుగు తీశాడు నారాయణ్.

"టైగర్, జంప్! జంప్ బేబి ….. జంప్!! " బిగ్గరగా అరిచాడు గొంతు చించుకొని, ముందుకాళ్ళను వంచి తోక విదిలించింది టైగర్…… దూకిన మరుక్షణం పట్టుకోవటానికి సిద్ధంగా వున్నారు పాతిక మంది పౌరులు.

అంతవరకూ నల్లటిపొగలు వెలువరిస్తున్న కిటికీ ఒకటి భగ్గుమంటూ మంటల్ని పైకి విరచిమ్మింది. నిలువెత్తున లేచాయి మంటలు…… భయపడి బాల్కానీలోకి దూకేసింది టైగర్.

అది అరుస్తున్న అరుపుల్ని వినలేక చెవులు మూసుకున్నారు అక్కడ గుమిగూడిన వారందరూ.

కార్తి కళ్ళముందున్న ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నది. మూడు వారాల పసికూనగా వున్నప్పుడు టైగర్ ని తన స్వంతం చేసుకున్నదామె. పాల పీకతో పాలు పట్టి పసిబిడ్డకంటే ఎక్కువగా చూసుకున్నది. ఆటల్ని నేర్పింది. అల్లరి చేస్తే కొట్టి తిట్టింది. ఇరవై నాలుగు గంటలు తన వెంటనే వుంచుకొని పెంచింది. టైగర్ ఆమెకు పెంపుడు కుక్క గాదు. ప్రాణాలకంటె ఎక్కువ అయిన ఒక ఫ్రెండ్.

తన కోసమే టైగర్ అరుస్తున్నదని కార్తికి తెలుసు. తను రెండు నిముషాల పాటు కనిపించక పోతే అలాగే అరిచేదది.

కాళ్ళు నిలువలేదు కార్తికి….. తనను ఎవరు చూడటం లేదని నిశ్చయించుకోగానే, బాణంలా పోయి ముఖద్వారంలో జొరబడింది.

గొల్లుమన్నారు జనం…..

"అమ్మా కార్తీ….. కార్తీ !!” అంటూ అటు పరుగుతీశాడు నారాయణ్.

ముఖద్వారంలో సుడులు తిరుగుతున్న పొగలలోకి పోయి అదృశ్యమైపోయింది కార్తి , నారాయణతో పాటు మరో నలుగురు పౌరులు ప్రాణాలకు తెగించి అటు దూకారు.

దడ దడలాడుతూనే నేలకూలింది మెదటి అంతస్తు మీద వున్న డ్రాయింగ్ రూమ్. పెద్ద పెద్ద కాంక్రీట్ పలకలు శెగలను వెలువరుస్తూ ముఖద్వారాన్ని మూసి వేశాయి.

"నారాయణ్ సాబ్ ! వద్దు….. ప్రాణాలు పోతాయి…..” అంటూ అతన్ని పట్టుకొని వెనక్కి లాగారు అతనితో పాటు పోయిన పౌరులు.

పిచ్చిగా చూశాడు నారాయణ్…. వెర్రిగా అరుస్తూ వారిని విదిలించి కొట్టాడు. మరో పదిమంది చేరి అతన్ని యివతలికి లాక్కు వచ్చారు.

"కార్తీ….కార్తీ!” అంటూ స్పృహ తప్పి పడిపోయింది అతని భార్య…

రెండవ అంతస్తు మీద ప్రత్యక్షమయింది కార్తి. ఆమె సాహసానికి మెచ్చి అగ్నిదేవుడు ఆమెను చూసీ చూడనట్లు వదిలేశాడు కాబోలు – మంటలు విరచిమ్ముతున్న మెట్ల మీది నుంచి సురక్షితంగానే పైకి పోగలిగిందామె.

కార్తిని చూడగానే సంతోషంతో ఎగిరి గంతులు వేసింది టైగర్ . దాన్ని గుండెలకు అదుముకొని, వెనుదిరిగింది కార్తి.

ఫెట ఫెటారావాలు చేస్తూ కూలిపోయాయి మేడ మెట్లు. బాల్కానీ సగభాగం విరిగి నేలమట్టం అయింది.

“నిచ్చెనలు! నిచ్చెనలు తీసుకురండి…. ’’ పెద్దగా అరిచారెవరో.

రెండు క్షణాలలో ప్రత్యక్షమయ్యాయి నాలుగు నిచ్చెనలు. ఉడతల్లా వాటిమీదికి పాకారు నలుగురు పౌరులు. నాలుగు అడుగులు కూడా పోకముందే భూకంపం వచ్చినట్లు కంపించింది ఆ భవనమంతా. నిచ్చెన్లు ఆనించిన గోడ నడుమకు విరిగి లోపల పడిపోయింది . చావుతప్పి కన్ను లొట్ట పొయినట్లు, క్రిందపడి, ప్రాణాలు దక్కించుకున్నారు ఆ నలుగురూ.

కార్తిని క్రిందకి రప్పించే మార్గం లేదు. భవనమంతా వీక్ అయిపోయింది. ఏ క్షణంలో నయినా కూలిపోవటానికి సిద్ధంగా వున్నది.

నిర్ఘాంతపోయి చూస్తున్నారు అక్కడ గుమిగూడిన పౌరులందరూ…. నోరు తెరచి పెద్దగా అరిస్తే, ఆ అదుటుకు భవంతి కూలిపోతుందేమో అన్నంత భయంతో రాతిబొమ్మల్లా నిలబడిపోయారు – మాట పలుకు లేకుండా.

ఒక చివరగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న ఇరవై రెండు సంవత్సరాల యువకుడు తల విదిలిస్తూ ముందుకు అడుగు వేశాడు.

మరుక్షణం అతని చేయి పట్టుకున్నాడు ప్రక్కనే వున్న లావుపాటి వ్యక్తి.

"గురో! నువ్వు లేనిపోని గొడవల్లో తలదూర్చి మన కొంపలు ముంచకు. నువ్వు ఆ మెడ ఎక్కి సర్కస్ ఫీట్లు చేయటం మొదలు పెట్టావంటే, ఎవరో ఒకరు నిన్ను గుర్తు పట్టకుండా వూరుకోరు. గుర్తు పట్టిన మరుక్షణం మన బాబాయిలకు ఫోన్ చేస్తారు” అన్నాడు వెనక్కి లాగుతూ.

“అలా అని ఆ చిన్నారి తన ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ వూరుకో మంటావా?” అతని చేతిని విదిలించుకుంటూ ముందుకు అడుగు వేశాడా యువకుడు.

"ప్రపంచంలో ప్రతిరోజూ ఎంతమంది చిన్నారులు యిలా ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవటం లేదు? వాళ్ళందర్నీ రక్షిస్తున్నామా? నా బంగారం! రా బాబూ! వెళ్ళిపోదాం….” గడ్డం పట్టుకొని బ్రతిమలాడాడు ఆ లావుపాటి వ్యక్తి.

వినిపించుకోలేదా యువకుడు. గబగబా ముందుకు పరుగెత్తి, మంటలు విరజిమ్ముతున్న భవనానికి ఎడమ ప్రక్కకు చేరుకున్నాడు.

పెద్ద బావి ఒకటి వున్నదక్కడ. మర మనుషుల్లా నీళ్ళు తోడి ఫైర్ బ్రిగేడ్ కి అందిస్తున్నారు పదిమంది పౌరులు.

ఇద్దరి చేతుల్లో వున్న చేంతాళ్ళను లాక్కున్నాడు యువకుడు. వాటి కొనలను ఒకటిగా ముడివేసి, అక్కడికి సమీపంలోనే వున్న కొబ్బరిచెట్టు మీదికి ఎగబ్రాకాడు. మంటల వేడికి మోడుబారిపోయిందది. దాని ఆకులు నల్లగా కమిలిపోయి సెగలను వెలువరుస్తున్నాయి. ఆ వేడిమిని లక్ష్య పెట్టకుండా మట్టల మధ్య నిలబడ్డాడు యువకుడు.

ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తున్నారు జనమంతా.

అతను ఏమి చేయబోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.

చేంతాటి రెండవ కొనను వుచ్చుముడి వేసి, త్రాటినంతా చుట్టచుట్టాడు ఆ యువకుడు. మొదటి కొనను ఎడమ చేతితో పట్టుకొని, త్రాటి చుట్టను గిరగిరా తిప్పాడు గాలిలో.

సగం కూలిపోయిన బాల్కానీ మీద జయస్థంభంలా నిలబడి వుంది ఒక కాంక్రీట్ స్తంభం . యువకుడి చేతిలో నుంచి ముందుకు దూకిన త్రాటిచుట్టూ…… గాలిలో ఎగిరిన త్రాచుపాములా పోయి ఆ స్థంభం మీద పడి , దానిచుట్టూ మెలకలు దిరిగింది. బలంగా గుంజాడు యువకుడు ఉచ్చుముడి బిగుసుకున్నది. కొబ్బరి చెట్టుకు భవనానికి మధ్య ఒక త్రాటి వంతెన తయారయింది.

హర్షద్వానాలతో మార్మోగిపోయిందా ప్రదేశం….ఆ యువకుడికి సాయం చేయటానికి కొబ్బరి చెట్టు మీదికి ఎక్కారు నలుగురు ఉత్సాహవంతులు.

రెండవ కొనను కొబ్బరి చెట్టుకు ముడివేసి త్రాటికి వ్రేలాడబడ్డాడు యువకుడు.

"జాగ్రత్త! జాగ్రత్త” అన్న అరుపులు ఎక్కువైపోయాయి….. మంటల్ని చూడటం మాని అతని వంకే చూడసాగారు అందరూ.

ఆ యువకుడి చూపులన్నీ త్రాటికి పది అడుగుల క్రింద వున్న కిటికీ మీద వున్నాయి. ఏ క్షణంలోనైనా పగులుతుందది. పగిలిన మరుక్షణం మంటల్ని వెలువరుస్తుంది. ఆ మంటలు త్రాటిమీదికి వస్తేనే వుంది అసలు తంటా.

అడుగు అడుగు చొప్పున ముందుకు జరిగి బాల్కానీని సమీపించాడతను. కాలు ఎత్తి సిమెంటు పలకమీద వెయ్యబొతుండగా …. దడదడా కూలిపోయాయవి .

త్రాటిని భరిస్తున్న కాంక్రీట్ స్తంభం …. ఏటవాలుగా పక్కకు వంగింది. గొల్లున అరిచారు క్రిందవున్న జనమంతా .

పెదవులు బిగబట్టి గాలిలోకి లేచాడు యువకుడు.

క్రిందినుంచి వినవస్తున్న అరుపుల్ని లక్ష్య పెట్టకుండా కాళ్ళు ఎత్తి బాల్కానీ చివర వేశాడు.

పొగ కొట్టుకొని మలినమైన ముఖంతో, కన్నీరు విడుస్తూ నిలబడి వున్నది కార్తి….. అతన్ని చూడగానే ఒక అగ్నిజ్వాల మీది నుంచి యివతలకి దూకి, ఎదురు వచ్చింది బావురుమంటూ.

"డోన్ట్ వర్రీ డార్లింగ్! ఫికర్ మత్ కరనా!” అంటూ ఆమెను బాహువుల్లో పొదవుకున్నాడా యువకుడు.

కిటికీలోనుంచి వెలువడుతున్న మంటలు , చేంతాటిని అంటీ అంటనట్లు అంటుకున్నాయి….కాంక్రీట్ స్తంభం కొంచెం పటిష్టంగానే వుంది….. మరో రెండు మూడు నిమిషాలు వున్న చోటనే వుంటుంది.

క్రింద వున్న వారందరూ చేతులు పైకిఎత్తి యువకుడి వంకే చూస్తున్నారు. వారి భావాలతో తనకు నిమిత్తం లేనట్లు ఖణేల్ ఖణేల్ వంటున్నది భవనం…..

కార్తి చేతుల్ని మెడచుట్టూ చుట్టుకున్నాడు యువకుడు. టైగర్ ని తన భుజం మీద ఎక్కించుకొని త్రాటి మీద వ్రేలాడబడ్డాడు.

గలగలలాడుతూ కూలిపోయింది బాల్కానీ లోని మరికొంత భాగం . వైల్డ్ గా అటూయిటూ వూగటం ప్రారంభించింది….. కాంక్రీట్ స్తంభం.

ఆ యువకుడి మెడను గట్టిగా కౌగిలించుకొని కళ్ళు మూసుకున్నది కార్తి . తోక ఆడిస్తూ ఆనందంగా అతని బుగ్గలను నాలుకతో తడి చేయసాగింది – టైగర్.

భగ్గుమంటూ పైకి వచ్చాయి త్రాటి క్రింద వున్న కిటికీలోని మంటలు. నల్లటి పొగలు వెలవడసాగాయి చేంతాడు మీదినుంచి.

పెదవులు బిగించి, పళ్ళ బిగువున పక్కకు జరుగుతున్నాడు ఆ యువకుడు. అప్రయత్నంగా అతని చూపులు క్రింద వున్న బావివైపు మరలాయి.

పదిమంది పోలీస్ కానిస్టేబుల్స్ నిలబడి వున్నారక్కడ. హడావుడిగా వారితో మాట్లాడుతున్నాడు వారి సబ్ యిన్ స్పెక్టర్ .

యువకుడి కళ్ళు తన సహచరుడి కోసం వెతికాయి. కొబ్బరి చెట్టు చుట్టు నిలబడివున్న జనంలో వున్నాడతను. రెండు చేతుల్ని ఎత్తి నెత్తిమీద పెట్టుకొని కళ్ళు ఆర్పుతున్నాడు.

ఉన్న శక్తినంతా కూడగట్టుకుని చేతుల్ని కదిలించడం ప్రారంభిం చాడు యువకుడు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టారట…. వారి చేతికి చిక్కకుండా తప్పించుకోవాలి. పటపటమంటూ తెగాయి రెండు త్రాటి పొరలు . బాల్కనీ మీద కాంక్రీట్ స్తంభం మరికొంచెం క్రిందకు వంగింది.

కెవ్వున అరిచారు క్రింద వున్న ప్రజలు.

కళ్ళు మూసుకుని మరింత వేగంగా ప్రక్కకు జరిగాడా యువకుడు. ముప్పై అడుగుల క్రింద వుంది నేల, పడటం అంటూ సంభవిస్తే సున్నంలోకి కూడా మిగలకుండా నుగ్గు నుగ్గు అయిపోతాయి ఎముకలన్నీ.

తోకను నిఠారుగా ఎత్తి గురగురలాడుతూ యువకుడి చెవిని ముద్దు పెట్టుకుంది టైగర్.

"బ్లడీ యిడియట్! నీకు యింతకంటే మంచి అదును మరోకటి కనిపించలేదా!” చక్కిలిగిలిని తట్టుకోలేక కసురుకున్నాడు ఆ యువకుడు.

ఆ మాటలు విన్న కార్తి ఫక్కున నవ్వింది తన భయాన్ని ఒక్కక్షణకాలం మర్చిపోయి, ఫట్ మంటూ తెగింది చేంతాడు. కిటికీలోంచి వెలువడిన మంటలు దాన్ని పూర్తిగా తినేశాయి.

రివ్వున పోయి కొబ్బరిచెట్టును గుద్దుకున్నాడు యువకుడు. ఆఖరి క్షణంలో ఒక చేతిని ముందుకు జాచి ఆ అదటును తట్టుకుని జర్రున క్రిందకు జారాడు. చెట్టు మీద రెడీగా ఉన్న సాహసవంతులు తలా ఒక చేయి అందించి అంచెలంచెలుగా అతను మోస్తున్న బరువులను తాము అందుకున్నారు.

యువకుడు నేలకు దూకిన మరుక్షణం అతన్ని చుట్టుముట్టింది ప్రజావాహిని. బాంబులు పడినట్లు శబ్దాలు చేస్తూ కూలిపోయింది నారాయణ్ భవంతి. దాన్ని గురించి పట్టించుకున్న వారెవరూ లేరు.

కార్తిని గుండెలకు అదుముకొని, టైగర్ ని చంకలో యిరికించుకుని, యువకుడి చేతులు పట్టుకున్నాడు నారాయణ.

"బాబూ! నువ్వెవరివో నాకు తెలియదు. డబ్బుపోతే రేపు సంపాదించుకోవచ్చు. నా బిడ్డపోతే తెచ్చుకోగలనా?” అంటూ గద్గద స్వరంతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాడు.

"నారాయణ్ సాబ్! అతన్ని మా యింటికి తీసుకుపోదాం ….. మన హమీర్ పురా ఆతిధ్యం ఎలా వుంటుందో రుచి చూపిపంపుద్దాం…..” నారాయణ్ స్నేహితుడొకడు పెద్దగా అరిచి చెప్పాడు.

"అవును….. అలాగే చేయాలి. అతని సాహసానికి తగిన గౌరవం చేయాలి!!” పెద్దగా అరచి తమ హర్షాని తెలియచేశారు మిగిలిన ప్రజలందరూ.

వారి మధ్య చిక్కుపడిన యువకుడి కళ్ళు…… చుట్టూ క్రమ్ముకువస్తున్న పోలీసుల్ని గమనించాయి. పదిమంది వున్నారు వారు. పది మంది యిన్ స్పెక్టర్లు వారిని లీడ్ చేస్తున్నారు.

 

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=244

రన్ ఫర్ ది బోర్డర్ On Kinige

Related Posts:

జలపాత గీతం పుస్తకంపై ప్రముఖుల అభిప్రాయాలు

                జలపాతగీతంచదివాను. అనుభూతి, ఆలోచన కమనీయంగా సంగమించిన కవితాసంపుటి అది. రాగాన్ని వేదికే భావం, మాటకి ప్రాణం పోయాల్సిన వేళ, వసంతం ఒక పంచవన్నెల పాట, పద్యమయ్యేవేళ ప్రత్యేకించి పేర్కొనదగిన మంచి కవితల్లో కొన్ని. కృత్రిమ జీవితానికి కొబ్బరాకు మబ్బులకింద నవ్వు మొలకల సీమ సింగారంఅందమైన అభివ్యక్తులు. రాగాన్ని వెదికే భావంకవిత ముగింపు చాల బాగుంది.

జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, పద్మభూషణ్‌, డా|| సి. నారాయణరెడ్డి (లేఖ, తే. 16.3.97)


 

                జలపాతగీతంఅందింది. అన్నీ ఇంచుమించుగా మంచి కవితలే. రోజూ చూసే దృశ్యమేఅన్న కవిత ఎంతో బాగుంది.

                దృష్టపూర్వా అపిహ్యర్థాః| కావ్యేరస పరిగ్రహాత్‌ / సర్వేనవా ఇవా భాంతి| మధుమాస ఇవద్రుమాఃఅని ప్రాచీనులననే అన్నారు. దీనికి మీ కవిత గొప్ప పునసృష్టి.

ముదిగొండ వీరభద్రయ్య (లేఖ, తే. 11.3.97)

 

                జలపాతగీతంచదివాను. ఆపాతమధురంగా ప్రవహించిన మీ కవిత్వ గానాన్ని ఆకర్ణించాను. ఈ దశాబ్దంలో మీది విలక్షణమైన గొంతు. కొన్ని కవితల్లో భావాన్ని; యింకా కొన్ని కవితల్లో శిల్పాన్ని, మరికొన్ని కవితల్లో ధ్వనిలో గుప్పెళ్లతో వెదజల్లారు….

డా|| నాగభైరవ కోటేశ్వరరావు (లేఖ, తే.10497)

               


 

ఆదూరి సత్యవతీ దేవి గారి జలపాతగీతం మనోజ్ఞంగా సాగిపోయింది. అక్షరాలను పూలుగా పరచినట్లు, భావాలను అత్తర్లు పన్నీర్లుగా చల్లినట్లు, అర్థాలు ఆర్ద్రాతి ఆర్ద్రమై పరిమళించినట్లు, తమ కవితలను శిల్పీకరిచిన రసజ్ఞ కవయిత్రి యీమె. లలితమైన భావాలు వీరి స్వంతం. తనకు యీ లోకానికంతటికీ ఇష్టమైన ఏవస్తువు పైనైనా మమకారం చూపడానికి ఆ వస్తువులకు హానికలిగించే శక్తులను సుతిమెత్తగా మందలించడానికి ఆ లలిత భావాలనే ప్రయోగిస్తారు. ఏ సంఘటనను స్పృశించినా అద్భుతమైన భావనాపరంపర జలపాతంలా ఎగిసిపడుతుంది. వస్తువైవిధ్యాన్ని పాటిస్తూనే రూపవైశారద్యాన్ని సాధించారు కవయిత్రి.

ఆచార్య నాయని కృష్ణకుమారి (తే. 23.4.97)


 

                జలపాతగీతంఅందింది. మొదటి పుస్తకంలో కవిత్వం ఆరంభమై రెండో పుస్తకంలో మలుపు తిరిగి, మూడో పుస్తకంలో ముచ్చటైన మీ సొంత మార్గం ఏర్పడింది. మీ కవితా ప్రయాణంలో కొంత భాగానికి నేను ప్రత్యక్ష సాక్షిని కావటం నాకు సంతృప్తికరంగా సంతోషంగా వుంది.

చే.రా. (లేఖ, తే. 11.3.97)

నులివెచ్చని సంవేదన మనోనేత్రం ముద్రించిన ఆర్ద్రమైన ఛాయాచిత్రాలు:

                పొద్దుటి పూట గడ్డిపరకపై వాలిన మంచు బిందువును ముద్దుపెట్టుకున్నట్లనిపిస్తుంది ఈ సంకలనంలోని కొన్ని కవితలను చదివితే. మేఘాలై తిరిగివచ్చి గుండెలో వెచ్చని కన్నీటి జలపాతాలను వొంపినట్లు ఒక ఆనంద విషాదం. ఎందుకో ఏమిటో తెలిసీ, చాలాసార్లు తెలియక, కలిగే వేదనలోంచి పుట్టే అక్షరాలకు ఎంత మహత్తు! ఈ కంటితో అందాన్నే చూడగలగడం ఒక వరం. ఈ మనసుతో బాధనే పాడగలగడం అంతకన్నా గొప్ప వరం. ప్రేమించే తాహతును బట్టే బాధపడే అర్హత లభిస్తుందేమో!

                ఏకాంత జలపాతాల్ని నిబ్బరంగా వొంపుకుని గీతమై ధ్వనించిన ఆదూరి సత్యవతీ దేవికి ప్రకృతే తాత్త్విక భూమికను కట్టబెట్టింది. ప్రకృతిని అపారంగా ప్రేమిస్తూ, ప్రాకృతిక నియమాలతో మనిషి సహజాతి సహజంగా లయించాలని ఆమె అత్యాశపడుతున్నారు. యంత్రయుగ బీభత్సంలో అనాది సౌందర్యాల కేన్వాసు ఛిన్నాభిన్నమైపోవడం ఆమెను అమితంగా వేధిస్తోంది. మనిషి మరగా మారడం ఆమెకు దిగులుగా ఉంది. అందుకే పరాయీకరణలో అస్తిత్వాన్ని కోల్పోతున్న మనిషికి ఆమె పచ్చని వసంతాల రుచి చూపిస్తున్నారు. ఎంత నిరుపేదతనం / మనిషికీ మనిషికీ మధ్యన అని వాపోతూ. మిత్రమా మిత్రమా / రెండు స్వప్నాల మధ్య / రెండు ప్రపంచాల మధ్య / ఒక గందర్వగానం / నిరంతరం సాగనీ అని ప్రేమగా అర్థిస్తున్నారు. సత్యవతీ దేవి కవిత్వానికి లాలనగా ఆందోళన రేకెత్తించే అరుదైన సుగుణం ఉంది. మనిషి ఎన్నటికైనా ప్రేమవైపే నడవక తప్పదు కదా అన్న ఆశావాదమూ ఉంది. అంతేకాదు, చూపుల జీవన కాంక్షల్ని రెప్పల పొత్తిళ్ళలో కరిగిస్తూ, ప్రకృతి ఔన్నత్యాన్ని విడమరచి చెబుతూ మనిషితనం అంటే ఏమిటో ఈ కవిత్వం గుర్తుచేస్తుంది.

                జీవరాసుల మనుగడకై / ఆరు ఋతువుల్నీ తరగతి గదులుగా మలచుకొని / తానే ఒక పాఠశాలై చరిస్తూ / ఇచ్చిపుచ్చుకునే సందర్బాలన్నింటినీ సమతూకాలుగా చేసి / అర్పించుకొనే సంస్కారాన్ని మనిషిని / వనాల నుంచీ, గనుల నుంచీ, జీవనదుల నుంచీ / నీలాంబర జలధారల నుంచీ గ్రహించమని ప్రకృతి తన తొలిపాటగా వినిపించిందని అంటారు. కంటికి కనిపించే దృశ్యాలను చిత్రికపడుతూ, ఆ క్రమంలో తానే దృశ్యంలో లీనమై కవిత్వాన్ని వినిపిస్తారు సత్యవతీదేవి.

                మౌనంలో జీవశక్తిని, దుఃఖంలో సౌందర్యాన్ని దర్శించగలుగుతున్నారు. కనుకే, నన్ను నేను చూసుకునేదీ / తెలుసుకునేదీ / ఒక యథార్థ దుఃఖలిపిలోనే అంటారు. ఆ లిపిలోనే సౌందర్య సీమలు సాక్షాత్కరిస్తాయి. ఎవరో అన్నట్లు, తీయని పాటలన్నీ విషాద ఘడియల్లోంచి పుట్టినవే కదా!

            పసునూరు శ్రీశీధరబాబు, ఇండియాటుడే 30 ఆగష్టు 1997


 

కవిత్వ జలపాతగీతం

                అనేకానేక వాదాల వివాదాల్లో కవిత్వం గతి తప్పిపోతున్న కాలమిది. అప్పుడప్పుడు మళ్ళీ కృష్ణశాస్త్రి, తిలక్‌ లాంటి కవులు ఎక్కడో తచ్చాడుతూ మండుటెండలో జలపాతగీతాలవుతున్నారు. రెక్క ముడవని రాగంనుంచి జలపాత గీతంవరకూ ఆదూరి సత్యవతీదేవి గారి కవితాగానం, ఆమెను చదివిన సాహితీప్రియుల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. ప్రకృతి స్వరాలను అక్షరాలుగా పేర్చి పచ్చటి పాటలుగా మలిచే గొప్ప శిల్పి సత్యవతీదేవి.

                జీవదానం చేసి పునర్జన్మనివ్వటం / బతుకులోని ఒక భాగాన్ని / ఎప్పటికీ కొత్తగా మెరిపించటం / ఈ అక్షరాలకి తెలుసు”– ఆమె మాటల్లోనే కాదు, మనక్కూడా ఈ కాసిన్ని అక్షరాలే చాలు తమకాన్ని తీర్చేందుకు. సత్యవతీదేవి గారు పాట నుంచి కవిత్వం వైపు మళ్ళేరు కాబట్టి సహజంగానే అస్పష్టత ఆమె జోలికి పోలేదు. ప్రకృతి పచ్చదనమంత సున్నితంగా కవిత్వమల్లగల నేర్పు ఈమె రచనల్లో కన్పిస్తుంది. ఈమెతో కవిత్వం నిజంగానే ప్రేమలో పడింది. ఎంత కవిత్వమైనా ఏ చేతులు పూచిన ఋతువులో‘! నంటూ పాట తాలూకు లయవినిపిస్తుంది.

                కవిత్వమంటే భావుకత్వమనీ, ప్రేయసీ ప్రియుల మధ్య పావురాయిపట్టుకొచ్చే ప్రేమ సందేశమనీ అర్థాలుండేవి. దాన్ని చెరిపేస్తూ కవిత్వమంటే విప్లవమనీ, సమాజాన్ని మార్చే సాధనమనీ జనం గుండె గొంతుకలో కొట్టుకునే ప్రాణధారనీ శ్రీశీశ్రీశీ లాంటి ఆధునికలు నిరూపించారు. దీన్ని కూడా కాదని… కవిత్వమంటే సామాన్యులకు అర్థం కాని అస్పష్టతనీ, గందరగోళ పదాల కూర్పనీ, అర్థాలను బద్దలుకొట్టి నిఘంటువులక్కూడా అందని కొత్తర్థాలు రాయటమని ఓ తరం పోటీపడింది. దాన్ని భూజానేస్కుని శిష్యరికం చేయటానికే మరోతరం కవిత్వం రాసింది. ఇదీ కాదని… కవిత్వమంటే దళిత, మైనారిటీ, స్త్రసీ వాదాలనీ కవిత్వం జుట్టు పట్టుకుని కులమతాల కుళ్ళు రాజకీయాల్లో ముంచి తేల్చుతున్నారు కవులు. ఈ సదర్భంలో ఎవరు రాసిన కవిత్వం వాళ్ళే చదువుకుని తృప్తి పడాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఇన్ని గందరగోళాల మధ్య నిజమైన పాఠకుడు ఎక్కడో తప్పిపోతున్నాడు. అయినా అక్కడక్కడా కొంతమంది ప్రకృతి కవులు పాఠకులని సేదతీరుస్తూనే ఉన్నారు. అలాంటిదే సత్యవదీదేవిగారి కవిత్వం. యుగాలనాటి సంగీతం / యవ్వనాల మోహవేగం / జలజల పారు గీతం / జలపాతగీతం. కృత్రిమత్వం, నటనలూ మనుషుల్లో పేరుకుపోవటం, నిజంగా మన నవ్వుల్ని మనమే నటించాల్సి రావటం పంత దారుణమో కదా! మనిషి తనను తానే వెలిగించుకుని ఒక వెన్నెల ముక్కయి బయటకు రావాలని కవి అభిలాష. కవిత్వానికి వస్తు పరిమితులు లేకపోయానా ఈ తరహా ప్రకృతి కవిత్వంలో స్పష్టమైన అనుభవాల్ని అనుభూతించటం సత్యవతీదేవిగారికి మొదట్నుంచీ అలవాటు. కొన్ని అనుభవాలు జీవితంలో చాలా చిన్న సంతోషాలని మాత్రమే కలిగించి జారిపోతుంటాయి, మళ్ళీ మనం వాటిని గుర్తుంచుకోం. కాని సత్యవతీదేవి గారు ఆ క్షణాల్ని అందంగా పట్టుకుంటారు. వాటికి అక్షరరూపమిచ్చి ఆ అనుభవాలను పునర్జీవింపజేసి ఒకే ఆనందాన్ని పదేపదే అనుభూతిస్తారు. మనకూ పంచిపెడ్తారు.

జావేద్‌, వార్త దినపత్రిక 11 ఆగష్టు 1997

 

వేదనాభరితం జలపాత గీతం

                అనాది సౌందర్యాల ప్రకృతి కాన్యాసు ఛిన్నాభిన్నమై మనిషిలోని మనిషితనం డిగ్రేడ్‌ అయిపోతున్న పరిస్థితుల పట్ల ఆవేదన,. ఆదూరి సత్యవతీదేవి గారి జలపాత గీతంలో నిదానంగా ప్రవహిస్తుంది.

                దుఃఖలిపిని తెల్సి కొత్తగా సుఖ దుఃఖాలు రెండూ సమమేనన్న తాత్విక బోధను కావిస్తారు.

                నన్ను నేను చూసుకునేదీ తెలుసుకొనేదీ ఒక యదార్థ దుఃఖ లిపిలోనే / ఒక్కొక్క దెబ్బా తగిలి జీవితం పెచ్చులూడిన గోడలా అందవిహీనమై పోతున్నదే అని / భాధ మెలిపెట్టినప్పుడల్లా దెబ్బ వెనుక సన్నివేశం నన్ను మరో ప్రక్కకు మళ్లించి /కొమ్మలు తెగినా చిగురించటం మానని చెట్టును చూపెట్టేది / ఉరిత్రాళ్ళకు వ్రేలాడిన త్యాగాల్ని చూపెట్టేది అప్పట్నించి గాయం నాకు ఆత్మీయమై పోయింది / ఓటమి నన్ను మెరిపించి గెలుపువైపు నడిపించే గురువై సాకింది. / నిజంగా ఆ కన్నీటి చెమ్మే తెలియకపోతే / జీవితం ఎంత రసాస్వాద భోజ్యాన్ని కోల్పోయేదో కదా! అంటారు కవయిత్రి!

                దుఃఖమే ఒక గురువై సుఖ పడడం నేర్పుతుంది. నరికిన చెట్టు మళ్ళీ హరితత్వాన్ని పొందిన విధంగా ఆశా జీవియై మళ్ళీ జీవించడం మొదలెడతాడు. దుఃఖాన్ని ఆస్వాదించ నేర్చుకోలేనివాడు సుఖాన్ని కూడా సరిగా ఆస్వాదించలేడనేది కవయిత్రిగా లోకానికామె ఇచ్చే సందేశం.

                21వ శతాబ్దంలో మనమెన్ని విధాల శాస్త్ర విజ్ఞానంలో అభివృద్ధిని సాధించి ముందుకు సాగుతున్నామనుకున్నా ఓమూల మనమీనాడు పర్యావరణ కాలుష్య రాక్షసి పెనుకోరల్లో చిక్కుకొని ఉన్నామన్న నిజం మనల్ని భయకంపితుల్ని చేయక మానదు. సర్వప్రకృతి సంపదే ఛిద్రమై ఓజోన్‌ పొరకు చిల్లులు పడడం మూలాన సర్వమానవాళి మనగడ ఒక తేలిక ప్రశ్నగా మిగిలిపోయింది. చెట్లు నరికివేస్తున్నాం. ప్రాణవాయువు లుప్తమై రోగాలబారిన పడుతున్నాం. ప్రకృతిలో దినదినం విడుదలయ్యే మృత్యు పొగల్లోచంద్రుడు సహితం కానరాకుండా పారిపోతున్నాడు. ఈ ప్రకృతి విధ్వంసనలో ఈ విషపు గాలుల్లో చిరునవ్వుల చిన్నారులకేదీ రక్ష? ఈ విషాద భయానక పరిస్థితుల నేపథ్యంలోనే కవయిత్రి

                విజ్ఞానం పెరిగి పెరిగి / ఈనాటి యుగవేగం కూడా / మనిషి గెల్చుకున్న విజయమే / కానీ / నీడలా వెన్నంటి పోరాడుతున్న కాలుష్య గాలులూ / నిరంతరంగా ఆకాశాన్ని చిల్లులు పొడుస్తున్న / క్లోరో ఫ్లోర్‌ కార్బన్‌లూ మిథైల్‌ బ్రోమైడ్‌లూ / ఓజోన్‌ పొరని చేదిస్తూ ఒక వికృత వేషంలో / దేశదేశాల పసిపిల్లల్నీ నమిలి మింగేయటానికి / బయలుదేరిన కంసుని దూతలల్లే భయం కొల్పుతున్నాయి.అంటారు.

                ఆధునిక విజ్ఞానం పేరుతో ఎన్నో మనం సాధించవచ్చు. ఆ శాస్త్రసీయ విజయాలన్నీ ఈ ఘోర విషకాలుష్య వాతావరణం ముందుదిగదుడిపే అవుతాయి. నేడు లెక్కల్లో తేలింది 65% శకటాలవల్ల వచ్చే కలుషితమయిన గాలి నగరాల్లో వ్యాపిస్తోందిట. దీనిని అరికట్టే నాధులేరీ? మానవులంతా కలిసికట్టుగా ఎదిరిస్తేనే ఈ విశాల వసుంధర క్షేమంగా ఉంటుంది. ఈనాటి మానవాళికిదొక సవాల్‌గా పరిణమించింది. మేధావులూ, కవులూ కదలిరండి పర్యావరణాన్ని రక్షించుకొనే మార్గాలను అన్వేషించండి. అదే కవి తపన. అదే ఆదూరి సత్యవతీదేవిగారి ఆవేదన.

                ఆదూరి సత్యవతీదేవి దుఃఖం తత్వ చింతనా కలిపి కలబోసిన కవిత్వమే జలపాత గీతంఒక ¬రు మనచెవుల్లో నినదిస్తుంది. కొన్ని కవితలయితే చక్కటి ప్రకృతి శోభను మన కళ్ళకు కట్టే పెయింటింగులు. ఆమె కలం అప్పుడప్పుడు కుంచెగా మారిపోతుంది. మరిన్ని నూతనవిలువల్ని ఆధునిక సాహిత్యంలోకి తీసుకురాడానికి ఈమె ప్రయత్నిస్తున్నారు.

ఎస్‌.ఏ. పద్మనాభ శాస్త్రి, ఆంధ్రభూమి 2 జూన్‌ 1997.


 

సౌందర్యం అనుభూతుల సమ్మేళన ప్రవాహం జలపాతగీతం

                జలపాతం స్వచ్ఛతకూ, వేగానికీ, మార్పుకూ, సౌందర్యానికీ ప్రతీక!

                ఆదూరి సత్యవతీదేవి రాసిన ఈ కవితలు మానవ జీవన జలపాతంలో ఒక్కో గీతాన్ని ఆలపిస్తున్నాయి. ఒక్కోరాగాన్ని నినదిస్తున్నయి. కవితలన్నింటి నిండా పరచుకున్న అండర్‌ కరంట్‌ మానవతే ! సృష్టినీ, మనిషినీ సౌందర్యమయంగా చూస్తూ మాయమవుతున్న మనిషితనం కోసం విలపిస్తున్న హృదయసుధ ఈ జలపాతగీతం

                చినిగిపోయిన పచ్చల కేన్వాసు; రాగాన్ని వెదికేభావం, జలపున్నమి; మాటకి ప్రాణం పోయాల్సిన వేళ; పలుచనయిపోతున్న పచ్చదనం; వసంతం ఒకపంచ వన్నెలపాట; పరిమళలహరి; ఒక హరితవసంతానికై; వెలుగు విహంగం; పద్యమయ్యే వేళ; జలపాతగీతం; యివన్నీ కవితల పేర్లు. ఇవి ఎంతమనోహరంగా వున్నాయో, కవితల్లోని కంటెంటు కూడా అంతే ఆలోచనా స్పోరకంగా వుంది. సౌందర్య దృష్టితో చూడడం ఒక ఎత్తైతే, ఆ సౌందర్య అనుభూతిని అక్షరబద్ధం చేసి మనోహరంగా అక్షరచిత్తరువులను మనముందు నిలపడం యింకా గొప్ప !

                మనిషితనాన్ని మరచి, త్యజించి మతం, కులం, భాష, ఆలోచన, వాదం, నమ్మకం, దేశం, యిలా చాలా రకాలుగా మనల్ని మనమే ఖండఖండాలుగా చేసుకోవడం, కోసుకోవడం స్పందించే ఎవరినైనా కలచివేస్తుంది. సత్యవతీదేవిగారు దాన్ని గొప్పగా చిత్రించి రంజింప చేశారు.

                ఏదో వివక్షతతో, విభిన్న సిద్ధాంతాలతో, సెన్సేషన్‌ ఉబలాటంతో చాలా రకాలుగా కవిత్వం చలామణి అవుతున్నవేళ ఒక్క మానవజాతేకాదు, సృష్టితో మమేకమై మానవతని సౌందర్యంతో, ఆలోచనతో రంగరించి అందరికోసం, ఆర్తితో కవిత్వం రాయడం సత్యవతీదేవిగారి ప్రత్యేకత. దాన్ని ఆదరించి, ఆస్వాదించి, అటువంటి కవిత్వం మరింత రావాలని ఆశించడం మనందరి వంతు!

                జీవదానం చేసి పుర్జన్మ నివ్వటం; బతుకులో ఒక భాగాన్ని ఎప్పటికీ కొత్తగా మెరిపించడం; ఈ అక్షరాలకి తెలుసు; (ఈ కాసిన్ని అక్షరాలే…) నేను ముందుకీ అవి వెనక్కీ పరుగుల ఆటే ఆటగా; నన్ను పసితనంలోపడవేసేవి; ప్రతి ఉదయం నాకొక మిఠాయి పొట్లాం దొరికేది; రేపటికై ఒక తీపికల మిగిలేది… (చినిగిపోయిన పచ్చల కేన్వాసు); విచ్చీ విచ్చని మొగ్గలాలిత్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి; వెన్నునంటి పలికేపాట గురితప్పిపోతుంది; (జలపున్నమి); తరతరాల మానవుడు; బుద్దిని అరగదీసి; చిక్కని మైత్రీ సుగంధాన్ని మనముందుంచి

                వెండి గిన్నెలోని పాల బువ్వలా / శుచి పక్వంచేసి అందించిన సారాన్ని / రుచిరార్థాలెరుగని కాకుల్లా నేల పాలుచేసి / వెన్నెలకు రక్తపు మరకలంటిస్తున్నవేళ / ఆనందం నిషేధమే అంటారు. (మాటకి ప్రాణం పోయాల్సిన వేళ)

                ఇందులో ఏ కవితా ఖండికను ఆఘ్రాణించినా యింతవరకు మనం చెప్పుకున్న అంశాలు బోధపడతాయి. అందుకే ఆదూరి సత్యవతీదేవిగారి కవితలను చదవడం అంటే పశ్చిమాకాశంలోని సాంధ్యతారను ఆనందించినట్టు, నీలిమేఘాల కడ్డంగా ఎగిరే తెల్లకొంగను ఆనందించినట్టు, రసానుభూతి పొందుతానని సంజీవ్‌దేవ్‌ చెప్పుకున్నారు. అదెంతో నిజం. అందుకే ఈ కవితా దర్పణంలో మసకపోయిన మన మానవతకు నగిషీలు దిద్దుకుందాం !

                చివరగా నాకు బాగా నచ్చిన కవితాఖండిక (శాపాలా? బహూమానాలా? నుంచి)

                . . . నీడలా వెన్నంటి పోరాడుతున్న కాలుష్య గాలులూ / నిరంతరంగా ఆకాశాన్ని చిల్లులుపొడుస్తున్న క్లోరోఫ్లోరో కార్భన్‌లూ మిథైల్‌ బ్రోమైడ్‌లూ / ఓజోన్‌పొరను ఛేదిస్తూ / ఒక వికృతవేషంలో / దేశదేశాల పసిపిల్లల్ని నమిలి మింగేయటానికి బయలుదేరిన కంసుని దూతలల్లే భయం గొల్పుతున్నాయి. / చెంగల్వపూదండల్ని కబళించనున్నాయి. / భూమిమీద వనరుల్నీ వనాల్నీ ఎండగట్టి /గ్రహాంతరాళాల్నిండా పొగధూళుల్ని నింపి / మానవజీవిత భద్రతను జీరోడిగ్రీకి దింపి / గడగడలాడిస్తున్న యీ శాస్త్రసవిస్తృతి / ఎవరి సుఖస్వప్నాలకోసం? ఏ ఉజ్వల బాల్యాలకోసం?

నాగసూరి వేణుగోపాల్‌, ఆహ్వానం మాసపత్రిక, ఏప్రిల్‌ 1998

Authors Thrid book Veyi Rangula Velugu ragam can be read @ http://kinige.com/kbook.php?id=214 

 

Related Posts:

శ్రీకృష్ణ దేవరాయలు

భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి సుపరిచితుడైన మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు. కస్తూరి మురళీకృష్ణ రచించిన ఈ నవలలో రాయల వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.
కథా ప్రారంభంలో – భారతదేశం అవిశ్రాంతమైన శత్రుదాడులతో బలహీనపడడం గురించి ప్రస్తావిస్తూ…..ఆ కాలం భారతీయ సమాజం దిశారహితమై దిక్కుతోచకుండా బిక్కుబిక్కుమంటున్న కాలమని పేర్కొంటు శ్రీకృష్ణ దేవరాయలు సింహాసనం అధిష్టించే ముందరి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఇటువంటి పరిస్థితిలో మహామంత్రి తిమ్మరుసు, ఇతర ముఖ్యులు కలసి రాజ్యాధికారాన్ని శ్రీకృష్ణ దేవరాయలకు అప్పగిస్తారు.
పాలనాపగ్గాలు చేపట్టాకా, ఒక్కో శత్రువునీ జయిస్తూ, సామ బేధ దాన దండోపాయాలతో దక్షిణాపథాన్నంతా ఏకఛత్రం క్రిందకి తెచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నో సంస్కరణలు చేపట్టి జనరంజకంగా పాలించాడు, విశిష్ట కట్టడాలని నిర్మించాడు. ఇదంతా అందరికీ తెలిసినదే.
పరిపాలనాదక్షుడుగా, వీరుడిగా, సాహితీప్రియుడిగా, కవిగా, గొప్ప కట్టాడాలను కట్టించిన రాజుగా మనకి తెలిసిన శ్రీకృష్ణ దేవరాయల లోని ఆధ్యాత్మికతను, ధర్మదీక్షని పరిచయం చేసారు రచయిత ఈ నవలలో.
విజయనగర రాజ్యాధికారం లభించడమంటే ధర్మరక్షణ చేసే అవకాశం లభించడమేనని శ్రీకృష్ణ దేవరాయలు భావించాడని, దైవం తనకి నిర్దేశించిన కర్తవ్యం అదేనని ఆయన నమ్మాడని రచయిత చెబుతారు. తన సామ్రాజ్యంలో ఎన్నో దేవాలయాలకు నిధులిచ్చి, వాటిని పునరుద్ధరించి, నిత్యపూజలు జరిగేలా చూసాడు. ఆలయాలు జనసామాన్యంలో ధార్మికత నెలకొల్పగలిగే కేంద్రాలని రాయలు విశ్వసించాడు.
శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వరుని భక్తుడు. వీలైనన్ని సార్లు తిరుపతి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకునేవాడట. “ఏడుకొండలు ఎక్కలేము, ఇంకోసారి రాలేము” అనుకునే వారందరూ కూడా మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి ఎందుకు వస్తారో రచయిత చక్కగా వివరించారు. అలాగే తిరుమల గుడిలో శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరి భార్యలతో ఉన్న విగ్రహాలు ఎందుకు ఉన్నాయో రచయిత చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
పాలకులకు ఉండాల్సిన లక్షణం గురించి రాయలు ఇలా అంటారు:
“ముందుగా మనం మన ప్రజలకు కలలు కనడం నేర్పాలి. జీవితాన్ని అనుభవించడం నేర్పాలి. రకరకాల భయాలతో, బాధలతో, మనవారు జీవించడం మరచిపోయారు, బ్రతుకులోని ఆనందాలను అనుభవించడం మరచిపోయారు. ఎంత సేపూ గతాన్ని తలచుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. ముందుగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్నివ్వాలి, వారికి భద్రతనివ్వాలి”
ఈనాడు ఇవి మనకి కూడా కావల్సినవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
“దేశభాషలందు తెలుగు లెస్స” అనే పద్యం శ్రీకృష్ణ దేవరాయలు ఏ సందర్భంలో చెప్పాడో రచయిత ఆసక్తిగా చెప్పారు.
తన తదనంతరం, విజయనగర సామ్రాజ్యం ఏమై పోతుందో అని చింతిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు మానసిక స్థితిని వర్ణిస్తూ – “తన జీవితంలో ఒక దశకి చేరిన తరువాత ఇతరుల పొగడ్తలు వింటున్న వ్యక్తి మనసులో అహంకారం జనిస్తుంది, దాని వెంటే సంశయం కలుగుతుంది. ఈ పొగడ్తలకు అర్హుడినా అనే అనుమానం కలుగుతుంది, మరో వైపు “నేనింత సాధించాను” అన్న అహంభావం పెరుగుతుంది. ఈ రెండిటి నడుమ జరిగే ఘర్షణలోంచి, “ఇది పోతే” అన్న భయం జనిస్తుంది. ఆ భయాన్ని వ్యక్తి ఎలా ఎదుర్కుంటాడన్నది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది” అని అంటారు రచయిత.
రాయలు తన పుత్రుని భవిష్యత్తు గురించి బెంగపడుతున్న యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, ఆ సమయంలో రాయల మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు రచయిత. ” మనిషికి ఆత్మస్థైర్యం ఇవ్వవలసిన మానవ సంబంధాలే మనిషిని బలహీనం చేయడం సృష్టిలో చమత్కారం” అంటారు.
ఆముక్తమాల్యద రచన పూర్తి కాగానే శ్రీకృష్ణ దేవరాయలు తృప్తిగా కన్నుమూయడంతో నవల పూర్తవుతుంది.
చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీకృష్ణదేవరాయలు On Kinige

– కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కారామాష్టారు – ‘నాకూ విశ్రాంతి కావాలి ‘ వి. రామలక్ష్మి కథలు – గురించి

నాకూ విశ్రాంతి కావాలి – వి. రామలక్ష్మి కథలు

వి. రామలక్ష్మి

తే 18.11.2002

రామలక్ష్మికి –

ఆటా వారి ‘తొలకరి’ (7వ ఆటా తెలుగు సమావేశం విశిష్ట సంచిక)లో నీ కథ ‘నాకూ విశ్రాంతి కావాలి’ గత రాత్రి చదివి ఉదయం లేవగానే ఈ ఉత్తరం.

కథ చదివాక కథారచనలో నీ graduation పూర్తయ్యిందనుకున్నాను. ఇంక ప్రతి కథతో ఓ మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ మాస్టరీ కోసం కృషి చేయగలవు. పాత తరం వాణ్ణి కాబట్టి శుభాశీస్సులతో…

కాళీపట్నం రామారావు

Kara Signature

PS: మూర్తితో పోటీ పడగలిగితే మహా మహా సంతోషం కానీ, అధ్యయనంలో చాలా చాలా వెనుకబడిపోయావు కదా! అయినా ప్రయత్నించు. వెనుకబడడానికి నీకున్న disadvantage నీ పాలిట Advantage కాగలదు.

కారా.

ఈ పుస్తకం ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తోంది!

నాకూ విశ్రాంతి కావాలి On Kinige

Related Posts:

  • No Related Posts

పరికిణీ!!

నాటక రచయితగా, సినీ రచయితగా, నటుడిగా పరిచయం అవసరం లేని పేరు తనికెళ్ళ భరణి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భరణి రచించిన పలు కవితల సంకలనమే “పరికిణీ!!”.
ఇందులోని కవితలన్నీ చాలా వరకు మధ్యతరగతికి చెందినవే. మిడిల్ క్లాస్ జీవితాన్ని అద్భుతంగా చిత్రించారు భరణి.
మధ్యతరగతి వారి పరిమితమైన ఆదాయాలు, అపరిమితమైన అవసరాల మధ్య పొసగని పొంతనని సహజంగా చిత్రించారు భరణి.
“విరబోసుకున్న జటాజూటం లాంటి బెంగ
అందులో నెలవొంక లాగ
లీలగ మెరిసే ఫస్టు తారీఖు!” అంటారు ‘మధ్యతరగతి మహారాజు’ కవితలో.

” నువ్వుల నూనె కన్నా, ‘ O ‘ నెగటివ్ చౌక!
ఊహల్ని తుంచుకోడమో
ఉల్లిపాయల్ని నంజుకోడమో…. మంచిది” అని ఆవకాయ పెట్టుకోడం గురించి ప్రస్తావిస్తూ  అంటారు  ‘ఖారం… ఖారంగా’ కవితలో.

మధ్యతరగతి జీవితాలకి మొత్తంగా ఓ నమూనా ‘ 30 – ఫస్ట్ నైట్ ‘  కవిత.
వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు మౌనంగా అనుభవించే వ్యధని ‘ కన్య – కుమారి’ కవితలో చదువుతుంటే కళ్ళు చెమరుస్తాయి.
తనకి ఉద్యోగం రాకపోవడానికి అసలు కారణం తనలోని లోపమేనని ఓ పట్టభద్రుడు తెలుసుకోడాన్ని – ‘ గ్రాడ్యుయేట్ ‘ అనే కవిత ఆర్ధ్రంగా వర్ణిస్తుంది.
కుటుంబంలో స్త్రీ పోషించే బహుపాత్రలను క్లుప్తంగా….పదునుగా చెబుతుంది – ‘ మా ఆవిడకి మంత్రాలొచ్చు!! ‘ కవిత.
ఇక పుస్తకానికి మకుటం అయిన “పరికిణీ!!” కవిత గురించి చెప్పడం కన్నా, చదివి ఆనందిస్తేనే ఎంతో బాగుంటుంది.

అందమైన అనుభూతుల్ని మిగులుస్తూనే, ఆలోచింపజేస్తుందీ “పరికిణీ!!” కవితా సంకలనం.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభ్యమవుతుంది.

పరికిణీ!! On Kinige

– కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మో నిషాదం కి ఘన సత్కారం

మో” కవితల సంకలనం “నిషాదం’ కవితా సంపుటికి తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం

చలన చిత్ర నటుడు భరణి, గొప్ప సాహిత్యాభిమాని కూడా. ఆయన పేరుమీదగా “తనికెళ్ళ భరణి సాహిత్య పురస్కారము్” రేపు అంటే గురువారం, 14 జూలైన, భాగ్యనగరం లోని రవీంద్ర భారతిలో, కళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్నది. ఆ రోజు తనికెళ్ళ భరణి పుట్టిన రోజు కూడా.

కృతికర్త ఐన వేగుంట మోహన ప్రసాద్‌కు స్వర్ణ పుష్పాభిషేకం తో పాటు ప్రశంసా పత్రం, యాభై వేల రూపాయల నగదు బహుమతినిని కూడా అందజేస్తారు.

వడ్డెర చండిదాస్ మాటల్లో “మో” కవిత్వం :
ప్రియమైన మో,
యీ శతాబ్దపు, యెక్వయిర్డ్ యిమ్యునో యెఫీషియన్సి సిన్-డ్రీమిక్ సంక్షుభిత యిర్రియల్ కాలం,  యింప్రెషనిస్టిక్ యెక్స్‌ప్రెషనిజ్‌మిక్ మాంతెజ్ పొయటోగ్రఫీ కవిత గా పెల్లుబీకితే, అర్ధం చేసుకోవడానికి డిస్సెక్ట్ చెయ్యబోతే – భావార్ధం, విడివిడి అవయవాల ముక్కలై సుడి గాలిలో ధూళిరేణువుల్లా చుట్టేస్తాయి
“. – వడ్డెర చండిదాస్

తనికెళ్ళ భరణి సాహితి పురస్కారానికి 108 కవితా సంపుటాలు పరిశీలనకు వస్తే, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖ సాహిత్యవేత్తలు శ్రీ వాడ్రెవు చిన వీరభద్రుడు,  ఆచార్య సి. మృణాలిని గార్ల ఏకగ్రీవ నిర్ణయానికి వేగుంట మోహన ప్రసాదు గారి కవితా సంపుటి ‘నిషాదం’ నిలబడింది.

కినిగె ఈ కవులిద్దరి సాహిత్యం ని ఈబుక్ గా మీకు అందిస్తున్నది.

కినిగెలో నిషాదం ఇక్కడ,  తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ లభ్యం.

Related Posts: