మే 2014 ఐదవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే 2014 ఐదవ వారంలోకినిగె పై టాప్ టెన్ పుస్తకాలు

1 శివుడు మధుబాబు వరుసగా 5 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
2 చాణక్య శ్రీశార్వరి వరుసగా 9 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
3 మనీపర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ న్యూ ఎంట్రీ
4 మూలింటామె నామిని వరుసగా 3 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
5 శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన డా. జయంతి చక్రవర్తి న్యూ ఎంట్రీ
6 మోహన మకరందం డా.మోహన్ కందా వరుసగా 4 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
7 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ రీ-ఎంట్రీ
8 బాల (మిత్ర) కథలు దూరి వెంకటరావు న్యూ-ఎంట్రీ
9 అంతర్యుద్ధం సూర్యదేవర రామ్మోహనరావు న్యూ-ఎంట్రీ
10 అరేబియన్ కామ శాస్త్రము శివరామ్ రీ-ఎంట్రీ

Related Posts:

కినిగె నవలా పోటీ – ఇంకా కొద్ది రోజులు మాత్రమే

కినిగె నవలా పోటీ – మీ స్పందనకు ధన్యవాదములు.

ఇంకా కొద్ది రోజులు మాత్రమే. జూన్ 6, ఆఖరి తారీఖు.

త్వరగా మీ నవలను పంపించండి ! ఆలస్యం వలదు.

కొద్దిమంది మిత్రులు ఇంకా కొద్దిరోజులు గడువు పొడిగింపు అడుగుతున్నారు. కానీ కినిగె పోటీలు, ఇప్పుడు – భవిష్యత్తులోనూ గడువు మార్చకుండా ఉంచాలనేది నియమము.

కానీ ఈఒక్కసారికి ఒక మార్గం.

మీరు జూన్ 6 లోపులో మీ నవలను ఈపబ్లిష్ చేసి మీ నవల డ్రాఫ్ట్ అది ఏ స్థాయిలో ఉన్నా పంపిచగలరు. ఆ తరువాత మీ పూర్తి నవలను జూన్ 15లోపులో పంపించినచో నవలా పోటీలోకి మీ నవల అర్హత పొందుతుంది.

జూన్ 6 లోపులో ఈపబ్లిష్ చెయ్యాలి, జూన్ 15లోగా పూర్తి నవలను పంపించాలి – గమనించగలరు.

Related Posts:

  • No Related Posts

మే 2014 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే 2014 నాలుగవ వారంలోకినిగె పై టాప్ టెన్ పుస్తకాలు

1 మోహన మకరందం డా.మోహన్ కందా వరుసగా 3 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
2 మూలింటామె నామిని రీ-ఎంట్రీ
3 నూటపదహారు అమెరికామెడీ కథలు Dr. వంగూరి చిట్టెన్‍ రాజు వరుసగా 2 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
4 శివుడు మధుబాబు వరుసగా 4 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
5 తత్వ శాస్త్రం చిన్న పరిచయం రంగనాయకమ్మ వరుసగా 4 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
6 చాణక్య శ్రీ శార్వరి వరుసగా 8 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
7 వేలుపిళ్లై సి.రామచంద్రరావు రీ-ఎంట్రీ
8 నిజాం కథలు 1 ఎమ్బీయస్ ప్రసాద్ రీ-ఎంట్రీ
9 సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం అనంతరామ్ అద్దంకి రీ-ఎంట్రీ
10 సిగ్గు పడితే సక్సెస్ రాదు! డా.వాసిలి వసంత కుమార్ న్యూ ఎంట్రీ

Related Posts:

మే 2014 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే 2014 మూడవ వారంలోకినిగె పై టాప్ టెన్ పుస్తకాలు

1 శివుడు మధుబాబు వరుసగా 3 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
2 తత్వ శాస్త్రం చిన్న పరిచయం రంగనాయకమ్మ వరుసగా 3 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
3 రామ్@శృతి.కామ్ అనంతరామ్ అద్దంకి రీ-ఎంట్రీ
4 చాణక్య శ్రీ శార్వరి వరుసగా 7 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
5 మనీ పర్స్-2 శ్రమలేని ఆదాయం వంగా రాజేంద్ర ప్రసాద్ వరుసగా 4 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
6 నిర్జన వారధి కొండపల్లి కోటేశ్వరమ్మ రీ-ఎంట్రీ
7 మోహన మకరందం డా.మోహన్ కందా వరుసగా 2 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
8 వంగూరి చిట్టెన్‍ రాజు చెప్పిన నూటపదహారు అమెరికామెడీ కథలు Dr.వంగూరి చిట్టెన్‍ రాజు రీ-ఎంట్రీ
9 మిసిమి మే 2014 మిసిమి న్యూ ఎంట్రీ
10 స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందడం ఎలా ? శ్రీనివాస్ న్యూ ఎంట్రీ

Related Posts:

స్ఫూర్తిదాయకం.. ‘యోగి’ వ్యక్తిత్వం- “సమ్మాన్యుడు” పుస్తకంపై సమీక్ష

డా.సి.వి.యోగి అనే సంక్షిప్త నామంతో ప్రాచుర్యం సంపాదించిన ప్రతిభావంతుడు డా.చేంబోలు వెంకట యోగిగారి జీవిత చరిత్ర ఈ పుస్తకం.
ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆయన సమకాలికులు, కుటుంబ సభ్యులు రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇవిగాక ఆయనవద్ద చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి.
సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ఆశీస్సులతో వెలువడిన ఈ పుస్తకంలో శ్రీ శివానందమూర్తిగారి ఆధ్యాత్మిక సూక్తులు అసంఖ్యాకంగా ఆంగ్లంలో ప్రచురించారు.
విశ్రాంత ఉపన్యాసకులు యర్రంశెట్టి సత్యారావు పుస్తకానికి రాసిన ప్రస్తావనలో ‘‘డాక్టర్ యోగి జీవనశైలి ఎందరినో కదిలించింది, కరిగించింది. విద్యాదానమే ఆయన అందరికీ అందించిన నిజమైన యోగం. ‘యోగి’ అనే పరమపవిత్ర పదానికి ప్రతీకగా నిలిచారు’’ అన్నారు (పేజి 15).
అనేక మందికి విద్యాదానం చేసిన డా.యోగిగారికి మెట్రిక్యులేషన్ తర్వాత కాలేజిలో చేరి చదువుకొనే అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటుగా చదివి హిందీలో ‘సాహిత్యరత్న’ డిగ్రీ సంపాదించారు. కాశీ వెళ్లి హోమియో వైద్యం నేర్చుకొని వచ్చి స్వస్థలం అనకాపల్లిలో హోమియో ప్రాక్టీసు మొదలెట్టారు. రాబడి తక్కువ కావటంతో ట్యూషన్స్ చెప్తుండేవారు.
స్వయంకృషితో పధ్నాలుగు భాషలు నేర్చుకొని పాండిత్యం సంపాదించుకొనగలిగారు. ఇదిగాక బిఎస్సీ, బి.కాం. తదితర డిగ్రీ పుస్తకాలు తెచ్చుకొని అధ్యయనంచేసి ఆ విద్యార్థులకూ ట్యూషన్స్ చెప్పేవారట. చూడటానికి ఇదంతా నమ్మశక్యంగా కనిపించదు. అయితే ఇవన్నీ అక్షర సత్యాలని ఈ పుస్తకంలోని వ్యాసాలు తెలియజేస్తాయి. కారుణ్య భావం, సేవాతత్పరత మొదలైన సద్గుణాలన్నీ ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయాయనే సంగతిని వెల్లడించే సంఘటనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
కాకినాడలో జిల్లా కలెక్టరుతో జరిపిన సంభాషణ (పేజి 66) డాక్టర్ యోగిగారిలో ఉన్న అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంభాషణకు సంబంధించి పేజి 119లో ఉన్న వివరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఆయనలో అపారమైన విజ్ఞానం ఉండేది. దానికితోడు అద్భుతమైన వ్యక్తిత్వం. అందుకే కాకినాడలో హిందీ లెక్చరర్‌గా పనిచేస్తున్న కాలంలో అనేకమందిని ప్రభావితం చేయగలిగారు.
వారి పెద్ద కుమారుడు సినీ గేయ రచయితగా స్థిరపడ్డ ‘సిరివెనె్నల’ సీతారామశాస్ర్తీ. ఆయన రాసిన పెద్ద వ్యాసం ఒకటి ఈ పుస్తకంలో ఉంది. ఒక తండ్రిగా డా.యోగి ఏ విధంగా ఉండేవారో ఇందులో వివరించారు.
డా.యోగి జీవితకాలం కేవలం నలభై సంవత్సరాలు. అయినా ఆ స్వల్ప వ్యవధిలోనే ఆదర్శవంతమైన జీవితం గడిపి అనేకమందికి మార్గదర్శకులు కాగలిగారు.
సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు చదివారు. ఉపన్యాసాలివ్వగల స్థాయికి ఎదిగారు. చదివిన వాటిని ఆచరణలోనూ చేసిచూపేవారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నరోజుల్లోనూ ఇతరులకు సహాయం చేయటానికి వెనుకాడేవారు కాదు.
హోమియో వైద్యంలోనూ ఆయన విశేషమైన ప్రతిభ కలిగి ఉన్నారనే సంగతి, ఈ పుస్తకంలో ఇవ్వబడిన కొన్ని కేసురిపోర్టులు చూసినప్పుడు తెలుస్తుంది. మొదట్లో ఫీజు తీసుకున్నారు గానీ, తర్వాత కాలంలో మానేశారట. కారణమేమిటని ఒకరు అడిగినప్పుడు ‘్ఫజు కోసం పేషెంట్సును బాధపెట్టటం ఇష్టం లేదు’ అని జవాబిచ్చారట.
పిల్లలను సహజంగా ఎదగనివ్వాలన్నది వారి ఆలోచన. చదువు పేరుతో పిల్లలను ఒత్తిడికి గురిచెయ్యకూడదని ఆయన తరచూ అంటుండేవారట. కానె్వంటు చదువులు రాజ్యమేలుతున్న ఈ రోజులలో ఇది ఆలోచించవలసిన విషయం.
ఏ సబ్జక్టుకు సంబంధించిన పుస్తకమైనా ఒక్కసారి చదివితే ఆయనకు గుర్తుండిపోయేది. అసాధారణమైన ఆదరణాశక్తికి కారణం ఏమై ఉంటుందని అన్నప్పుడు ‘దైవానుగ్రహం’ అన్నది వారి జవాబు.
ఎవరైనా సనాతన ధర్మానికి సంబంధించిన తప్పుడు విమర్శ చేసినప్పుడు ఆయన సహించేవారు కాదు. తార్కికంగా వాదించి తగిన సమాధానం చెపుతుండేవారట.
ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. విశ్రాంతి నెరుగని జీవితం. సమస్యలు ఎదురైనప్పుడు వెనుకంజవేయటంకన్నా ఎదుర్కొని విజయం సాధించటం మిన్న అని ఆయన జీవిత చరిత్ర తెలుపుతుంది.
నిజాయితీగా జీవించి ‘పరోపకారార్థమిదం శరీరమ్’ అన్న సూక్తిని సార్థకం చేసిన గొప్ప వ్యక్తి డా.యోగి.
పుస్తకంలో చివరి అధ్యాయానికి ‘మహాభినిష్క్రమణం’ అని శీర్షిక ఇవ్వటం సముచితంగా ఉంది.
పుస్తకం ముగింపులో ‘యోగిగారి జీవితం యొక్క ప్రభావం మాతోనే అంతమవకూడదు. ఇంకా ముందు తరాల వారికి కూడ స్ఫూర్తిని ఇవ్వాలనే కాంక్షతో ఆయన కొండంత వ్యక్తిత్వాన్ని చిన్నదర్పణంలో చూపించటానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతం అయిందో కాలమే నిర్ణయించాలి’ అన్నారు రచయిత.
వారి ఆకాంక్ష నెరవేరుతుందని ఆశించవచ్చు.

-ఎం.వెంకటేశ్వరశాస్ర్తీ, అక్షర, ఆంధ్రభూమి, 29/03/2014

***

ఈ సమీక్షను ఈనాడు పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి

http://www.andhrabhoomi.net/content/yogi

 

 

 

 

 

 

 

 

సమ్మాన్యుడు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సమ్మాన్యుడు” on kinige

Related Posts:

తెలంగాణ ధావత్ – ‘తెలంగాణ వంటలు (వెజ్)’ పుస్తకంపై సమీక్ష

భాష అంతరించిపోతోందనో, సంస్కృతి కనుమరుగు అవుతోందనో బాధపడిపోతుంటారు కానీ, వంటల సంగతి మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఓ తరం గతించిపోయిందంటే, ఆ మనుషులతో పాటూ ఎన్నోకొన్ని వంటలూ కనుమరుగైపోతాయి. అలా, చాలా రుచుల్నే కోల్పోయాం. ఓ గృహిణిగా తనకు తెలిసిన, పరిశోధకురాలిగా తాను తెలుసుకున్న తెలంగాణ వంటకాల్ని ఓ పుస్తకంగా తీసుకురావాలన్న జ్యోతి వలబోజు ఆలోచన మంచిదే. అందులోనూ తెలంగాణ ఉద్యమాల పాఠశాల మాత్రమే కాదు…రుచుల వంటశాల కూడా! మలీద, తీపి శేవలు, మక్కరొట్టెలు, సొరకాయ సర్వపిండి, గట్క, సెనగపప్పు పోలెలు, మరమరాల లడ్డు, బెల్లపన్నము వగైరా వగైరా శాకాహార వంటకాల్ని ఎలా వండుకోవాలో, కావలసిన దినుసులేమిటో కొలతలతో సహా వివరించారు.

-దమయంతి, ఈనాడు ఆదివారం అనుబంధం, 13/04/2014

***

ఈ సమీక్షను ఈనాడు పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
http://archives.eenadu.net/04-13-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka

 

 

 

 

 

 

 

తెలంగాణ వంటలు (వెజ్)” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

తెలంగాణ వంటలు (వెజ్) on kinige

Related Posts:

మే 2014 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే 2014 రెండవ వారంలోకినిగె పై టాప్ టెన్ పుస్తకాలు

1 శివుడు మధుబాబు వరుసగా 2 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
2 చాణక్య శ్రీశార్వరి వరుసగా 6 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
3 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ వరుసగా 3 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
4 ఏదీ నాది కాదు రావూరి భరద్వాజ న్యూ ఎంట్రీ
5 మనీ పర్స్-2 శ్రమలేని ఆదాయం వంగా రాజేంద్ర ప్రసాద్ వరుసగా 3 వారాల నుండి టాప్ టెన్‌లో నిలచిన పుస్తకం
6 ఇతి స్మరణీయం అతి రమణీయం నీలంరాజు లక్ష్మీప్రసాద్ రీ ఎంట్రీ
7 ఎవరితో ఎలా మాట్లాడాలి ఉషశ్రీ-డా.గాయత్రీ దేవి రీ ఎంట్రీ
8 ప్రారంభం పి.వి.సునీల్ కుమార్ న్యూ ఎంట్రీ
9 తత్వ శాస్త్రం చిన్నపరిచయం రంగనాయకమ్మ రీ ఎంట్రీ
10 మోహన మకరందం డా.మోహన్ కందా రీ ఎంట్రీ

Related Posts:

దేశీయ కతాసరిత్సాగరం – “13 భారతీయ భాషల తొలికతలు” పుస్తకంపై సమీక్ష

తొండనాడు తెలుగు రచయితల సంగం’ ప్రచురించిన పదమూడు దేశ భాషల్లోని తొలి కతల సంకలనం ఇది. తొలికత 1870లో రాయబడిన ఉర్దూ కత అయితే, 1955లో వచ్చిన కశ్మీరి కత చివరిది. ఈ మధ్య కాలక్రమానుసారం వచ్చిన బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళ, కొంకణి, తుళు భాషల తొలి కతలు ఇందులో ఉన్నాయి.

భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయ సాహిత్యపు మూలమొక్కటే. కత ఒక ప్రత్యేక ప్రక్రియగా, ఏయే భాషలో ఎప్పుడు ఆవిర్భవించిందో తెల్సుకోవడం మనల్ని మనం రీ-రీడ్ చేసుకోవడం లాంటిది. గతం పునాది మీద భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపకరించే విశిష్ట ప్రయోగం ఇది. ఒక్క కశ్మీరి కత తప్ప మిగిలిన కతలన్నీ ఆయా భాషల నుంచి నేరుగా తెలుగులోకి తీసుకురావడం ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం.

పదేళ్ల పిల్లవాడు ఆలోచనల జర్నీలో జీవితాన్ని చుట్టి రావడం, మానవత్వం మాత్రమే చివరి వరకు మిగిలేది అనే సత్యం తెల్సుకోవడం ఉర్దూ కత ‘గుజారుహా జమాన’. టాగూరు రాసిన రేవు కథలో గంగమ్మ ఒడ్డున కూచుని పాత సంగతులు నెమరేసుకునే కతకుడు నదిలో ఆడి పాడి, నదిలోనే మునిగిపోయి ముగిసిపోయిన కుసుమ్ కత చెప్తాడు. ఈ బెంగాలీ కతను పోలినదే తమిళ కత ‘గుంటకట్ట రాగిమాను’. తొంభయ్యో నూరో ఏళ్లు ఉన్న రాగిమాను రుక్మిణి కత చెప్తుంది. తన్ను పెళ్లి చేసుకోవాల్సిన నాగరాజన్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని భావించి, నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది రుక్మిణి. తొలి తెలుగు రెండు కతల్లో (ఏది అనే ప్రశ్నని వదిలేద్దాం)నూ పోలిక కనిపిస్తుంది. ‘ధన త్రయోదశి’లో విజయలక్ష్మి భర్త వేంకటరత్నంను విశ్వాస ద్రోహం చెయ్యకుండా దిద్దుతుంది. ‘దిద్దుబాటు’లో తిరుగుళ్ల గోపాలరావుకి బుద్ధి వచ్చేట్టు చేస్తుంది భార్య కమలిని. సమకాలిక సమస్యలు, కత నడిపించే తీరులో వైవిధ్యం, సంఘటనలు, సంభాషణలు, మెలో డ్రామా ట్విస్టులు తొలి కతల్లోనే కనబడతాయి. వివిధ భాషల కతలని తెలుగు కతలుగా మలచడానికి అసాధారణమైన కృషి చేశారు అనువాదకులు.

 – చింతపట్ల సుదర్శన్, ఫన్ డే, సాక్షి, 16 Feb 2014

“తొలి కతలు” సమీక్షను సాక్షి పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి

http://www.sakshi.com/news/funday/book-review-of-the-funay-book-106040

“తొలి కతలు”డిజిటల్ రూపంలోకినిగెలోలభిస్తుంది.కినిగెవెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

“తొలి కతలు” on kinige

Related Posts:

గుంటూరు గుండె చప్పుడు – “గుంటూరు కథలు” పుస్తకంపై సమీక్ష

‘గుంటూరు కథను కథలతోనే చెప్పించాలనే ప్రయత్నమే ఈ గుంటూరు కథల సంకలనం‘ అంటారు సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ. ఐదువందల యాభైపేజీల భారీ పుస్తకంలోని ప్రతి అక్షరం ఆ మాటకు మద్దతు పలుకుతుంది. జిల్లాలో సంస్కరణోద్యమం – స్వాతంత్రోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, శ్రమ-కులం-మతం, సంస్కృతి-చరిత్ర, వ్యవసాయం, గ్రామీణం, విద్య- జన్మభూమి తదితర విభాగాల కింద గుంటూరు కథల్ని విభజించారు. అనుబంధంలో గుంటూరుప్రశస్తి ఉంది. సీమలోని గుత్తికొండ ప్రాంతానికి చెందిన అక్కిరాజు ఉమాకాంతం 1913-14 సంవత్సరంలో మొదటి కథ రాశారు. ఆ రకంగా గుంటూరు కథకు వందేళ్లు పూర్తి అయ్యాయి. పేరుకి గుంటూరు కథలే అయినా తెలుగువారి జీవన సంవేదనలకూ, అనుభూతులకూ ఇవి అద్దంపడతాయి.

- కావూరి లాస్యశ్రీనిధి, ఈనాడు, ఆదివారం అనుబంధం,13 April 2014.

ఈ సమీక్షను ఈనాడు పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
http://archives.eenadu.net/04-13-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka

 

 

 

 

 

 

 

 

 

గుంటూరు కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

గుంటూరు కథలు on kinige

Related Posts:

కినిగె కొత్త ఫీచర్లు – ఇప్పుడు పుస్తకాలు ఎంచుకోవడం మరింత ఆసక్తికరం.

ఈ వారం కినిగెలో మూడు కొత్త ఫీచర్లు.

ఈ-పుస్తకాలు Vs ప్రింట్ పుస్తకాలు

గతంలోని షో ఓన్లీ ప్రింట్ బుక్స్ అనే పద్దతి బదులుగా ఇప్పుడు రెండు చెక్ బాక్సులు కినిగె హోమ్ పుటపై ఎడమవైపున వచ్చాయి. వీటి ద్వారా మీకు కావాల్సినవి ఈ-పుస్తకాలు మాత్రమే అయితే కేవలం ఈపుస్తకాలు చెక్ బాక్స్ ఎంపిక ఉంచి ప్రింట్ బుక్స్ చెక్ బాక్స్ ఎంపిక తొలగించవచ్చు. అదే మీకు కావాల్సింది కేవలం ప్రింట్ పుస్తకాలు అయితే కేవలం ప్రింట్ బుక్స్ మాత్రం ఎంపిక ఉంచి ఈపుస్తకాలు తొలగించవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే కినిగె దర్శించి తెలుగు పుస్తకాలలో మీకు కావాల్సినవి చదివెయ్యండి! లేదా మీ ఇంటికే తెప్పించుకోండి. అన్నట్టూ మీకు తెలుసా, ఇప్పుడు కినిగె నుండి భారతదేశం వెలుపలికి కూడా ప్రింట్ పుస్తకాలు తెప్పించుకోవచ్చు!

Kinige Home Page Filters

Kinige Home Page Filters

 

ధరల పట్టీ బట్టి ఎంపిక

ఇప్పుడు మీరు కేవలం మీకు కావల్సిన ధరల్లోని పుస్తకాలను మాత్రమే చూడవచ్చు. దీవి ద్వారా మీరు పుస్తకాలు మరింత సులబంగా ఎంచుకోని చదువుకోవచ్చు.

Kinige Price Band

Kinige Price band

అవరోహణ, ఆరోహణ అమరికలు.

ఇప్పటివరకు కినిగె పుస్తకాలను ఇంటర్నల్ కినిగె ర్యాంకు (పాపులర్) ద్వారా మాత్రమే మీరు వరుసగా చూసే వీలుండేది. ఇహ నుండి మీరు కినిగె పుస్తకాలను మరిన్ని వరుసల్లో, శ్రేణుల్లో పేర్చుకొని చూసుకోవచ్చు.

Kinige Books Sorting Options

Options available while sorting Kinige books

1. పాపులర్ – ఈ పద్దతిలో మీరు పాపులర్ పుస్తకాలను ముందుగా చూవచ్చు.

2. ఫ్రెష్లీ పాపులర్ – ఈ పద్దతిలో మీరు తాజా పాపులర్ పుస్తకాలు చూడవచ్చు. ఇది చాలా ఆసక్తికరమైన శ్రేణి. కినిగెకు మాత్రమే ప్రత్యేకమైనది సుమా.

3. లేటెస్ట్ – తాజా పుస్తకాలు.

4. ఓల్డ్ – ముందు పాత పుస్తకాలు

5. ధరలు కనిష్టం నుండి గరిష్టం.

6. ధరలు గరిష్టం నుండి కనిష్టం.

అయితే ఈ సార్టింగ్ అమరికలు హోమ్ పుటపై, తాజా పుస్తకాల పుటపై కాకుండా అన్నిపుస్తకాలు, పాపులర్ పుస్తకాలు, రచయిత పుటలు (ఉదా: యండమూరి, మధుబాబు, సూర్యదేవర, రంగనాయకమ్మ), ప్రచురణకర్త (ఉదా:రామకృష్ణ మఠం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్) , కొసలు (ఉదా: స్త్రీ రచయితలు, యన్నారై రచయితలు, తెలంగాణా పుస్తకాలు), వర్గాలు (ఉదా: కవిత్వం, చిన్న కథలు, నవలలు, నాన్ ఫిక్షన్) లపై లభిస్తాయి.

ఆనంద తెలుగు పుస్తక పఠనం.

సదా మీ సేవలో,

కినిగె.

 

 

Related Posts:

  • No Related Posts