నూతన సంవత్సరం 2012 ప్రత్యేక 30 శాతం తగ్గింపు – నవ్వులు పూయించే పుస్తకాలపై

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం నవ్వులతో ఆహ్వానించండి, ఈ సంవత్సరం మొత్తం నవ్వుతూ, ఆహ్లాదంగా ఉండండి.
ఈ నూతన సంవత్సరం సందర్బంగా కినిగె నుండి అమోఘమైన ప్రత్యేకమైన 30 శాతం తగ్గింపు.
10 హాస్య రస ప్రధాన పుస్తకాలు ఒక క్లిక్కుతో కొనండి, 31.81 శాతం తగ్గింపు పొందండి.
ఆలసించిన ఆశాభంగం, ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే.
మీకు ప్రియమైనవారికి ఈ ఆఫర్ గిఫ్ట్ గా పంపండి, వారిని నవ్వులతో ముంచెత్తండి.

660 రూపాయల విలువైన ఈ పది పుస్తకాలు కేవలం 450 రూపాయలకే సొంతం చేసుకోండి.
రూపాయలకు దూరంగా ఉంటున్న తెలుగు వారు కేవలం 10 డాలర్లు పేపాల్ ద్వారా కినిగె రీచార్జ్ చేసుకోని ఈ 10 పుస్తకాలూ స్వంతం చేసుకోవచ్చు. అంటే కేవలం డాలరుకే ఒక పుస్తకం. మరింకెందుకు ఆలస్యం? Visit now http://kinige.com/koffer.php?id=33

Related Posts:

చరిత్రకు పదునుపెడుతున్న చరిత్రకారుడు

ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు అయిన సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన “భారత స్వాతంత్ర్యోద్యోమం: ఆంధ్రప్రదేశ్ ముస్లింలు” పుస్తకం గురించి 12 డిసెంబర్, 2011 నాటి హైదరబాద్ మిర్రర్ దినపత్రిక లోని “అక్షర మిర్రర్” శీర్షికలో సుప్రసిద్ధ రచయిత, విశ్లేషకులు కత్తి పద్మారావు విశ్లేషించారు.

ఆధునిక ఆంధ్రుల సాహితీ చరిత్రను పునర్మించడంలో సయ్యద్ నశీర్ అహమ్మద్ గారిది ఉన్నతమైన పాత్రని కత్తి పద్మారావు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆద్యుడైన సబాల్ట్రన్ హిస్టోగ్రఫీ విధానంలోనే నశీర్ అహమ్మద్ రచన సాగిందని కత్తి పద్మారావు అభిప్రాయపడ్డారు. నశీర్ అహమ్మద్ రచనా క్రమంలో విజువలైజేషన్ ఉంటుందని, అందువల్లే ఆయన పుస్తకాలు ఆయనతో పాటుగా పాఠకుడిని సుదూరాలకు తీసుకువెడతాయని పద్మారావు పేర్కొన్నారు.

సబాల్ట్రన్ స్టడీస్‍కు అమూల్య గ్రంథం చేర్చిన నశీర్ అహమ్మద్ కాంట్రిబ్యూషన్ మరువలేనిదని కత్తిపద్మారావు వ్యాఖ్యానించారు.

ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ లింక్‍లో చదవగలరు.

సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తున్నాయి.

ఈ పుస్తకాలపై తగ్గింపు కూడా ఉంది. వివరాలకు ఈ లింక్ చూడండి.

సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ పుస్తకాలు 25 శాతం తగ్గింపు ధరకు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కథా విశ్లేషణ పోటీ!

తెలుగు కథ శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో 200 కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ నిర్వహిస్తోంది.

ఈ పోటీకి తెలుగులో బ్లాగులు నడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు చేయవలసినదల్లా కథాజగత్‌లోని కథల్లో ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథ మీకు ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో వివరిస్తూ ఆ కథపై మీ విశ్లేషణను ఇచ్చిన గడువులోగా మీ బ్లాగులో ఒక టపా వ్రాసి ఆ టపా లంకెను తురుపుముక్క బ్లాగులో కామెంటు రూపంలో ఇవ్వడమే.

వచ్చిన ఎంట్రీలలో ఉత్తమమైన మూడు విశ్లేషణలను కథాసాహిత్యంలో పేరుగాంచిన న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయించి బహుమతులు ఇవ్వనున్నారు.

బహుమతుల వివరాలు:
మొదటి బహుమతి : 2000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
రెండవ బహుమతి : 1000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
మూడవ బహుమతి : 500/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహక బహుమతి.

ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 31-01-2012.

పూర్తి వివరాలకు తురుపుముక్క బ్లాగులోని ఈ టపా చూడండి.

Related Posts:

పుస్తకానికి కొత్త కళ

పుస్తకానికి కొత్త కళ అనే శీర్షికతో ది. 22 డిసెంబరు 2011 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్ ఎడిషన్‍లో వెలువడిన వార్తా కథనంలో నగరంలో జరుగుతున్న 26వ పుస్తక ప్రదర్శన గురించి ప్రస్తావించారు.

విజ్ఞానానికి సాంకేతికత తోడవుతోందని చెబుతూ, ప్రపంచీకరణ నేపధ్యంలో ఎగువ మధ్యతరగతి ప్రజలలో మార్పు వచ్చిందని, వారి అవసరాలు తీర్చడం కోసం ప్రచురణకర్తలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని ఈ కథనం పేర్కొంది. టెక్నలజీ ఆలంబనలో పుస్తకం కొత్త కళని సంతరించుకుంటున్న వైనాన్ని ప్రస్తావించింది.
కినిగె గురించి వ్యాఖ్యానిస్తూ, “కినిగె పుస్తకం కేవలం కాగితానికే పరిమితం కాకుండా సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకుని, కొత్త తరానికి అందుబాటులోకి వచ్చింది” అని ఈ కథనం పేర్కొంది.

పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్ నొక్కండి.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ఎమ్బీయస్ కబుర్లు జనవరి 2010

విషయ సూచిక:
1. జనవరి 5న ఏం జరగబోతోంది…?
2. రోశయ్య గారు అలా అనకూడదా…?
3.హీరోలకు యాస వుండదేం…?
4.సినిమాల్లో తెలంగాణావారిని రానివ్వరా…?
5.యాస గురించి మరికొంత…
6. నాకేం కడుపునొప్పి?
7. జనవరి 5కి ముందూ, తర్వాత
8. తాడూ వుంది, బొంగరమూ వుంది
9.చిరంజీవి మాటల్లో అనౌచిత్యం…..?
10.మీడియాపై జాలిపడాలా?
11.కావూరి కావు కావు….
12.మతి చెదుర్స్…..
13.డిపెండెంట్సా? ఇండిపెండెంట్సా?
14. ‘మేం గెలిపించుకుంటాం….’
15. గోన గన్నారెడ్డి 1 – 7
16. భద్రం బీ కేర్‍ఫుల్ బ్రదరూ 1-5
17. గుమ్మడికి నివాళి 1-5

ఇది నేను గ్రేట్ ఆంధ్రా డాట్‍కామ్‍లో "ఎమ్బీయస్ కబుర్లు" అనే శీర్షికలో 2010 జనవరిలో రాసిన వ్యాసాల (ఆర్టికల్స్) సంకలనం.

ఈ ఆర్టికల్స్ సబ్జెక్ట్ వారీగా విడగొట్టబడి ఉండవు. వీటిలో రాజకీయాల గురించి ఆర్టికల్స్ ఉన్నాయి, సమాజపరమైనవి ఉన్నాయి, గోనగన్నారెడ్డి నవల పరిచయం ఉంది, గుమ్మడి గారికి నివాళి ఉంది. ఇది ఒక కలగూర గంప. మీకు కావల్సింది మీరు ఏరుకుని చదవవచ్చు.

ఈ పుస్తకం మీకు నచ్చితే తెలియబరచండి. తక్కినవి కూడ అందుబాటులోకి తెస్తాను.

- ఎమ్బీయస్ ప్రసాద్

 

—-

ఈ పుస్తకం ఇప్పుడు కినిగెలో ఈ-పుస్తకంగా లభిస్తుంది. వివరాలకు ఇక్కడ నొక్కండి

ఎమ్బీయస్ కబుర్లు జనవరి 2010 On Kinige

Related Posts:

ఎమ్బీయస్ కబుర్లు జనవరి 2010

విషయ సూచిక:
1. జనవరి 5న ఏం జరగబోతోంది…?
2. రోశయ్య గారు అలా అనకూడదా…?
3.హీరోలకు యాస వుండదేం…?
4.సినిమాల్లో తెలంగాణావారిని రానివ్వరా…?
5.యాస గురించి మరికొంత…
6. నాకేం కడుపునొప్పి?
7. జనవరి 5కి ముందూ, తర్వాత
8. తాడూ వుంది, బొంగరమూ వుంది
9.చిరంజీవి మాటల్లో అనౌచిత్యం…..?
10.మీడియాపై జాలిపడాలా?
11.కావూరి కావు కావు….
12.మతి చెదుర్స్…..
13.డిపెండెంట్సా? ఇండిపెండెంట్సా?
14. ‘మేం గెలిపించుకుంటాం….’
15. గోన గన్నారెడ్డి 1 – 7
16. భద్రం బీ కేర్‍ఫుల్ బ్రదరూ 1-5
17. గుమ్మడికి నివాళి 1-5

ఇది నేను గ్రేట్ ఆంధ్రా డాట్‍కామ్‍లో "ఎమ్బీయస్ కబుర్లు" అనే శీర్షికలో 2010 జనవరిలో రాసిన వ్యాసాల (ఆర్టికల్స్) సంకలనం.

ఈ ఆర్టికల్స్ సబ్జెక్ట్ వారీగా విడగొట్టబడి ఉండవు. వీటిలో రాజకీయాల గురించి ఆర్టికల్స్ ఉన్నాయి, సమాజపరమైనవి ఉన్నాయి, గోనగన్నారెడ్డి నవల పరిచయం ఉంది, గుమ్మడి గారికి నివాళి ఉంది. ఇది ఒక కలగూర గంప. మీకు కావల్సింది మీరు ఏరుకుని చదవవచ్చు.

ఈ పుస్తకం మీకు నచ్చితే తెలియబరచండి. తక్కినవి కూడ అందుబాటులోకి తెస్తాను.

- ఎమ్బీయస్ ప్రసాద్

 

—-

ఈ పుస్తకం ఇప్పుడు కినిగెలో ఈ-పుస్తకంగా లభిస్తుంది. వివరాలకు ఇక్కడ నొక్కండి

ఎమ్బీయస్ కబుర్లు జనవరి 2010 On Kinige

Related Posts:

యమ్బీయస్ ప్రసాద్ గారికి కినిగెకు స్వాగతం

ఆబాలగోపాలాన్నీ ఆహ్లాదపరచిన హాసం (సంగీత, హాస్య పత్రిక) పత్రిక మాగజైన్ ఎడిటరుగా,

గ్రేట్ ఆంధ్రా డాట్ కాం లో పాపులర్ కాలమిస్టుగా,

అచలపతి కథలు రచయతగా,

ఇరవై పైపడిన పుస్తకాల రచయతగా,

కోతి కొమమచ్చి పుస్తకం లే అవుట్ రూపకరునిగా,

అనువాదకునిగా,

టీవీ వ్యాఖ్యాతగా,

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన యమ్బీయస్ ప్రసాద్ గారికి కినిగె కు స్వాగతం.

వారి పుస్తకాలు కినిగెలో ఈ-పుస్తకాలుగా అందుపాటులోకి రానున్నాయి.

వివరాలకు ఇక్కడ నొక్కి చూడండి.

Related Posts:

సి. ఐ. డి. షాడో

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు వ్రాసిన రొమాంఛిత సస్పెన్స్ థ్రిల్లర్ “సి. ఐ. డి. షాడో”

ఓ రోజు కులకర్ణి షాడోని పిలిచి, “రాజూ, ఓ సారి బంగ్లాదేశ్ వెళ్ళివస్తావా?” అని అడిగారు. ఎందుకని షాడో అడగలేదు, ఆయనా వివరాలు చెప్పలేదు. షాడో బంగ్లాదేశ్ చేరే సరికి అతని కోసం బోలెడు సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. బయటి శత్రువులని జయించి, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఆ దేశానికి అంతర్గత శత్రువులు తయారయ్యారు. వాళ్ళని ఎదుర్కుని, నిర్మూలించడానికి మిలిటరీ సి. ఐ. డి. గా షాడో రంగంలోకి దిగుతాడు.

తిమోతీ పట్టణంలో అడుగుపెడుతునే షాడోకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఏమిటా ప్రమాదాలు? షాడో రాక గురించి శత్రువులకి ఎలా తెలిసిపోయింది? షాడోకి వ్యతిరేకంగా రాసి ప్రజలని రెచ్చగొట్టాలని ఓ మహిళా జర్నలిస్ట్ ఎందుకు ప్రయత్నించింది? మరో పత్రిక యజమాని షాడోకి ఏ విధంగా సాయం చేసాడు?

ఆసాంతం ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీ నేడే సొంతం చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

సి.ఐ.డి. షాడో On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

రాబందు వాలిన నేల

సరిగ్గా ఇరవై ఏళ్ళ కింద 1991 జూలై 1న కేంద్రప్రభుత్వ విధాన ప్రకటనతో ఈ దేశంలో ప్రపంచీకరణ విధానాలు మొదలయ్యాయి. పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్ధికమంత్రిగా, పి. చిదంబరం వాణిజ్యమంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ నూతన ఆర్ధిక విధానాలు అంతకు ముందు నుంచీ కొనసాగుతున్న పాలకవర్గ దోపిడీ, పీడనలను మరింత తీవ్రతరం చేసాయి. ఒక మలుపు తిప్పాయి. దేశాన్ని సామ్రాజ్యవాద రథచక్రాలకు మరింతగా కట్టివేసాయి. ఈ దేశవనరులను దేశదేశాల సంపన్నులకు భోజ్యంగా మార్చాయి. ఈ దేశ శ్రామికులను, పీడితులను మరింత దారిద్ర్యంలోకి, పీడనలోకి నెట్టాయి. ఆ తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రాలలోను అధికారంలో ఉన్న అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలూ ఆ విధానాలను కొనసాగించాయి. అలా ఈ రెండు దశాబ్దాలలో వేరు వేరు రూపాలలో, వేరు వేరు రంగాలలో సాగుతున్న రాజకీయార్ధిక విధానాల మీద సమకాలీన స్పందనల, వ్యాఖ్యల, విశ్లేషణల సంకలనం ఇది. నూతన ఆర్ధిక విధానాల ప్రకటన జరిగిన పది రోజులకు 1991 జూలై 12న అచ్చయిన వ్యాసంతో ఎన్. వేణుగోపాల్ ఆ విధానాలతో సంవాదం ప్రారంభించారు. గడచిన ఇరవై సంవత్సరాలలో ప్రపంచీకరణ రాజకీయార్థిక అంశాలపై రాసిన దాదాపు రెండువందల నలభై వ్యాసాలలోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంకలనం ఇది.

 

ఈ పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఇక్కడ నొక్కండి.

రాబందు వాలిన నేల On Kinige

Related Posts:

చైనీస్ పజిల్

ప్రముఖ డిటెక్టివ్ నవలల రచయిత మధుబాబు కలం నుండి జాలువారిన మరో థ్రిల్లర్ చైనీస్ పజిల్.

ప్రొఫెసర్ హోచిమిన్ పది సంవత్సరాల పాటు కష్టపడి అపూర్వమైన ఒక టాబిలెట్‌ని కనిపెట్టాడు. ఇంతవరకూ ఎటువంటి మందులకూ లొంగని కాన్సర్ వ్యాధిని సైతం రెండు వారాల్లో మటుమాయం చేయగల శక్తి ఆ టాబిలెట్‌కి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ ఆ టాబిలెట్‌ని తయారు చేయడంలో ఏదో పొరపాటు జరిగింది. ఫలితంగా కాన్సర్ వ్యాధిని తగ్గించే మందుకు బదులు దారుణ పరిణామాల్ని సృష్టించే మరో పాయిజన్ టాబిలెట్ సృష్టించబడింది.

ఆ పాయిజన్ టాబిలెట్‌ని సేవించినవాళ్ళు తిండి నిద్ర అవసరం లేకుండా ఇరవై నాలుగు రోజులపాటు యంత్రాల్లా పనిచేయగలరు. వాళ్ళ శక్తియుక్తులు, తెలివి తేటలు అన్నీ వందరెట్లు అభివృద్ధి చెందుతాయి. వట్టి చేతులతో కాంక్రీట్ గోడల్ని పగలగొట్టగలరు. ప్రపంచాన్ని అల్లకల్లోలం పాలు చేయటానికి కంకణం కట్టుకొన్న ఏ కిల్లర్స్ గాంగ్‌ దృష్టి ఈ టాబిలెట్‌పై పడిండి. వెంటనే వివిధ దేశాలలో ఉన్న వారి ఏజంట్లు ప్రొఫెసర్ కోసం వేట ప్రారంభిస్తారు. చివరికి బిబ్లీఖాన్ అనుచరులు హోచిమిన్‌ని అపహరించి, చైనా, ఝరియా ఏజెంట్లతో బేరం పెడతారు.

ఇంటర్‌పోల్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన షాడో హోచిమిన్‍ని ఎలా రక్షించాడు? చైనా పజిల్‌ని ఎలా ఛేదించాడో తెలుసుకోవాలంటే ఈ రోమాంచక నవల చదవాలి.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

చైనీస్ పజిల్ On Kinige

Related Posts: