“1948: హైదరాబాద్ పతనం” పుస్తకావిష్కరణ

మొహమ్మద్ హైదర్ రాసిన పుస్తకం “1948: హైదరాబాద్ పతనం” 7 ఏప్రిల్ 2013 ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఆబిడ్స్ తిలక్ రోడ్ లోని సారస్వత పరిషత్ హాల్ లో ఆవిష్కరించబడుతోంది. సభని హైదరాబాద్ బుక్ ట్రస్ట్, (040 23521849) , అన్వేషి సంస్థ (040 27423168) సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అందరికీ ఆహ్వానం పలుకుతోంది.

వివరాలకు ఆహ్వానపత్రం చూడండి.

పుస్తకం గురించి:
హైదరాబాద్విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్ పోలో….
1948లో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్షించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కథనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బుతెరలనూ తొలగించి చూపిస్తుందీ మొహమ్మద్ హైదర్ రచన.
నాటి ఉద్రిక్త కాలంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పని చేశారు హైదర్. ఏడాది తిరగక ముందే ఆయనను తన జిల్లా జైలుకే పంపించారు. జైలులో గడుపుతూనే ఓ పరిపాలనాధికారిగా 1948 ఘటనలకు సంబంధించి తన ప్రత్యక్ష అనుభవాలను, జ్ఞాపకాలను కాగితంపై పెట్టారాయన. ఎంతో హుందాగా, అక్కడక్కడ చెణుకులతో సాగిపోయే ఈ రచన- ఎటువంటి ఆవేశకావేశాలకూ లోనుకాకుండా సాగిపోవటమే కాదు- చివరకు మన కళ్లు తెరిపిస్తుంది కూడా !
Hyderabad Patanam

Related Posts:

వందరోజుల విజయోత్సాహం నింపుకున్న వోడ్కా విత్ వర్మ కు అభినందనలు …

సిరాశ్రీ విరచిత వోడ్కా విత్ వర్మ పుస్తకం ఈ రోజుతో విడుదలయి వంద రోజులు పూర్తయినాయి.
ఈ వంద రోజుల్లో మూడు సార్లు పునర్ముద్రణలు,
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో టాప్ సెల్లింగ్ పుస్తకం,
విజయవాడ పుస్తక ప్రదర్శనలో టాప్ సెల్లింగ్ పుస్తకం,
కినిగె ఆన్ లైన్ అమ్మకాల్లో విడుదలనుంచి నేటి వరకూ వీక్లీ టాప్ టెన్ పుస్తకాల్లో పదిలం.

పలువురిని చదివించిన సిరాశ్రీకి అభినందనలు ….

వోడ్కా విత్ వర్మ On Kinige

Related Posts:

  • No Related Posts

మిసిమి మార్చి 2013 సంపాదకీయం

మిసిమి మార్చి 2013 సంపాదకీయం

Editorial Misimi March 2013 by Soma Sankar Kolluri

మిసిమి మార్చి 2013 On Kinige

Related Posts:

సంగీత కళానిధి డా. శ్రీపాద పినాకపాణి గారికి నివాళి

పినాకపాణి గారు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్ట్ 3వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు. సంగీతంలో తొలిపాఠాలు రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద నేర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు. వైద్యం అభ్యసించి, రాజమండ్రిలోనూ, విశాఖపట్నంలోనూ, కర్నూలు లోను ప్రభుత్వ వైద్యునిగా పనిచేసారు.
వీరి శిష్యులు ఎందరో వైద్య రంగంలోనే కాకుండా, సంగీతంలోను ప్రఖ్యాతి గడించారు. సంప్రదాయ సంగీతం తెలుగునాట వర్ధిల్లాలని ఆకాక్షించిన పినాకపాణిగారు పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకాలు రచించారు.
సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి. పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.
పినాకపాణి గారి పుస్తకాలలో ఈ క్రింది మూడు పుస్తకాలు కినిగెలో లభిస్తున్నాయి.
అభ్యాసమ్ On Kinige

స్వరరామమ్ On Kinige

ప్రపత్తి On Kinige

ఈ పుస్తకాలు డిజటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాలను తక్కువ ధరకి పొందవచ్చు.
నాదయోగులు బ్రహ్మశ్రీ పినాకపాణి గారిని సంస్మరించుకుంటూ శాస్త్రీయ సంగీతానికి వారు చేసిన సేవలకు వందనాలు అర్పిస్తోంది కినిగె.

Related Posts: