అతివ అంతరంగ మథనం – “అన్వేషణ” నవలపై సమీక్ష

మనిషి జీవిస్తున్నాడా? లేక జీవిస్తున్నానని భ్రమలో ఉన్నాడా? అనే ఒక సందిగ్ధం ఈరోజుది కాదు. పురాణాల నుండి వస్తున్నదే! ఐతే- ఆ మాట నిర్భయంగా నేడు అంటున్నారు. అనుకుంటూనే ఆలోచిస్తున్నారు. గంటి భానుమతి రచించిన ‘‘అన్వేషణ’’ నవలలో నిజంగా మానవ జీవితంలోని అనేక కోణాలను అన్వేషించారు. అందరికీ తెలిసిన సమాధానాలపై ఎదురు తిరిగారు. తెలియని ప్రశ్నలను సంధించారు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా అత్తింట్లో ఆవేదనలు, భర్త మూలంగా అవమానాలు, అనుమానాలు ఎదుర్కొంటున్న నేటి సమాజపు దుస్థితిని అభివర్ణించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. అసలు స్త్రీ సంఘానికి భయపడాలా? లేక తన మనస్సాక్షికి భయపడాలా? అంటే నా ధోరణిలో మనస్సాక్షికే ఎక్కువ మార్కులు వేస్తాను. సంఘం అనేది గాలివాటుకు ఎగిరిపడుతున్న ఎండుటాకు లాంటిది. అదిగో అని చూపితే కనిపించకున్నా, అవును నాకూ కనిపించింది అంటూ ఎదుటిమనిషిని మరింత నిర్వీర్యం చేస్తుంది. కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది మనమేంటి? మనం జీవిస్తున్న విధానం ఏమిటి? అని. ఒక స్ర్తి అయినా, పురుషుడైనా మనస్సాక్షి ముందు తలెత్తుకుంటే చాలు గెలిచినట్లే..
అసలు  స్త్రీ అంటేనే ఒక కుటుంబం. స్త్రీ లేనిదే కుటుంబాలు ఎంతగా వెలవెలపోతుంటాయో మనం గమనిస్తూనే ఉంటాం. ఈ నవలలో విజయ అనే పాత్ర ఎన్నో సందిగ్ధాల మధ్య సతమతమవుతూ తన జీవితం అలా ఎందుకు ఒంటరి అయిపోయిందనే విషయంపై అన్వేషణ కొనసాగిస్తుంది. అలాంటి సమయంలో తనను ప్రేమించిన వ్యక్తి కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియకుంటే పెళ్ళిచేసుకోవడం కష్టమని అనడం విజయను మరింత బాధిస్తుంది. పెళ్ళికి యువతి కావాలా? యువతికి యువకుడు ఉంటే చాలదా? అంటే చాలదు. ప్రేమకు ఇద్దరు చాలు పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి అనే మాట విన్నాం. అయితే కుటుంబం ఎందుకు? అంటే మాత్రం రాబోయే తరాలకు ఒక చరిత్ర కావాలి. నాన్న అమ్మ ఎలాగో, అమ్మమ్మ, తాత, పెదనాన్న, చిన్నాన్న పిన్ని అత్త లాంటి వరసలన్నీ ఎంతో కావాలి. వారందరూ మనకంటూ ఏమీ చేయకపోవచ్చు. కానీ ఉన్నారనే ఆశ ముందుకు నడిపిస్తుంది. తల్లిదండ్రులు పునాదులైతే నా అన్నవాళ్ళు మూలస్తంభాలు. ఆ విషయమే ఈ నవలలో కనిపిస్తుంది.
గంటి భానుమతి ఎంతో సున్నిత హృదయులు. వీరిలోని నొప్పించేతత్వం లేని తనమే ఈ నవలకు పునాది అయింది. కారణం ఈ నవలలో మరీ బాధించే పాత్రలు చూపలేదు. కాలానుగుణంగా మనిషి తత్వం మారుతుందే తప్ప ఎవరూ చెడ్డవారు కారనే తత్వాన్ని తెలియజేసిన తీరు కడు రమణీయం. కాకుంటే మనుషుల్లో ఏదో ఒకటి కావాలని బాధ, ఉంటే ఎవరికి చెందుతుందో అనే బాధ, ఆస్తుల పంపకాలు, అక్కచెల్లెళ్ళ పోరాటాలు, రక్తసంబంధీకుల సమస్యలు చదువుతుంటే ఒకటుంటేఒకటిలేదనే తత్వంతో మనుషులు ఎదగలేకపోతున్నారా అనిపించక మానదు. అదే విషయం విజయ జీవితంలో కనిపిస్తుంది. తండ్రి వచ్చినా, అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నా ఆస్తుల పంపకాలలో అనేక చేదుకోణాలను చూస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్న విజయ తల్లిని అన్వేషించడం మాత్రం ఆపలేదు. చివరకు తన తల్లి అత్యాచారానికి గురై చేయూతనిచ్చేవారు ఉన్నా అందుకోలేక, సమాజానికి ముఖం చూపించలేక మరింతగా కుంగిపోయి తన జీవితాన్ని పోగొట్టుకుందనే నిజాన్ని తెలుసుకుని కుమిలిపోతుంది. మరో వివాహం చేసుకుని వారి ద్వారా కూడా బిడ్డలున్నా వారి నుండి ఆదరణ లభించకపోవడంతో మొదటి భార్య కన్నబిడ్డ విజయ తండ్రిని తానే కొడుకై ఆదరిస్తుంది. తల్లిదండ్రులు ఎలాంటివారైనా అనుబంధం ముందు ఓడిపోక తప్పదని నిరూపిస్తుంది.
మనిషి జీవితంలోని మార్పుచేర్పులకు సమాజమే కారణం అయితే, వ్యక్తిగా తనను తాను గమనించుకునే స్థితికి మనిషి ఎపుడు చేరుకుంటాడు? అదే స్త్రీ అయితే తన పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలను సంధించి సరికొత్త సమాధానాన్ని అందించిన తీరులో సాగిన వైనం మనల్ని ఆద్యంతం అలరిస్తుంది. వ్యక్తిత్వం అనేది ఒక స్ర్తికి సంబంధించింది అనడం కంటే వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి సంబంధించింది అని ముగించి ఉంటే మరింత బావుండేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రశ్నగా స్త్రీ నిలబడినంతకాలం సమాజం తనకిష్టమైన సమాధానాలు చెబుతూనే ఉంటుంది. తానే ఒక సమాధానమైన రోజు ప్రశ్నలన్నీ ఏమవుతాయి? ఆలోచించాలి…!

-ఎస్.ఎం. అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

***

అన్వేషణ”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

అన్వేషణ on kinige

Related Posts:

జూలై 2014 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

జూలై 2014 నాలుగవ వారంలోkinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 ప్యాసా తనికెళ్ళ భరణి వరుసగా 2 వారాలుగా
2 మా ఇంటి రామాయణం పొత్తూరి విజయలక్ష్మి రీ ఎంట్రీ
3 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ వరుసగా 2 వారాలుగా
4 వజ్రాల దీవి అడపా చిరంజీవి వరుసగా 5 వారాలుగా
5 చాణక్య శ్రీ శార్వరి వరుసగా 17 వారాలుగా
6 పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి అద్దంకి అనంతరామ్ వరుసగా 4 వారాలుగా
7 అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్ రీ ఎంట్రీ
8 మనీ పర్స్-2 శ్రమలేని ఆదాయం వంగా రాజేంద్రప్రసాద్ వరుసగా 2 వారాలుగా
9 వోడ్కా విత్ వర్మ సిరాశ్రీ రీ ఎంట్రీ
10 వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ రీ ఎంట్రీ

Related Posts:

కంచికి వెళ్లని కథలు! – “కథ-2013″ పుస్తకంపై సమీక్ష

ఇటీవలి కాలంలో రెండు గొప్ప ప్రయత్నాల్ని గమనిస్తాం – కవితా వార్షిక, కథా వార్షిక ప్రచురణలు. 2013లో వెలువడిన అనేక కథల్ని చదివి, అనేక కోణాలలో పరిశీలించి – వాటిలో సంపాదకులు ఎంపిక చేసిన పద్నాలుగు రచనల్ని ‘కథ-2013‘గా ప్రచురించారు. కార్పొరేట్ వ్యవస్థ, ప్రచార మాధ్యమాల మోజు, కనుమరుగవుతున్న పల్లెల స్వచ్ఛత, మనసు పొరల విచిత్రాలు, ఉద్యోగ జీవితాల్లోని స్థితిగతులు తదితర సమకాలీన వస్తువులతో మనసును స్పందింపచేసే కథలివి. పతంజలిశాస్త్రి ‘రామేశ్వరం కాకులు’ పాఠకుడ్ని అస్థిమితపరుస్తుంది. కిడ్నీలు అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలంటూ మనసును ఆర్ద్రం చేస్తారు పెద్దింటి అశోక్‌కుమార్ ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’ కథలో. సునీల్‌కుమార్ ‘దెయ్యం’ ఉత్కంఠ భరితంగా సాగుతూనే మానవ సంబంధాల పతనాన్ని వెల్లడిస్తుంది. ‘కథ 2013‘లో ప్రసిద్ధులతోపాటూ ఈతరం కథకులూ ఉన్నారు.

–డా. ద్వా.నా.శాస్త్రి, 13 జూలై 2014, ఆదివారం అనుబంధం

 

 

 

 

 

 

 

 

కథ-2013” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

కథ-2013 on kinige

Related Posts:

జీవితమే ఇతివృత్తం! – “సన్మానం” పుస్తకంపై సమీక్ష

పొత్తూరి విజయలక్ష్మి కథలకు అనుబంధాలే పునాదులు. ఆమె రచనల్లో హాస్యం అంతర్లీనం, వ్యంగ్యం నిబిడీకృతం. ‘సన్మానం‘ కథ పూర్తయ్యేలోపు పాఠకుడి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. చిన్నప్పుడు పాఠాలు నేర్పిన గురువులంతా కళ్లముందు మెదులుతారు. మానవ సంబంధాల్లోని అతి సున్నిత కోణాన్ని అంతకంటే సున్నితంగా ఆవిష్కరించారు రచయిత్రి. చుట్టాలతో స్నేహితులతో కళకళలాడాల్సిన పెళ్లిమండపాలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్లతో నిండిపోతున్నాయి. ఆ మేరకు, పలకరింపులూ కృతకంగా మారిపోతున్నాయి. ఆ ధోరణి బారిన పడవద్దంటూ ‘మర్యాదలు వచ్చేస్తున్నాయి జాగర్త’ కథలో హెచ్చరించారు. ‘భారత రసాయన శాస్త్రం’, ‘చీరెల సుబ్బారావు’, ‘చిరుదివ్వె’… ఒకటేమిటి, పుస్తకంలోని ప్రతి కథా జీవితంలోని ఏదో ఓ సమస్యకు పరిష్కారాన్ని చెప్పేదే, మనుషుల్లోని కృత్రిమత్వాన్ని ఎత్తిచూపేదే.

– భరత్, 29 జూన్ 2014, ఆదివారం అనుబంధం

 

 

 

 

 

 

 

 

సన్మానం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

సన్మానం on kinige

Related Posts:

జూలై 2014 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

జూలై 2014 మూడవ వారంలోkinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 వజ్రాల దీవి అడపా చిరంజీవి వరుసగా 4 వారాలుగా
2 పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి అద్దంకి అనంతరామ్ వరుసగా 4 వారాలుగా
3 ప్యాసా తనికెళ్ళ భరణి న్యూ ఎంట్రీ
4 ఆనంద జ్యోతి మధుబాబు వరుసగా 12 వారాలుగా
5 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ రీ ఎంట్రీ
6 మనీపర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ రీ ఎంట్రీ
7 చాణక్య శ్రీశార్వరి వరుసగా 16 వారాలుగా
8 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ వరుసగా 2 వారాలుగా
9 అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి రీ ఎంట్రీ
10 ఎవరితో ఎలా మాట్లాడాలి ఉషశ్రీ , డా.గాయత్రీదేవి వరుసగా 2 వారాలుగా

Related Posts:

‘తెలీని రహస్యాలు’ తెలిస్తే అంతా మేలే – మనకే తెలీని మన రహస్యాలు పుస్తకంపై సమీక్ష

అన్ని ప్రశ్నల్లోకి అతి పెద్ద ప్రశ్న ‘నేనెవరు?’ అనేది. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే, ఇంక అడగవలసిన ప్రశ్నలు గాని, తెలుసుకోవలసిన సమాధానాలు గాని వుండవు. ఉపదేశంకోసం తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో రమణమహర్షి చెప్పేవారట, ‘ఈ ప్రశ్ననే ఎవరికివారు వేసుకొని సమాధానం వెతుక్కోండి’ అని. ఒక ఉపనిషత్తులో శిష్యుడు అడుగుతాడు. ‘ఏ ఒక్కటి తెలుసుకొంటే బయట కనిపించే ఈ చరాచర ప్రపంచం అంతా తెలుస్తుంది?’ అని. బహుముఖాలుగా, చిత్ర విచిత్రాలుగా భాసిస్తున్న ఈ రంగుల ప్రపంచం తెలుసుకోవటం ఏ ఒక్కరికైనా ఎలా సాధ్యం అంటే తననుతాను తెలుసుకొన్నప్పుడు, ఆత్మజ్ఞానం అలవడినప్పుడు సాధ్యమవుతుంది అనవచ్చు.
మన వేదాంతం అంతా ఇందుకొరకే, అంటే, తానెవరో తాను తెలుసుకొనేందుకే ఉద్దేశించబడింది. ఆ వేదాలు, వేదాంతాలైన ఉపనిషత్తులు వేల ఏండ్ల నాటివి కావటంవల్ల, అప్పటి సాంఘిక పరిస్థితులు ఈనాటి స్థితిగతులకంటే వేరుకావటంవల్ల, జన సామాన్యానికి అవి అందుబాటులోకి రాక, అవి అన్నీ గూఢార్థాలుగా, వేదాంత రహస్యాలుగా వుండిపోయినవి. భావం చెడకుండా వాటిని మళ్ళీ మన భాషలోకి మన పరిస్థితుల కనుగుణంగా మలుచుకోవలసిన అవసరం నేటి కాలానికి ఎంతైనా వుంది.
అలాంటి ప్రయత్నంలో భాగంగానే డాక్టర్ వాసిలి వసంతకుమార్ రాసిన అనేకానేక గ్రంథాలు. వాటిల్లో ‘‘మనసు గెలవాలి’’ గ్రంథంలో మనసు మర్మం విప్పిచెప్పినా, ‘‘77 సాధనా రహస్యాలు’’, ‘‘56 ఆత్మదర్శనాలు’’ గ్రంథాలలో సంఖ్యాపరంగా తాత్వికతను గురించి విశదీకరించినా వారికివారే సాటి అనిపించుకున్నారు.
ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’లో రచయిత ఆ రహస్యాలేమిటో చెప్పి, మనలోమనకే తెలీని ఇన్ని రహస్యాలున్నాయా? అని ఆశ్చర్యపడేట్టు చేశారు. ఒక విధంగా మనం వాస్తవికంగా ఏమిటో తెలిసేట్టు చే శారు. ఏ రహస్యమైనా అది తెలియనంతవరకే రహస్యం. తెలిసిన తరువాత బట్టబయలు. ఆ రహస్యాలు ఏమిటో తెలుసుకోని మనిషి కష్టాల పాలవుతున్నాడు అనీ, తెలుసుకొని, వాటిని అధిగమించి సుఖ జీవితం గడపాలనీ రచయిత కాంక్షిస్తున్నారు.
నిత్యజీవితంలో ఎదురుపడే సంఘటనలను ఆధారంచేసుకొని వెలువరించిన సార్వకాలిక సత్యాలు రచయిత నిశిత పరిశీలనా దృష్టికి మచ్చుతునకలుగా నిలుస్తవి. ఉదాహరణకు:
1. జీవితాన్ని దొర్లించేస్తుంటే ఉప్పగానే వుంటుంది. జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది. – పేజీ 19.
2. పడుకోబోయేముందు లెక్కల పద్దులు రాయగలమేకానీ ఏం సాధించామన్నది డైరీకి ఎక్కించాలంటే కలంలో సిరా ఉన్నా
జీవితంలో సారం కనిపించదు. – పేజీ 38.
3. ఇంతకాలం మనం ఇతరులతో పోటీపడుతూ వచ్చాం… ఇప్పటినుండయినా మనతో మనం పోటీ పడగలమా అన్నది ప్రశ్న.
– పేజి 39.
4. ఇతరుల మెప్పుకోసం మన బ్రతుకును దుర్భరం చేసుకోకూడదు. – పేజి 94
5. మనకు మనమే కేంద్రం కావాలన్న ప్రయత్నమే ధ్యానం. – పేజి 132
6. గడప దాటితేనే గదా ప్రపంచం కనిపించేది అన్నట్టుగా మనం కూడా ఎన్నోవిధాల మన గడప దాటాల్సిందే! మన ప్రమేయం లేకుండా మనపై బడ్డ ముసుగులను తొలగించుకుంటూ పోవలసిందే! అప్పుడే మనం సరికొత్తగా కాంతులీనుతాం. – పేజి 138
డాక్టర్ వాసిలి వసంతకుమార్ రచనలన్నీ ఆధునిక ఉపనిషత్తులు అయితే, వాటిల్లో ప్రస్తుత గ్రంథం ‘మనకే తెలీని మన రహస్యాలు’ ఒకటి

-దీవి సుబ్బారావు, అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

మనకే తెలీని మన రహస్యాలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

మనకే తెలీని మన రహస్యాలు on kinige

Related Posts:

జూలై 2014 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

జూలై 2014 రెండవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి అద్దంకి అనంతరామ్ వరుసగా 3 వారాలుగా
2 వజ్రాల దీవి అడపా చిరంజీవి వరుసగా 3 వారాలుగా
3 శ్రీ రామకృష్ణ ప్రభ జులై 2014 శ్రీ రామకృష్ణ ప్రభ మ్యాగజైన్ రీ ఎంట్రీ
4 వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ రీ ఎంట్రీ
5 చాణక్య శ్రీశార్వరి వరుసగా 15 వారాలుగా
6 ఆనంద జ్యోతి మధుబాబు వరుసగా 11 వారాలుగా
7 అరేబియన్ కామ శాస్త్రము శివరామ్ రీ ఎంట్రీ
8 ఎవరితో ఎలా మాట్లాడాలి ఉషశ్రీ , డా.గాయత్రీదేవి రీ ఎంట్రీ
9 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ రీ ఎంట్రీ
10 నా ఆత్మకథ మరియు రోజుకో సూక్తి స్వామి వివేకానంద రీ ఎంట్రీ

Related Posts:

“విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” పుస్తకంపై సమీక్ష

తెలుగు చలన చిత్ర చరిత్రలో డెబ్బయ్యవ దశకంలో అనేక విధాలుగా సంచలనాలు సృష్టించిన చిత్రం ‘అల్లూరిసీతారామరాజు’ సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయమిది. ఎనిమిదేళ్ళ ఆలోచన, తొమ్మిది నెలల కష్టానికి ప్రతిఫలంగా ఈ చిత్రానికి గొప్ప విజయం లభించింది.

1955లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలని ఎన్టీఆర్ విఫలయత్నం చేశారు. తర్వాత శోభనబాబుతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత డి.ఎల్.నారాయణ కథ సిద్ధం చేసుకుని కూడా ఆగిపోయారు. తర్వాత జ్యోతి పిక్చర్స్, వాణీ ఆర్ట్ కంబైన్స్ వారూ కూడా యత్నించి కమర్షియల్ హిట్ కాదనే భయంతో వదిలేశారు. కానీ కృష్ణ మాత్రం వీరందరికీ భిన్నంగా ఆలోచించారు. తెలుగువారి పౌరుషాగ్నిని చాటి చెప్పేందుకు కంకణబద్దులై ఒక టీమ్ ఏర్పాటు చేసి సీతారామరాజు చరిత్ర వెలికితీశారు. ఆయన తిరిగిన ప్రదేశాలను గుర్తించారు. అష్టకష్టాలూ పడి ఆ మహనీయుని చరిత్రను చిత్తశుద్ధితో సెల్యులాయిడ్ పై ఎక్కించి కష్టానికి తగ్గ విజయం సాధించారు. తొలుత ఎన్టీఆర్ సైతం ఒక సారి కృష్ణను పిలిచి డబ్బు పాడుచేసుకోవద్దని సలహా ఇచ్చినా ఆయన వినలేదు. దాంతో ఎన్టీఆర్ ఆగ్రహించారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ప్రత్యేకంగా ఆ సినిమాను ఎన్టీఆర్ వీక్షించారు. ’ఇంతకంటే గొప్పగా మరెవ్వరూ తియ్యలేరు’ అని కృష్ణను ప్రశంసించారు. ఇలాంటి ఎన్నో తెరవెనుక సంగతులతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ జర్నలిస్టు యు.వినాయకరావు పాఠకజనరంజకంగా వ్రాశారు. సినీరంగానికి చెందిన ఎన్నో గొప్ప పుస్తకాలను ఆయన వెలువరించారు. సినీ ప్రేమికులను మెప్పించి అబ్బురపరచే అసాధారణ సమాచారాన్ని ఇందులో క్రోడీకరించారు. సీతారామరాజు జీవిత చరిత్ర, దానికి సంబంధించిన అపురూప చిత్రాలు, ఆయన తిరుగాడిన ప్రదేశాలు వంటి సమాచారాన్ని ఆసక్తికరంగా వివరించారు. ఈ చిత్ర నటీనటుల అనుభవాలు, భావోద్వేగాలను కళ్ళకు కట్టిపడేసే అలనాటి ఫోటోలను ఇందులో జతచేశారు.

 

 

 

 

 

 

 

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు on kinige

 

Related Posts:

వెంటాడే విషాద స్వరం – “మూలింటామె” పుస్తకంపై సమీక్ష

పల్లెబతుకుల్ని ఓ తోలుబొమ్మలాట మాదిరిగా పాఠకుల కళ్లకు కడతారు నామిని. మనుషుల ప్రవర్తనలు, భిన్న ప్రవృత్తులు, అవసరాలు, ఆలోచనలు, రాగద్వేషాలు… అక్షరబద్ధం చేసి పికాసో ‘గోర్నికా’ చిత్రాన్ని గుర్తు చేస్తారు. ‘పచ్చనాకు సాక్షిగా’, ‘మునికన్నడి సేద్యం’ చదివినవారికి నామినిని కానీ నామిని శైలిని కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పన్లేదు. ‘మూలింటామె‘ నవల కూడా అంతే వైవిధ్యమైన రచన. ఒకానొక గ్రామంలో … ఒకానొక సంఘటన నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితుల క్రమాన్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు నామిని. మార్కెట్ సూత్రాల్ని ఒక గ్రామం ఒంటబట్టించుకున్న తీరుకు వసంత (పందొసంత), కడదేరుతున్న పాతతరం విలువలకు కుంచమమ్మ (మూలింటామె) ప్రతినిధులుగా పాఠకుల కళ్లముందు కదలాడతారు. పుస్తకాన్ని మూసేసిన తర్వాత కూడా, ఓ విషాద స్వరమై ‘మూలింటామె‘ మన ఆలోచనల్లో తారట్లాడుతూనే ఉంటుంది. ‘నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేగానీ, మియాం మియాం అంటూ నీ కాళ్ల కాడా నా కాళ్ల కాడా చుట్టకలాడే పిల్లిని చంపలేదే’ అన్న మూలింటామె మాటతో నవల ముగుస్తుంది. ఆ ముగింపు పాఠకుడి మదిలో అనేక ఆలోచనలకు ఆలంబన అవుతుంది.

–వెంకట్, ఈనాడు ఆదివారం అనుబంధం, 22 జూన్ 2014

 

 

 

 

 

 

 

 

మూలింటామె” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

మూలింటామె on kinige

 

 

Related Posts:

జూలై 2014 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు

జూలై 2014 మొదటి వారంలోkinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 వజ్రాల దీవి అడపా చిరంజీవి వరుసగా 2 వారాలుగా
2 ఆనంద జ్యోతి మధుబాబు వరుసగా 10 వారాలుగా
3 ఆధ్యాత్మిక కథలు స్వామి జ్ఞానదానంద న్యూ ఎంట్రీ
4 పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి అద్దంకి అనంతరామ్ వరుసగా 2 వారాలుగా
5 మనీపర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ వరుసగా 4 వారాలుగా
6 అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి రీ ఎంట్రీ
7 ఆంధ్రనగరి సాయి పాపినేని వరుసగా 2 వారాలుగా
8 మోహన మకరందం డా.మోహన్ కందా రీ ఎంట్రీ
9 మూలింటామె నామిని రీ ఎంట్రీ
10 చాణక్య శ్రీశార్వరి వరుసగా 14 వారాలుగా

Related Posts: