కినిగె దీపావళి సేల్ మరియు మూడవ వార్షికోత్సవ కానుక

కినిగె మీ ఆదరాభిమానాలతో ఈ నవంబరు ఒకటవ తారీఖుకు నాల్గవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ మూడు సంవత్సరాలు మీరు కినిగెపై చూపించిన ఆదరాభిమానాలకు వేవేల కృతజ్ఞతలు. మీతో కలిసి మేము సాగించే ఈ ప్రయాణంలో మరిన్ని మైలురాళ్లు దాటుతామని ఆశిస్తూ, ఈ మూడవ వార్షికోత్సవ కానుక మీ కోసం.

కినిగె ఈపుస్తకాలపై ప్రత్యేక 10% అధిక  తగ్గింపు!

ఉచిత షిప్ప్రింగు: ప్రింటు పుస్తకాలు పోస్టేజి భారం లేకుండా భారతదేశంలోని మీ ఇంటికే తెప్పించుకోండి!!

Kinige Diwali Sale – free shipping and extra discount on eBooks

దీపావళి శుభాకాంక్షలు.

కినిగె మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ఇప్పుడే దర్శించండి కినిగె డాట్ కామ్. తెలుగు పుస్తకాల సముద్రంలో ఈదులాడండి. 

 

Related Posts:

  • No Related Posts

అక్టోబరు 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

అక్టోబరు 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
2. అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర్ తిలక్
3. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ
4.హైదరాబాద్ ను౦చి ఒక రోజులో పి.యస్.యమ్. లక్ష్మి
5. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
6. ఇతి స్మరణీయం అతి రమణీయం నీలంరాజు లక్ష్మీప్రసాద్
7. వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్
8. మిథునం …శ్రీరమణ
9. అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి
10. గీతాంజలి మువ్వల సుబ్బరామయ్య

Related Posts:

నిరాశకు నిష్క్రమణ పలికే కథల సంపుటి ‘ఆసరా’

గీతలన్నా, గీతాలన్నా తనకిష్టమని చెప్పే శ్రీమతి వారణాసి నాగలక్ష్మి మంచి కథా రచయిత్రిగా కూడా పాఠకలోకానికి పరిచితురాలు. వానచినుకుల్లో తడుస్తున్న వాళ్ళకు గొడుగు ఎవరైనా ఇస్తే ఎంత ఆసరానో కన్నీటి జడిలో తడిసే వారికి కొండంత ధైర్యాన్నిచ్చే ‘ఆసరా‘ సంపుటిలోని కథల వంటి కథలు అంత ఆలంబన. ‘బంగారపు పళ్లేనికైనా గోడ చేర్పు ఉండాలి’ అన్నట్లు, ఎంతటి వాళ్ళకైనా ఏదో ఒక సమయంలో ఆసరా అవసరపడుతుంది. ‘పాడి ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి’ అని తోడు-నీడ సినిమా పాటలో అన్నట్లు కష్టాలను కన్నీళ్ళనే కాదు, మన ఆనందాన్నీ పంచుకునే వాళ్ళున్నదే జీవితం.
ఈ సంపుటిలో వరసగా నాలుగు కథలు చదివాక నాకు ఏం చెప్పాలని పదే పదే అనిపించిందో సరిగ్గా అవే మాటలు ‘మేఘన’ కథలో కనిపించాయి. “సృజనాత్మక రచనలో చెప్పదలచిన విషయాన్ని మొహాన కొట్టినట్లుగానో, లేదా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగానో చెప్పకూడదు. పాఠకుడిలో ఆలోచన రేకెత్తించేలా, చిరునవ్వు మొలిపించేలా, నిద్రపోతున్న వ్యక్తిని వెచ్చని సూర్యకిరణం మేల్కొలిపినట్లుగా, మనసు ఆర్ద్రమై కళ్ళు చెమర్చేలా, సూచనప్రాయంగా, దృశ్యాదృశ్యంగా రచన సాగాలి” మేఘన కథలో సృజనాత్మక రచన వర్క్ షాప్ నిర్వహించే సాహితీ వైద్యుడు సుధీర్ సంజయ్ చెప్పిన మాటలు నిజానికి రచయిత్రివే. శ్రీమతి నాగలక్ష్మి కథల్లో కనిపించే నేటి మానవ సంబంధాలు, సమస్యలు, అంతస్సంఘర్షణలు, వాగ్వివాదాలు, చిలిపి తగవులు – అన్నింటిలోనూ సౌకుమార్యం కనిపిస్తుంది. తిట్టినా అందులో పదునుతోపాటు నాగరికత కనిపిస్తుంది. నవ సమాజాన్ని నిశితంగా పరిశీలించి నిర్లిప్తంగా ఉండే మనుషుల్ని ఈ సమస్య గురించి ఆలోచించమంటుంది. ఈ సంపుటి పేరు ‘ఆసరా’ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లిపేగు (బొడ్డుతాడు) ఆసరా. చివరి వార్ధక్య దశలో చెట్టంత బిడ్డలో, చేతికర్రో ఆసరా. ఈ మధ్య సాగే జీవనయానంలో ఆసరా ఎన్నోసార్లు అవసరమవుతుంది. మొదటి కథ పేరే ‘ఆసరా’ సైబర్ కేఫ్‌లలో చిరుచీకటి నిండిన కేబిన్లలో యువతీ యువకులు యౌవనమైకంలో చేసే శృంగార చేష్టల్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చెయ్యటం గురించి మనకు తెలుసు. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఎగతాళి చేసి స్నేహితులు, తిట్టి తల్లిదండ్రులు వాళ్ళని మరింత నీరుగారిపోయేలా చేస్తారు. అందుకు ఫలితమే ఎన్నో ఆత్మహత్యలు. ఆ కాసేపు వివేకంతో, ఓర్పుతో ధైర్యం చెప్పేవాళ్ళుంటే, సమస్యకు పరిష్కారాన్ని సూచించే వాళ్ళుంటే ఆ ‘ఆసరా’ జీవితాన్నే నిలబెడుతుందని ఈ కథ చెబుతుంది. తప్పు దిద్దుకోవటానికి తల్లి చేయూతనిస్తే ఒక పడుచుపిల్ల జీవితం మళ్లీ పచ్చగా మారుతుందని చెప్పే ఈ కథ ఇటు యువతకు, అటు తల్లిదండ్రులకు కనువిప్పు. సమాజంలో ‘పీడించటం’ అనేది వర్ణాలకు, వర్గాలకు పరిమితం చేస్తుంటారు. ‘అమృతాన్ని సాధించు’ కథ చదివినప్పుడు బలవంతులు, బలహీనుల్ని పీడిస్తారనీ, అందుకు వర్ణ, వర్గాలు అతీతమని అనిపిస్తుంది. పదిమంది మెప్పు కోసం ఆదర్శ వివాహాలు చేసుకొని వివక్ష విషాన్ని కడుపులోనే దాచుకొని పండంటి కాపురాన్ని పాడుచేసుకుంటున్న ఒక జంట కథ ఇది. తన ప్రేమకోసం తన వాళ్ళందరినీ వదిలి వచ్చిన భార్యను ‘అగ్రవర్ణపు అహంకారి’గా మాత్రమే చూసే అవినాశ్ ఆత్మన్యూనతా భావంతో, పేరుకుపోయిన పగతో భార్య నీరదను నిజంగానే ‘కురిసే మేఘం’గా మార్చాడు. అవినాశ్ పురుషుడిగా తన ఆధిక్యత భార్య మీద చూపిస్తే నీరదను ఆసరాగా నిలిచే సునంద ఇంట్లో పనిపిల్లమీద ఆధిపత్యం సాగిస్తుంది. ‘తప్పులు దిద్దువారు తమ తప్పులెరుగరు’మరి!
ఒళ్లు కొవ్వెక్కిన వెధవ ఒంటరిగా వచ్చే ఆడపిల్లను మానభంగం చేస్తే తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతుంటాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అమెరికా మొగుడు మోసం చేస్తే ఆమెకూ ఆత్మహత్యే గతి. మనకు కనబడుతున్న కన్నీటి కథలివి. కాని ‘సంధ్యారాగం’ కథలో ‘సావేరి’కి సుమేధ ఆసరాతో బ్రతికి సాధించాలనే పట్టుదల వచ్చింది. బొద్దింకను చూస్తే భయపడే సావేరి పసిఫిక్ మహా సముద్రం మీద ‘హాట్ ఎయిర్ బెలూనింగ్’ చేసేంత ధైర్యవంతురాలైంది. “’వే’ని వెతికి పట్టుకోవాలి. అది తీసేస్తే ‘సారి’ మిగిల్తుంది. నువ్వు ‘సావేరి’ని. అందమైన రాగానివి.“ అన్న స్నేహితురాలి మాటల ఆసరా విలువ అమూల్యం.
జీవితాన్ని మధురంగా, రాగసుధా భరితంగా ఊహించుకుని కలలుకనే అమ్మాయిలు తనను పట్టించుకోని భర్త దొరికితే మానసిక వేదనకు గురౌతారు. ఆ కోపంలో ‘మొమెంట్ ఆఫ్ ప్లెజర్’ ఫలితంగా వచ్చిన గర్భాన్ని తీయించేసుకోవాలనుకుంటారు. అది భర్తకు బుద్ధి చెప్పటమనుకుంటారు. కడుపున పడిన బిడ్డను కాదనుకునే హక్కు తల్లికి లేదని, జన్మనివ్వటం అద్భుతమైన ఘట్టమనీ చెప్పే కథ ‘చిన్నబోదా చిన్నప్రాణం’. ఆడపిల్లల్ని వద్దనుకున్న పాపం తరతరాలను కట్టికుదుపుతుందని ‘రేపటి ప్రశ్న’ కథ హెచ్చరిస్తుంది. అత్తగారొస్తుంటే దెయ్యం వస్తున్నట్లు భయపడిన కోడలు ఆమె ప్రేమతోరాసిన ‘ఒక ప్రేమలేఖ’ మానవ సంబంధాల తియ్యదనానికి నిదర్శనం. అర్థం చేసుకోవటం కష్టం. అపార్థంతో నిందలు వెయ్యటం సులభమనే సందేశం ‘ప్రేమతో మీ పెద్దత్త’ కథలో చూడవచ్చు. అమ్మ అనురాగానికి అద్దంపట్టిన కథ ‘గోడమీదబొమ్మ’. బాపు- రమణల ‘రాధాగోపాళం’ను చూసి ముచ్చటపడి రచయిత్రి మురిపెంగా రాసుకున్న కథ ‘శ్యామాగోపాళం’. (ఆఁయ్! అమ్మా! మమ్మల్నే ఇమిటేట్ చేస్తావా? మా పాత్రల్ని (గిన్నెలు కాదు రాధా గోపాళం) జాతీయం చేస్తావా? అని పెద్దాళ్ళిద్దరూ ఖోప్పడ్డారేమో?) కథా వస్తువులు, కథ నమూ నచ్చే కథల ‘మిక్చర్’ ‘ఆసరా’ కథా ప్రియులను మెప్పిస్తుంది. నేటి నిజాలను హితంగా, మితంగా చెప్పిన శ్రీమతి నాగలక్ష్మి అభినందనీయురాలు.

డా. బి.ఉమాదేవి, నది మాసపత్రిక, సెప్టెంబరు 2013

* * *

“ఆసరా” కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
ఆసరా On Kinige

Related Posts:

తురగా జానకీరాణి కథలు

రేడియో అక్కయ్యగా తెలుగు వారందరికీ సుపరిచితురాలైన శ్రీమతి తురగా జానకీరాణి గారి కథల పుస్తకం “తురగా జానకీరాణి కథలు” ఈ దసరా పండుగనాడు ఆవిష్కరించబడడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

ఈ శుభసందర్భంలో వారికి ఇవే మా శుభాకాంక్షలు.

శ్రీ తురగా కృష్ణమోహన్ గారి “మాట కచ్చేరి” పుస్తకాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరి దగ్గరకు ఈ-బుక్స్ రూపంలో తీసుకువెళ్ళడానికి మా కినిగె.కాం సంస్థను తమ భాగస్వామిగా చేసుకున్నందుకు శ్రీమతి తురగా జానకీ రాణి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఈ సందర్భంగా “తురగా కృష్ణమోహనరావు పాత్రికేయ పురస్కారాన్ని” అందుకోబోతున్న ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారికి, మా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము.

ఇంకా ఈ సభకు విచ్చేసిన ప్రముఖులు, మాజీ తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ ఎన్.గోపి గారికి, లోక్‌సత్తా పార్టీ అధినేత, శాసన సభ్యులు శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి, విఖ్యాత పాత్రికేయులు, సంపాదకులు శ్రీ ఎబికె ప్రసాద్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారములు తెలియజేస్తున్నాము.

అభినందనలతో,

అనిల్ అట్లూరి,
కినిగె.కాం బృందం

Related Posts:

అక్టోబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

అక్టోబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
2. మహి కుప్పిలి పద్మ
3.కిల్ దెమ్ మిస్టర్ షాడో మధుబాబు
4.అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి
5. ఇతి స్మరణీయం అతి రమణీయం నీలంరాజు లక్ష్మీప్రసాద్
6. ది డైరీ ఆఫ్ మిసెస్ శారద యండమూరి వీరేంద్రనాథ్
7. యర్రంశెట్టి శాయి హాస్య కథానికలు యర్రంశెట్టి శాయి
8. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
9. మిసిమి అక్టోబరు 2013 మిసిమి
10. సంకల్పం సూర్యదేవర రామ్మోహన రావు

Related Posts:

అక్టోబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

అక్టోబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
2. ఇతి స్మరణీయం అతి రమణీయం నీలంరాజు లక్ష్మీప్రసాద్
3. బియాండ్ కాఫీ ఖదీర్ బాబు
4. ది డైరీ ఆఫ్ మిసెస్ శారద యండమూరి వీరేంద్రనాథ్
5. ఈ దారి మనసైనది అంగులూరి అంజనీదేవి
6. యర్రంశెట్టి శాయి హాస్య కథానికలు యర్రంశెట్టి శాయి
7. నవ్విపోదురుగాక…కాట్రగడ్డ మురారి
8. నా ఆత్మకథ (స్వామి వివేకానంద) మరియు రోజుకో సూక్తి స్వామి వివేకానంద
9. వోడ్కా విత్ వర్మ…సిరాశ్రీ
10. అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి

Related Posts: