నిర్జన వారధి

నిర్జన వారధి

సమాజంలో మౌలిక మార్పులు కోరే సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమం అనే మూడు ఉద్యమాల వారధి కొండపల్లి కోటేశ్వరమ్మగారు. ఈ మూడు ఉద్యమాలలోని స్త్రీల పోరాటపటిమకు, వేదనకు కూడా ప్రతినిధి. మూర్తీభవించిన ఉద్యమ రూపం. “నిర్జన వారధి” కోటేశ్వరమ్మగారి ఆత్మకథ. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్ద్రమవుతుంది.

* * *

“నిర్జన వారధి” చదవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
నిర్జన వారధి On Kinige

నిర్జీవంగా ఉన్న సీతారామయ్యను చూస్తే ఎన్నో జ్ఞాపకాలొచ్చాయి. ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం…. ధారపోశాక చూడ్డానికి వాళ్ళ పార్టీవాళ్ళెవరూ రాలేదెందుకని? తమ ఉద్యమనేత చనిపోతే విభేదించాడని వదిలేస్తారా? నన్ను… సీతారామయ్య తనకి అనుకూలంగా లేనని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను వాళ్ళు వదిలేశారు. ఇంతేనా జీవితం?

కొండపల్లి కోటేశ్వరమ్మ

నిర్జన వారధి పుస్తకం ముందుమాట నుండి

ఇవీ…నేను అనుకున్నవి
నేను ఒక గొప్ప వ్యక్తినీ, రచయిత్రినీ కాకపోయినప్పటికీ ‘నీ జీవితం ఓ కావ్యం లాంటిది. అది పదిమందికీ తెలియడం అవసరం’ అని చెపుతుండేవాళ్ళు కొంతమంది పెద్దలూ, మిత్రులూ. ‘సామాన్యుని సాహసమెట్టిదో…’ చరిత్రలో నమోదు కావాలని మహీధర రామమోహనరావు, చేకూరి రామారావు, స్మైల్‌ వంటివాళ్ళు, పరకాల పట్టాభి రామారావు, మానికొండ సూర్యావతి వంటి మిత్రులు నన్ను ఆత్మకథ రాయమని ప్రోత్సహిస్తుండే వాళ్ళు.
జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. తడిసిన ఆ అక్షరాలను అర్థవంతంగా కాగితం మీద పెట్టడం నా వల్ల అవుతుందా అనుకున్నాను. అందుకే ఇన్నేళ్ళుగా ఆ ప్రయత్నం చేయలేదు.
నా మనవరాళ్ళు అనురాధ, సుధ, నన్ను అమ్మమ్మా అని పిలిచే మరో మనవరాలు వసంత (వేమన వసంతలక్ష్మి) ‘నీ ఒంట్లో శక్తి తగ్గకముందే నీ జీవితాన్ని కథగా రాయి. ముందు తరాలకు తెలియకుండా దాన్ని మాసిపోనివ్వొద్ద’ని మరీ మరీ చెప్పారు.
అయినా నా శక్తీ, నా కంటిచూపూ అందుకు సహకరిస్తాయా అని సందేహించాను.
నీ మిత్రులు ఎందుకు రాయమన్నారో ఆలోచిస్తేనూ, విూరు ఆనాడు ఎందుకు ఉద్యమించారో గుర్తుచేసుకుంటేనూ నీ కన్నీరే కథగా ప్రవహిస్తుంది ప్రారంభించమన్నారు వాళ్ళు.
అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో అనురాధ, అనురాధ మిత్రులు వాసుగారు, వసంత ఎంతో సహకరించారు. సుందరయ్యగారు, రాజేశ్వరరావు గారిలాంటి వ్యక్తులు నా జీవితంతో ఎంతగానో ముడిపడిపోయిన వ్యక్తులు కాబట్టి సహచర కామ్రేడ్స్‌ మీద రాసిన సంస్మరణ వ్యాసాలను కూడా ఇందులో అనుబంధంగా చేర్చాను. ప్రత్యేకించి అనురాధ అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో చాలా శ్రమ తీసుకుంది.
స్త్రీ జనాభ్యుదయంపై ప్రేమాభిమానాలున్న ఓల్గాగారు అడగ్గానే ముందుమాట రాయడానికి ఒప్పుకున్నారు. నా కథను పాఠకులు లోతుగా ఆలోచించేటట్లుగా చారిత్రక ఉద్యమాల అవగాహనతో విశ్లేషించారు.
ఈ పుస్తక ప్రయత్నం గురించి తెలిసి దాన్ని అచ్చువేయడానికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ముందుకొచ్చారు. ‘సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం మొత్తం నాలుగు ఉద్యమాలతో సంబంధం ఉన్న జీవితం మీది. కనుక దేన్నీ వదిలిపెట్టకుండా రాయమని’ కొన్ని సూచనలిచ్చారు బుక్‌ ట్రస్ట్‌ గీత గారు. ఆ ప్రకారం మరికొన్ని అనుభవాలు గుర్తు తెచ్చుకుని రాశాను. మరికొన్నిటిని విమలగార్ని విశాఖపట్నం పంపి రికార్డు చేయించి ఇందులో చేర్చారు.
ఇందరి సహకారంతో నా జీవిత కథ ఇవ్వాళ నా 92వ యేట పుస్తక రూపంలో రానుంది. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందను కుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలో మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందను కుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ళ నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను.

కొండపల్లి కోటేశ్వరమ్మ

* * *

ఈ పుస్తకం పై కొంతమంది పాఠకుల అభిప్రాయాలు

చదవదగ్గ పుస్తకం, చాలా రోజుల తర్వాత, కన్నీళ్ళు ఆపుకోలేకపోయా….

కృష్ణ ప్రవీణ్

నేనూ చదువుతూ ఉన్నా. ముప్పావు వంతు అయ్యింది. అద్భుతమైన పుస్తకం. ప్రవీణ్ గారికి మల్లే నాకూ కొన్ని చోట్ల కళ్ళలో నీరు, వెంటనే కోటేశ్వరమ్మ గారు తన జీవితాన్ని ఎదుర్కున్న తీరు చూసి బోలెడంత స్పూర్తీ కలిగాయి.

వి. బి. సౌమ్య

పుస్తకం చదివాను. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే కోటేశ్వరమ్మగారి స్వయం ప్రకాశత్వాన్ని అర్థం చేసుకోనట్లు అవుతుంది అయినా ఒక వాక్యం, చదువుతున్నంతసేపూ కన్నీరు వరదలై కారింది, ఆ కన్నీటి ప్రవాహాన్ని కూడా ఆపుకోవాలనిపించలేదు.


చావా కిరణ్

* * *

“నిర్జన వారధి” చదవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
నిర్జన వారధి On Kinige

Related Posts:

చదవాల్సిన పుస్తకం: మనీప్లాంట్

ఇతర భాషా కథల్ని తెలుగువారికి పరిచయం చేస్తున్న రచయితల్లో ముందువరుసలోని కథకుడు – కొల్లూరి సోమ శంకర్. సోమ శంకర్ అనువాద కథల సంపుటి – ‘మనీప్లాంట్‘.
కొన్ని ప్రత్యేకతలని సంతరించుకుని, ఒక విలక్షణ గ్రంథంగా మనముందుకొచ్చింది – ఈ ‘మనీప్లాంట్’.

ఈ పుస్తకానికి “వికసించిన అనువాద సృజన” అని గుడిపాటి ముందుమాట ఉంది. పుస్తకంలోని ప్రత్యేకతల్లో మొదటిది ఈ ముందుమాట.

తెలుగులో చక్కని వచనం రాయటం చక్కని కవిత్వం రాయటం కంటే కష్టం. ‘శైలి రచయిత వ్యక్తిత్వం’ అంటారు. కొంతమంది శైలి బాగా incisive గా వుంటుంది. అతి తక్కువ అక్షరాల పదాలు, అతి తక్కువ పదాల వాక్యాలు, భావం వాటి వెంట పరిగెత్తుతుంది. ప్రతిపాదిస్తున్న అంశం మళ్ళీ గాఢంగా అందుతూ వుంటుంది పఠితకి.
ఇంతటి శక్తివంతమైన శైలి తెలుగు రచయితల్లో చాలా తక్కువ మందిలో చూస్తాము.

గుడిపాటి అభిప్రాయభాగాన్ని ఉదహరిస్తున్నాను. చూడండి. “జీవితం అందరికీ ఒకేలా ఉండదు. మనుషులు తార్కికంగా, హేతుబద్ధంగా ప్రవర్తించరు. సహేతుకంగా ఉండాలని ఆశించడం తప్పుకాదు. కానీ ఉండలేకపోవడమే జీవిత వాస్తవం. తమలా ఎదుటివారు ఆలోచించాలని, నడుచుకోవాలని మనుషులు ఆశిస్తూంటారు. కానీ అలా ఎవరూ ఉండలేరు. నిజానికి తాము ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కూడా ఉండలేరు. కారణాలేమయినా, మనుషుల్ని ఉద్వేగాలే నడిపిస్తాయి. అందుకే ఒక తీవ్రతలోంచి మరో తీవ్రతలోకి ప్రయాణిస్తారు. ఈ మనిషి చచ్చిపోతే బాగుండును అనుకున్న మనిషి పట్లనే అవాజ్యమైన ప్రేమ కలుగుతుంది. అదెలా సాధ్యమనే ప్రశ్నకు హేతువు సమాధానం చెప్పదు. జీవితమే దాని సరైన జవాబు. ఇలాంటి జీవిత సత్యాన్ని చెప్పే కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి”.

భావాస్పదమైన పదాల పోహళింపు, భావ విపులీకరణ – రెండూ అద్భుతంగా నిర్వహించబడిన రచనా పరిచ్ఛేదం ఇది.

ఇక, గుడిపాటి వ్యక్తం చేసిన జీవన తాత్వికతకి వస్తే – ఇది పూర్తిగా భౌతిక వాస్తవికత పునాదిగా కల్గిన అవగాహన. మనిషి బహిరంతర వర్తన, ఆలోచన – వీటికి గల పరిమితి, వీటి మీద external and internal forces ప్రభావాలు – అన్నీ సద్యస్ఫూర్తితో ఆకళించుకుని చెప్పిన ఒక గొప్ప అభిప్రాయంగా అంగీకరిస్తాము దీన్ని.
జీవితం పట్ల ఒక తాత్విక వివేచనని సముపార్జించుకోకుండా, అధ్యయన రాహిత్యంతో కథల్ని పునాదులు లేని మేడలుగా నిర్మించబూనడం – ఆరుద్ర అన్నట్లు ‘బంతి లేకుండా ఫుట్‌బాల్ ఆడడం’ వంటిది. జీవితం, జీవన విధానం, గతి – సరళరేఖ కాదు. దీన్ని గమనించకుండా, ప్రతీ సంఘటనకీ, కథలోని ప్రతీ పాత్రకీ కార్యకారణ సంబంధాల్ని అంటగట్టాలని కృతకమైన రీతికి తలపడడం – కథౌచిత్యాన్ని దెబ్బతీస్తుంది.

గుడిపాటి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించేవారు – అటు పాఠకుల్లోనూ, ఇటు కథకుల్లోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు గుడిపాటి చెప్పినంత స్ఫుటంగా, ఇంత సరళంగా, ఇంత శక్తివంతంగా – తెలుగు కథా సాహిత్యంలో ఎవరూ చెప్పలేదు. గుడిపాటి చెప్పిన ఈ అంశాన్ని కొత్తకథకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

‘మనీప్లాంట్’ పుస్తకంలోని Contents విషయానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకతలని చూద్దాం. ‘పట్టించుకోని వాళ్ళయినా వాస్తవాలని ఎదుర్కోక తప్పదు’ అంటాడు ఆల్డస్ హక్స్‌లీ. మనకు బాగా దూరంగా నివసించే ప్రజల గురించీ, వారి జీవన విధానాన్ని గురించీ, స్థితిగతులను గురించీ మనం ఎక్కువగా పట్టించుకోము. కానీ, అవే మనకూ తారసపడవచ్చు. మనమూ వాటిని ఎదుర్కోవలసి రావచ్చు. కనుక, ఆయా స్థితిగతుల్ని మనమ్ ముందుగానే పరిచయం చేసుకొని వుంటే, నిజజీవితంలో ఆయా సంభవాలు ఎదురయితే, వాటిని ఎదుర్కోడం సుళువవుతుంది. అంటే మానసికంగా తయారై వుండటమన్న మాట. ఇతర భాషాసాహిత్య పఠనం ఇందుకు బాగా వుపయోగపడుతుంది. అందునా కథలు – వివిధ జీవన పార్శ్వాల మెరుపుల్నీ, మరకల్నీ, మనకు గాఢతతో అందించగలవు; మన ఆలోచనల విస్తృతికి దోహదం చేయగలవు. ఇదీ అనువాద కథల ప్రయోజనం.

ఈ పుస్తకానికి “అనువాద ‘కథం’బం” ముందుమాట కూర్చిన కె. బి. లక్ష్మి ఇదే విషయాన్ని ఇలా చెప్తున్నారు, “స్నేహాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసుయలు, కలిమిలేములు, కష్టసుఖాలు, వినోద విలాసాలు – వగైరాలు విశ్వమానవులందరికీ సమానమే. ఏ భాష వారు ఆ భాషలో ఘోషిస్తారు”. కనుక, ఆ ఘోషల మూలాల్ని అర్థం చేసుకోడానికి ఈ కథలు తోడ్పడుతాయి.

‘మనీప్లాంట్’ లోని మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ – వర్తమాన సమాజ జీవన దృశ్యాల సమాహారం. ఎంతో నేర్పుతో – ‘ఈనాటి’ జీవితాల్నీ, వ్యక్తిగత ధోరణుల్నీ, సాంఘికంగా సంక్లిష్టతలని కల్పిస్తున్న రీతి రివాజుల్నీ – ఈ కథల్లో దర్శింపజేసాడు, సోమ శంకర్. కథల్ ఎన్నిక – ఆ విధంగా ఎంతో చాకచక్యంగా నిర్వహించాడు.
“లుకేమియా”తో బాధపడుతున్న క్లాస్‌మేట్ గుండుకు తోడు సహానుభూతితో తానూ గుండు చేయించుకున్న చిన్నపిల్ల సింధు కథ ‘పెరుగన్నం’తో మొదలుపెట్టి, శూన్యభట్టాచార్య పేరుతోనే సున్నాగాడుగా స్థిరపడి – జీరోగా గేలిచేయబడిన ‘శూన్య’ చివరికి గురువుగారి సాంత్వనలో “నేనంటే నాకెంతో గర్వంగా ఉందీ రోజు” అనుకునే స్థితికి ఎదిగిన “సున్నాగాడు” వరకూ – ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూస.

మారిస్ బౌడిన్ జూనియర్ అనే రచయిత – కథకునికి ఆవశ్యకమైన విశిష్ట దృక్పథాన్ని గురించి రాస్తాడు ఒకచోట. అనువాద కథనే రాస్తున్నా – సోమ శంకర్‌లో ఈ విశిష్ట దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మూల కథలోని వాతావరణాన్నీ, పరిసరాలని అవగతం చేసుకుని, మూల కథా రచయిత కంఠస్వరాన్ని గుర్తెరిగి, ఆ భాషాసౌందర్యానికి భంగం కలగకుండా, నుడికారాన్ని చెడగొట్టకుండా – అనువాదం నిర్వహించారు సోమ శంకర్.

కథకుని లక్ష్యశుద్ధీ, చిత్తశుద్ధీ – పుష్కలంగా ద్యోతకమవుతున్న గొప్ప కథా సంపుటి ‘మనీప్లాంట్’. అందుకే ఇది కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం.

విహారి (చినుకు మాసపత్రిక, ఆగస్టు 2008 సంచిక నుంచి)

* * *

“మనీప్లాంట్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మనీప్లాంట్ పుస్తకాన్ని కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

మనీప్లాంట్ On Kinige

Related Posts:

పాలకవర్గాలు జవాబు చెప్పాలి

ఆలోచింపజేసే సంపాదకీయం – నడుస్తున్న చరిత్ర సెప్టెంబరు 2012 సంచిక నుంచి

Nadustunna Charitra September 2012 Editorial

* * *

నడుస్తున్న చరిత్ర సెప్టెంబరు 2012 On Kinige

Related Posts:

“భరతఖండంబు చక్కని పాడియావు” 40% తగ్గింపు ధరకి

చిలకమర్తి వారి ఆత్మకథ “స్వీయచరిత్రము”

Special 40% discount on “Sweeyacharitramu”, autobiography of eminent poet, freedom fighter and social reformer Chilakamarthi Lakshmi Narasimham. Hurry, offer valid only for couple of days. To purchase the eBook at 40% discount Click here now.
చిలకమర్తి వారి ఆత్మకథ “స్వీయచరిత్రము” 40% తగ్గింపు ధరకి On Kinige

“భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”
అంటూ భారత స్వాతంత్ర్య సమరం సందర్భంగా తెలుగువారిని కార్యోన్ముఖులను చేసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ఆత్మకథ “స్వీయచరిత్రము”.

* * *

చిలకమర్తి వారి జన్మదినం (26 సెప్టెంబరు) సందర్భంగా ఈ పుస్తకంపై 40 శాతం ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది కినిగె.

త్వరపడండి. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే.

* * *

పండిత కుటుంబంలో పుట్టిన చిలకమర్తి సంస్కృతాంధ్రాల్లో ప్రావీణ్యం సంపాదించి, రాజమండ్రి కళాశాలలో ఆంగ్లాన్నీ అభ్యసించాడు. రాజమండ్రిలో చదువుకొంటున్నప్పుడే, వీరేశలింగం భావాలవైపు ఆకర్షింపబడి, ఆయన అనునూయులలో అగ్రగణ్యుడైనాడు. అప్పటికే, రాజమండ్రిలో నెలకొనివున్న సంస్కరణ వాతావరణం, కళాశాల చదువు, అప్పుడప్పుడే రాజుకొంటున్న జాతీయభావజాలం చిలకమర్తిపై తీవ్రప్రభావాన్ని కలిగించాయి. 21 అధ్యాయాల్లో రాసిన ‘స్వీయ చరిత్రము’లో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం, గ్రంథరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్‌ యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – యివన్నీ సవివరంగా రాశాడు. చిలకమర్తి ఏకసంథాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు. చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశాడు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో పరికించాడు.

వకుళాభరణం రామకృష్ణ

చిలకమర్తి వారి ఆత్మకథ “స్వీయచరిత్రము” 40% తగ్గింపు ధరకి On Kinige

Special 40% discount on “Sweeyacharitramu”, autobiography of eminent poet, freedom fighter and social reformer Chilakamarthi Lakshmi Narasimham. Hurry, offer valid only for couple of days. To purchase the eBook at 40% discount Click here now.

Related Posts:

అదివో… అల్లదివో….

ఎం. వెంకటేశ్వరరావు రాసిన 25 కథల సంకలనం “అదివో…అల్లదివో…“. మధ్యతరగతి మనస్తత్త్వాలకు అద్దం పట్టిన కథలివి. ఆశలు, కోరికలు, ఆశయాలు, ఊహలు, వాస్తవాలు, మధుర స్మృతులు, బాధాజ్ఞాపకాలు…. ఇలా మధ్యతరగతి జీవితాలని అలవోకగా వ్యక్తీకరించిన కథలివి.

కుటుంబాలు ఎలా ఛిద్రమవుతున్నాయో, ఆర్ధిక విలువలు మానవత్వాన్ని ఎలా శాసిస్తున్నాయో చెప్పే కథలు చాలానే వచ్చినా, ఇందులోని కథలకు ఇతివృత్తం చాలా వరకు అదే అయినా, కథనం నూతనంగా ఉంది. ముగింపు వాస్తవికంగా ఉంది.

అమెరికాకి ఎగిరిపోయిన కొడుకుల స్వార్ధం లేదా భార్యల మాటల జవదాటలేని అసమర్ధ భర్తలు…. మౌనంగా బాధలు సహించే అత్తమామలు ఇలాంటి పాత్రలెన్నో ఇతర కథల్లో తారసపడతాయి. అయితే, ఈ సంపుటంలోని కథలలో బాంధవ్యాలని స్వార్థపూరితం చేసిన మనుషులకు అంతే ధీటుగా సమాధానం చెప్పే పాత్రలు తారసపడతాయి. చదువరుల మెప్పు పొందుతాయి.

తమ ముందు తరం ప్రతినిధులైన పెద్దలకూ నచ్చజెప్పలేక, తమ తర్వాతి తరమైన తమ పిల్లలకు సుద్దులు చెప్పలేక సతమతమయ్యే కుటుంబీకులెందరో ఉన్నారు. అందుకే ఈ పుస్తకంలోని కథలు వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పచ్చు.

ఉద్యోగ విరమణ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటూ అనవసరంగా డబ్బులు వృధా చేసే ఓ తండ్రికి కొడుకు కోడలు పడుతున్న అవస్థలు ఎలా అర్థమవుతాయి? కాలికి చిన్న దెబ్బతగిలితేనే, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్ రే తీయించుకోవాలనుకున్న ఆ వ్యక్తి తన అమెరికా ప్రయాణాన్ని ఎందుకు మానుకున్నాడు? ఆపరేషన్ చేసినా బ్రతుకుతాడో లేదో తెలియని యువకుడికి సాయం చేయాలని అతనికి ఎందుకు అనిపించింది? ఇలాంటి సంఘటనలు మధ్యతరగతి జీవితాల్లోనే సాధ్యమవుతాయి. అందుకే ఈ కథలు చదువుతుంటే మన కథలు అనిపిస్తాయి.

చాలా కథల్లో మనుషుల్లోని లోపాలను ఎత్తి చూపినా అవే కథల్లో వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చో ఆయా పాత్రల ద్వారా చెప్పిస్తారు రచయిత.

తన పైఅధికారి తన పై అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నందుకు బాధపడిన ఓ ఉద్యోగి, ఛిన్నాభిన్నమైన జీవితాన్ని పునర్నించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళ కూతురి పట్ల తాను కూడా అకారణంగా ద్వేషం పెంచుకుని ఆ పిల్లని అసహ్యించుకున్నట్లు గ్రహించగానే, తన తప్పు దిద్దుకుంటాడు. తనకెదురవుతున్న బాధ తన ద్వారా మరొకరు అనుభవించకూడదన్న జీవిత సత్యాన్ని అతను పాటించగలిగాడు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండాల్సిన పవిత్రబంధం సడలిపోతున్న తీరు, సమాజంలో వెర్రితలలు పోతున్న ఆధునిక పోకడలను కొన్ని కథలలో అద్బుతంగా వ్యక్తం చేసారు రచయిత. సంఘం ఇలా మారడంలో మన ప్రమేయం ఎంతవరకు అని పాఠకులు ప్రశ్నించుకోక మానరు.

ఈ సంపుటంలో చోటు చేసుకున్న రెండు రైతు కథలు కర్షక సోదరుల కష్టాలను, మౌన ఆక్రందనలను ఎలుగెత్తి చాటాయి. వ్యవస్థలో లోపమెక్కడా అని ఆలోచనలోకి దింపుతాయి. అన్నదాత వ్యథలెలా తీరుతాయోనని కించిత్ దిగులు కూడా కలుగుతుంది.

చివరగా, ఈ సంపుటానికి శీర్షిక అయిన “అదివో… అల్లదివో..” కథ గురించి చెప్పుకోవాలి. తిరుమల వెళ్ళాలంటే ఇప్పుడు సామాన్యలు ఎందుకు విముఖత చూపిస్తున్నారో ఈ కథ చదివితే అర్థం అవుతుంది. ఎన్ని అవకతవకలున్నా, ఇబ్బందులు పడుతున్నా, జనాలు ఇంకా ప్రతీ రోజు వేల సంఖ్యలో తిరుమల ఎందుకు వస్తున్నారో కూడా అర్థమవుతుంది.

మనుషుల్లోని నెగటివ్ లక్షణాలని ప్రస్తావించిన పాజిటివ్ కథలు ఇవి.

“అదివో…అల్లదివో…” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

అదివో… అల్లదివో! On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

యముడు

సుప్రసిద్ధ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన షాడో అడ్వెంచర్ – యముడు.

ప్రపంచన్నంతటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకుని, అందుకు పలువిధాలుగా ప్రయత్నిస్తూండే ముఠా కిల్లర్స్ గ్యాంగ్. దేశవిదేశాలలోని రౌడీలు, వస్తాదులు, గూండాలు ఈ గ్యాంగ్‌లో సభ్యులు. మిగతా దేశాలలో ఈ గ్యాంగ్ ప్రణాళికలు సఫలమైనా, భారతదేశంలో మాత్రం వీరి ప్రయత్నాలకు అడుగడుగునా చుక్కెదరవుతోంది. కారణం….? షాడో, ఇంకా ఇతర సి.ఐ.బి ఏజంట్లు.

తమ కార్యక్రమాలన్నీ వైఫల్యం చెందడానికి మూలకారకుడైన షాడోని తమవైపు తిప్పుకోడానికి ప్రయత్నించింది కిల్లర్స్ గ్యాంగ్. తమతో కలిస్తే షాడో కోరుకున్న దేశానికి అధినేతని చేస్తానని ఆశచూపింది. షాడో లొంగలేదు. చివరికి షాడో తలపై భారీ బహుమానం ప్రకటించింది. బహుమానం కోసం ఆశపడిన రౌడీలు, గ్యాంగ్ లీడర్లు షాడో చేతిలో చావుదెబ్బలు తిన్నారు.

ఇక షాడోని అంతమొందించడానికి మరో మార్గం ఎంచుకుంది కిల్లర్స్ గ్యాంగ్. షాడోకి బాగా పరిచయస్తులైన వ్యక్తులను ఆకర్షించి వారి ద్వారా షాడో అడ్డు తొలగించుకోవాలని చూసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే, బషీరుద్దీన్‌ని సంప్రదించింది.

బషీరుద్దీన్ ఎవరు? షాడోకీ, గంగారాంకీ బషీరుద్దీన్‌కి పరిచయం ఎలా జరిగింది?

షాడోని ఖతమ్ చేయాలని అనుకున్న వారెవరూ చేరుకోలేనంత సమీపంలోకి బషీరుద్దీన్ ఎలా చేరుకున్నాడు?. వేరెవరూ సంపాదించుకోలేని కాన్ఫిడెన్స్‌ని తను ఎలా సంపాదించుకున్నాడు? షాడో కూర్చునే ప్రదేశంలో పేలుడు పదార్థాన్ని నిక్షేపించగల అవకాశం అతనికెలా వచ్చింది? వచ్చిన అవకాశం ఎందుకు చేజారిపోయింది? ఎవరివల్ల అలా జరిగింది?

ఈ ప్రశ్నలకి జవాబులు చివరిదాక ఆసక్తిగా సాగిపోయే ఈ రోమాంచక నవలలో దొరుకుతాయి.

యముడు నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

యముడు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

వినాయక వ్రతకల్పం get your F R E E eBook !

కినిగె పాఠకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

ఉచిత ప్రత్యేకమైన వినాయక వ్రత కల్పం దిగుమతి చేసుకోడానికి ఇక్కడ నొక్కండి.

వినాయక వ్రతకల్పం On Kinige

శ్రీ నందన నామ సంవత్సర వినాయక చవితి (2012) సందర్భంగా భక్తిప్రపత్తులతో కినిగె అందిస్తోంది – “వినాయక వ్రతకల్పం పుస్తకం” ఉచిత కానుక. ఇది సరళ వచనంలో చెప్పబడిన క్రియారూపక పూజావిధానం.

ఇందులో పూజాసామాగ్రి వివరాలు, శ్లోకాలు, వివరణ, దండకం, మంగళహారతులు, వ్రత కథ మొదలైనవన్నీ నిర్దిష్ట పద్ధతిలో చెప్పబడ్డాయి. మొదటిసారిగా పూజ చేసుకునే వారు సైతం ఏ ఇబ్బంది లేకుండా పూజ చేసుకునేలా చెప్పబడ్డాయి.

తెలుగు మాట్లాడగలిగి, తెలుగు లిపి చదవలేని వారి కోసం తెంగ్లీషు లిపిలో కూడా అందిస్తున్నాము. ఒకే పుస్తకంలో మొదట తెలుగులోనూ, తర్వాత తెంగ్లీషులోను పూజావిధానం ఉంది.

వినాయక వ్రతకల్పం On Kinige

Related Posts:

నా కవిత్వాన్ని ఎంచడానికి కనీసం మూడు దశాబ్దాలు గడవాలి …. విశ్వనాథ సత్యనారాయణ

Viswanatha A Literary Legend On Kinige

When it comes to speak of himself he speaks without false humility or irritating arrogance. He says of his poetry: ”I am a master of a style which is even by moderns acclaimed to be individualistic. There are not more than six or seven old authors who are known for this distinction. I am a conscious artist. My book, if read with no prejudice and a deep insight into things reveals the modernism, the high scientific modernism. At least two or three decades must pass after I pass away to estimate my poetry”.

In the speech he made when Jnanapith Award was conferred on him, Sri Viswanatha says, “Not to utter false hood is Tapas, to part with money to the poor and the needy is Tapas, mastery over the internal passions is Tapas”. He continues, “If you read between the lines of my writings, you can see that I want the type of government which now people are having in Russia, but at the same time, too, I don’t want to do away with our metaphysics, our mysticism, our spiritualism, our music, our culture, our fine arts, our philosophy of life and so on which are time tested”. In an interview with A.S.Raman with the caption “My self-My Work” Sri Viswanatha says “I may defend lost causes. I don’t want them revived”. How can we call this gentleman who holds on to these liberal views a conservative or an obscurantist?

* * *

The book is a humble but a fervent attempt to present the multifaceted splendour of the genius of Sri Viswanatha who has already elevated himself to the level of the greatest master writers of India.

One can say without fearing any controversy that his literary genius is such that we cannot find the like of which in anybody else in point of its quality, quantity and diversity. It takes ages to have such a genius once again. Perhaps one appears, as we have said elsewhere while writing about him, “after we are tired and tired of waiting for him”!

Viswanatha A Literary Legend On Kinige

Related Posts:

విషబీజాలు నాటడం ఎందుకు?

ఆలోచింపజేసే సంపాదకీయం – ఆశ మాసపత్రిక సెప్టెంబరు 2012 సంచిక నుంచి

Aasha Monthly September 2012 Editorial

* * *

ఆశ సెప్టెంబరు 2012 On Kinige

Related Posts:

మిసిమి సెప్టెంబర్ 2012 సంపాదకీయం

మిసిమి సెప్టెంబర్ 2012 సంపాదకీయం
Misimi September 2012 Editorial

* * *

మిసిమి సెప్టెంబరు 2012 On Kinige

Related Posts: