అక్షర పరిమళం (“ద్రోహవృక్షం” పుస్తక సమీక్ష)

మనసులో బాధ బరువు మోస్తున్నప్పుడు తేలికైన పుస్తకం ఒకటి చదివితే హృదయంలో అక్షరాల చిరుజల్లుల పరిమళం వెల్లివిరుస్తుంది. అపుడు ఆలోచనల వేడి, సాంద్రత తగ్గుముఖం పడుతుంది. అటువంటి పుస్తకాలు తెలుగులో చాలా తక్కువే అయినా డాక్టర్ వి. చంద్రశేఖరరావు రాసిన ‘ద్రోహవృక్షం’ ఈ కోవకి చెందినదే. ఈ పుస్తకం చదువుతుంటే మనం ఎక్కదో విహరిస్తున్నామనే భావన, అక్షరాలు మనల్ని వెంబడిస్తున్నాయనే అపోహ, పాత్రలన్నీ సుపరిచితాలే అనే భావన మనలో చోటుచేసుకునే ముఖ్య అనుభూతులు. బహుశా రచయితకు అడవులు, పూలు, పర్యటనలు, ప్రకృతి అంటే అమితమైన అనురాగం అనుకుంటా. అందుకే పాఠకుడి చిటికెనవేలు పట్టుకుని తెలియని ప్రపంచం వైపు తీసుకు వెళుతుంటారు. మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అనే జిజ్ఞాస కూడా పాఠకుడిలో లేకుండా చేస్తారు. ఒకసారి కాదు, పేరాను రెండుసార్లు చదివినా మనకు తెలియని అనుభూతి మనల్ని వెంటాడినట్టే అనిపిస్తుంది. ఇందులో ఇరవై కథలు ఉన్నట్టు చెప్పారు. కానీ ఒక నవలలో 20 అధ్యాయాలు అన్నట్లుగా అనిపిస్తుంది. ఒక కథకు, మరో కథకు ఎక్కడో ఏదో కనిపించీ, కనిపించకుండా సన్నని దారం ఉన్న భావన కలుగుతుంది. సుందరం, పూర్ణలు రచయితకి అత్యంత ప్రియమైన పాత్రలే. సుందరమైన ప్రకృతిలోనే పరి’పూర్ణ’మైన జీవితం అనుకోవలా? ఇందులో ఏ కథ బావుంది? అని ప్రశ్నిస్తే, ఏ కథ బావుండలేదు? అని ఎదురుప్రశ్న వేయాలనిపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇదో వచన కావ్యంలా అనిపించింది.
‘కాలం ఎగిరిపోవటాన్ని నేను గమనించాను. సుందరం ఒక్కడే, ఈ ప్రపంచంలో అనిపించడం మొదలుపెట్టింది. సుందరం అనే ఆలోచన లేకపోతే నేను శక్తిహీనంగా మారిపోవటం గమనించాను’ (55 పేజి) అని ది లైఫ్ అండ్ టైమ్స ఆఫ్ సత్యప్రకాశంలో ఒక చోట ఉన్న పేరా. ఇది అచ్చం భావకవితలా ఉంది కదూ. అతను అతనిలాంటి మరొకడు అనే శీర్షికగల కథలో ఇలా ఉంది. “ఆ చెట్లపై నివాసమున్న వందలాది పక్షుల శవాలు, పొదల చాటున, రోడ్ల పక్కన. అదో భయానకమైన దృశ్యం. హాస్టల్‌కు చేరే నీళ్ళ పంపుల్లో సీవేజ్ వాటర్ కలిసి, హాస్టళ్ళంతటా డయేరియాలు, విషజ్వరాలు వ్యాపించేది కూడా ఆ నెలలోనే…” (89 పేజి) సుందరం కలలది ఏ రంగు అనే కథలో ‘ కమల వెంటనే తేరుకొని, కళ్ళలోని అందోళనని తుడిచేసి (కొడుకు చేసే బెదిరింపులు కాసేపు మరిచిపోయి) తనదైన మనోహరాన్ని ముఖంపైకి తెచుకొని ఎట్లా ఉన్నావయ్యా… ఎన్నేళ్ళయ్యింది నిన్ను చూసి, పిరికిగా, భయంగా ఉండేవాడివి, గట్టిగా పట్టుకుంటే కందిపోయే పూవులా ఉండేవాడిని’ అని (పేజి 131) ఇందులో పాత్రలతో సంబంధం లేదు. ఏ పేరా చదివినా ఎక్కడి నుంచి ఎక్కడికి చదివినా ఆసక్తికరంగానే ఉంటుంది. అదే రచయిత ప్రత్యేకత.
ఇక పోతే, హెచ్. నరసింహం ఆత్మహత్య శీర్షికన హైదరాబాద్ లోని ప్రదేశాలను పరిచయం చేస్తూ, ఎర్లీ టీన్స్‌లో గోల్కొండ నా ఎడ్వెంచర్ స్పాట్, ఫలక్‌నుమా నా రహస్య డేటింగ్ ప్లేస్, ఆ రోజుల్లో ప్రేమికులకు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉండేవి. ఇందిరాపార్కు, టాంక్‌బండ్, బిర్లామందిర్ (ముఖ్యంగా మెట్ల పైన), గండిపేట చెరువు, యూనివర్సిటీ లోపలి రోడ్డు… (పేజి 217) అంటూ చదువుతూ ఉంటే యవ్వనం దాటిన వారికి మధుర స్మృతులు గుర్తొస్తుంటాయి. ‘హైదరాబాద్ రోడ్లపైనే నా బాల్యమంతా గడచిపోయింది. గుర్తు పట్టలేనంతగ ఆ రోడ్ల రూపం మారినా, అపార్ట్‌మెంట్లు, రంగు దీపాలు, పెద్ద పెద్ద మాల్స్, అయినా ఆ రోడ్లపై పాదం పెట్టగానే ఒక గాఢమైన పరిమళం, నన్ను ఇప్పటికీ చుట్టుముట్టుతుంది. సజీవమైన భాష, ఆత్మీయమైన పలకరింపు, ఎరుపురంగు మెహందీలు, గాలి పటాలు, పురాతనమైన ఆత్మలకు సరికొత్త అలంకరణలు, రోడ్లను చూడగానే, జ్ఞాపకాల ప్రదర్శన నన్ను వివశురాల్ని చేస్తుంది.’
ఏ పేజి తిరగేసినా, ఏదో కొత్తదనం, మాధుర్యం మనల్ని పలకరిస్తునే ఉంటుంది. మనల్నిమనం వెనక్కి తిరిగి ఇలానే చూసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి బాల్యం ద్రోహవృక్షంలోనూ దర్శనమిస్తుంది. పుస్తకం చదువుతుంటే కొత్త విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎక్కడో ఎక్కడో ఇలాంటి సంఘటనలు మనకు తారసిల్లిన భావం కలుగుతుంది.

టి. వేదాంతసూరి
(వార్త, ఆదివారం అనుబంధం, 17 జూన్ 2012)

* * *

ద్రోహవృక్షం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

ద్రోహవృక్షం On Kinige

Related Posts:

ప్రజాసాహితి జూన్ 2012 సంపాదకీయం

Prajasahiti June 2012 Editorial

ప్రజాసాహితి జూన్ 2012 On Kinige

Related Posts:

నడుస్తున్న చరిత్ర జూన్ 2012 సంపాదకీయం

వారసత్వ కమీషన్‍ను వెంటనే ఏర్పరచాలి.

Nadustunna Charitra June 2012 Editorial

నడుస్తున్న చరిత్ర జూన్ 2012 On Kinige

Related Posts:

మిసిమి జూన్ 2012 సంచిక – సంపాదకీయం

MisimiJune2012 Editorial

మిసిమి జూన్ 2012 On Kinige

Related Posts:

నాకు తెలియని నేనెవరో

పుస్తకం పేరు చూస్తే, ఒక తాత్వికుడు, వేదాంతి ‘నాన్‌ ఏర్‌’ అనుకుంటూ దర్శనమిచ్చే అరుణాచల రమణ మహర్షి గుర్తుకు వస్తారు. ముకుంద రామారావుగారు అలాంటి తాత్విక జిజ్ఞాసాపరుడా? అన్న అనుమానం కల్గుతుంది. కవితా సంకలనాన్ని పూర్తిగా చదువితే, మనిషికి ఇలాంటి జిజ్ఞాస అప్పుడప్పుడూ కలుగుతూనే ఉంటుంది; అది తాత్విక పరిధిని ఒరుసుకొని ఒక్కొక్కప్పుడు, కవిత్వపు ఆవరణలో నుంచి పుట్టినట్టు మరికొన్ని చోట్ల కనబడుతుంది.
కవిత్వాన్ని గురించీ, ముఖ్యంగా తమ కవిత్వాన్ని గురించీ చెప్పుకున్న తెలుగు కవులెందరో ఉన్నారు. నన్నయ, తిక్కన, శ్రీనాథుండు, పెద్దన అలా చెప్పుకున్నవారే. ఆధునిక కవి ఆరుద్ర కూడ ‘సాహిత్యోపనిషత్‌’ అని కవిత్వ తత్వాన్ని ప్రయోజనాన్ని ముగ్గురు కవుల మధ్య జరిగిన చర్చలా ప్రదర్శించాడు.  శ్రీ ముకుంద రామారావుగారు సంకలనానికి ఉపోద్ఘాతంలో తనకు కవిత్వమంటే ఎట్టిదో వివరిస్తూ వ్రాశారు. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి కవిత్వ తత్వం. అది నిత్య నూతనం, నిరంతరం సాగే ప్రక్రియ.  స్వచ్ఛంగా ఉండలి, మనస్సుకు స్వాస్థ్యం కల్గించాలి. ఆనందం దాని లక్ష్యం అని అనలేదు కాని, అది ఆనందాన్ని కల్గిస్తుంది. రెండవది తనకు కవిత్వం తన్ను తాను తెలుసుకునే సాధనం అంటారు. అంటే కవికి నాకు తెలియని నేనెవరో తెలుసుకోవడనికి కవిత్వం తలుపులు తెరుస్తోందన్న మాట.
కవిత్వాన్ని గురించి చెప్పేటప్పుడు దానిని కవి కవిత్వా భాషలోనే చెపుతూ తన కవిత్వ స్వభావాన్ని ప్రతిఫలింప జేస్తాం. ఇందులో కూడ అలాగే ఉంది ఆయన కవిత్వం.
‘వెన్నెల అడవిలోకి చొచ్చుకుపోతున్నట్లు
ఎదురు చూస్తున్న మొక్కలకు నీళ్లు పోస్తున్నట్లు’ ఉంటుందట;
ఇందులో కూడ కవి తన కవితలోని సొగసు ఎవ్విధంగా ఉంటుందో, తానెట్టి సున్నిత హృదయ స్పందనలకు లోనవుతాడో, రుచి చూపుతున్నాడు.
కవిత్వానికి భాష ఒక పరికరం. భాషకు రెండు లక్షణాలుంటాయి. శబ్దానికి అర్థమే కాకుండ నాదమూ ఉంటుంది. అదీగాక శబ్దాలను నేర్పరి కూర్చగా ఒక బొమ్మ పుట్టుకొస్తుంది. మొదటి లక్షణం వల్ల కవిత్వం రీతి మార్గాన సాగిపోతుంది. శబ్ద మాధుర్యానికి ముగ్ధుడైన కవి, ఆ మాధుర్యమే కవిత్వమని భ్రమించి, పర్యవసానంగా అర్థం వచనం స్థాయికి దిగిపోవచ్చునని గ్రహించడు. అందుకే అట్టి రచనను అభిజ్ఞుడైన భావకుడు కవిత్వమని అంగీకరించడు.
ఇక కవిత్వంలో మాటలతో బొమ్మను కట్టించే లక్షణం అనాదికాలం నుంచీ అంగీకరింపబడుతూనే ఉంది. అసలు కవిత అనేది నిన్ను పల్కరించే చిత్రం, మాటాడే బొమ్మ. కవితలో దీనిని కనపరచం అంత తేలిక కాదు. దీనికి కవి ఎంతో సాధన చేయాలి. ఆయన మనసున అచేతన వస్తువులు చేతనంగాను, చేతన వస్తు సముదాయం బొమ్మల కొలువుగాను కవికి దర్శనమివ్వాలి. ముకుంద రామారావు గారు దీనిని సాధించిన కవి.
‘ఇంట్లో అందరికీ’ (22) అన్న కవిత చిన్నారులకు ఏమొచ్చినా, ఇంట్లోని వారందరి మనస్థితి ఎలా ఉంటుందో స్నిగ్ధ మనోహరంగా తెలియజేస్తుంది. సజీవమైన బంధు, స్నేహవర్గమే కాదు – ‘నిర్జీవమైన ఇంటితో బాటు చిందరవందరగా వున్న బొమ్మలు సైతం చిన్నారుల చేతుల్లో ఎగిరెగిరి గంతులేయడానికి ఇంటినంతా వెలిగించడానికి దీనంగా ఎదురు చూస్తుంటాయి’
ఇందులో విషాదం ఛాయా మాత్రంగ ఉండడమే కాక, దీనివల్ల గుండెలో కారు చీకట్లు ఆక్రమించుకుంటాయి. సహజంగా, క్లుప్తంగా, గాఢంగా ఉన్న కవిత ఇది.
అసలు ముకుంద రామారావు గారు హృదయ కవి. ఆయన కవితల్లో గుండెల స్పందనలు  వినిపిస్తూనే ఉంటాయి. ‘చెట్లు’ (26) కవితను చూడండి. అవి చెట్లు కాదు ‘ఎవరు పెంచిన పిల్లలో!’ అవి. ఆకాశంలో ‘కొమ్మల చెలతో మేఘాల చిత్రాలను గీస్తాయట!’ అంటే చెట్లు పర్యావరణ పరిరక్షణ బాధ్యత స్వీకరిస్తూ, వానలు కురవడనికి కారణమవుతాయన్న లౌకికార్థాన్ని వెలికితీయడం ఆ చెట్ల ముగ్ధ సచేతన స్థితిని మైలపరచే అభావకుని లక్షణం. అసలు ‘ఈ మేఘాలేమిటో’ (34) కవితను చూడండి. మనకు తెలియని, కవికే తెలిసిన ఈ మేఘాలకెంత అహంకారం! ఎందుకలా కళ్లల్లో నీరు తిరుగుతున్నా, బయట పడకుండ తమాయించుకుంటాయి? ఉన్నట్టుండి అలా ఎందుకు భోరున ఏడుస్తాయి? తనంత ఎత్తుకి ఎదిగిన చెట్లని, కొండల్ని ఆత్మీయంగా అలా గుండెలకు హత్తుకుంటాయి అంటూ, ఇలా అచేతన వస్తుజాలానికి చైతన్యాన్ని కల్గిస్తూ, వానినొక చిత్రశాలగా అలవోకగా చూడడం ఈ కవితలోని వైశిష్ట్యం.
ఎన్నని చెప్పాలి. ‘కదలిక’ (63) కవితకు కదలిపోని భావుకుడుండడు.  చెట్టు ఏడుస్తుంది!, నవ్వుతుంది. ఎన్ని హింసలు పెట్టినా భరిస్తుంది. అయినా సేదతీరనికి నీడనిస్తుంది. ‘ఎక్కడైనా’ (64) కవితలో పంచభూతాలూ మనిషి కోసమే ఎన్నైనా చేస్తాయి. మరి మనిషో!
కవులకు శ్రోతలను ఏడ్పించడం వెన్నతో పెట్టిన విద్య. అయితే రచయితలు భావుకులను గలగల నవ్వించగలరు కూడ. కానీ మరొక స్థితి ఉంది. అది హృదయాన్ని స్పృశించే సన్నివేశం, మాట వలన మనకు సంతోషమో, దుఃఖమో తెలియని మానసిక స్థితికి లోనవుతాము. కంఠం రుద్ధమవుతుంది. కంటివెంట రెండు కన్నీళ్లు రాల్తాయి. అవి దుఃఖాశ్రువులు కాదు, ఆనందభాష్పాలని మనకు తర్వాత తెలుస్తుంది. ‘విదేశంలో మనుమరాలు’ (30)లోని సన్నివేశం అలాంటిది. ఆ తాత ఆత్మీయతను, పాప బంగారు పలుకుల్నీ ఆలకించండి, అదొక దివ్యమైన అనుభవంగా భావకునికి మిగిలిపోతుంది.
అసలు ఈ కవి కంప్యూటరు ఇంజనీరు. 0 1 రెండంకెలతో ఒక  శాస్త్ర భాషను సృష్టించే  నేర్పరితనం ఉంటుందీయనకు. ఆ భాష మనకు తెలియదు. ఈయన ఒకే ఒక అంకె ‘ఒకటి’తో మనకు మన జీవితాన్ని ‘లెక్కలు’ (31) అన్న కవితలో కాస్త రుచి చూపాడు. మనం 1 + 1 కావాలి, వాళ్లు 1 – 1 కావాలి, లేక 1 x 1 కాని, 1/1 కావాలి. జీవితంలో ప్రత్యర్థులు రెండు కుటుంబాలో, తెగలో, జాతులో, వృద్ధి క్షయాలను, కలహించు కోవడన్ని కోరడాన్ని సూచిస్తాయి.
మరి ‘నేనెవరో?’ అన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. ‘అవును కాదు’ (52)లో సమాధానం దొరుకుతుందేమోనని ఆశించాము. నీవు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చావు? నీ పయనం ఎటు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతే బాగుండును.
కానీ దొరకదే! కానీ చివరి కవిత ‘యాత్ర’ (70)లో అందరికీ తెలిసినా ఎవరి అనుభవంలోకి రాని సమాధానం ఉంది. మనిషికి చావు లేదు. అతనికినిరంతర ప్రయాణం ఒక చోటు నుంచి మరొక చోటుకు! ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి అంటాడు. ఈ కవితాత్వికుడు చుట్టూ ఉన్న చరాచర జగత్తును చూస్తూ.
అయినా ముకుంద రామారావుగారు కవిగానే స్థిరపతాడు, తాత్విక పరిధిని అక్కడక్కడ స్పృశిస్తూ దూసుకుపోయినా!

వడలి మందేశ్వర రావు
(సౌజన్యం: సాహిత్యనేత్రం, జులై – డిసెంబరు 2008 సంచిక)

* * *

నాకు తెలియని నేనెవరో” కవితా సంకలనం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

నాకు తెలియని నేనెవరో On Kinige

Related Posts:

ఋతుపవనాల ప్రత్యేక ఆఫర్ – RAIN RAIN COME TO ME

చల్లని జల్లులతో వేసవి తాపాన్ని మరిపించి అందరినీ మురిపిస్తున్న ఋతుపవనాలతో పాటు కినిగె మీకు ప్రత్యేకమైన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పుడు 400 రూపాయలు లేదా అంతకు పైబడి కినిగె బాలన్స్ రీచార్జ్ చేసుకోండి ఆ తరువాత ఎంచక్గా http://kinige.com/krecharge.php దర్శించి అక్కడి గిఫ్ట్ పెట్టెలో RAINRAINCOMETOME (RAIN RAIN COME TO ME ఖాళీలు లేకుండా) అని టైప్ చేసి మీరు రీచార్జ్ చేసిన మొత్తానికి అదనంగా 5% పొందండి. త్వరపడండి, ఈ ఆఫర్ కొద్దికాలం మాత్రమే, ఈ చిరుజల్లులు తఫానులుగా మారకముందే సద్వినియోగం చేసుకోండి.

 

ఆనంద కినిగె పుస్తక పఠనం. ఇప్పుడు మరింత ఆనందకరం.

 

 

Related Posts:

  • No Related Posts

Kinige Newsletter 16 June 2012


View this newletter Online

Welcome to Kinige Newsletter V2.14
Kinige.com 16 June, 2012
    An Online Store For Indian eBooks Home | My Books | Support
** EvaritO Ela Matladali Thumb Image ** ఎవరితో ఎలా మాట్లాడాలి?

‘రామాయణంలో హనుమంతుడు’ ఆధారంగా రూపొందిన పుస్తకం.

** Bible Kathalu Thumb Image ** బైబిల్ కథలు
ఎమ్బీయస్ ప్రసాద్ రచన
** Macchala Gurram Thumb Image **మచ్చల గుర్రం

మధుబాబు జానపద నవల

** Venkatesha Thumb Image ** శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర
స్వామి వారి దివ్య చరితము

స్వామివారి అద్భుత చరిత్ర, లీలలు

** Yuddhakala Thumb Image **యుద్ధకళ
సన్–జు “ది ఆర్ట్ ఆఫ్ వార్” తెలుగులో
** Angaraka Yatra Thumb Image **ఆనందరావు అంగారక యాత్ర

మన్నె సత్యనారాయణ హాస్యనవల


** Bhinna Dhruvalu Thumb Image ** భిన్న ధృవాలు

మాదిరెడ్డి సులోచన నవల

** Cotton Dora Thumb Image ** సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి

కాటన్ దొర జీవితచరిత్ర

** Maayimuntha Thumb Image ** మాయిముంత

పెద్దింటి అశోక్‌కుమార్ కథలు

** Sayyata Thumb Image ** సయ్యాట

పి.వి. సునీల్ కుమార్ నవల

** Cheppulu Kudutu Thumb Image **చెప్పులు కుడుతూ… కుడుతూ…
ఎమ్మా రొషాంబు క్లౌ పుస్తకానికి అనువాదం
** Alvida Thumb Image ** అల్విదా
కౌముది కవిత్వం
** Toli Telugu Vyangya Chitralu Part 2 Thumb Image ** తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు రెండవ భాగం

తలిశెట్టి రామారావు కార్టూన్లు

** Adavi Thumb Image **అడవి
పి. చంద్రశేఖర అజాద్ నవలిక
** Toli Reyi Thumb Image ** తొలిరేయి
సైన్సు ఫిక్షన్

భిన్న ధృవాలు తేరా నామ్ ఏక్ సహారా?! మా వూరి బాగోతం ఎవరితో ఎలా మాట్లాడాలి?
పర్యావరణ కథలు తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు రెండవ భాగం త్రిపుర కథలు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం
ప్రకృతి వరాలు 1 రామాయణ విషవృక్షం వారసులు Tree, My Guru
మరపురాని మాణిక్యాలు మూగవాని పిల్లనగ్రోవి రమణీయం చారిత్రక వ్యాసమంజరి

From Our Blogs:
** Teacherlaku Thumb Image ** “టీచర్లకు మానసిక రుగ్మతలుంటే…”
ఎ.ఎస్.నీల్ పుస్తకం గురించి
** Marapurani Maniykalu Image ** Soulful Strokes
Article in “The Hans India”
** Vidwan Viswam Thumb Image ** “సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం”
విద్వాన్ విశ్వం గురించి

Related Posts:

  • No Related Posts

డైనమైట్ డోరా

సుప్రసిద్ధ రచయిత మధుబాబు కలం నుంచి జాలువరిన మరో షాడో థ్రిల్లర్ “డైనమైట్ డోరా“. ఈ నవలలో మిసెస్ షాడో (బిందు) ప్రధాన ఆకర్షణ. షాడోతో కలసి ఆమె చేసిన సాహసాలు ఈ రోమాంచక నవలలో చదవచ్చు.

భారతదేశానికి పరమశత్రువైన కిరస్థాన్ బ్లాక్ డిసెంబర్ అనే అంతర్జాతీయ నేరగాళ్ళ ముఠాని పెంచిపోషిస్తుంది. ఆ గ్యాంగ్ వాళ్ళు ఆయుధాలు సమకూర్చుకోడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు ఖనిజాన్ని సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. దేశదేశాల్లోని ప్రముఖ బంగారు వ్యాపారుల కొట్లన్నీ వారి సొంతం ఆయిపోయాయి. వాళ్ళు భారతదేశం మీద దాడి చేయబోతున్నట్లు సమాచారం అందుకున్న సి.ఐ.బి షాడోని రంగంలోకి దించుతుంది. షాడోతో పాటు బిందు కూడా ఈ ఎస్సైన్‌మెంట్‌లో పాలుపంచుకుంటుంది.

షాడో బిందులిద్దరూ, బ్లాక్ డిసెంబర్ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నట్లుగా అనుమానిస్తున్న ఊరు “టెహ్రాన్” చేరుతారు. అక్కడ వేషాలు మార్చి మిసెస్ డోరా, మిస్టర్ డిక్ అనే మారుపేర్లతో చలామణీ అవుతారు. ఆ సంస్థ రహస్యాలు తెలుసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. జైలుకి కూడా వెడతారు.

షాడో కూడా చేయలేని పని, బిందు పూర్తి చేసి, కులకర్ణిగారి ప్రశంసలు పొందింది. ఏంటా పని? బిందుకి డైనమైట్ డోరా అని పేరెందుకు వచ్చింది? ఆమె చేసిన సాహసకృత్యాలు ఏంటి? బ్లాక్ డిసెంబర్ పూర్తిగా మూతపడినట్టేనా? బ్లాక్ విడోస్ ఎవరు?

ఇటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు ఈ ఉత్కంఠభరితమైన నవలలో లభిస్తాయి.

డైనమైట్ డోరా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

డైనమేట్ డోరా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

“టీచర్లకు మానసిక రుగ్మతలుంటే…”

టీచర్లను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిరకం పుట్టుకతోనే టీచర్లు. రెండో రకం ద్వేషంతో కూడుకున్న క్రమశిక్షణావాదులు. పుట్టుకతోనే టీచర్లుగా గుర్తింపు పొందినవారితో సమస్యలేదు. వారు తమ పనిని, పిల్లలను ప్రేమిస్తారు. పిల్లలు వారిని ప్రేమిస్తారు. ఇక రెండోరకం వారితోనే సమస్యంతా. రుగ్మతలతో కూడిన వారి ఆధిపత్య ధోరణి పిల్లలను భయకంపితులను చేస్తుంది. వారు పిల్లలనేగాక తమ వృత్తిని గూడ ద్వేషిస్తారు. టీచర్ అంటే పిల్లలు భయపడుతున్నారంటే ఆ టీచర్ నిజంగా చెడ్డవాడే! ఇది ఏ టీచర్ కైనా వర్తించే గీటురాయి. ఆ టీచర్ నూటికి నూరుశాతం ఫలితాలుసాధించినప్పటికీ విద్యార్ధుల మనసులో మాత్రం వారికి శూన్యస్థానమే. కొన్ని సబ్జెక్టులపట్ల పిల్లలకు ఏర్పడే కాంప్లెక్స్‌లనుబట్టి ఈ విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టీచర్ అంటే ఎక్కువ భయపడే పిల్లలు ఆ టీచర్ బోధించే సబ్జెక్టు అంటే గూడ ఎక్కువ భయపడతారు.

“టీచింగ్ అంటే పాఠాలు చెప్పటం మాత్రమేకాదు. టీచింగ్ అంటే పిల్లలతో పాటు కలిసి జీవించటం. వారిని అర్ధం చేసుకోవటం, వారిలో ఒకరుగా మెలగటం. ప్రముఖ టీచర్ హోమర్ లేన్ చెప్పినట్లు పిల్లల ముఠాలతో కలసిపోవటం. పిల్లల అభిప్రాయాలను వారి మనోభావాలను తెలుసుకునే ఓపిక, సహనం ఉపాధ్యాయులగుండా”. రచయిత ఎ.ఎస్.నీల్ అన్నట్లు దురదృష్టవశాత్తు టీచర్‌కు మాత్రమే దెబ్బలు తినే పిల్లలు సిద్ధంగా ఉంటారు. వారి ఉన్మాదానికి పిల్లలే బలిపశువులు. కాని ఉపాధ్యాయుల సమర్థత తెలుసుకోవటానికి పిల్లలు అసలైన న్యాయమూర్తులు. దురదృష్టవశాత్తు ఇతర వృత్తుల వారితో పోల్చినప్పుడు “టీచర్లకు ఇతరుల నుండి నేర్చుకోవటం ఇష్టముండదు. పెద్ద వయసు ఉపాధ్యాయులకైతే నేర్చుకోవలసిన అగత్యమే లేదనుకుంటారు. ఇక్కడ మనం అహం యొక్క అంతులేని శక్తిని చూడవచ్చు” అన్న నీల్ గారి అభిప్రాయం ఒప్పుకోదగినది.

“పిల్లలకు మూడు లేదా నాలుగు సంవత్సరాలు వయసు వచ్చేవరకు ఇంటి అవసరం ఉంటుంది. కుటుంబానికి భావావేశపరంగా అతుక్కుపోకుండా ఆ వయసులో పిల్లలను బోర్డింగ్ స్కూల్ కు పంపాలి. ఆ స్కూల్లో వారు కోరుకున్నంత సంతోషం లభించాలన్న ఎ.ఎస్.నీల్ గారి అభిప్రాయం ఒప్పుకోదగింది కాదు. ఎందుకంటే అంత చిన్న వయసులో కుటుంబ సభ్యులమధ్య పెరిగితేనే వారిలో సంపూర్ణ మూర్తిమత్వం ఏర్పడుతుంది. కనీసం 15 సంవత్సరాల వయసు వరకు పిల్లలు తల్లిదండ్రులతో ఉండటమే వాంఛనీయం. అప్పుడే వారిలో కలిగే శారీరక, మానసిక మార్పులు కనుగుణంగా తల్లిదండ్రులు వారినొక కంట కనిపెడుతుంటారు. ఇదే హాస్టల్ లో అయితే అంతమంది మధ్య వ్యక్తిగతంగా వారి ప్రవర్తనను పట్టించుకునే వీలు ఉండకపోవచ్చు.

టీచర్లకిచ్చే ట్రయినింగులో పిల్లల మనస్తత్వశాస్త్రం ప్రధానమైన ఒక అంశంగా ఉండాలి. “పిల్లవాడిని అర్థం చేసుకో” అన్నది ట్రయినింగ్ లక్ష్యం కావాలి. ఈ లక్ష్యం ‘నిన్ను నీవు తెలుసుకో’ అనే లక్ష్యంతో ముడిపడి ఉండాలి. అన్న నీల్ గారి సూచన మన ప్రభుత్వాలు గూడ ఆచరణలో పెట్టదగినది. రచయిత అభిప్రాయపడినట్లుగా ‘యూనిఫారంలో ఏదో ఒక బందీ స్వభావం, స్వేచ్ఛను వ్యతిరేకించే గుణం ఉన్నాయని తను స్థాపించిన ‘సమ్మర్ హిల్’ పాఠశాలలో యూనిఫారం లేదని చెప్పారు. జైలు యూనిఫారం, సైనికుల యూనిఫారంలో అలాంటి గుణం ఉంటుందేమోగాని పాఠశాలలో మాత్రం తప్పనిసరిగా యూనిఫారం ఉండాలి. మామూలు దుస్తులకు అనుమతిస్తే విద్యార్ధులలో బీద, గొప్ప తేడాలు స్పష్టంగా కన్పించి,తాము తక్కువవారమనుకునే అవకాశముంది.

సమాజానికి ఉపాధ్యాయులు మూలస్తంభం వంటివారు. అయితే నేను వారి వృత్తికి మాత్రం తగిన గౌరవం లభించటం లేదు. విద్యను సృజనాత్మకంగా రూపొందిస్తే, సృజనాత్మకత కలిగిన స్త్రీ, పురుషులు ఈ వృత్తిలోకి ఆకర్షితులవుతారు. ఈరోజున విద్యారంగం మందగొడులను మాత్రమే ఆకర్షిస్తున్నది. ఈ విద్యారంగంలో పని మందగొడులకు మాత్రమే తగినట్లుగా ఉన్నది. విద్యలో కావలసిందేమిటంటే టీచర్ వ్యక్తిత్వం. స్కూళ్ళలో మంచికీ చెడుకీ టీచర్ల వ్యక్తిత్వమే ప్రధాన భూమిక పోషిస్తున్నది. టీచర్ ప్రేమను లేదా ద్వేషాన్నిగాని భయాన్నిగాని పిల్లలకు సంక్రమింపజేయవచ్చు. కానీ బోధనావృత్తిని అల్పంగా పరిగణించినంత కాలం టీచర్ పిల్లలకు భయాన్ని మాత్రమే అంటగట్టగలిగే ప్రమాదమున్నదన్న నీల్ గారి అభిప్రాయం ఎన్నదగినది.

ఎ.ఎస్.నీల్ అన్నట్లుగా భవిష్యత్తులో స్వేచ్ఛకోసం పిల్లలను తయారుజేయటానికి ప్రతి స్కూలులోను స్వయంపాలన, స్వయం నిర్ణయాధికారం అమలు కావాలి. గుజరాతీ మహోపాధ్యాయుడు గిజూభాయి బధేకా, రవీంద్రనాథ్ టాగూర్ ఆశించినట్లుగా మన విద్యా విధానం మార్పు చెందాలి. అప్పుడే దేశానికి ఉత్తమ పౌరులను అందించగలం.

ఎ.ఎస్.నీల్ గారి 14 అధ్యాయాల ‘ది ప్రాబ్లమ్ టీచర్’ను చక్కని తెలుగులో “టీచర్లకు మానసిక రుగ్మతలుంటే…” అనే పేరుతో డా. సుంకర రామచంద్రరావు గారు అనువదించారు. విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన పుస్తకమిది. ఒకప్పుడు ప్రతి ఉపాధ్యాయుని చేతిలో ఏదో ఒక మంచి పుస్తకము కనిపించేది. కాని, నేటి ఉపాధ్యాయుల చేతుల్లో సెల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ బ్రోచర్లు, చిట్ ఫండ్ కంపెనీల కరపత్రాలు, ఫైనాన్స్ లెక్కలు, జీవిత భీమా పాలసీలు మాత్రమే కనిపిస్తున్నాయి. వృత్తికన్నా ప్రవృత్తికే ప్రాధాన్యతనిస్తున్న రోజులివి. ప్రతి ఉపాధ్యాయుడు తప్పక చదవాల్సిన పుస్తకమిది. అప్పుడే మానసిక రుగ్మతలేమిటో వాటిని ఎలా వదిలించుకోవాలో తెలుస్తుంది.

పూదోట శౌరీలు
(నడుస్తున్న చరిత్ర జూన్, 2012 నుంచి)

* * *

” టీచర్లకు మానసిక రుగ్మతలుంటే…” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

టీచర్లకు మానసిక రుగ్మతలుంటే… On Kinige

Related Posts:

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం

ఈతరం పాఠకులకు అంతగా పరిచయం లేని సాహితీదిగ్గజం విద్వాన్ విశ్వం. ఈ మహానుభావుడిని పునరావిష్కరించే క్రమంలో డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్ళి మురళీమోహన్ సంకల్పించిన అపురూప గ్రంథం ‘సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం‘. సంపాదకుల అభిప్రాయంలో “ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, మానవతావాదికి లభించవలసినంత గుర్తింపు లభించలేదు. వారి ప్రతిభకు మనం తగిన పట్టం కట్టలేదు. వారి రచనలపై పి హెచ్.డి. స్థాయిలో ఒక్క పరిశోధన కూడా వెలుగు చూడలేదు”

ఈ కారణంగా, వారి జీవితం, రచనలగురించి కొంతైనా తెలియచేయడానికి, “త్వరలో ఆంధ్రదేశం జరుపుకోబోతున్న విశ్వం (1915-2015) గారి శతజయంతిని దృష్టిలో వుంచుకుని, ఆ సాహితీ పూర్ణచంద్రునికి ఈ నూలుపోగు” సమర్పించారు.

నాలుగు అధ్యాయాలుగా కూర్చిన ఈ పుస్తకంలో, విశ్వంగారి గురించి, సర్వశ్రీ దివాకర్ల వెంకటావధాని, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, మహీధర రామమోహనరావు, ఏటుకూరి బలరామమూర్తి,తిరుమల రామచంద్ర, ఆరుద్ర, దాశరధి వగైరా ప్రముఖులు రాసిన వ్యాసాలూ, పరిచయాలూ ఉన్నాయి. అలాగే, అయిదు దశాబ్దాల పత్రికా జీవితంలో, విశ్వంగారు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, మొదలైన పత్రికల్లో నిర్వహించిన, బహుళప్రచారం పొందిన తెలుపు – నలుపు, మాణిక్యవీణ, మంచీచెడ్డా, ఆనందం, విజ్ఞానం వగైరా రచనల్ని ‘విశ్వరూపి’ అనే అధ్యాయంలో చేర్చారు. మరికొన్ని వ్యాసాలు, సమీక్షలు ‘విశ్వభావి’ లో, ఆయన సందేశాలు, ఇంటర్యూలు చివరి అధ్యాయంలో పొందుపర్చారు. మొత్తంమీద ఈ పుస్తకాన్ని, సమగ్రంగా చదివితే, విశ్వంగారి జీవితం, రచనల గురించి ఒక స్పష్టత ఏర్పడుతుందనటంలో సందేహంలేదు.

అనంతపురంజిల్లాలోని తరిమెలగ్రామంలో జన్మించిన మీసరగండ విశ్వరూపాచారి, సంస్కృతాధ్యయనంతో విశ్వరూప శాస్త్రిగా ఎదిగి, ఆ పేరుతో పలు రచనలు చేసినా, మదరాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పుచ్చుకుని విద్వాన్ విశ్వంగా మారిన క్రమం తెలుసుకోవాలంటే డా.నాగసూరి వేణుగోపాల్ గారి వ్యాసం చదవాలి. సంస్కృత పండితుడైనా, తరిమెల నాగిరెడ్డి సాంగత్యంలో వామపక్షభావాలు వంటపట్టించుకున్నాడు విద్వాన్ విశ్వం. 1938లోనే నవ్య సాహిత్య గ్రంథమాలను ప్రారంభించి పాసిజం, లెనిన్, స్టాలిన్ ల గురించి పుస్తకాలు ప్రచురించారు.

ఇరవయ్యవ ఏటనే ‘విరికన్నె’ రచించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వున్నప్పుడు మార్క్సిస్టు సాహిత్యంతో, రాజకీయాలతో సంబంధం పెంచుకున్నారు. 1938లో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1945లో, హైదరాబాదు మీజాన్ పత్రికలో వర్కింగ్ జర్మలిస్టుగా చేరి ఆ తర్వాత మరికొన్నాళ్ళు ప్రజాశక్తిలో పనిచేసి, 1952నుండే ఆంధ్రప్రభ వారపత్రికలో వివిధ హోదాలలో కొనసాగారు.

విక్రమోర్వశీయంతో ప్రారంభమైన విశ్వంగారి అనువాద కార్యక్రమం కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర, మేఘసందేశం, దాకాకొనసాగింది. ఇవి కాక, ఇతర భారతీయ భాషలనుండీ ప్రపంచ సాహిత్యంనుండీ పలురచనలు తెనుగించారు. చెహోవ్, యితర రష్యన్ రచయితల కథలు, ఫ్రెంచి రచయిత రోమా రోలాకు నోబెల్ బహుమతి సంపాదించి పెట్టిన ‘జాఁక్రిస్తోఫ్’ను ‘మానవుడు’గా ఇబ్సన్, షాల నాటకాలను, ఫ్లాహెర్టీ నవలను, రజనీపామీదత్ భారతదేశం గురించి రాసిన వుద్గ్రంధాన్ని, రవీంద్రుని రచనల్ని కూడా తెలుగువాళ్ళకందించాడు. ఇవన్నీగాక, కథా సరిత్సాగరాన్ని పన్నెండు భాగాలుగా తెలుగు చేశారు.

అయితే, మనం యింకా ఎంత చెప్పుకున్నా విశ్వంగారి పేరు చెప్పగానే చప్పున గుర్తుకు వచ్చే కావ్యం పెన్నేటిపాట, పెన్నానది పరీవాహక ప్రాంతంలోని నిజ జీవితాన్ని కరుణరసార్ద్ర హృదయంతో రచించిన కన్నీటిపాటే ఈ పెన్నేటిపాట. రాయలసీమ జన జీవితాన్ని ప్రతిబింబించిన తొలికావ్యం యిది అన్నారు భూమన్. 1956లో, తెలంగాణ రచయితల సంఘం ఈ కావ్యాన్ని ప్రచురించింది. విశ్వంగారు తెలంగాణ రచయితలకు ఆత్మబంధువు అన్నాడు దాశరథి. సంఘంపేరు తెలంగాణ రచయితల సంఘం అయినా, కార్యకలాపాలు ఆ ప్రాంతానికే సీమితం కాలేదు అని కూడా శలవిచ్చారు.

విశ్వంగారి మరొకకావ్యం ‘ఒకనాడు’ 1965లో అచ్చయింది. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా యిది రాశాడాయన. బ్రిటిష్ సైనికుల అత్యాచారం, నుండి యిద్దరు హిందూ మహిళలను రక్షించే క్రమంలో, గుత్తిలోని రైలుగేటు కీపర్ గూళిపాలెం హంపన్న ప్రాణాలొడ్డిన రోజది. (4 అక్టోబర్ 1893).

పత్రికా వుద్యోగం నుండి విరమణ తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగం ప్రధాన సంపాదకులుగా పనిచేసిన విశ్వంగారు వేదాలతోపాటు, మరెన్నో సంస్కృత గ్రంథాలను అనువదించారు.
విశ్వంగారిలాంటి సంపాదకులు, రచయితలను స్వేచ్చగా రాయనిచ్చి, సహజంగా ఎదగనివ్వటం వల్లనే ఒక లత, కృష్ణకుమారి, రంగనాయకమ్మ, కౌసల్యాదేవి, విశాలాక్షి అచ్యుతవల్లి మొదలగువారు సుస్థిరమైన స్థానాన్ని పొందగలిగారు’ అంటారు మాలతీ చందూర్.

ఎన్ని పత్రికల్లో పనిచేసినా, ఎక్కడా నిలకడగా చేయలేకపోయాడు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకపోయారు. ఎవరినీ సంతృప్తి పరచలేకపోయారు. అంటారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.
ఏది ఏమైనా, పేర్లుఏవైనా, పత్రికలు ఏవైనా, 1952 నుండి, 1987 దాకా ముఫ్పై అయిదేళ్లపాటు అవిచ్ఛిన్నంగా పత్రికల్లో ఒక (కాలం) ను శీర్షిక నడిపిన బహుశా, ఒకే ఒక తెలుగు సాహితీమూర్తి విద్వాన్ విశ్వం అంటారు వెలుదండ నిత్యానందరావు.

సందేశాలు యివ్వడం చాలా సులభం. అవి ఎప్పుడూ మంచిమాటలుగానే వుంటాయి. కాని ఆ దారిలోనే నడవచ్చని చూపించాలి. ఆశయ విహీనమైన జీవితం వ్యర్థం. ఎవరి ఆశయం వారే నిశ్చయించుకుని, అందుకోసం ఎంత తపించి కృషి చేస్తే అంత మంచిది. నడిచే వారికన్నా, నడిపించేవారిలో చిత్తశుద్ధి అవసరం. అన్న విశ్వంగారి మాటలు అందరికీ స్ఫూర్తిదాయకం.

ముక్తవరం పార్థసారథి. (నడుస్తున్న చరిత్ర జూన్, 2012 నుంచి)

* * *

“సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ పుస్తకం ప్రింట్ బుక్‌ని మీరు కినిగె వెబ్ సైట్ నుంచి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం On Kinige

Related Posts: