సెప్టెంబరు 2013 నాలుగవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు 2013 నాలుగవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. ఇతి స్మరణీయం అతి రమణీయం నీలంరాజు లక్ష్మీప్రసాద్
2. బియాండ్ కాఫీ ఖదీర్ బాబు
3. నందినిమధుబాబు
4. చదువు ఏకాగ్రత యండమూరి వీరేంద్రనాథ్
5. శోభన్ బాబు సమగ్ర బాక్సాఫీస్ చరిత్ర విజయ భాస్కర్
6. మూలికా వైద్యంతో ఆరోగ్యం డా. జి.లక్ష్మణరావు
7. రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తాసూర్యదేవర రామ్ మోహన రావు
8. యర్రంశెట్టి శాయి హాస్య కథానికలు యర్రంశెట్టి శాయి
9. నా ఆత్మకథ (స్వామి వివేకానంద) మరియు రోజుకో సూక్తి స్వామి వివేకానంద
10. రామాయణ విషవృక్షంరంగనాయకమ్మ

Related Posts:

సెప్టెంబరు 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. బియాండ్ కాఫీ ఖదీర్ బాబు
2.షాడో ఇన్ బాగ్దాద్మధుబాబు
3. ఇతి స్మరణీయం అతి రమణీయం నీలంరాజు లక్ష్మీప్రసాద్
4.శోభన్ బాబు సమగ్ర బాక్సాఫీస్ చరిత్ర విజయ భాస్కర్
5. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ
6. చదువు ఏకాగ్రత యండమూరి వీరేంద్రనాథ్
7. రాయవాచకమువిశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి
8. మూలికా వైద్యంతో ఆరోగ్యం డా. జి.లక్ష్మణరావు
9. యర్రంశెట్టి శాయి హాస్య కథానికలు యర్రంశెట్టి శాయి
10. సేతు రహస్యం గంగ శ్రీనివాస్

Related Posts:

2 మైల్స్ టు బోర్డర్

సుప్రసిద్ధ డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు గారి థ్రిల్లర్ “2 మైల్స్ టు బోర్డర్“.

***

షాడో బందిపోటుగా జీవించిన కాలం నాటి కథ ఇది. ప్రజలను హింసించి దోచుకునే ఎందరో సేట్‌లను దోచి, ఆ డబ్బును బీదసాదలకు పంచుతుంటాడు షాడో. మిత్రుడు గంగారంతో కలసి గుజరాత్ నుంచి రాజస్థాన్ ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన సంఘటనలూ, తదుపరి పరిణామాలు ఈ నవలికకి కథావస్తువులు.
రైలులో ప్రయాణిస్తున్న షాడోని పోలీసులు అనుమానించి వెంటపడగా, వారి నుంచి తప్పించుకోడానికి రైల్లో నానా హంగామా చేస్తాడు గంగారాం. జాన్ పీటర్స్ అనే దొంగ ద్వారా గిరాబ్ గ్రామంలో ఉండే సేట్ నందన్‌లాల్ చేస్తున్న అక్రమాలు తెలుసుకుంటాడు షాడో.
నందన్‌లాల్ కొడుకుని పాకిస్తాన్ లోని మహమ్మద్ అనే బందిపోటు అపహరించుకుపోయాడని, రెండు లక్షల రూపాయలు అడుగుతున్నాడని తెలుస్తుంది షాడోకి. గిరాబ్ గ్రామం చేరాక, నందన్‌లాల్ అనుచరులతో గొడవపడి, కావాలనే బంధితుడవుతాడు. అదే రాత్రి నందన్‌లాల్ ఇంటిని దోచేసి పారిపోతుంటే, అతని భార్య మంచితనం అర్థమవుతుంది. కొడుకుని పోగొట్టుకున్నందుకు ఆమె పడుతున్న బాధ షాడోని కలచివేస్తుంది. ముందు బందిపోటు మహమ్మద్ నుంచి నందన్‌లాల్ కొడుకుని విడిపించి, ఆ తర్వాత అతన్ని దోచుకోవాలని నిర్ణయించుకుంటాడు షాడో.
దొంగతనంగా సరిహద్దు దాటి పాకిస్తాన్‍లోకి ప్రవేశిస్తారు షాడో, గంగారాం. అక్కడ పోలీసులనుంచి తప్పించుకుని బందిపోటు మహమ్మద్‌ను కలుసుకోడానికి అడవిలో ప్రవేశిస్తారు. అక్కడ మహమ్మద్ అనుచరులకు దొరికిపోతారు. ఇంతలో ఓ అడవి ఏనుగుల గుంపు ఒకటి ఈ బందిపోటుల ముఠాపై దాడి చేస్తే, షాడో మహమ్మద్‌ని రక్షిస్తాడు. ఈ పరిణామాల మధ్య, షాడోకి, మహమ్మద్‌కీ స్నేహం ఎలా కుదిరిందన్నది ఆసక్తిదాయకం. ఆ తర్వాత ఏం జరిగింది? నందన్‌లాల్ కొడుకుని మహమ్మద్ వదిలేసాడా? అదే అడవిలో ఎదురైన మరో బందిపోటు ముఠానుంచి ఎలా తప్పించుకున్నారు? రెండో ముఠాకి పాకిస్తాన్ సైన్యంలో ఓ ఉన్నతాధికారికి ఏమిటి సంబంధం? వారు పాకిస్తాన్‌లో తలపెట్ట దలచిన ఘాతుకాన్ని షాడో ఎలా అడ్డుకున్నాడు?
ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు కావాలంటే ఈ ఉద్విగ్నభరితమైన థ్రిల్లర్ చదవాల్సిందే.

***

“2 మైల్స్ టు బోర్డర్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

2 మైల్స్ టు ది బోర్డర్ On Kinige

Related Posts:

ఆశావాదమే జీవనవేదం

వివిధ పత్రికలలో ప్రచురించబడిన ఇరవై కథానికలు ఈ పుస్తకంలో ఉన్నాయి. జీవితాన్ని వేర్వేరు కోణాలలో పరిశీలించి విశ్లేషించటం ఇందులో చూడవచ్చు. పుస్తకానికి ముందుమాట రాస్తూ డా.వేదగిరి రాంబాబు ‘మానవ సంబంధాలమీద రచయిత్రికి గట్టి నమ్మకం ఉందని, నిర్మలమైన ప్రేమతో అవి నిలబడతాయని రచయిత్రి గాఢంగా నమ్ముతున్నారని’ అన్నారు. పరిచయాలు వేరు, స్నేహాలు వేరు, ప్రేమలు వేరు, అవసరానికి సహాయ పడటం వేరు- దేని స్థానం దానిదే. అది తెలుసుకోకుండా ఒక దానిని మరొకటిగా భావించినప్పుడు సమస్యలొస్తాయి. ఈ సత్యాన్ని తెలియజేసేదే ఈ పుస్తకంలోని ‘పగటి కల’ కథ. దుర్మార్గంగా వ్యవహరించటం అనేది పరిస్థితులనుబట్టి ఉంటుందని, దానికి ఆడా, మగా అన్న తేడా ఉండదనీ ‘జాతర’ కథ సూచిస్తుంది. ఈ కథ ముగింపులో ‘పురుషులవల్ల స్ర్తిలు బాధలు పడుతున్నారన్నది ఎంత నిజమో, అదే విధంగా ఒక కోణంలోంచి గమనిస్తే పురుషులు కూడా స్ర్తిల మూలంగా ఎంతో నరకం అనుభవిస్తున్నది కూడ నిజం’ అని రచయిత్రి చెప్పటం ఆలోచించతగ్గది. జీవితాన్ని విశ్లేషిస్తూ ఆశావాద దృక్పథం అవసరమని తెలుపుతుంది ‘పిచ్చుక గూళ్లు’ కథ. ‘అడ్డా’ కథ కార్మికుల జీవన పోరాటాన్ని సమస్యలతో సర్దుకపోవటాన్ని తెలుపుతుంది. ‘చచ్చి సాధించేది ఏదీ లేదు. సమస్యలను ఎదుర్కోవాలి. బతుకు పోరాటం కొనసాగించాలి’ అనే ఆశావాద వైఖరిని ‘జీవితానికి ఆవలి గట్టున’ కథ ఉద్బోధిస్తుంది.

ఎం.వి.శాస్ర్తి , ఆంధ్రభూమి అక్షర పేజి, 13/07/2013

* * *

“అడ్డా” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
అడ్డా On Kinige

Related Posts:

కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి ప్రముఖుల అభిప్రాయాలు

కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి సుప్రసిద్ధ బ్లాగరు, రచయిత కొత్తపాళీ అభిప్రాయం
“నాకో చిన్న థియరీ ఉంది. ఇప్పటికి తెలుగులో అనేక అస్తిత్వవాద సాహిత్యాలు వచ్చాయి. ఇవన్నీ చూశాక అస్తిత్వవాద సాహిత్యం అంటే ఏవిటి అంటే .. ఒక వర్గానికి చెందిన మనుషులు తమ కథల్ని తామే చెప్పుకోవడం అని నాకనిపించింది. మరి ఇప్పుడు కథలూ నవల్లూ రాస్తున్న వారందరూ నలభైలు దాటిన వాళ్ళే కనిపిస్తున్నారు. యువత గొంతెక్కడ? యువతకీ సాహిత్యంలో అస్తిత్వం నిలబడాలి అంటే వాళ్ళ కథల్ని వాళ్ళే చెప్పుకోవాలి. లేకపోతే వంకర చిత్రీకరణలే కనబడతాయి – ఇప్పటికే ఆ ధోరణులు మన కథల్లో కనిపిస్తున్నై.
తెలుగు కథల్లో యువత అస్తిత్వానికి స్వాగతం పలుకుతున్నారు కినిగె వాళ్ళు ఈ కథల పోటీతో.
ఇంతకంటే మంచి అవకాశం మరోటి ఉండబోదు.
రండి యువతరానికి ప్రతినిధులారా, మీ మీ కథలు చెప్పండి.”

కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి సాహిత్య విమర్శకుడు శ్రీ జంపాల చౌదరి అభిప్రాయం
“గొప్పగా వ్రాయడానికి ఎక్కువ మాటలు అవసరం లేదు.
ఏసుక్రీస్తు మొదట చూపించిన మహిమ – నీటిని ద్రాక్షాసవంగా మార్చటం – గురించి ఒకాయన The conscious water saw its God and blushed అని ఒక్క వాక్యంలో చెప్పాడట.
నేను శాస్త్రీయ పత్రాలు వ్రాయటం మొదలుబెట్టిన రోజుల్లో మా ప్రొఫెసర్‌గారు ఒక సూత్రం చెప్పారు. నువ్వు వ్రాయదలచుకున్నదంతా వ్రాసేశాక, దాన్ని అంతకు సగం మాటలతో తిరగవ్రాయి. దాంట్లో సగం మాటలతో మళ్ళీ తిరగవ్రాయి. నువ్వు చెప్పదలచుకున్నది క్లుప్తంగా, స్పష్టంగా అప్పుడు చెప్పగలుగుతావు అని.
కల్పనా సాహిత్యంలోనూ ఈ సూత్రం బాగా పని చేస్తుంది. గొప్ప తాత్విక విషయాలను కొద్ది మాటలలో హైకూలలో, తేటగీతుల్లో, ఆటవెలదులలో చెప్పటం మనకు తెలుసు. యువ కథకులను తక్కువ మాటల్లో కథలు వ్రాయటానికి కినిగె సంస్థ ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ ద్వారా ప్రోత్సహించటం ముదావహం, అభినందనీయం.”

కినిగే స్మార్ట్ స్టోరి కాంపిటిషన్ (2013) వివరాలకు ఇక్కడ చూడండి:
http://teblog.kinige.com/?p=2773

Related Posts:

సెప్టెంబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. రాయవాచకమువిశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి
2. చైనీస్ మాస్క్మధుబాబు
3. సేతు రహస్యం గంగ శ్రీనివాస్
4. బియాండ్ కాఫీ ఖదీర్ బాబు
5. రమణీయ భాగవత కథలు ముళ్ళపూడి వెంకట రమణ
6. పైశాచికం ఆనంద్ వేటూరి
7. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ
8. తెలుగు సామెతలు- మానవ మనస్తత్వ విశ్లేషణ డా. శ్యామల ఘంటసాల
9. మంచి ముత్యాలు యండమూరి వీరేంద్రనాథ్
10. రాణీ పులోమజాదేవి కథలు రాణీ పులోమజాదేవి

Related Posts:

కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి ప్రముఖ రచయిత మధుబాబు అభిప్రాయం

తెలుగు సాహిత్యంలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా నిరంతరంగా వ్రాస్తూ , తన అభిమానుల్ని అలరిస్తున్న రచయిత ‘మధుబాబు’ . అనితర సాధ్యమైన ‘షాడో’ సృష్టికర్త మృదు మధురమైన జానపద నవలాకారుడు. ఆయన శైలి అత్యద్భుతం నాలుగు వాక్యాలు వ్రాస్తే చాలు అవి ఆయన వ్రాసినవే నని అందరు గుర్తుపట్టే విధంగా వుంటుంది ఆయన ఉపయోగించే భాష .

సున్నితమైన భావాలను సైతం సూటిగా చిన్న చిన్న వాక్యాలలో చెప్పి మెప్పించగల మాటల మాంత్రికుడు. కాకా హోటల్స్ లో పనిచేసే వెయిటర్స్ దగ్గిర్నించి కార్పోరేట్ ఆసుపత్రులలోని డాక్టర్స్ వరకు అన్ని రంగాలలోను ఆయన అభిమానులు వున్నారు. ఆ మధుబాబు యువ నవ కధకులను ఆహ్వానిస్తున్న *కినిగే స్మార్ట్ స్టోరి కాంపిటిషన్ (2013)* గురించి ఏమని అంటున్నారో చదవండి!

“మనకి కొత్త రచయితలు కావాలి. ఒక చక్కని రచయితగా ఒక పది కాలాల పాటు రాయగలగాలి. అలాంటి రచయితల్ని అహ్వానిస్తూ, ప్రోత్సహిస్తున్న కినిగె వారి స్మార్ట్ స్టోరి కాంఫటిషన్ సరైన సమయంలో సరైన పోటిని నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను. నవయువ రచయితలు ఈ అహ్వానాన్ని అందుకోవాలి. వారి రచనల కోసం నేను కూడా ఎదురుచూస్తుంటాను” .

కినిగే స్మార్ట్ స్టోరి కాంపిటిషన్ (2013) వివరాలకు ఇక్కడ చూడండి:
http://teblog.kinige.com/?p=2773

మధుబాబు నవలలు ఇక్కడ కొని చదువుకోండి:
http://kinige.com/kbrowse.php?via=tags&tag=Madhubabu

Related Posts:

పాఠకుల దాహం తీర్చే ‘కథల కడవలు’

తెలుగు కథకి ఇప్పుడు కొంత ప్రాధాన్యత ఏర్పడింది. పలు పత్రికలు కథలను విరివిగా ప్రచురిస్తున్నాయి. కథా సాహిత్య గ్రంథాలను పాఠకులు కొని చదివి ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు కవిత్వానికి ఉన్న ‘విలువ’ నేడు కథ ఆక్రమిస్తున్నది. ఐతే, కథా రచన నిజంగా అంతగా అభివృద్ధి చెందిందా? అనే ప్రశ్న లేకపోలేదు. కవితలకు లేని వార్షిక పోటీలు, వార్షిక సంకలనాలు కథల విషయంలో ఎక్కువగా వెలువడుతున్నాయి. కథా రచయితలూ స్వీయ సంకలనాలు వెలవరిస్తున్నారు. ప్రాంతీయ విషయ విభాగాల వారిగా కొన్ని సంకలనాలు అచ్చవుతున్నాయి. సాహిత్య పేజీలలో కథాసాహిత్యంపై వ్యాసాలూ అచ్చవుతున్నాయి. ఇంత జరిగినా- ‘నిజంగా కథారచనలో గణనీయమైన వాసి పెరిగిందా?’ అనిపిస్తుంది.
ఇంకా కథ వినోద ప్రధానంగానే ఉంది. సామాజిక కథలు తగ్గుముఖం పట్టాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబపరమైన ఇతివృత్తం ఇంకా పెత్తనం వహిస్తూనే ఉంది. బాధ కలిగించే విషయమేమంటే- ఉద్యమాలు, పోరాటాలు ఇతివృత్తం కాలేకపోవడం. ఐతే, సమాజంలోని వెలికిరాని బతుకులపై, సామాజిక కోణాలపై కొన్ని మంచి రచనలు రావడం శుభపరిణామం. ఇదంతా ఇతివృత్తపరంగా జరిగే పరిశీలన. వస్తువులో వచ్చిన నవ్యత కథారచన శైలిలో ఉన్నదా? అన్నది రెండో పరిశీలనాంశం. నిజానికి తెలుగు కథ ఎక్కువగా కుంటుపడింది ఈ రంగంలోనే. దీటైన రచయితలు ఉన్నా కొత్తశైలిని నిర్మించుకున్నవారు చాలా తక్కువే.
ఇతర భాషలలో కనుపించే శైలీపరమైన ప్రభావాలు మన కథాసాహిత్యంపై పడడం గమనించాలి. ముఖ్యంగా పాశ్చాత్య సాహిత్యంలో వెలువడిన శైలులను కొందరు తెలుగుకీ పరిచయం చేశారు. కానీ, వారిలో చాలామంది ఇవి ఫలానా కథలకు, కథారచయితలకు ఆధారం అని ఎప్పుడూ, ఎక్కడా పేర్కొనలేదు. వస్తుశైలుల ప్రభావానికి లోనుకాకూడదని ఎవరూ అనరు. కానీ, చూచాయగానైనా పేర్కొనకపోవడం నిజాయితీ రాహిత్యంగానే భావించాలి. అలా పేర్కొనడం రచయిత వ్యక్తిత్వానికి వనె్నతెస్తుందే తప్ప మరోటికాదు. నిజాయితీ కొరవడిన దాఖలాలు కూడా నేడు ఎక్కువే అనిపిస్తున్నది.
ఏదిఏమైనా కథావార్షికాల కోసం కాకుండా ఇతివృత్తం ప్రేరేపించగా రాసిన కొన్ని రచనలూ వచ్చాయి. అలాంటి వాటిలో ‘సింహాలపేట’ ఒకటి. నవ్యత, వైవిధ్యం, సంక్షిప్తత ఈ కథలకు ప్రాణం. పదాలు కావచ్చు. వాక్యాలు కావచ్చు. భావ చిత్రాలు కావచ్చు. కథ మొదలు, తుది ఏదైనా స్ట్రైకింగ్‌గా చెప్పడం ఈ కథల లక్ష్యం.
‘సింహాలపేట’ సంకలనం రచయిత రమణ జీవి వృత్తిపరంగా ఆర్టిస్ట్. బొమ్మలు అతని వ్యక్తీకరణ. భుక్తికోసం పలు పత్రికల్లో పనిచేశాడు. సాహిత్యం అతని ఆరో ప్రాణం. కవిత్వం, కథ- కవలల వంటివి.. అతని లాగే. మిగిలిన ఏ ప్రక్రియ జోలికిపోకుండా వీటినే పంచేంద్రియాలంత ప్రాణంగా చూసుకుంటున్నాడు. రెండు కథా సంపుటాలు, కవిత్వ సంపుటాలు అచ్చేసినా రమణజీవి తనను సాహిత్యజీవిగా క్లెయిమ్ చేసుకోడు.
రాయడం వరకే తన బాధ్యత. పుస్తకాల రూపంలో వెలువడడం వాటి అదృష్టం అనుకుంటాడు. నిమిత్తంగా కనిపించే కథకుడి కలం మనిషి బతుకుల్లోని జీవవైవిధ్య వైరుధ్యాలు పాఠకులని విస్మయపరుస్తాయి. పనె్నండు కథలు అన్నీ ఏకబిగిన కొత్తవలయాలు సృష్టించి పాత్రల్లో పాఠకులని ఒకరిగాచేస్తాయి. ఈ కథాపఠనం మొదలెడితే ఆపడం కష్టమే. అలాగని చదువుతూ పోలేం. ఏదో విచలిత భావన. వైకల్యపు ఆలోచనల కొనసాగింపు.
చాలా కథలు ఈనేల మీదే జరిగాయి. అదో అది చిరునామా. అదో అతను ఈ మనిషేనేమో అనిపిస్తుంది. కొద్ది కథల్లో పరాయి సంస్కృతిలో పరాయి సమాజంలో కనుపించే మనుషులు కనుపిస్తారు. ‘చివరి మనిషి’ కథ అలాంటిదే. దేశీయత, పాశ్చాత్యీకరణ రెండు జంట భావనలుగా స్వారీ చేస్తాయి. సమాజ వాస్తవికత, ఆది భౌతిక భావన రెండు ఏక కాలంలో సయ్యాటలాడుతాయి. కనిపించే పర్యావరణం వంటి సమస్యలు, కనిపించని సమస్యల గూళ్ళల్లో చిక్కుకున్న సుంకన్నలు మనని రెండువేపులా పలకరిస్తుంటారు.
ఈ కథలన్నీ లోగడ ప్రముఖంగా అచ్చయినవే. కానీ, పుస్తకంలో ఒకచోట అచ్చుకావడంవల్ల పాఠకుడిని ప్రభావితం చేయగలిగిన ‘చానెల్’ ఏర్పడింది. రమణజీవి ఇప్పుడు కథకుల పట్టికలో చేరక తప్పదు. ఆ పట్టిక తయారుచేసే వారి ప్రిఫరెన్స్‌ని బట్టి అతని స్థానం ఉంటుంది. ఇప్పుడు కథా సాహిత్యాన్ని నిర్దేశిస్తున్న ధనిక ప్రచురణకర్తల చేతిలో రమణజీవి ఇరుక్కుంటాడా? జారిపోయిన తన అస్తిత్వాన్ని నిలుపుకుంటాడా?
నిజానికి ఇవి మంచి కథలుగా భావించి వార్షిక కథా సంకలనాలలో అచ్చయినవెన్ని? వాటిల్లో స్థానం సంపాదించనివి మంచి కథలు కావా? ఈ సవాలు తెలుగు కథాసాహిత్య రాజకీయాన్ని బట్టబయలు చేస్తున్నది. వార్షిక సంకలన రూపకర్తల అనైతికతకి ప్రశ్న గుర్తుగా నిలుస్తుంది. వారానికో గుడ్డు పొదిగిన కోడిలా ఏడాదికో కథాసంకలనం అనే చట్రం ఏర్పరుచుకునే కంటే తద్బిన్నంగా మరో మంచి ఆలోచనచేసే తరుణం వచ్చింది.
కథా వార్షికాసురులు, సాహితీ పేజీల నిర్వాహకులు, కథారచయితల కన్నా పాఠకులు చాలా తెలివి మీరారు. నిజంగా మంచి కథ ఏదో పసిగట్టి దానిని సొంతం చేసుకుంటున్నారు. ఈ కథలకు ఒక పాఠక వర్గం ఏర్పడింది. వారి దాహాన్ని ఈ కథల కడవలు తీర్చుతాయి. అందుకు రచయితకు అభినందనలు. మంచి పుస్తకం అచ్చేసిన ‘పర్‌స్పెక్టివ్’ వారికి కూడా.

బి.విద్యాసాగర్‌రావు, ఆంధ్రభూమి అక్షర పేజి, 20/07/2013

* * *

సింహాల పేట” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సింహాల పేట On Kinige

Related Posts:

కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి ప్రముఖ రచయిత(త్రు)ల అభిప్రాయాలు

“కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి Sathyavathi Pochiraju గారు ఏమంటూన్నారో చూడండి! మరి వెంటనే పంపండి పోటీకి మీ కథలను!

“వృద్ధాప్యంలోకో,మధ్య వయస్సులోకో వచ్చేస్తోందేమోనని అనుమానం కలిగిస్తున్నతెలుగు సాహితీ వనంలోకి “స్మార్ట్” యువరయితలు ఇప్పటి అవసరం”
సత్యవతి

కినిగెలో సత్యవతి గారి సాహిత్యం ఇక్కడ:

http://kinige.com/kbrowse.php?via=author&name=P.+Sathyavathi&id=263

* * *

“అనామకుడు”అనే కలం పేరుతో సుప్రసిద్ధులైన అల్లంరాజు రామశాస్త్రి గారు ఏమంటూన్నారో చూడండి!
“స్మార్ట్ స్టోరీ ని తెలుగు లో ఏమంటారన్న మీమాంసలో పడకండి. అమలాపురం సరోజ (ఎవరో తెలియదా? వేదం చూడండి!) చెప్పినట్లు అలాంటి వాటిని పెద్దలకి వదిలెయ్యండి. మన అందరికీ స్మార్ట్ స్టోరీ అంటే ఏమిటో తెలుసు. స్టార్ట్ రైటింగ్ ఇట్.

ప్రపంచమంతా భాషల్లో మార్పులు వస్తున్నాయి. రావాలి. అలా మారని భాషలు ప్రజలకి దూరంగా వెళ్లి పోతున్నాయి. కొత్త ఆలోచనల్ని అందించాలంటే భాష కొత్త పదాల్ని తన స్వంతం చేసుకోవాలి. అలా స్వంతం చెయ్యగలిగేది వ్యాకరణ వేత్తలు నిఘంటు కర్తలు కారు. అలా చెయ్యగలిగేది మీ లాంటి యువరచయితలు.

మీరు చూస్తున్న ప్రపంచం కొత్తది. అందులోంచి ఇతివృత్తాలు ఏరుకోండి. మీ జీవితాల్లో ఉన్న సమస్యల్ని, సందేహాల్ని, సంతోషాల్ని హాయిగా రాయండి.నలుగురితో పంచుకోండి. నవ్వించండి. ఏడిపించండి. కొత్త తరం ఆలోచనల్నీ అనుభవాల్ని అనుభూతుల్నీఅందరికీ అందించండి. అప్పుడే తెలుగుకి కొత్తతనం అందుతుంది. తెలుగు కధ కొత్త చిగుళ్ళేస్తుంది.

అదే స్మార్ట్ స్టోరీ పోటీ పరమార్థం. యంగ్ రైటర్స్, కీబోర్డందుకోండి. ”

కినిగెలో రామశాస్త్రి గారి సాహిత్యం ఇక్కడ:

http://kinige.com/kbrowse.php?via=author&name=Anamakudu&id=28

Related Posts:

సెప్టెంబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.బియాండ్ కాఫీ ఖదీర్ బాబు
2.దొంగ… దొంగ… దొంగ మధుబాబు
3.జనవరి 5 సూర్యదేవర రామ్మోహన రావు
4.తెలుగు సినిమా 1961-2011 లక్ష్మణరేఖ ఎన్. గోపాలకృష్ణ
5. మిసిమి సెప్టెంబరు 2013 మిసిమి
6. మంచి ముత్యాలు యండమూరి వీరేంద్రనాథ్
7. రాయవాచకమువిశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి
8. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ
9. చెట్టంత మనిషి ద్విభాష్యం రాజేశ్వరరావు
10. వొడువని ముచ్చట ప్రొఫెసర్. జయశంకర్

Related Posts: