శీలమా? అదియేమి?

అనామకుడు అనే కలంపేరుతో డా. ఎ. ఎస్. రామశాస్త్రి రాసిన కథా సంకలనం – “శీలమా? అదియేమి?“.

సిద్ధాంతాల మూసకట్టులోంచి కాకుండా విశాల జీవితానుభవం నుంచి వచ్చిన కథలివి. ఇందులోవి చాలా వరకు బహుమతి పొందిన కథలే. ఇందులో మొత్తం 21 కథలున్నాయి. కొన్ని కథల గురించి ప్రస్తావిస్తాను.

అనంతం: ఈ కథలోని ప్రధానపాత్ర రామ్మూర్తికి హఠాత్తుగా తను చచ్చిపోతాననే భయం పట్టుకుంటుంది. కొడుకు కోడలితోనూ, మనవడితోనూ, మిత్రబృందంతోనూ ఉల్లాసంగా ఉండలేక పోతాడు. ఎప్పుడూ అదే దిగులు….. మానసికంగా కృంగిపోతుంటాడు. భయాన్ని దూరం చేసుకోడానికి వీలైనంత సేపు సముద్రపుటొడ్డున కూర్చుంటుంటాడు. చివరికి, చావుకి భయపడేకన్నా, చచ్చిపోవడమే నయమని భావించి సముద్రంలోకి నడవబోతాడు. అప్పుడో పదహారేళ్ళ అమ్మాయి ఎదురై అతన్ని ఆపుతుంది….. జీవితం వైపు నడుపుతుంది. ఆసాంతం ఆసక్తిగా సాగిపోయిన ఈ కథలో సముద్రం గురించి, కెరటాల గురించి రాసిన వాక్యాలు చదువుతూంటే మనమూ సముద్రం ముందు బీచ్‍లో కూర్చున్నట్లుంది.

అసంపూర్ణం: ఇది ఇద్దరు బావామరదళ్ళ కథ. బావ (కథకుడు) బాగా చదువుకుని గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. అతనికెంత సేపు విజ్ఞానం మీదే దృష్టి! ప్రకృతిని ఆస్వాదించేంత సమయమూ, ఆసక్తి, భావుకత లేవు. ఇందుకు భిన్నంగా, మరదలు శైలజ భావుకురాలు. ప్రకృతిని ఆస్వాదించలేని బావ స్వభావాన్ని అర్థం చేసుకున్న ఆమె అతనికి తనకి జోడీ సరిపోదని గ్రహించి అతనితో పెళ్ళికి నిరాకరిస్తుంది. ఇద్దరూ వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకుని తమ జీవితాలను గడుపుతూంటారు. కథకుడు తను ఎంచుకున్న రంగంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడు. అయినా అతనిలో ఏదో అసంతృప్తి. కొన్నేళ్ళ తర్వాత ఓ ఫంక్షన్‍లో బావామరదళ్ళు కలుస్తారు. మరదలితో తన బాధని వ్యక్తం చేస్తాడు. బదులుగా, మరదలు నవ్వుతుంది. ఆ నవ్వులో అతనికి ఎన్నో అర్థాలు గోచరిస్తాయి. మనుషులను అర్థం చేసుకోకబోతే, ఏం జరుగుతుందో ఈ కథ చెబుతుంది.

ఆరంభం: ఓ పౌరాణిక గాధ ఆధారంగా అల్లిన కథ ఇది. వసుదేవుడు కృష్ణుడిని రహస్యంగా రేపల్లెకి తీసుకురావడం గురించిన కథ. ఓ గడ్డపాయన బుట్టలో బాబుని పెట్టుకుని యమునానదిని దాటి రేపల్లె వస్తాడు. దార్లో ఎదురైన ఓ అవిటి బాలుడిని ఊరిపెద్ద ఇల్లెక్కడ అని అడుగుతాడు. కుంటి బాలుడు నందుడి ఇంటికి దారి చూపించడంతో పాటు, వర్షంలో బాబు తడవకుండా గొడుగు వేసి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లారి నిద్రలేచేసరికి అతని శారీరక వైకల్యం పోయి, కాలు బాగయిపోతుంది. దైవం లీలలని ఉద్దేశించి రాసిన కథ ఇది.

ఏ గాలెటు వీస్తుందో: ఓ ఆర్థికవేత్త కథ ఇది. దేశంలో వడ్డీరేట్లు తగ్గాలని, అప్పుడే మన దేశం ఆర్ధికంగా పురోగతి సాధిస్తుందని నమ్మే అతను, పెన్షన్ డబ్బులపై వచ్చే వడ్డీ సరిపోక ఇబ్బందులు పడుతున్న మావయ్య కుటుంబాన్ని చూడాడానికి వస్తాడు. తను చెప్పే సిద్ధాంతం వారి జీవితాన్ని క్రుంగదీస్తుందోని గ్రహిస్తాడు. మరి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడా, లేదా? చిన్నప్పుడు తనకి సాయం తన వృద్ధికి దోహదం చేసిన మావయ్యకి ఇప్పుడతను ఏమైనా చేయగలిగాడా? ఆర్ధికవేత్త దృక్పథానికి, సామాన్య మధ్యతరగతి మహిళ దృక్కోణానికి మధ్య ఉండే వైరుధ్యాన్ని ఈ కథ చక్కగా వ్యక్తీకరించింది.

ఓ అజ్ఞానం లోంచి: ఇది ఓ పాత్రికేయుడి కథ. ఒక రచయిత గురించిన కథ. రెండు సుప్రసిద్ధ నవలలు రాసి, ఆ తరువాత విరమించి ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా గడుపుతున్న ఆ రచయితని ఇంటర్వ్యూ చేసి ఓ వ్యాసం రాయలనేది విలేఖరి ఉద్దేశం. ఆ రచయిత ఎవరు? ఆ విలేఖరి సంకల్పం నెరవేరిందా?

ఓ వందనోటు కథ: డబ్బు నల్లధనంగా ఎలా మారుతుందో సోదాహరణంగా తెలియజేసిన కథ ఇది. “నల్ల ధనం నిరోధించడం ప్రభుత్వం, బ్యాంకులు చేసేపని కాదు. నల్లధనం ఉండకుండా ఉండాలంటే కరెన్సీ నోట్లను కాదు తెలుపు చేయాల్సింది….. మన మనస్సులను..” అంటుందీ కథ.

క్రైం 2000: ఇంటర్‍నెట్ ఆధారంగా చేసే సైబర్ నేరాలను ప్రస్తావిస్తూ, బ్యాంకు దొంగతనం సులువుగా ఎలా చేయచ్చో ఓ కుర్రాడు నిరూపిస్తాడు. అయితే మరో కుర్రాడు అంతే తెలివిగా ఈ నేరాన్ని నిరూపించి పోలీసులకు సాయం చేస్తాడు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ కాలంలో ప్రతీ ఒక్కరు ఎంత అప్రమత్తత ఉండాలో ఈ కథ చెబుతుంది.

గూళ్ళు: విపరీతంగా పెరిగిపోతున్న అపార్టుమెంట్ సంస్కృతిలో, ఓ ఫ్లాట్‍లో ఉంటున్న ఓ యువజంట కథ ఇది. వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వారి జీవితం ఎలా సాగుతోందీ, మార్పు కోసం ఏం చేయాలనుకున్నారు… ఇలా ఈ కథ ఆసక్తిగా సాగుతుంది. ఈ కథలోని చాలా సంఘటనలు మన అందరి జీవితాలలోనూ తారసపడేవే.

తెరవెనుక: ఇదో చక్కని కథ. మనిషికి తప్పు చేయాలనే ఆలోచన ఎందుకు కలుగుతుంది? తప్పు అనే భావన ఆలోచనలో ఉంటుందా? ఆచరణలో ఉంటుందా? వ్యక్తిగతంగా మనుషులకి ఉండే పిరికితనమే సమాజానికి లాభదాయకమా? ఇలా ఎన్నో ప్రశ్నలతో ఆలోజింపజేస్తుందీ కథ.

మీ: స్వర్గస్తుడైన తండ్రికి ఉత్తరం రూపంలో నివాళి అర్పించిన కొడుకు కథ ఇది. మనసు ఆర్ద్రమైపోతుంది ఈ కథ చదివాక.

మెరీనా…మెరీనా: ” ఏదో వస్తుంది… ఇంకేదో పోతుంది. ఓ దశ నుంచి ఇంకో దశకి ఎదగడం…. ఇదే జీవితం” అని ఈ కథ చెబుతుంది. స్వేచ్ఛలోనే ఆనందం ఉందనుకునే వ్యక్తి, బాధ్యతలోనూ ఆనందం ఉందని తెలుసుకుంటాడీ కథలో.

విముక్తి: మరణానికి దగ్గరగా ఉండి, ఇంకా మృత్యుఘడియలు సమీపించని వయోవృద్ధులుండే కుటుంబాలు ఎదుర్కునే సమస్యల గురించిన కథ ఇది. మనుషుల అవసరాలు, మనస్తత్వాలు బంధాలను ఎలా నిర్దేశిస్తాయో ఈ కథ చెబుతుంది. నిడివి ఎక్కువైనా చివరిదాకా ఆసక్తిగా చదివిస్తుంది.

శీలమా? అదియేమి?: శీర్షికలోనే కథ ఏమిటో చెప్పేసే కథ ఇది. శీలమంటే ఏమిటో విశ్లేషించారు రచయిత ఈ కథలో. ప్రగతి అంటే బాహ్యాలంకరణ కాదని, ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ పురోగతి కావాలని రచయిత అంటారు. ఈ కథలో రచయిత విశ్వనాధ సత్యనారాయణగారి వాడుక భాష వంటి గ్రాంథిక భాషను ఉపయోగించే శైలిని వాడడానికి రచయిత ప్రయత్నించారు.

రచన శైలి ఆహ్లాదంగా ఉంటూ, ఆసాంతం హాయిగా చదివించే గుణం కలిగిన ఈ కథలు చదువరులలో ఆలోచనలు రేకెత్తిస్తాయి. మంచి కథలని చదివిన తృప్తి పాఠకులకు కలుగుతుంది. ఈ పుస్తకం ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ నొక్కండి.

శీలమా ? అది యేమి? On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

స్వీట్ హోం

స్వీట్ హోమ్ నవల మొదటి భాగం 1967లోనూ, రెండవ భాగం 1968లోనూ, మూడవ భాగం 1999లోనూ వెలువడ్డాయి. 2004లో ఈ మూడు భాగాలూ కలిపి ఒకే సంపుటంగా వెలువడింది.

ఈ నవల విమల, బుచ్చిబాబు అనే భార్యభర్తల కథ. బుచ్చిబాబుకి, ‘భర్త స్వభావం’ లేదు. భార్య మీద పెత్తనాలు చెయ్యడం, ఆధిక్యత కోసం తహతహలాడడం చెయ్యడు. విమలకి కూడా ‘భార్య స్వభావం’ లేదు. భర్త ముందు పిరికిగా, జంకుగా లొంగుబాటుగా ప్రవర్తించదు. ఇద్దరూ చనువుగా, స్నేహంగా ఉంటారు.

కొంతమంది మనుషులు తెలియకే తప్పులు చేస్తారు. తప్పు చేసినట్టు తెలుసుకుగాని దాన్ని సరిజేసుకోడానికి తహతహలాడుతారు. విమలా బుచ్చిబాబు అలాంటి వాళ్ళే. మరి వీరి కథ చదువుకోడం, వీళ్ళని తెలుసుకోడం పాఠకులకు ఆసక్తిగా ఉండదూ?

సంసారంలో కలకాలం కలసిమెలసి సాగేందుకు, నిండైన జీవితం గడిపేందుకు భార్యభర్తలు ఎలా నడుచుకోవాలో సూచించే కథ ఇది. కథ హాస్యంగా సాగుతూనే, భార్యభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది.

ఒక ఇల్లు నిజంగానే స్వీట్ హోమ్ అవ్వాలంటే, స్త్రీ పురుషులిద్దరూ చాలా జ్ఞానవంతులై వుండాలి, మంచి చెడ్డల విచక్షణ గల వాళ్ళై వుండాలని అంటారు రచయిత్రి.

స్వీట్ హోం నవల ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెపై. వివరాలు ఇక్కడ

స్వీట్ హోమ్ On Kinige

Related Posts:

తెలుగు కథ హద్దులు చెరిపిన డయాస్పోరా

సాయి బ్రహ్మానందం గొర్తి కథాసంకలనం “సరిహద్దు“పై 19 అక్టోబరు 2011 నాటి నవ్య వారపత్రికలో సమీక్ష ప్రచురితమైంది. సమీక్షకులు సి. ఎస్. ఆర్.
సాయి బ్రహ్మానందం అమెరికాలో స్థిరపడిపోయి ప్రతిభావంతంగా రాస్తున్న బహుకొద్దిమంది రచయితల్లో ఒకరు.
సాయి బ్రహ్మానందం కథలలో కొన్నింటిని చదవగానే అవి ఎంత కలవరపెడతాయంటే, మిగిలిన కథల్ని వెంటనే చదవడానికి మనసొప్పుకోదని సమీక్షకుడు అభిప్రాయపడ్డారు. ఈ సంకలనంలోని దాదాపు కథలన్నీ స్త్రీల జీవితాలు, వారి సమస్యల చుట్టూ పరిభ్రమిస్తాయి.
జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు జీవం పోసి, పాత్రలను సృష్టించి వాటిని మన అంతర్లోకాలకు తోడ్కొనిపోయి రచయితగ తన మనోధర్మాన్ని ఎరుకపరచడంలో కృతకృతులయ్యారని సమీక్షకులు అన్నారు. ఈ కథలింత బావుడండానికి కారణం రచయిత శైలితో పాటు, చిన్న చిన్న వాక్యాలలో పెద్ద పెద్ద జీవిత సత్యాలను సున్నితంగా చెప్పడమేనని సమీక్షకులు భావించారు.
పూర్తి సమీక్షని ఈ లింక్‌లో చదవగలరు.
ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ నొక్కండి.

సరిహద్దు On Kinige

Related Posts:

బ్లాగు పుస్తకం బహుమతిగా ఇవ్వండి

బ్లాగు పుస్తకం బహుమతిగా ఇవ్వండి,

బ్లాగు ప్రపంచానికి ఆహ్వానించండి.

 

బ్లాగులు రాయాలని ఉండి మార్గదర్శకత్వం కోసం చూసేవారికి,

బ్లాగులు రాయాలని ఉండి అందులోని మంచి-చెడు ఆలోచిస్తూండేవారికి

సహాయకారిగా ఉండటానికి, బ్లాగు పుస్తకం మీ కోసం సిద్దంగా ఉంది.

 

ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి మీ ప్రియమైన వారికి బ్లాగులని పరిచయం చెయ్యండి.

భారతదేశంలో ఎక్కడికైనా ప్రింట్ పుస్తకాన్ని కూడా పంపించవచ్చు. వెల 26% తగ్గింపు తరువాత కేవలం 170/-  రూపాయలు మాత్రమే. షిప్పింగ్ పూర్తిగా ఉచితం. ఆర్డర్ ఇవ్వడానికి ఇప్పుడే దర్శించండి బ్లాగు పుస్తకం.

రచన –

మనసులో మాట బ్లాగరు – సుజత

సత్యాన్వేషణ బ్లాగరు – రహ్మాన్

టెక్నికల్ ఎడిటర్ – కిరణ్ కుమార్ చావా

బ్లాగు పుస్తకం On Kinige

Related Posts:

 • No Related Posts

మీ కంప్యూటరుకు తెలుగు రుచి చూపండి

తెలుగులో కంప్యూటర్లో పని చేయడమంటే అదేదో బ్రహ్మ విద్యనో లేకపోతే కేవలం కొందరు సాంకేతిక విజ్ఞానం కలవారికి మాత్రమే సొంతం అన్నది నిన్నటి మాట.

సురవర కీబోర్డ్ మీ చెంతనుండగా మీకు వేరే ఏ సాఫ్టువేర్ల అవసరం లేకుండానే, చాలా సులువుగా తెలుగులో టైప్ చెయ్యవచ్చు.

ఈ కీబోర్డ్

 • కంప్యూటర్లు, ల్యాప్టాప్ల పై పని చేస్తుంది.
 • మైక్రోసాఫ్ట్ విండోస్ 7, ఎక్స్పీ, విస్టా, లినక్స్, అను ఫాంట్స్ పై పని చేస్తుంది.
 • ఇంగ్లిష్, తెలుగు రెండూ టైప్ చెయ్యండి.
 • ఇన్స్క్రిప్ట్ స్టాండర్డ్ నిమిషాల్లో నేర్చుకోండి
 • మీ కంప్యూటరుకు తెలుగు రుచి చూపండి

సురవర తెలుగు కీబోర్డ్ ఇప్పుడే కొనుగోలు చెయ్యడానికి ఇక్కడ నొక్కండి.

ఈ కీబోర్డ్ తో మీరు…

 • అతిసులభంగా తెలుగులో టైప్ చేయండి
 • తెలుగులో ఈ-మెయిల్స్ పంపించండి
 • తెలుగులో చాటింగ్ చేయండి
 • తెలుగులో కథలు, నవలలు రాయండి
 • తెలుగులో డాక్యుమెంట్లు ప్రింట్ చేయండి
 • తెలుగులో వెబ్సైట్లు నడపండి.

సాంకేతిక సహాయం: ఈ కీబోర్డ్ గురించిన చర్చ, సమస్యా-సమాధానాలను సురవర కీబోర్డ్ గుంపు లో చర్చించండి. గుంపు లంకె ఇక్కడ ఉంది.

సురవర తెలుగు కీబోర్డ్ ఇప్పుడే కొనుగోలు చెయ్యడానికి ఇక్కడ నొక్కండి.

తెలుగు కీబోర్డ్ On Kinige

Related Posts: