నవంబరు 2013 ఐదవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

నవంబరు 2013 ఐదవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.టెర్రా 205మధుబాబు
2.తిలక్ కథలు 1దేవరకొండ బాలగంగాధర్ తిలక్
3. ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశంయండమూరి వీరేంద్రనాథ్
4. అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి
5. శ్రీ శివ మహా పురాణము విశ్వనాథం సత్యనారాయణ మూర్తి
6. హైదరాబాద్ ను౦చి ఒక రోజులో పి.యస్.యమ్. లక్ష్మి
7. వేదోక్త గర్భాధానము భాస్కరభొట్ల జనార్థన శర్మ
8. ముక్త కుప్పిలి పద్మ
9. మిథునం …శ్రీరమణ
10. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్

Related Posts:

నవంబరు 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

నవంబరు 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.టైగర్ మున్నా మధుబాబు
2.శ్రీరామకృష్ణ కథామృతం మహేంద్రనాథ్ గుప్త
3.కామెడీ . కామ్ తెలుగు బ్లాగర్లు
4. మిథునం …శ్రీరమణ
5. అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి
6. వేదోక్త గర్భాధానము భాస్కరభొట్ల జనార్థన శర్మ
7. అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర్ తిలక్
8. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
9. ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశంయండమూరి వీరేంద్రనాథ్
10. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ

Related Posts:

బిగి సడలని ‘సస్పెన్స్’

పట్టు సడలని ‘బిగి’తో, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే ‘క్రైమ్’ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఒకప్పుడు ‘డిటెక్టివ్ సాహిత్యం’ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించింది. ఇటీవలి కాలంలో క్రైమ్ కథాంశాలతో ‘డిటెక్టివ్ సాహిత్యం’లో కృషి చేస్తున్న రచయితల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ క్రైమ్ కథలకు ఆదరణ పూర్తిగా అంతరించిపోలేదు. కొన్ని పత్రికలు ఇప్పటికీ కొన్ని పేజీలను క్రైమ్ కథలకు ప్ర త్యేకించడం చూస్తున్నాం. పలు టీవీ చానళ్లు కూడా యథార్థ సంఘటనలతో రూపొందించే క్రైమ్ కథలను ప్రసారం చేస్తున్నాయి. ఇ లాంటి కథనాలకు సంబంధించి పేర్లు, పాత్రలు, స్థలాలు మొదలైనవన్నీ కల్పితమని, ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావని ‘క్రైమ్’ కథా రచయితలు చెప్పడం ఆనవాయితీ అయనా, వీటిలో చాలావరకూ మన చుట్టూ ఉన్న సమాజం నుంచి వచ్చినవే. ఈ కథలు చదవడానికి ఉత్కంఠ భరితంగా ఉండడమే కాదు, నేరాలకు నేపథ్యం ఏ మిటి? ఏ కారణంగా కొందరు నేరస్థులవుతున్నారు? అనే విషయాలపై కూడా పాఠకులకు అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇక, క్రైమ్ కథలు రాసే రచయితలపై ఆంగ్ల సాహిత్య ప్రభావం సహజంగా ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. తెలుగు భాషలో అద్భుత శైలితో స్వతంత్రంగా నేరగాథలను ఆవిష్కరించే రచయితల సంఖ్య తక్కువే. ఈ లోటును రేణిగుంట ఉత్తమ్ కొంతవరకూ తీర్చారనే చెప్పాలి. ‘థ్రిల్లర్స్’ పేరిట ఆయన రాసిన పది కథలూ పాఠకుల్లో ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తాయి. కథ నిడివి చిన్నదైనా, పెద్దదైనా ‘సస్పెన్స్’ ఒక్కటే రచయిత ప్రతిభకు గీటురాయి వంటిది. కథనాన్ని అనేక మలుపులు తిప్పుతూ, పాఠకుడి చేత ఏకబిగిన చదివించే లక్షణం ఉత్తమ్ రచనల్లో కనిపిస్తుంది. ‘థ్రిల్లర్స్’లో ‘ద్రోహం’, ‘విషకన్య’, ‘అతడు’, ‘ముసురు’, ‘ద ప్లాన్’ తదితర కథలు దేనికదే వైవిధ్యంతో కనిపిస్తాయి. కొన్ని కథల్లో ముగింపును మనం అంత సులువుగా ఊహించలేం. ప్రేమ, డబ్బు, విలన్లు, తుపాకులు, పోలీసులు.. వీటితో పాటు ‘ఆత్మ’లకూ క్రైమ్ కథల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘67 నిముషాల తర్వాత’ కథలో- రాత్రి వేళ రైలు దిగిన ఓ ఒంటరి అమ్మాయిని క్షేమంగా ఇంటికి చేర్చిన వ్యక్తి ఆమె బావ కాదని, అది ‘ఆత్మ’ అని ముగింపులో చెప్పడం ఊహించని మలుపు. ఇలాంటి అనుకోని మలుపులే క్రైమ్ కథల్ని గుర్తుండేలా చేస్తాయి. ఇక, విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలును అంతం చేసేందుకు ప్రత్యర్థులు సాగించిన వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు మహామంత్రి తిమ్మరుసు చేసిన ప్రతి వ్యూహాలకు సంబంధించిన కథ ‘కుట్ర’. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాయలు జీవితానికి సంబంధించిన కథాంశాన్ని ‘క్రైమ్’ కథాసంపుటిలో చేర్చడం విశేషం.

ఎస్‌ఆర్, ఆంధ్రభూమి అక్షర పేజి, 07/09/2013

* * *

“థ్రిల్లర్స్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
థ్రిల్లర్స్ On Kinige

Related Posts:

‘తెలివి బరువు’ దిగితే.. అంతా తేలికే..!

జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?” పుస్తక సమీక్ష ఇది.

* * *

పుస్తకం పేరులో ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అడుగుతున్నది రచయిత అయితే, పుస్తకంలోని మొదటి ముప్ఫయిమూడు పేజీలు ప్రత్యక్షంగా, మిగతావి (ఈయన ఇతర రచనలతోబాటు) పరోక్షంగా జవాబు అందిస్తున్నాయి. కృష్ణమూర్తిగారిని ఆయన ‘కృ’ అన్న పేరుతో పిలిచారు. ‘కృ’కు నీలంరాజువారు బాగా తెలుసు. అయినా లక్ష్మీప్రసాద్‌లోని మంచితనం, మిగతా అంశాలను ‘తెలిసినంతమేరకు’ అన్న శీర్షిక కింద చేర్పించింది. ఈ రచయితకు తాను రాయదలచుకున్న అంశం తలకెక్కింది. వొంటబట్టింది. ఆయన సాయంతో పాఠకులు తమను తాము ప్రశ్న అడిగేసుకుని జవాబు వెదుకుతారు, ఈ పుస్తకం చదివితే!
మదనపల్లెలో పుట్టి చిన్నతనంలోనే ఇంగ్లండుకు తరలించబడిన జిడ్డు కృష్ణమూర్తి మనవాడు, తెలుగువాడు అని చెప్పుకోవడం మనలోని ఖాళీతనాన్ని చూపుతుంది. భారతీయుడివా అన్న ప్రశ్నకు ‘అవును. భారతదేశంలో పుట్టాను’ అని జవాబిచ్చాడు జె.కె. జె.కె అన్నపేరు ప్రపంచమంతటా తెలుసు. తెలియనిదల్లా మనకే. ఆయనేదో ప్రపంచానికి దారి చూపిస్తాడనుకుంటూ, అందరం ఆయన చుట్టూ మూగితే, అదేదో మీరే చేయాలి అని దారిచూపించాడాయన. శ్రీకృష్ణమూర్తిగారు, వారు లాంటి సంబోధనలను మించి ఎంతో ముందుకు సాగిన ఆ మనిషి ‘అర్థం కాడు!’ అనే స్థాయికి చేరుకున్నాడు. సమస్య అక్కడే ఉంది. జేకే మాటలు అర్థంకాకపోతే తప్పు ఆయనదా? లేక మనలో ఏదయినా లోపం ఉందా? ఈ రెండవ ప్రశ్నకు జవాబు చెప్పడానికి చేసిన ప్రయత్నమే లక్ష్మీప్రసాద్ రచనల్లో కనబడుతుంది. రచనలు కొన్ని ఒకచోటచేరి ఈ పుస్తకమయింది. దీన్ని నవల చదివినట్లు ఈ చివర నుంచి, ఆ చివర వరకు ఒక్కసారి చదివి, ‘అర్థం కాలేదు’ అని పక్కనబెడితే మాత్రం తప్పకుండా లోపం మనదే.
తెలివిగలవారు కూడా తెలివి అనే బరువు కింద నలుగుతుంటారు. ఆ బరువును తప్పించుకుంటే తప్ప, ఆలోచనలను స్వీకరించడం కుదరదు. ‘పాతది అంతమొందితే తప్ప నూ తన సృష్టి జరగదు’- అని ఈ పుస్తకం మొ దట్లోనే ఒకమాట కనబడుతుంది. దీన్ని గురించి చర్చకు అవకాశం ఉంది. జరగాలి. అందుకు మనం ప్రయత్నించాలి. జేకే చెప్పింది ఈ ప్రయత్నం గురించేననిపిస్తుంది.
జేకే మాటలు ఎందరి హృదయాల్లో నాటుకున్నాయో, ఎందరికి నిజంగా అర్ధమైనాయోనని ప్రసంగవశంగా రచయిత ఒకచోట అనుమానం వెలిబుచ్చి మనకు తెలియదు, అంటారు. కానీ, అందరూ ఆయన తమను ఆశీర్వదించాలనుకుంటారు. ఈ దండాలు, దాస్యాలు తప్ప మనకు ఆలోచనలు చేతగాలేదు. ‘మనకు చేతనయిందల్లా సేవ, పూజ, ఆరాధన, దీవెనలు అందుకోవడం మాత్రమే అయ్యుండాలి అంటారు రచయిత. జేకే చూపిన దారిని నడిచే సామర్థ్యం, కుతూహలం, సుముఖత మనలో లేవంటారీయన. అది జేకే దురదృష్టం అనేంతవరకు వెళతారు కూడా!
అందుకే కుతూహలం (మిగతా లక్షణాలు ఉండనివ్వండి) కలవారంతా ఈ పుస్తకం చదవాలి. ఇందులో మనకు ‘కృ’ ఆలోచనలమీద వ్యాఖ్యానాలు, అన్వయాలు కనబతాయి. భగవద్గీత విన్న తరువాత అర్జునుడు చప్పట్లుకొట్టలేదు. గొప్ప మాట విన్న తర్వాత చప్పట్లతో మన బాధ్యత తీరదు అంటారు ప్రసాద్. ఈయన మనకు సాయపడగలరనడానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ లేదేమో?
ఆనంద సామ్రాజ్యం తాళం చెవి, మనదగ్గరే ఉందన్నా, మనసులో శూన్యం కలిగితే, ఆ సంగతి, శూన్యంపోయిన తరువాత తెలుస్తుంది అన్నా, మనం (చప్పట్లు మాని) ఆలోచనలో పడిపోతాం. పడిపోవాలి. అదే ఈ పుస్తకం ఉద్దేశమనవచ్చు. కొన్ని విషయాలు చటుక్కున అర్థంకావు. అట్లాగని, అసలే అర్థంకావు, అనవచ్చా? సామూహిక అభిప్రాయాల బరువును కాసేపయినా దించుకుని, కనీసం తగ్గించుకుని ప్రయత్నిస్తే, కొత్త అభిప్రాయాలు అర్థమయ్యే వీలుంది. రచయిత ఈ బరువులతో నలిగినవారే. పడుకుని దండం పెడతారన్నారట. జేకే ‘వద్దని’ఆయనే వంగారట!
జేకే మతాలకు అతీతమయిన మాటలు చెప్పారని కూడా తెలియని వారున్నారు. అసలు ఆయన పేరుకూడా తెలియనివారి ప్రసక్తి ఇక్కడ రాదు. అనుకరణ, అనుసరణలు వద్దన్నారు. నేను గురువును కాను, నాకు శిష్యులు, అనుయాయులు లేరు అన్నారు. ఇంకా ఎన్నో అన్నారు! కొండ అద్దంలో లాగ ఆయన ఈ పుస్తకంలో కొంత కనిపిస్తారు.

గోపాలం కె.బి. ఆంధ్రభూమి అక్షర పేజి 24/08/2013

* * *

“జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా? On Kinige

Related Posts:

పల్లె వాతావరణానికి అద్దం

‘ఒక మారుమూల గ్రామంలో వెన్ను బద్ద విరిగి పక్కకు ఒరిగిన పాతపడిన ఇంట్లో నులక మంచం మీద కట్టెలా పడి ఉన్న దేవమ్మను చూడ్డానికి కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనుమరాళ్ళు అందరూ వస్తున్నారు’ అంటూ ‘భూదేవి‘ నవల ప్రారంభమవుతుంది. ఇది పల్లె జీవితానికి అద్దం పట్టిన నవల. గ్రామీణ వాతావరణం… అక్కడి కుటుంబాల స్థితిగతులు… వారి మనస్తత్వాలను… ముఖ్యంగా దేవమ్మ పాత్రను… ‘భూదేవి’ నవలలో చక్కగా చూపించారు రచయిత సింహప్రసాద్‌. ప్రధాన పాత్ర కథా ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా చిరాకు లేకుండా సాగిపోతుంది. భూదేవి ఓర్పుకు పెట్టింది పేరు అంటుంటాం.. ఆ రకంగా నవలలోని పాత్రకు తగిన పేరు ఎంచుకుని న్యాయం చేశారు. ఎన్నో కష్టాలు ఓర్చి పిల్లలను పెద్దవాళ్ళుగా చేసి తీర్చిదిద్దిన తర్వాత .. ఎవరిదారి వారు చూసుకుని తనను పట్టించుకోకుండా వదిలేయడంతో కుమిలిపోతోంది. చివరికి స్నేహితుడు నాని చెప్పిన మాటలతో… కన్నీళ్ళు తుడిచే చేతుల కోసం ఎందరో ఆశగా ఎదురుచూస్తున్నారని… వారి కోసం పనిచేయడానికి మళ్ళీ సిద్ధమవుతాననడంతో నవలను ముగిస్తారు. నవల పల్లెవాసులకే కాదు! ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ వాసులకు కూడా అతికినట్టు సరిపోతుందని చెప్పవచ్చు. అంతేకాదు! ఆ సంఘటనలు మన చుట్టు పక్కలో.. మన ఇంట్లోనో జరిగినట్లు ఉంటుంది. ఏ పాత్రకు, ఆ పాత్ర ఏ లోపం లేకుండా కథను సహజంగా తీర్చిదిద్దారు. ‘నడవటానికి పాదాలుండాలి గాని లోకం నిండా దారులే.. పరోపకారానికి మనస్సుండాలి గానీ చేయడానికి ఎన్నెన్నో మార్గాలు’ వంటి మనస్సును హత్తుకునే ఎన్నో వాక్యాలు ఈ నవలలో ఆకట్టుకుంటాయి.

జి.వేణుమాధవరావు, ప్రజాశక్తి ఆదివారం అనుబంధం, 10 నవంబరు, 2013

* * *

‘భూదేవి’నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్‌పై ఆర్డర్ చేయడం ద్వారా ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.
భూదేవి On Kinige

Related Posts:

నవంబరు 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

నవంబరు 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.ఫ్లయింగ్ బాంబ్ మధుబాబు
2.రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
3. అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి
4. కామెడీ . కామ్ తెలుగు బ్లాగర్లు
5. మొదటి పేజి శ్రీరమణ
6.మిసిమి నవంబరు 2013 మిసిమి
7. హాస్యాహాస్య కథలు డా. గాయత్రీదేవి
8.తెలుగు వాక్యం చేకూరి రామారావు
9. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ
10. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్

Related Posts:

నవంబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

నవంబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
2. పాముమధుబాబు
3. దివ్యస్తోత్రమాలికనల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ
4. నా చూపులో ఐరోపా దూసి ధర్మారావు
5. వెన్నెల్లో ఆడపిల్లయండమూరి వీరేంద్రనాథ్
6. మిథునం …శ్రీరమణ
7. అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర్ తిలక్
8. 1948: హైదరాబాద్ పతనం మహమ్మద్ హైదర్
9. అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి
10. పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలుపొత్తూరి విజయలక్ష్మి

Related Posts:

నవంబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

నవంబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతంమధురాంతకం నరేంద్ర
2. సెవన్త్ కిల్లర్ మధుబాబు
3. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
4. 1948: హైదరాబాద్ పతనం మహమ్మద్ హైదర్
5. మిథునం …శ్రీరమణ
6. అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం-1 అట్టాడ అప్పల్నాయుడు
7. అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర్ తిలక్
8. ఇతి స్మరణీయం అతి రమణీయం నీలంరాజు లక్ష్మీప్రసాద్
9. అంతర్ముఖంయండమూరి వీరేంద్రనాథ్
10. రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ

Related Posts: