అచలపతి కథలు-1

గ్రేట్ ఆంధ్రా డాట్‍కామ్‍లో ఎమ్బీయస్ కబుర్లు శీర్షిక ద్వారా సుపరిచరితులైన రచయిత ఎమ్బీయస్ ప్రసాద్.

ఆంగ్ల హాస్యరచయిత పి.జి.ఉడ్‌హౌస్‌ రచనలంటే ఎమ్బీయస్ ప్రసాద్ గారికెంతో ఇష్టం. ఆయన భావవ్యక్తీకరణను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ప్రయత్నమే అచలపతి కథలు. జీవ్స్‌, వూస్టర్‌ పాత్రల స్ఫూర్తితో అచలపతి, అనంతశయనంలను మలచుకుని ఈ కథలు రాశారు.

ఈ వుడ్‌హౌస్ కథలను ఎమ్బీయస్ ప్రసాద్ గారు తెలుగులో చెప్పారు. ఇది అనువాదం కాదు – అనుసృజనా కాదు.. తెన్గింపు కాదు – తెలుగింపు. ఇంపైన సొంపైన తేట తెలుగులో హాయిగా చెప్పారు.

అచలపతి అనంతశయనానికి కార్యదర్శిలాంటివాడు. అనంత్ పెద్ద తెలివైన వాడని భావించుకుని చిక్కుల్లో పడినప్పుడల్లా అచలపతి తన తెలివితేటలతో అతన్ని బయట పడేస్తూ ఉంటాడు. ప్రింట్ పుస్తకంలో మొత్తం 18 కథలుండగా, ఈ-బుక్‌ని రెండు భాగాలుగా విభజించి తొమ్మిది కథలతో మొదటి భాగాన్ని విడుదల చేసారు రచయిత.

ఈ కథల గురించి తెలుసుకుందాం. హాస్యపూరితమైన సంభాషణలు కథలకి సొబగులద్దాయి.

అచలపతీ – అమితజీవీ: ఈ కథలో ఓ కుర్రాడికి సినిమా పిచ్చి. తన తండ్రి తనకు నిజమైన తండ్రి కాదని, తాను ఏ జమీందారు బిడ్డనోని, చిన్నప్పుడు దొరికితే ఈ తల్లిదండ్రులు పెంచుకుంటున్నారని భావించే వ్యక్తి. ఈ పిచ్చిని వదిలించడానికి అనంతశయనం ఓ ఉపాయం పన్నుతాడు. ఆ అబ్బాయి ఏమైతే ఊహించుకుంటున్నాడో అవన్నీ నిజమని, అయితే వాళ్ళ కుటుంబాన్ని వేరు చేసిన ఆ ముగ్గురు విలన్లు ఇప్పుడు జీవించి లేరని, పగప్రతీకారలనే ఆలోచనలు మానుకుని ఇక బుద్ధిగా చదువుకోమని చెబుతాడు. అయితే పదిరోజుల తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. నువ్వే నా తండ్రివంటూ ఆ కుర్రాడు అనంతశయనం వెంట పడతాడు. ఈ సమస్యని అచలపతి ఎలా పరిష్కరించాడనేది ఆసక్తికరం. “శివాజీ గణేశన్ మైలుకి తక్కువ డైలాగు చెప్పినంత ఒట్టు… ముళ్ళపూడి వెంకటరమణ దీర్ఘోపన్యాసం ఇచ్చినంత ఒట్టు” – అనేది ఈ కథలో బాగా నవ్వించే వ్యాక్యం.

అచలపతీ – అరబాటిలు ధైర్యమూ: ఖగపతి అనే మిత్రుడు ఓ స్కూలు టీచరుని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ గురించి ఆమెకి ఎలా చెప్పాలో, ఏమని ఒప్పించాలో తెలియక అనంతశయనం వద్దకు వస్తాడు. అ టీచరు ఖగపతి బొత్తిగా చవటని, చొరవలేని మనిషని భావిస్తుంది. అందుకని అర్జెంటుగా ఖగపతిని ధైర్యశాలిని చేసేయ్యాలని నిర్ణయించుకుంటాడు అనంతశయనం. బడిపిల్లలకి బహుమతి ప్రదానానికి ముఖ్య అతిథిగా ఖగపతిని ఏర్పాటు చేస్తాడు. భయస్తుడైన ఖగపతి వణికిపోతుంటే అరబాటిల్ ధైర్యాన్ని పోయిస్తాడు అనంతశయనం. మత్తులో స్టేజి మీద వీరంగం వేస్తాడు ఖగపతి. మత్తు దిగాక, మర్నాడు అతనికి మరో భయం పట్టుకుంటుంది – ఆ టీచర్ తనని అసహ్యించుకుంటుందేమోనని! అనంతశయనం మరో అయిడియా ఇచ్చి – ఆ టీచర్ పేరుతో ఉత్తరం రాయిస్తాడు. కథలో మలుపేంటంటే – ఖగపతి, అనంతశయనం ఊహించుకున్నట్లు కాకుండా ఆ టీచర్ ఖగపతిని ఇష్టపడుతుంది. తనను మర్చిపొమ్మని ఖగపతి రాసిన ఉత్తరం అచలపతి ఆమెకివ్వడం ఆలస్యం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. “పిల్లాడిని బాగా చదివించినందుకు నా రుణం ఇంకెలా తీర్చుకోనూ?” – అనేది బాగా నవ్వించే వాక్యం ఈ కథలో.

అచలపతీ – క్రి ‘కేటూ’: రాయుడనే పిల్ల జమీందారు బ్రాకెట్ ఆట మోజులో పడి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంటాడు. తిరిగి పుంజుకునే మార్గాన్ని వెతుకుతూండగా ఓ దూరపు బంధువు చనిపోతే తన ఆస్తినంతా రాయుడి పేర రాసేస్తాడు, కొత్తగా వచ్చిన ఆస్తితో ఏం చేయాలో కనుక్కుందామని అనంతశయనం దగ్గరికి వస్తాడు రాయుడు. ఓ క్రికెట్ మ్యాచ్‌ని స్పాన్సర్ చేయమని సలహా యిస్తాడు అనంతశయనం. దానికన్నా ఓ ఆటగాడితో మాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాడు రాయుడు. ఆటగాడు చేసే పరుగుల మీద పందేలు కాయిస్తాడు. మధ్యవర్తిగా అనంతశయనాన్ని ఉంచుతాడు. ఎంతోమంది ఆ ఆటగాడి మీద పందేలు కాసేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది. దాంతో రాయుడు మహాభినిష్క్రమణం గావించడానికి ప్లాన్ చేస్తాడు. కానీ రాత్రికి రాత్రికి అచలపతి పన్నిన ఉపాయంతో రాయుడు, అనంతశయనం కఠిన పరిస్థితుల నుంచి బయటపడతారు. “మీ మహాభినిష్క్రమణం వీడియో తీయించి హొరైజన్‌కి అవతల మీకందజేసే ఏర్పాట్లు చూడమంటారా సర్?” ఈ వాక్యం, దీని తరువాతి వాక్యాలు చదువుతుంటే నవ్వాపుకోలేం.

అచలపతీ- అభౌతిక జీవులూ: అనంతశయనం అత్త కవయిత్రి. తానే సొంతంగా ఓ పత్రిక స్థాపించి నడుపుతూంటుంది. పత్రిక కంటెంట్ కోసం, ఫైనాన్సు కోసం ఓ పేరుమోసిన బొంబాయి పబ్లిషర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుని, అతన్ని ఆహ్వానిస్తుంది. తమ వంటవాడి రుచికరమైన వంటలతో పబ్లిషర్‌ని పడగొట్టి, ఒప్పందం కుదుర్చేసుకోవాలనుకుంటుంది. ఆమె ఆశించినట్లే జరుగుతుంది. రుచికరమైన ఆ వంటలు అతనికి బాగా నచ్చేస్తాయి. అతను వంటతని పట్టణ జీవితం ఆశ చూపి తన వైపుకి తిప్పేసుకుంటాడు. బదులుగా అత్త మరో ఉపాయం పన్నుతుంది. ఆ పబ్లిషర్ కూతురిని వలలో వేసుకోమని అనంతశయనాన్ని ప్రోత్సహిస్తుంది. ఆమె తలచింది ఒకటైతే, జరిగేది మరొకటి అవుతుంది ఈ విషయంలో కూడా. చివరికి అచలపతి రంగంలోకి దిగితేగానీ, సమస్య పరిష్కారం కాదు. “త్వమేవాహం అర్థమయిందన్న పాఠకుడికేసి ఆరుద్రలా అపనమ్మకం, ఆశ్చర్యం, అనందం, సంభ్రమం మేళవించి నాకేసి చూసింది” – పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే ఇలాంటి వాక్యాలు మరెన్నో ఉన్నాయి ఈ కథలో.

అచలపతీ – ఆరంజి కోటూ: బ్లాక్‌మెయిలర్ బారిన పడిన బంధువు కొడుకుని రక్షించడానికి ఓ బ్రోతల్ హౌస్‌కి వెళ్ళిన అనంతశయనం తాను కూడా వాళ్ళ బ్లాక్‌మెయిల్ బారిన పడతాడు. అచలపతి పూనుకుని రక్షిస్తేగానీ, ఆ ప్రమాదంలోంచి బయటపడలేడు. “అచలపతి ముఖం మాడినట్లు తెలియనివ్వలేదు గాని నాకు వాసన తగిలింది.” ; “మనవాళ్ళకి మాక్రో ఆస్ట్రో ఫిజిక్స్ (ఈ శాస్త్రం ఉందో లేదో నాకు తెలీదు. కానీ, ఏ సబ్జెక్ట్ కైనా సరే మైక్రోయో, మాక్రోయో తగిలిస్తే హుందాగా, గంభీరంగా ఉంటుందని నాకో గట్టినమ్మకం) ఇంకా సరిగా వంటబట్టలేదు.” – ఈ వాక్యాలు చదువుతూంటే నవ్వాగదు.

అచలపతీ- పాదధూళీ: బెంగాలీ అనువాద నవలలు చదివి త్యాగమూర్తిగా మారిపోయిన మరదలు మణి బారినుంచి అనంతశయానాన్ని అచలపతి రక్షించిన విధానాన్ని ఈ కథ చెబుతుంది. కథ మొత్తం హాస్యమే. ప్రత్యేకించి కొన్ని వాక్యాల గురించి రాయనవసరం లేదు.

అచలపతీ- భాగవిపణీ: అనంతశయనం అత్తయ్య తన పత్రికని పాపులరైజ్ చేయడం కోసం షేర్ కాలం ప్రవేశపెట్టి, పాఠకులకు పిచ్చి సూచనలు చేసి వాళ్ళందరు షేర్ల వ్యాపారంలో నష్టపోయే ప్రమాదంలోకి తీసుకువెడుతుంది. దీనికి విరుగుడుగా అనంతశయనం చెప్పిన ఉపాయం వికటిస్తుంది. చివరికి అచలపతి రంగప్రవేశం చేయకతప్పదు. ఈ కథంతా హాస్యమే. “గులేబకావళి పుష్పం ఎక్కడినుంచో తెచ్చినా చేతికివ్వకుండా తానెక్కిన కొండలు, గుట్టలు గురించి వర్ణిస్తున్న పుత్రుణ్ణి ‘చూసి’ అసహనంగా ఫీలవుతున్న గుడ్డితండ్రిలా అడిగింది అత్తయ్య” – ఇలాంటి నవ్వించే డైలాగులు ఈ కథలో బోలెడు.

అచలపతీ- ఆయుర్వేదం చాక్లెట్లూ: తన మిత్రుడుకి అల్లం సబ్బులు తయారు చేసి అమ్మమని ఒకసారి, ఆయుర్వేదం చాక్లెట్లు అమ్మమని మరోసారి సలహా ఇచ్చి అతని కొంప ముంచుతాడు అనంతశయనం. ఈ కష్టం నుంచి – యథా ప్రకారం – అచలపతి బయటపడేస్తాడు. కథ చదువుతున్నంత సేపు పాఠకుల పెదాలపై చిరునవ్వు కదలాడుతునే ఉంటుంది.

అచలపతీ – అటెండెన్సు: లైబ్రేరియన్‌గా పనిచేసే ఓ మిత్రుడికి సలహాలిచ్చి అతనికి కొత్త సమస్యలు సృష్టిస్తాడు అనంతశయనం. లైబ్రరీలో పాఠకుల సంఖ్య పెరగడం, రిజిస్టర్‍లో అడ్రసులు రాయడం వంటి విషయాలలో అనంతశయనం సలాహాలాచరించి భంగపడిన ఆ లైబ్రేరియన్ అచలపతి సూచనలు పాటించి తన ఉద్యోగాన్ని నిలుపుకుంటాడు. ఇది కూడా బాగా నవ్వించే కథే.

చదువుతూ హాయిగా నవ్వుకోగలిగే ఈ అచలపతి కథలు-1 డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

అచలపతి కథలు 1 On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

నైట్ వాకర్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన మరో షాడో స్పై అడ్వెంచర్ “నైట్ వాకర్“.

కలకత్తా నగరంలోని డిఫెన్స్ రీసెర్చి లేబరేటరీలో సైంటిస్ట్‌గా పనిచేసే డా. మహేంద్రనాధ్ ఇతర్ శాస్త్రవేత్తల్లా ఆయుధాల మీద, వాటిని ప్రయోగించటానికి అవసరమైన ప్రేలుడు పదార్థాల మీద తన దృష్టిని కేంద్రీకరించకుండా, మానవ శరీరం మీద, శరీరంలోని నాడీ వ్యవస్థ పనిచేసే పద్ధతుల మీద విచిత్రమైన పరిశోధనలు చేసాడు. శరీరంలోని నాడీ వ్యవస్థను నిర్వీర్యపరిచి మనిషిని పూర్తిగా దెబ్బతీసే ఒక విచిత్రమైన నెర్వ్ గాస్‌ని కనుగొన్నాడతను. ప్రయోగించిన మరుక్షణం ఎదురైన ప్రతి మనిషిని డమ్మీగా మార్చేస్తుందది…. ఎందుకూ పనికిరాని మూర్ఖుడి క్రింద తయారుచేస్తుంది.

ఆ గాస్ ఫార్ములాని మిలిటరీ అధికారులకి అందజేసేముందే లేబరేటరీలో వున్నవాడు వున్నట్లే అదృశ్యం అయ్యాడు మహేంద్రనాధ్. ఆ భయంకర ఆయుధం శత్రువుల చేతికో, మరే సంఘ విద్రోహుల చేతికో చిక్కితే సర్వనాశనం తప్పదని భావించిన ప్రభుత్వం, మాయమైన మహేంద్రనాధ్‌ని, అతని వద్ద వున్న నెర్వ్ గాస్ ఫార్ములాని వెతికి పట్టుకోమని స్పెషల్ బ్రాంచిని ఆదేశించింది.

అదే సమయంలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన చైనీస్ మిలటరీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ యాంగ్ చీ జాడలు తెలుసుకునే బాధ్యతని సి.ఐ.బికి అప్పగిస్తారు.

మహేంద్రనాధ్ అదృశ్యమవడానికీ, యాంగ్ చీ అస్సాం సరిహద్దులో కనపడడానికి సంబంధం ఉందా? లేబరేటరీలోని మూడవ బ్లాకు పేలిపోడానికి కారణం ఎవరు? అక్కడ సీక్రెట్ అరలో షాడోకి దొరికిన ఫోటోలు ఎవరివి? ఇంతకీ మహేంద్రనాధ్ తనంతట తానుగా మాయమయ్యాడా లేక ఈ సంఘటనలో విదేశీహస్తమేదయినా ఉందా? స్పెషల్ బ్రాంచ్ ఏజంట్లు షాడోని ఎందుకు హింసించారు? వారి నుంచి షాడో ఎలా తప్పించుకున్నాడు? మహేంద్రనాధ్ ఏమయ్యాడు? దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన ఆ నెర్వ్ గాస్ ఫార్ములాని షాడో సంపాదించగలిగాడా?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

“నైట్ వాకర్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

నైట్ వాకర్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

నిశ్శబ్దం నీడల్లో

ప్రముఖ కవి ముకుంద రామారావు రచించిన కవితల ఆరవ సంకలనం – నిశ్శబ్దం నీడల్లో. వీరి తొలి కవితాసంకలనం “వలసపోయిన మందహాసం” పుస్తకానికి శ్రీరమణా సుమనశ్రీ పురస్కారం లభించింది. కవిత్వ తలుపులు తెరిచి, తాను చూసే విశాల విశ్వాన్ని, అనంతాకాశాన్ని, అద్భుతమైన ప్రకృతిని, అర్థం కాని ప్రపంచాన్ని, అందరితో పంచుకోవాలన్న తపనే తన చేత కవిత్వం రాయిస్తోందని అంటారు కవి.

ఈ సంపుటిలోని 40 కవితలూ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. వీటిల్లో కొన్ని కవితలను పరిచయం చేసుకుందాం.

పువ్వులను చూస్తే ఏమవుతుందో, చూడకపోతే ఏమవుతుందే చక్కగా వర్ణించారు “ఆకుపచ్చ ఆలోచనలు” అనే కవితలో.
అందమైన పూలు /గాలితో కూడి ఎన్ని హొయలో / చూడకపోతే/ చిన్నబుచ్చుకుంటాయి /చూస్తే భయం/ ఎవరి కంఠం తెగుతుందోనని.

తెరిపి అనే కవితలో ఓ తల్లి, ఆమె పసిపిల్లతో పాటుగా రైల్లో ప్రయాణిస్తున్నారు కవి. తల్లీ పిల్లలను, వాళ్ళ అనందాన్ని సంతోషాలను చూస్తూ గడిపేయడం వల్ల తనకు ప్రయాణపు అలసటగానీ, దూరాభారం గాని తెలియలేదంటారు.

గతానికి భవిష్యత్తుకి మధ్య ఉండే ‘వర్తమానం’ అనే అనంత జలరాశిని దాటడానికి మనుషులు పడే తపనని చక్కగా వర్ణించారు “నేడు”అనే కవితలో. భవితపైన ఆశతో, “ఎలాగోలా/ ఎవరికి వారే ఈదుతున్నారు/ రోజంతా” అని అంటారు.

ఉదయాన్ని కూతురితో పోల్చడం ఎంతో బావుంటుంది. “ఉన్నంతసేపూ / ఉత్సాహమే” అంటారు. రాత్రికి తావిస్తూ, ఎన్నో జ్ఞాపకాలను వదిలి తనింటికి వెళ్ళిపోయే కూతురు ఉదయం అనడం తండ్రి ఆప్యాయతని సూచిస్తుంది. 11 పంక్తుల కవితే అయినా, చదువరులపై గాఢ ముద్ర వేస్తుంది “కూతురు”.

ఓ పసివాడు ఆడుకునే ఆట గురించి చెబుతారు “నిద్రాట” అనే కవితలో. పసిపిల్లలున్న ఇంట్లో తల్లికి ఉండే ఆందోళనలు, ఆనందాలని చక్కగా వర్ణించారు కవి. చదివాక ఈ కవితని ఆస్వాదించకుండా ఉండలేం.

ఇంటర్‌నెట్ స్నేహాల గురించి, దాంట్లోని ప్రమాదాల గురించి చక్కని కవిత రూపంలో చెప్పారు కవి. “ముట్టుకుంటే అతుక్కుపోయే / సరదా సందేహాల సాలెగూడు/ కనిపించని కల్లోలం/ వెబ్ స్నేహం”.

జీవితమంటే /శ్వాసా / ప్రపంచమా” అని ప్రశ్నిస్తారు కవి “నాలోని ఆకాశం” అనే కవితలో. సులువుగా అనిపించే తాత్వకమైన ప్రశ్న ఇది.

ప్రాణాన్ని దీపంతో పోలుస్తారు కవి “దేహదీపం” అనే కవితలో. “ఎంతో కొంత వెలిగి / ఆరిపోతుందో / ఎగిరిపోతుందో / ఎవరికెరుక” అని అంటారు. మనిషి జీవితం క్షణభంగురమని సూచిస్తారు.

సమూహానికి ఏకాంతానికి మధ్య తేడాలని వివరిస్తారు “ఏకాంత సమూహం” అనే కవితలో. ఏకాంతం ఆకాశాన్ని హత్తుకునే వంతెన అయితే, సమూహం దేనికీ బెదరని నది అని అంటారు.

తాతామనవళ్ళ అనుబంధాన్ని సున్నితంగా వివరిస్తారు “సంతృప్తి” అనే కవితలో.

సముద్రంలో చేపలవేటకై వెళ్ళే మత్స్యకారుల జీవనానికి అద్దం పట్టిన కవిత “జాలరి”. “రాతలూ సరిహద్దులు తెలుసుకోలేని/ ప్రమాదం అంచుల్లో ప్రయాణం” ఈ రెండు పంక్తులు చాలు జాలర్ల జీవితాన్ని అద్భుతంగా వర్ణించారని చెప్పడానికి.

రిటరయ్యే ఉద్యోగస్తుల భయాలను, ఆందోళనలను వివరించిన కవిత “పదవీ విరమణ”. “అలవాటైన బ్రతుకు ఆఖరై / అలవాటు కాబోయే సమీకరణాలు”
“అహం దెబ్బతింటున్న ప్రతీ క్షణం / అధికారం లేని ఒంటరితనం” అంటారు కవి.

ఇంకా చక్కని కవితలు ఉన్న ఈ పుస్తకం ఇప్పుడు డిజటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

నిశ్శబ్దం నీడల్లో On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

రామాయణ విషవృక్షం

‘రామాయణ విషవృక్షం’ మొదట్లో 3 భాగాలుగా (మూడు వేరు వేరు పుస్తకాలుగా) ఉండేది. ‘విషవృక్షం’లో మొదటి భాగాన్ని రచయిత్రి 1974లోనూ, 2వ భాగాన్ని 1975లోనూ, 3వ భాగాన్ని 1976లోనూ రచించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి భాగం ఏడు ముద్రణలూ, రెండవ భాగం ఆరు ముద్రణలూ, మూడవ భాగం నాలుగు ముద్రణలూ వచ్చాయి. 2005 నుంచీ ఆ 3 భాగాలూ ఒకే సంపుటంగా (ఒకే పుస్తకంగా) కలిసిపోయాయి.

అన్ని భాగాలు కలిసిన సంపుటం ఇప్పటికి మూడు సార్లు ముద్రణలు పడింది: 2006 అక్టోబరులోనూ, 2008 మేలోనూ, 2012 ఫిబ్రవరిలోనూ. 2012 ఫిబ్రవరి ముద్రణలో, గతంలో లేని కొత్త వ్యాసాలు 3 చేరాయి. ఇది 2012 ఫిబ్రవరి ముద్రణకు డిజిటల్ రూపం.

* * *

“పాతనంతా తిరస్కరించడమే అభివృద్ధి అనుకుంటారు కొందరు” అనేది, నూతనమైన ఆలోచనలమీద ఒక విమర్శ! కానీ, ఇది ‘పాత’ కాదు. ‘పాత’ అయిపోలేదు. ‘రామాయణం’ ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఈ నాటి సాంఘిక సమస్యలకు ‘రామనామ జపాన్ని’ పరిష్కారంగా చెప్పే ఏ ఒక్క సంఘటన అయినా చాలు – ఆ గ్రంథం ‘పాతదైపోలేదని’ నిర్ణయించడానికి!

ఈ ప్రయత్నానికి అర్థం – పాతనంతా తిరస్కరించడం కాదు. ‘పాత’ అంతా మానవ చరిత్రే. ఆ ‘చరిత్ర పరిణామం’లో, రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ, వీటిని స్పష్టం చేయడమే ఈ పుస్తకం లక్ష్యం.

రామాయణ విషవృక్షం On Kinige

Related Posts:

శ్రీనందన నామ సంవత్సర పంచాంగం

అనుశృతంగా వస్తున్న పంచాంగ పరిజ్ఞానం దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి అనేక శాస్త్ర సంప్రదాయాలు ఏర్పడినవి.

అందులో దృక్‌సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ పంచాంగ గణన రచన సాగినది. పంచాంగకర్త బాల్యము నుండి వైఖానస ఆగమ, వాస్తు, జ్యోతిషశాస్త్రాంబుధిలోని అనర్ఘరత్నాలను పాండితీ చిహ్నాలుగా ధారణ చేసికొన్న శశికాంతుడు. స్వతః సిద్ధ అభిలాష, అభినివేశముతో వైఖానస ఆగమ గ్రంధాలను-జ్యోతిష శాస్త్రగ్రంధాలను సమన్వయ దృక్పథంతో ఈ పంచాంగ రచన గావించి యున్నాడు.

జ్యోతిష కళానిధి, తార్కిక గణనవేత్త, అదృష్టతాండవ రచనకర్త అయిన తాండవకృష్ణ చక్రవర్తి అప్రమేయ వైదుష్య విభవముతో ఈ పంచాంగమును కలికితురాయిగా తీర్చిదిద్దినారు.

వైఖానస లోకమునకు ఈ పంచాగం ఒక కరదీపిక వంటిది అని భావించవచ్చు.

- ‘ఆగమ ప్రవర’ వేదాంతం సార్వభౌమ

శ్రీనందన నామ సంవత్సర పంచాంగం On Kinige

Related Posts:

“అమృతం కురిసిన రాత్రి ” ఈ-బుక్‌ విడుదల

కవితాప్రియులను, రసజ్ఞులను ఎంతగానో అలరించిన కవితా సంకలనం “అమృతం కురిసిన రాత్రి”.

దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ 1971లో ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

ఈ నందన నామ సంవత్సరాది సందర్భంగా, తెలుగులో అత్యుత్తమ రచనలలో ఒకటైన “అమృతం కురిసిన రాత్రి ” కవితా సంకలనాన్ని డిజిటల్ రూపంలో విడుదల చేసింది కినిగె.
ప్రపంచంలోని ప్రతీ తెలుగు వ్యక్తికి ఈ ఈ-బుక్ అందుబాటులోకి వచ్చింది. వివరాలకు క్రింది లింక్‌ని అనుసరించండి.

అమృతం కురిసిన రాత్రి On Kinige

ప్రకటన పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి.
Am Rut Am Press Note

Related Posts:

  • No Related Posts

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

- బాల గంగాధర తిలక్

Now Amrutam kurisina ratri eBook is available from Kinige. Visit http://kinige.com/kbook.php?id=672 for more details.

Related Posts:

మిషన్ టు పెకింగ్

ప్రఖ్యాత డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు రచించిన నవల “మిషన్ టు పెకింగ్“.

సరిహద్దులమీద ఉద్రిక్తతల్ని సృష్టించే దేశాల తాకిడిని తట్టుకోవటం కోసం తప్పనిసరిగా సైనికబలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితులు మన దేశానికి ఎదురవుతున్న నేపధ్యంలో భారత క్షిపణి పరిశోధన శాస్త్రవేత్తలు రెండు వందల కిలోమీటర్ల దూరంలో వున్న టార్గెట్‌ని గురితప్పకుండా ఛేదించగల క్షిపణిని తయారుచేసారు. అయితే, ఆ క్షిపణిని ప్రయోగించే సమయంలో అనుకోని విధంగా బయటపడిన ఒక విచిత్రాన్ని గమనించి అవాక్కయ్యారు.

వారెవరూ ఊహించనిరీతిలో అది రెండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగల సత్తావున్న ఆయుధంగా… ఆర్డినరీ క్షిపణి కాస్తా కాంటినెంటల్ బలాస్టిక్ మిస్సయిల్‌గా రూపొందింది. తక్కువ దూరంలో వుండే టార్గెట్‌ని ఛేదించేటందుకు క్షిపణిలో అమర్చిన కంట్రోల్ మెకానిజం ఎక్కువ దూరానికి సరిపోదని గ్రహించి, వెంటనే మార్పులు చేశారు ఇంజనీర్లు. అత్యంత ఆధునికమైన కంప్యూటర్ వ్యవస్థను అందులో ప్రవేశపెట్టి పరీక్షల నిమిత్తం ప్రయోగించారు. ఆఖరి క్షణంలో ఏదో పొరపాటు జరిగి క్షిపణి అదుపు తప్పి చైనా భూభాగంలోకి దూసుకుపోయింది. సికియాంగ్ పర్వతశ్రేణుల్లో ఎక్కడో కుప్పకూలిపోయింది.

ఆ క్షిపణి అవశేషాల్ని వెతికి, వాటిల్లోనుంచి కంట్రోలింగ్ వ్యవస్థను విడదీసి వెంటనే భారతదేశంలోకి తీసుకురాకపోతే…. శత్రువులకు ఆ వ్యవస్థ రహస్యం తెలిసిపోతుంది…. ఆ క్షిపణి తయారీకి ఖర్చుపెట్టిన ధనమంతా వృథా అయిపోతుంది.

సి.ఐ.బి తరపున ఈ బాధ్యత షాడోకి అప్పగిస్తారు. భారతదేశంలోనుంచి గాని, బర్మా వైపునుంచి గాని సరిహద్దులు దాటి చైనాలోకి అడుగుపెట్టడం ప్రమాదకరమని నిర్ణయించుకుని, జపాన్ నుంచి బయలుదేరాడతను. గంగారం సహాయంతో చిన్న సైజు వ్యాపారవేత్తగా పత్రాలు సృష్టించుకుని మారువేషంలో కాయ్‌ఫెంగ్ నగరంలో అడుగుపెడతాడు. షాడో పట్ల అనుమానాలు పెంచుకున్న అక్కడి పోలీసులు అతన్ని పట్టుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వారి నుంచి తప్పించుకోడానికి, వారు అరెస్టు చేసిన హూవాన్ చూ అనే మంచి దొంగని వారి అదుపులోంచి తప్పిస్తాడు.

ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కుంటాడు. తానెవరో హువాన్ చూకి తెలియజేయకుండా, పెకింగ్ నగరం గుండా మిస్సైల్ కూలిపోయిన ప్రాంతాలలోకి చేరుకోడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నాలలో హువాన్ చూ సోదరి ఈషా షాడోకి ఎందుకు అడ్డు తగిలింది? ఆమె ఎవరు? అటవీ ప్రాంతంలో చైనా ఆటవీక జాతి నాయకుడు షాడోకి ఎందుకు సాయం చేసాడు? షాడో గూని ఎలా మాయమైంది? షాడో ఈషాకి అందించిన అపూర్వ కానుక ఏంటి?

ఈ ప్రశ్నలకి జవాబులు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

“మిషన్ టు పెకింగ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిషన్ టు పెకింగ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కినిగె ఈపుస్తకాలు ఐపాడ్ పై

 

కినిగె ఈపుస్తకాలు ఐపాడ్ పై చదువుకోవచ్చు. ఈ టపాలో మనం వివరాలు చూద్దాం.

మూడు ముక్కల్లో

1. బ్లూఫైర్ రీడర్ ప్రతిస్టించండి.

2. అడోబ్ ఐడీతో దాన్ని ఆథరైజ్ చెయ్యండి. (ఒకవేళ అడోబ్ ఐడీ లేకపోతే ఇక్కడ నుండి తెచ్చుకోండి)

3. http://kinige.com దర్శించి మీకు నచ్చిన ఈపుస్తకాన్ని చదవండి.

సవివర సూచనలు

photo

a. http://kinige.com దర్శించండి.

photo (1)

b. ఈసరికే లాగిన్ అయి ఉండకపోతే, లాగిన్ అవ్వండి. అలానే మీ బాలన్స్ శూన్యం ఉంటే బాలన్స్ లింకుపై నొక్కి రీచార్జ్ చేసుకోండి. 

photo (2)

c. మీకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోండి.

photo (3)

d. పుస్తకాన్ని కొనండి, లేదా అద్దెకు తీసుకోండి.

photo (4)

e. దిగుమతి చేసుకోండి లంకె నొక్కితే పైన చూపిన దోషం వస్తుంది. కంగారు పడకండి. బ్లూఫైర్ రీడర్ ప్రతిస్ఠించితే ఆ దోషం తొలగుతుంది.

photo (5)

f. ఐపాడ్ ఆప్ స్టోర్ దర్శించి, బ్లూఫైర్ రీడర్ కోసం వెతకండి. 

photo (6)

g. ఉచిత బ్లూ ఫైర్ రీడర్ ప్రతిష్టించండి.

photo (7)

h ప్రతిస్ఠ ముగిసిన తరువాత పైన చూపిన చిహ్నం మీ గృహపుటపై కనిపిస్తుంది.

photo (8)

i. ఇప్పుడు http://kinige.com దర్శించి మనం కొన్న పుస్తకాన్ని మై బుక్స్ విభాగాన్నుండి దిగుమతి చేసుకుందాం. బ్లూఫైర్ రీడరుతో తెరవండి.

photo (9)

j. బ్లూ ఫైర్ రీడర్ అడోబ్ ఆథరైజ్ చేసుకోమని అడుగుతుంది. తప్పకుండా చేసుకోండి. ఇలా ఆథరైజ్ చేసుకోకపోతే మీరు కినిగె ఈపుస్తకాలు కేవలం ఒక యంత్రం పై మాత్రమై చదవగలరు. ఆథరైజ్ చేసుకుంటే బహుళ యంత్రాలపై చదువుకోవచ్చు. ఒకవేళ మీకు అడోబ్ ఐడీ లేకపోతే ఇక్కడ నుండి ఒకటి సృష్టించుకోండి. 

photo (11) 

photo (11) - Copy

k. ఆథరైజేషన్ ముగించండి.

photo (12)

l. కినిగె నుండి ఈపుస్తకాన్ని దిగుమతి చేసుకోండి.

photo (13)

m. కినిగె ఈపుస్తకాన్ని చదవండి.

photo (14)

photo (15)

photo (16)

Related Posts:

షార్ట్ స్టోరీస్ ఆఫ్ విశ్వనాథ – పుస్తకావిష్కరణ

“షార్ట్ స్టోరీస్ ఆఫ్ విశ్వనాథ” అనే శీర్షికతో విశ్వనాథ సత్యనారాయణ గారి కథలని ములుకుట్ల యోగ ఆంగ్లంలోకి అనువదించారు.

ఈ సంకలనం తేదీ: 21 మార్చి 2012 నాడు ఆవిష్కృతమవుతోంది. రేపు సాయంత్రం ఆరు గంటలకి విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షులు శ్రీ వెలిచాల కొండలరావు ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ విశ్వనాథ సాహిత్య పీఠం ప్రాంగణంలో (నీలోఫర్ హాస్పిటల్ వద్ద, రెడ్ హిల్స్, హైదరాబాద్.) జరుగనుంది.

శ్రీ విజయరామారావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీ మండలి బుద్ధప్రసాద్ సభకి అధ్యక్షత వహిస్తారు. శ్రీ సి.సుబ్బారావు పుస్తకాన్ని పరిచయం చేస్తారు.

ఆహ్వానపత్రికని ఈ లింక్‍లో చూడగలరు.

Related Posts: