ఫిబ్రవరి 2014 నాలుగవ వారంలో టాప్ టెన్ తెలుగు పుస్తకాలు

ఫిబ్రవరి 2014 నాలుగవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. శ్రీ శివ మహా పురాణము విశ్వనాధం సత్యనారాయణ మూర్తి
2. హూ ఆర్ యూ? మధుబాబు
3. గుత్తొంకాయ్ కూర – మానవ సంబంధాలూ శ్రీరమణ
4.A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్శ్రీనివాస్
5.పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు పొత్తూరి విజయలక్ష్మి
6.రామ్@శృతి.కామ్ అద్దంకి అనంత్‌రామ్
7.డేగరెక్కల చప్పుడుయండమూరి వీరేంద్రనాథ్
8.మనసు తలుపు తెరిస్తేస్రవంతి ఐతరాజు
9.రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తాసూర్యదేవర రామ్ మోహన రావు
10.ఆత్మ కధాంశాల ఉత్తరాలురంగనాయకమ్మ

Related Posts:

శ్రీ శివ మహాపురాణం ఈ-బుక్ 28% ప్రత్యేక తగ్గింపు ధరకు

కినిగె పాఠకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు!
ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కినిగె పాఠకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది.
మహాదేవుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపే శ్రీ రామకృష్ణ మఠం వారి శ్రీ శివ మహాపురాణం ఈ-బుక్‌ని 28% ప్రత్యేక తగ్గింపు ధరకే పొందండి. ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే!

 శ్రీ శివ మహాపురాణం on Kinige

వేదములే మూలములుగా గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించాడు. కనుక వేదములు, వాటి నుండి వెలువడిన శ్రుతి, స్మృతులు, పురాణాలు అన్ని ప్రప్రథమంగా శివుని చేత బ్రహ్మదేవునికి తెలుపబడింది. కాబట్టి మహాశివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడని మహాభారతం శాంతిపర్వంలో – “అష్టాదశ పురాణానాం దశభిః కథ్యతే శివః” – అని పేర్కొనబడింది. అష్టాదశ పురాణాలలో పది పురాణాలు శివుని కథలతో నిండినవని స్పష్టంగా తెలియబడుచున్నది. సర్వవ్యాపకుడు,సర్వాధారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మ విష్ణ్వాది దేవతల చేత కీర్తించదగ్గ మహాశివుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపేదే ఈ శివ మహా పురాణం. ఈ శివ మహా పురాణం మహా పుణ్యప్రదాలైన పన్నెండు సంహితలను కలిగి ఉంది. లక్ష శ్లోకాలతో కూడినది. అయితే కలియుగ జీవులు అల్పాయుష్కులని గ్రహించి వ్యాసమహర్షి ఏడు సంహితలు, ఇరువది నాలుగు వేల శ్లోకాలలో సంక్షిప్తం గావించారు. ఈ శివ మహా పురాణం అష్టాదశ పురాణాలలో నాల్గవది. ఏడు సంహితలలో నాల్గవదైన కోటి రుద్ర సంహితలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాదుర్భావ చరిత్ర పొందుపరచబడింది.

పురాణాలలో సాగే సంభాషణలలో ఆధ్యాత్మిక సాధకుల సాధనా మార్గాలు తేటతెల్లమవుతాయి. ఉదాహరణకు శివ మహా పురాణం రుద్ర సంహితలో దాక్షాయణి పరమశివుని సమీపించి నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని కోరింది. జీవుడు ఏ తత్త్వాన్ని ఎరిగి సంసార దుఃఖాన్ని దాటగల్గుతాడో ఆ మోక్షసాధనను తెలియజేయమని కోరింది. పరమశివుడు భక్తిమార్గాన్ని బోధించి ముల్లోకాలలో భక్తి కంటె సులభమైన మార్గం లేదని వివరించాడు. ఈ పురాణంలో ప్రతీ ఘట్టం జీవులకు మేలైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తుంది.

“పఠనాచ్ఛ్ర శ్రవయా దస్య భక్తి మా న్నర సత్తమః, సద్యః శివపదప్రాప్తిం లభతే సర్వసాధనాత్‌” – భక్తితో శివపురాణం పఠించే మానవులూ, ఆ పురాణమును భక్తిశ్రద్ధలతో ఆలకించేవారూ, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించే నరులు, మానవోత్తములై ఇహ లోకంనందు సుఖసౌఖ్యాలను, పరలోకమునందు శివసాన్నిధ్యాన్ని పొందగలరని ఈ పురాణమే చెబుతోంది.

Related Posts:

పదునైన అస్త్రాలు

కాలక్షేపానికో, కలల్లో విహరింపజేయటానికో కాకుండా ఛాందస, కపటత్వ, రాజీధోరణులపై విమర్శాస్త్రాలు గురిపెడుతూ సాగిన కథల, వ్యాసాల సంకలనమిది. అమెరికాలో తెలుగువారి జీవితంలోని పార్శ్వాలూ, సాహిత్య విమర్శలూ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. భార్యగా వచ్చిన స్త్రీకి మానసికవ్యాధి వచ్చేలా ప్రవర్తించి, ఆమె చనిపోగానే నిత్యపెళ్ళికొడుకు అవతారమెత్తాలని వెంపర్లాడే ఓ వ్యక్తి కథ ‘పెళ్ళాల పులి‘. తమ మతవిశ్వాసాలనో, నాస్తిక భావాలనో చాలామంది తమ పిల్లల్లో కలిగించలేకపోవటం చూస్తుంటాం. ఈ ఇతివృత్తంతో ‘తండ్రి’తనం కథ నడిచింది. ఆఫీసులకు పెంపుడుకుక్కల్ని తీసుకువచ్చే అమెరికన్‌ ఉద్యోగుల చేష్టలను హాస్య వ్యంగ్య ధోరణిలో చిత్రించిన కథ ‘గొర్రెల స్వామ్యం’. ఒక రచన పాఠకునిపై ఎంత గాఢమైన ప్రభావం చూపగలదో ‘నన్ను మార్చిన పుస్తకం’ తెలుపుతుంది.

— సీహెచ్‌.వేణు, ఈనాడు ఆదివారం అనుబంధం, 2 ఫిబ్రవరి, 2014

* * *

‘పెళ్ళాల పులి’ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

పెళ్ళాల పులి on Kinige

 

Related Posts:

ఫిబ్రవరి 2014 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

 

ఫిబ్రవరి 2014 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.బ్రోకెన్ రివాల్వర్మధుబాబు
2.ప్రేమిస్తానంటే… అంగులూరి అంజనాదేవి
3.నవ్విపోదురుగాక…కాట్రగడ్డ మురారి
4.సాయంకాలమైందిగొల్లపూడి మారుతీరావు
5.A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
6.రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
7.వెన్నెల్లో ఆడపిల్లయండమూరి వీరేంద్రనాథ్
8.చిరుజల్లు కురిసెనా? స్వాతీ శ్రీపాద
9. ద్రౌపదియార్లగడ్డ లక్ష్మీప్రసాద్
10.అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్

Related Posts:

ఫిబ్రవరి 2014 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

ఫిబ్రవరి 2014 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.బ్రోకెన్ రివాల్వర్మధుబాబు
2.నిశీథి నియంత సూర్యదేవర రామ్ మోహన రావు
3.రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
4.గాలిబంగ్లాఅడపా చిరంజీవి
5.వెన్నెల్లో ఆడపిల్లయండమూరి వీరేంద్రనాథ్
6.నవ్విపోదురుగాక…కాట్రగడ్డ మురారి
7.A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
8. గండికోటతవ్వా ఓబుల్ రెడ్డి
9.పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం డా. జయంతి చక్రవర్తి
10. మిథునం …శ్రీరమణ

Related Posts:

ఫిబ్రవరి 2014 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

ఫిబ్రవరి 2014 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.నిశీథి నియంత సూర్యదేవర రామ్ మోహన రావు
2.డేంజరస్ డయబాలిక్మధుబాబు
3.రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
4.గాలిబంగ్లాఅడపా చిరంజీవి
5.పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం డా. జయంతి చక్రవర్తి
6.A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
7.నవ్విపోదురుగాక…కాట్రగడ్డ మురారి
8. శబ్బాష్‌రా శంకరా!తనికెళ్ళ భరణి
9.అల్లుడుగారు ఆంధ్రా స్పెషల్ నందుల వెంకటేశ్వరరావు
10. యుగానికి ఒక్కడుయు. వినాయకరావు

Related Posts: