సైబర్ మండే: తక్కువ చెల్లించండి, ఎక్కువ చదవండి!

సైబర్ మండే సందర్భంగా, కినిగె.కాం నుంచి ఓ చక్కని ఆఫర్!!. ఈ సైబర్ మండే రోజున మీరు కొత్తగా రీ-ఛార్జి చేసుకున్న మొత్తానికి అదనంగా 10% పొందండి.

ఈ ప్రత్యేక బోనస్ పొందేందుకు ఈ దిగువ సూచనలు పాటించండి:

1. కినిగె.కాం సందర్శించండి.

2. మీరు ఇప్పటికే లాగిన్ చేసి ఉండకపోతే, మీ కినిగె యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ లతో లాగిన్ అవ్వండి.

3. కుడి వైపు పై భాగన ఉన్నBalance: లింక్ పై నొక్కండి. (లేదా నేరుగా కినిగె రీఛార్జి పేజి తెరవండి)

4. పేపాల్ ద్వారా లెదా పేమెంట్ గేట్ వే ద్వారా మీ కినిగె బాలన్స్‌ను రీఛార్జి చేసుకోండి.

5. బాలన్స్ రీ-ఛార్జి చేయడం విజయవంతంగా పూర్తి చేసాక, కుడి వైపు పై భాగన ఉన్న బాలన్స్ లింక్ పై మరోసారినొక్కండి. (లేదా నేరుగా కినిగె రీఛార్జి పేజి తెరిచి) గిఫ్ట్ కోడ్ గడిలో CYBERMONDAY (పదాల మధ్యన స్పేస్ లేకుండా) అని టైప్ చేసి, క్లెయిమ్ అనే బటన్ నొక్కండి. అంతే! సైబర్ మండే సందర్భంగా ప్రత్యేక బోనస్ – మీ రీఛార్జి మొత్తనికి అదనంగా 10% ఈ రోజే పొందుతారు.

త్వరపడండి, ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే.

మంచి తెలుగు పుస్తకాల కోసం కినిగె.కాం సందర్శించండి నేడే.

Related Posts:

  • No Related Posts

కినిగె పేమెంటు ఆప్షన్లు …

పై బొమ్మలో కినిగె పేమెంటు ఐచ్చికాలు ఉన్నాయి, పరిశీలించండి.

అలానే యన్నారైలు పేపాల్ కూడా వాడవచ్చు.

 

 

Related Posts:

  • No Related Posts

నడుస్తున్న చరిత్ర నవంబర్ 2012 సంపాదకీయం

నడుస్తున్న చరిత్ర నవంబర్ 2012 సంపాదకీయం

EditorialNadustunnaCharitraNov2012

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నడుస్తున్న చరిత్ర నవంబరు 2012 On Kinige

Related Posts:

ప్రజాసాహితి నవంబర్ 2012 సంచిక సంపాదకీయం

ప్రజాసాహితి నవంబర్ 2012 సంచిక సంపాదకీయం

Editorial Praja Sahiti November 2012

* * *

ప్రజాసాహితి నవంబరు 2012 On Kinige

Related Posts:

మిసిమి నవంబర్ 2012 సంచిక సంపాదకీయం

మిసిమి నవంబర్ 2012 సంచిక సంపాదకీయం

Editorial, Misimi Magazine, Nov 2012

* * *

మిసిమి నవంబరు 2012 On Kinige

Related Posts:

రాణి రుద్రమ సినిమా రచనా సహకారం – మధుబాబు, యమ్బీయస్ ప్రసాద్ …

రాణి రుద్రమ, తెలుగులో, త్రీడీలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా, నభూతో నభవిష్యతి అన్న రీతిలో, నిర్మించబడుతున్న చారిత్రాత్మక చిత్రం.
దీని రచనా సహకారం అందించి మధుబాబు, యమ్బీయస్ ప్రసాద్ రచనలు మీకు కినిగెలో ఈపుస్తకాలుగా లభ్యం. వివరాలకు చూడండి మధుబాబు రచనలు, యమ్బీయస్ ప్రసాద్ రచనలు.
ఈ సినిమా గురించిన పేపర్ క్లిప్పింగులు చూడండి..

..

Related Posts:

  • No Related Posts

ఆల్ టైమ్ పాపులర్ తెలుగు ఈపుస్తకాలు on Kinige.com

1. వెన్నెల్లో ఆడపిల్ల
2. రామాయణ విషవృక్షం
3. అందమైన జీవితం
4. ఎవరితో ఎలా మాట్లాడాలి
5. నిర్జన వారధి
6. కాళికాలయం
7. వీరభద్రారెడ్డి
8. డేగరెక్కల చప్పుడు
9. శబ్బాష్‌రా శంకరా!
10. మారుతీయం
వెన్నెల్లో ఆడపిల్ల On Kinige

రామాయణ విషవృక్షం On Kinige

అందమైన జీవితం On Kinige

ఎవరితో ఎలా మాట్లాడాలి On Kinige

నిర్జన వారధి On Kinige

కాళికాలయం On Kinige

వీరభద్రారెడ్డి On Kinige

డేగరెక్కల చప్పుడు On Kinige

శబ్బాష్‌రా శంకరా! On Kinige

మారుతీయం On Kinige

Related Posts:

  • No Related Posts

కినిగె ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు

కినిగె.కాం రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, మీ ఆదరణకి, సహాయానికి, ప్రోత్సాహానికి మా ధన్యవాదాలు.

అంతర్వర్తి

ఇప్పుడు మరింత అందమైన, ప్రపంచ శ్రేణి నాణ్యతతో మా కొత్త అంతర్వర్తిని మీకు పరిచయం చేస్తున్నాము.

Kinige new UI

ఉచిత కానుక

ఏదైనా ఒక పుస్తకాన్ని కొనండి,దాన్ని మీ మిత్రులతో పంచుకోండి ఉచితంగా!

కినిగె పట్ల మీ ఆదరణకు ఈ సంతోష సమయంలో మరోసారి కృతజ్ఞత తెలుపుతున్నాం. కినిగె.కాం ద్వితీయ వార్షికోత్సవ కాలంలో మీరు కొన్న ఏ ఈ-బుక్‌నైనా మీకిష్టమైన వ్యక్తితో ఉచితంగా పంచుకోవచ్చు, ఆ ఈ-బుక్‌ని మీకు నచ్చిన వారికి ఉచితంగా బహుకరించవచ్చు. మీకు నచ్చిన దాన్ని మీకిష్టమైన వారితో పంచుకునే బహు చక్కని అవకాశం ఇది!

పేపాల్ సౌలభ్యం

మీరు చేసే కొనుగోళ్ళకు పేపాల్ ద్వారా చెల్లింపు జరపడం మీలో చాలా మందికి వాడుక. మీరు మీ పేపాల్ ఎకౌంట్ ఉపయోగించి కినిగె.కాం పై చెల్లింపులు జరపే సౌలభ్యం కల్పించామిప్పుడు.

ఆదా
డబ్బు ఆదా చేసుకోవడం అందరికీ ఇష్టమే. మీరు డబ్బు ఆదా చేసుకోడానికి మేమో మార్గం చూపుతున్నాం. కినిగె.కాం ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా సురవర తెలుగు కీబోర్డును ప్రత్యేక తగ్గింపు ధరకు అందిస్తున్నాం. ఇది పరిమిత కాలపు ఆఫర్. కొనండి, ఆదా చేసుకోండి. ఈ కీబోర్డు కొనేందుకు ఇక్కడ నొక్కండి.

Suravara Telugu Keyboard
కినిగె.కాం తరపు నుంచి మీ ప్రతీ ఒక్కరికీ మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెరుగైన సేవలందిస్తామని భరోసా ఇస్తున్నాము.
కినిగె బృందం

Related Posts:

  • No Related Posts

ఇది గొల్లపూడి ‘మారుతీయం’

ప్రముఖ సినీనటుడు గొల్లపూడి మారుతీరావు మంచి రచయిత, కవి అని కూడా చాలా మందికి తెలుసు. సినిమాలలో ఆయన నటనను ఎవరూ ఇష్టపడకుండా ఉండలేదు. ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఈ సెప్టెంబరులో ఆయన ‘మారుతీయం – గొల్లపూడి మారుతీరావు కవితా హృదయం‘ అనే పేరుతో ఒక పుస్తకం ముద్రించారు.

ఆయన చెప్పినట్లే…. ఏభై సంవత్సరాల ఊసులవి. ఆయన జీవితంలో పరుచుకున్న అన్ని రుచులూ అంటే తీపి, చేదూ, వగరూ, విగరూ, ప్రేమా, చిరునవ్వూ, బాధా, కోపం, తాపం అన్నీ ఉన్నాయి ఇందులో. కవితలు, పాటలు మొత్తం పది విభాగాలుగా ఉన్నాయి. ప్రేమగీతాలు, ఆసుపత్రి పాటలు, వాసుస్మృతులు, మళ్ళీ మళ్ళీ వసంతం, ఉగాది కవితలు, స్వాతంత్ర్య గీతం, ఏరిన పూలు, హైకూలు, పాటలు పల్లవులు అనే ప్రధాన విభాగాలుగా ఉన్నా, ఒక్కో విభాగంలో మరికొన్ని కవితలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పుస్తకం చదివేడప్పుడు పాఠకుడిని మారుతీరావు పూర్తిగా ఆవహించేస్తారు. ఎందుకంటే తెలుగు ప్రజలకు బాగా పరిచితుడు కావడం, ఆయనది ఒక ప్రత్యేక శైలి కావడం, ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో ఆయనకు ఒక శైలి ఉండడంతో, ఈ పుస్తకంలో ఏ కవిత, ఏ వాక్యం చదివినా ఆయన డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే గానీ దాని నుంచి బయటపడలేం. ఇక అన్ని కవితలూ బావున్నాయి. నిత్యసత్యాలు అనే కవితలో నుదుటిన ఎర్రటిమంట అది బొట్టు. నోట్లో వాడిగా మాట అది తిట్టు. గుండెల్లో చిక్కని పొంగు అది ఆవేశం. ఇలా అనేక నిత్యసత్యాలకు నిర్వచనం చెప్పిన దిట్ట. ఆయన కవిత్వంలో వ్యంగ్యం కూడా ఉంది. బడ్జెట్ ప్రతిపాదన కవితలో రాజకీయ బాగోతం గురించి బాగా చెప్పారు. ఒక మంత్రి – బడ్జెట్‌ని ప్రతిపాదించిన మంత్రి ఆ బడ్జెట్‌తోనే దేశంలో సోషలిజం వచ్చేసినట్లు చెబుతాడు. చివరకు ‘సుఖపడే అన్ని అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి కనుక, కలగనే ఒక్క అవకాశాన్నీ తప్పని సరయి మినహాయిస్తున్నాం’ అని ముగింపు వ్యంగ్యంగా చెబుతూ బడ్జెట్ బండారాన్ని బయట పెట్టారు.

ఇలా ఆయన కవితలు, మాటలు, అన్నీ కూడా విలువైనవే. చదువుకోడానికి, పదిమందితో చెప్పుకోవటానికి కూడా ఉపయోగపడేవే.

ఎన్‌క్యూబ్
వార్త దినపత్రిక, 28 అక్టోబరు 2012

* * *

మారుతీయం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ప్రింట్ బుక్ ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
మారుతీయం On Kinige

Related Posts: