ముద్రా కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి. కృష్ణమూర్తి

ముద్రా కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి. కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడితోనూ, ఒకే ఒక క్లయింట్‌తోనూ అడ్వర్టయిజింగ్ ఏజన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్ళలో ముద్రా భారతదేశంలోని అతి పెద్ద అడ్వర్టయిజింగ్ ఏజన్సీలలో మూడవ స్థానాన్ని, భారతీయ అడ్వర్టయిజింగ్ ఏజన్సీలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది.

ప్రభుత్వంలో చిన్న గుమాస్తా ఉద్యోగంతో జీవితాన్ని, ప్రారంభించి, ఆ ఉద్యోగాన్ని వదిలివేసి అడ్వర్టయిజింగ్ రంగంలోకి ప్రవేశించిన ఎ.జి.కె. భారతీయ కార్పోరేట్ రంగంతో అతి చేరువగా కలిసి పనిచేసి అతి కొద్ది కాలంలోనే తెలుగువారు గర్వించదగ్గ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు.

ముద్రా కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్‌ను స్థాపించారు. కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోనూ, తెలుగులోనూ పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. వారి పుస్తకాలు అతి కొద్దికాలంలో పలు భారతీయ భాషల్లో ప్రచురింపబడి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి.

ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాదు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.

ఎ.జి. కృష్ణమూర్తి
జననం:28 April 1942 నాడు గుంటూరు జిల్లా వినుకొండలో.

ఎ.ఎ.ఎ.ఐ – ప్రేం నారాయణ్ అవార్డు,1999.

ఇంటర్నేషనల్ హూ ఈజ్ యు ఆఫ్ ప్రొఫెషనల్స్ 2002-2003 ఎడిషన్‌లో స్థానం

2003లో మా టీవి సన్మానం

To read his books click here now.

ధీరూభాయిజమ్ On Kinige
ధీరూభాయి అంబానీ ఎదురీత On Kinige
నేస్తమా…. బి పాజిటివ్! On Kinige
జయహో On Kinige
లీడర్‌షిప్ ముచ్చట్లు On Kinige
మనందరం విజేతలు కావచ్చు On Kinige
నేస్తమా…. డ్రీమ్ బిగ్ On Kinige
అందిన ఆకాశం On Kinige
నేస్తమా…. నీ కలలను జీవించు On Kinige
నేస్తమా.. జయమ్ము నిశ్చయమ్ము! On Kinige
ఆకాశానికి నిచ్చెనలు On Kinige

Related Posts:

  • No Related Posts

ఆవేశం-ఆవేదన

సింహాల పేట (కథలు)
రచన: రమణ జి.వి.

వాస్తవాలను రాయాలనే కోరిక, విషయాన్ని విశ్లేషించి చెప్పాలనే తపన రచయిత రమణలో కాస్త ఎక్కువేమో అనిపిస్తుంది ఈ సంకలనం చదువుతుంటే. ‘నియమాల్ని సృష్టించుకున్నవాళ్ళకే వాటిని అతిక్రమించడంలో ఆనందం దాగి ఉండటం విశేషం’ అన్న మాట వెనుక అపారమైన ఆవేదన ఉంది. ‘ఆస్తుల్ని కూడబెట్టడంలోని ఆనందం, చాలామంది కడుపుల్ని మాడ్చేస్తుంది’ లాంటి వాక్యాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. ‘పర్యావరణవేత్త’, ‘సముద్రం’, ‘శత్రువు’, ‘కాలజ్ఞాని’… ఏ కథ తీసుకున్నా ఆవేదన, ఆరాటం, కసి, బాధ… అడుగడుగునా తొణికిసలాడతాయి.

అయ్యగారి, ఈనాడు ఆదివారం అనుబంధం 30 జూన్ 2013

* * *

“సింహాల పేట” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
సింహాల పేట On Kinige

Related Posts:

విశ్వాక్షరాలు

క్షీరసాగర మథనం సందర్భంగా అంతిమంగా వెలువడిన అమృతమే కవిత్వమని నమ్మేవారికి కొదవలేదు.
తమ కవిత్వంతో సంచలనం సృష్టించి, నోబెల్ బహుమతులు సాధించి, చరిత్ర పుటల్లో స్వర్ణాధ్యాయాలు లిఖించుకున్న కవుల జీవిత, కవిత్వ విశేషాలపై వచ్చిన ‘నోబెల్ కవిత్వం‘- అలాంటి సాహితీ అభిమానులను అలరించేదే.
నువ్వేదో గులాబీ రేకు అనుకుని/ ఒక్కోరేకూ తుంచి/ నీ ఆత్మని చూద్దామనుకున్నాను/ నాకది కనబడలేదు… అంటూ హువాన్ రామోన్ హిమనేజ్‌ను అనువదించినా,
బొడ్డుపేగు లేకుండా పుట్టి/తెలియకుండా మరణించి/శూన్యం నుండొచ్చి/శూన్యానికి తిరిగి పోతుంది అంటూ లాగెర్ క్విస్ట్‌ను ఆవిష్కరించినా… ముకుంద రామారావు శైలి సుకుమారంగా ఉంటుంది.
సల్లీ ప్రుధోమే నుంచి టామస్ ట్రాంస్ట్రోహ్మర్ దాకా 37 మంది కవుల హృదయావిష్కరణ ఈ పుస్తకం.

దత్తారాం, ఈనాడు ఆదివారం అనుబంధం 30 జూన్ 2013

“నోబెల్ కవిత్వం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
నోబెల్ కవిత్వం On Kinige

Related Posts:

జూలై 2013 నాలుగవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

జూలై 2013 నాలుగవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. హంటర్ షాడో మధుబాబు
2. సిగ్గేస్తోంది యండమూరి వీరేంద్రనాథ్
3.నా ఆత్మకథ (స్వామి వివేకానంద) మరియు రోజుకో సూక్తి స్వామి వివేకానంద
4. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
5. వోడ్కా విత్ వర్మ…సిరాశ్రీ
6. కౌటిల్యుని అర్థశాస్త్రము …డా. నెల్లూరి సత్యనారాయణ
7. పురాణాలు కుల వ్యవస్థ – 5: రామాయణ మునులు …డా. బి. విజయభారతి
8. క్రికెట్ అండ్ లవ్ భాస్కరుని సత్య జగదీష్
9. అస్తమించని రవి ఖాదర్ మోహియుద్దీన్
10. రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తాసూర్యదేవర రామ్ మోహన రావు

Related Posts:

ఆధ్యాత్మిక అక్షరమాల!

అఆఇఈ… అహం నించి ఆత్మ దాకా, ఇహం నించి ఈశ్వరుడి దాకా… అన్న శీర్షికకు సంక్షిప్త రూపం. ఆధ్యాత్మిక సాహిత్యం చేదు గుళిక లాంటిది. దాన్ని తేనెలో ముంచి తియ్యతియ్యగా మన చేతిలో పెట్టారు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఓ పట్టాన కొరుకుడు పడని విషయాల్ని ఆహ్లాదంగా చెప్పడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి వైవిధ్యంగా ఉంది. ప్రతి వ్యాసాన్నీ హాస్యంతో ప్రారంభించారు. ఆ తర్వాత చక్కని శ్లోకాన్ని తాత్పర్యసహితంగా వివరించారు. విషయం సుబోధకం కావడానికి చిన్నచిన్న కథలూ, ఆసక్తికరమైన సంఘటనలూ జోడించారు. పాపపుణ్యాలు, దాన గుణం, ఇంద్రియ నిగ్రహం, మరణం, వాగ్దోషాలు… దాదాపు డెబ్భై వ్యాసాలూ ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి ఉపకరించేవే. ఈ పుస్తకాన్ని కొని చదవడమే కాదు, ఆత్మీయులకు కానుకగా ఇవ్వమని రచయిత సిఫార్సు చేస్తున్నారు. మంచి సూచన.

(ఈనాడు ఫిబ్రవరి 2011 రివ్యూ)

* * *

“అ ఆ ఇ ఈ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
అ ఆ ఇ ఈ On Kinige

Related Posts:

రామకృష్ణమఠం వారి ప్రచురణలు కినిగెపై అతి త్వరలో…

కినిగెని ప్రోత్సహించి, ఆదరిస్తున్న పాఠకులకు శుభవార్త.
ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస గ్రంథాల ద్వారా యువతరానికి ప్రేరణ కల్పిస్తూ, వ్యక్తిత్వ నిర్మాణం చేస్తున్న రామకృష్ణ మఠం, తెలుగు విభాగం వారి ప్రచురణలు త్వరలో కినిగెలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రచురణలను కినిగెలో ఉంచడానికి సహాయం చేసిన మా శ్రేయోభిలాషులకు, కినిగె భాగస్వామ్యంతో అమూల్యమైన ఆధ్యాత్మిక సాహితీ సంపదను అంతర్జాల పాఠకులకు అందించేందుకు అంగీకరించిన రామకృష్ణమఠం ప్రచురణలకు ధన్యవాదాలు.
రామకృష్ణమఠం వారి ప్రచురణలు కినిగెపై అతి త్వరలో….
ఎప్పటిలాగే మీ ఆదరణనీ ఆశిస్తూ, మీ నిరంతర ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

Related Posts:

  • No Related Posts

జూలై 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

జూలై 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. కాలకన్య మధుబాబు
2. మహారాజశ్రీ అవతారంగారు సింహ ప్రసాద్
3. రాయవాచకము విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి
4. సిగ్గేస్తోంది యండమూరి వీరేంద్రనాథ్
5 రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
6. కౌటిల్యుని అర్థశాస్త్రము …డా. నెల్లూరి సత్యనారాయణ
7. మిథునం …శ్రీరమణ
8. అనన్య కెయస్వీ
9. కన్యాశుల్కం గురజాడ అప్పారావు
10. ద్రౌపది డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

Related Posts:

మైలు రాళ్లు

ప్రతి ఒక్కరి జీవితంలో అరవయ్యేళ్ళు ఓ మైలురాయి. సాహిత్యకారులకైతే అదొక చారిత్రక సందర్భం. దశాబ్దాలుగా సాహిత్య కృషి చేస్తున్న దాసరి అమరేంద్ర… అరవయ్యేళ్ళు నిండిన సందర్భంగా తాను వివిధ ప్రక్రియల్లో సృజించిన సాహిత్య సర్వస్వాన్ని రెండు సంపుటాలుగా వెలువరించారు. మిగిలిన ప్రక్రియల్లో కూడా రచనలు చేసినప్పటికీ… చాలామంది ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో విశేషంగా కృషి చేస్తారు. కాని అమరేంద్ర అన్ని ప్రక్రియలనూ ప్రేమించారు.

అన్నిట్లోనూ ఒక స్థాయికి తగ్గని రచనలను వెలువరించారు. ‘ఆత్మీయమ్‘లో కథలు, కవితలు, అనువాదాలు, యాత్రా రచనలతో పాటు సన్నిహితుల అభినందనలు కూడా జత చేశారు. ‘లోకంలోని అన్ని అందాలూ ఆనందాలూ/తమ కోసమే సృజించబడ్డాయనిపిస్తేనూ… విశ్వరహస్యాలూ… వేదాంతపాఠాలూ తమ అనుబంధంలోనే నిక్షిప్తమై ఉన్నామనిపిస్తేనూ… సందేహమెందుకూ… రాగోదయమయినదన్నమాట’ అనడంలోనే అమరేంద్ర హృదయ సౌకుమార్యమేంటో అర్థమవుతుంది.

ఉద్యోగరీత్యా తెలుగు నేలకు దూరంగా ఉండడం వల్ల, దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నందువల్ల వివిధ భాషా ప్రక్రియలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే ఎక్కువగా ఎవరూ స్పృశించని రూపకాన్ని కూడా చక్కగా రక్తికట్టించి, గంధర్వ, భూలోకాల్లో విహరింపజేశారు. ఊహాలోకాలలోనే కాదు… హిమాలయాలు, పూల లోయలు, పిండారీ గ్లేషియర్, అమర్‌నాథ్‌ల వంటి ఇహలోకాలనూ పాఠకులకు తన కళ్ళతో చూపుతారు.

ఆయనే చెప్పుకున్నట్టు అమరేంద్ర కాళ్ళలో చక్రాలున్నాయన్నమాట నిజమేనని ఆయన యాత్రా రచనలు చదివే వారికి అర్థమవుతుంది. రెండో సంపుటి ‘సాహితీ యాత్ర‘లో వ్యాసాలు, ఇంటర్వ్యూలు పొందుపరిచారు. వీటిల్లో ఆయా రచయితల పుస్తకాలపై రాసినవే ఎక్కువ. బలివాడ కాంతారావు, అల్లం శేషగిరిరావు మొదలుకుని… నాగావళి కథల వరకు వివిధ సంకలనాలపై తన విశ్లేషణను అందించారు. కాళీపట్నం రామారావు మాస్టారి ఇంటర్వ్యూ మామూలుగానే సాగినప్పటికీ… ఖుష్వంత్ సింగ్, సచ్చిదానందన్ వంటివారి ఇంటర్వ్యూలు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. భిన్న ప్రక్రియల్లో సాగిన దాసరి అమరేంద్ర కృషి భవిష్యత్‌లో మరింత విస్తృతిని సంతరించుకుంటుందని ఆశిద్దాం.

దేరా, ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 22 జూన్ 2013

* * *

“ఆత్మీయమ్”, “సాహితీ యాత్ర” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌లని అనుసరించండి.

ఆత్మీయమ్ On Kinige

సాహితీయాత్ర On Kinige

Related Posts:

జగన్నాథ కథ చక్రాల్

ప్రముఖ రచయిత జగన్నాథ శర్మ ‘నవ్య’ వారపత్రిక మొదటి పేజీలో రాస్తున్న చిరు కథల్లోంచి ఓ నూరు కథలను ఎంచుకుని ‘జగన్నాథ కథ చక్రాల్‘ పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. పత్రికా రచయిత కూడా అయినందువల్ల జగన్నాథ శర్మకు ఒక ఇతివృత్తాన్ని కథగా ఎలా మలచాలో తెలుసు.

తమ జీవిత కాలంలో అనేక వేల కథలు, కథానికలు, నవలలు, నాటకాలు చదివిన వారికి కూడా ఏమాత్రం ఊహకందని ఇతివృత్తాలు ఈ నూరు కథల్లోనూ కనిపిస్తాయి. ఇందులో కొన్ని ర చయిత స్వీయ అనుభవాలు అయి ఉండాలి. ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యక్తి పేదలకు సహాయం చేయడానికి, ముఖ్యంగా వారి కడుపు నింపడానికి ఎటువంటి పద్ధతిని అనుసరించాడన్నది మొట్టమొదటి కథ ‘దేవుడిడ్లీ’లో కళ్లకు కడుతుంది.

ఆ ఊరిలో హోటల్ యజమాని ఒకరు గోడ మీద ‘ఒకటి దేవుడికి’ అనే స్లిప్‌ను అతికించి ఉంచుతాడు. ఆ హోటల్‌లో టిఫిన్ చేసే ప్రతివాడూ తప్పనిసరిగా ఓ ప్లేటుకు అదనంగా డబ్బులివ్వాలి. ఆ అదనపు ప్లేటు పేదవాళ్లకు వెడుతుంది. ఆ హోటల్ యజమాని ఉద్దేశ్యం తెలిసిన ఎవరూ అతని ఔదార్యాన్ని కాదనలేకపోతారు.

నవ్య వారపత్రికలోని సంపాదకీయ పుటలో ఆయన ఈ కథలు రాశారు. ఈ పేజీని చదవకుండా లోపలి పేజీల్లోకి వెళ్లలేని పరిస్థితిని జగన్నాథ శర్మ తన కథల ద్వారా కల్పించారంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఒకే ఒక్క పేజీలో ఇంత చక్కని కథను ఆణిముత్యంలా పొదగడం, ఆ కథ రంజింపజేసేదిగా ఉండడం శర్మకు మాత్రమే సాధ్యమైందనుకోవాలి. జీవితంలోని వివిధ కోణాలను ఈ కథలు అతి మధురంగా స్పృశించాయి. ఇందులోని ప్రతి ఇతివృత్తమూ హృద్యంగానే ఉంటుంది. మానవ సంబంధాల్లోని సున్నితత్వాన్ని ఇంత అద్భుతంగా కథల్లో చొప్పించడం అందరికీ సాధ్యం కాదు. ఇవి బొత్తిగా కాలక్షేపం కథలు కావు. వినోదం కోసం ఉద్దేశించిన కథలూ కావు. ఆసాంతం చదివిస్తాయి. తప్పకుండా మనిషినీ, మనసునీ ప్రభావితం చేస్తాయి.

జి. రాజశుక, ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 22 జూన్ 2013

* * *

“జగన్నాథ కథచక్రాల్” డిజిటల్ రూపంలో కినిగెలోలభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
జగన్నాథ కథచక్రాల్ On Kinige

Related Posts:

సాధన

ప్రముఖ రచయిత మధుబాబు రచించిన నవల “సాధన“.

సి.బి.ఐ. స్పెషల్ ఆఫీసర్ సాధనా సక్సేనా డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ లేడీ. ఎన్నో స్పెషల్ కేసులు సాధించి సి.బి.ఐ.కి మంచిపేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఉన్నట్లుండి ఆమె అదృశ్యమవుతుంది. దేశభద్రతకు ముప్పు కలిగించే విద్రోహచర్యకు సంబంధించి కీలక సమాచారం ఏదో సాధనా సక్సేనా వద్ద వుందని సి.బి.ఐ. వర్గాల అనుమానం. ఆ పనిమీదే ఆమె పహాడ్‌గంజ్‌కి బయలుదేరి వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళినా సక్సేనా తిరిగి రాలేదు. ఆమెను ట్రేసవుట్ చేయటంలో సి.బి.ఐ. వర్గాలు విఫలమయ్యాయి. పదిరోజులయినా ఆమె జాడ తెలీకపోవటంతో సిబిఐ డైరెక్టర్ సామంత్ సిన్హా వాత్సవను పిలిపించుకుని స్వయంగా కేసు వప్పగిస్తాడు.

దీనికి కొద్ది రోజుల ముందు ఓ క్లబ్ మీద రైడ్ చేస్తుంది సాధన. ఆ రైడింగ్‌లో కొందరు విదేశీయులు అనుమతి లేకుండా కనబడతారు. వారిలో ఒక నీగ్రో జాతి యువకుడు సాధనపై కాల్పులు జరుపుతాడు. అతని గురి నుంచి తప్పించుకుని, తన గన్‌తో వాడిని కాలుస్తుంది సాధన. వాడి జేబులను వెతికితే, కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అందులో ఒక నాణెం అత్యంత ప్రమాదకరమైన జాకాల్ గ్రూప్‌దని గుర్తిస్తుంది. ఈ తతంగంలో మాజీ రక్షణ మంత్రి గోవర్థన్ దాస్ హస్తం ఉందని తెలుసుకున్న సాధన మరింత సమాచారం కోసం ఆ ఆధారాలను అనుసరించి పహాడ్‌గంజ్ చేరిన సాధన అదృశ్యమవుతుంది.

రంగంలోకి దిగిన వాత్సవ సాధన ఆచూకీ కనిపెట్టడంలో కొంతమేర విజయం సాధిస్తాడు, ఆమె నాగాలాండ్‌లోని కొహిమాలో ఉందని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలనెదుర్కుంటాడు. సాధనని ఎలా తప్పించాడు? సాధారణంగా ఒకరి ఎసైన్‌మెంట్‌లో మరొకరు జోక్యం చేసుకోని శ్యామ్ సుందర్, వాత్సవలు ఈ ఎసైన్‌మెంట్‌లో ఎందుకు కలవాల్సి వచ్చింది? సాధనకి, వాత్సవకి, శ్యామ్‌కి అనేక ఆటంకాలు కల్పించిన ఎస్. ఐ. ఎవరు? వారు ముగ్గురు దేశద్రోహుల ఆట ఎలా కట్టించారు?
ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఆసక్తిగా సాగిపోయే ఈ నవలలో లభిస్తాయి.

* * *

సాధన నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

సాధన On Kinige

Related Posts: