అపురూప నివాళి – ‘కొసరు కొమ్మచ్చి’ పుస్తకం పై సమీక్ష

ఆత్మకథా రచనలో కొత్తపుంతలు తొక్కిన అద్వితీయ రచన ‘కోతి కొమ్మచ్చి‘. మూడో భాగం పుస్తకంగా రాకముందే రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కన్నుమూశారు. మరి దానిలో ప్రస్తావించని ఎనిమిది సంపుటాల సాహితీ సర్వస్వం, భాగవతం టీవీ సీరియల్, ఇతర చలనచిత్రాల సంగతి? ఆ ముచ్చట్లతోనే ‘కొసరు కొమ్మచ్చి‘ పాఠకుల ముందుకొచ్చింది. ముళ్ళపూడి వ్యక్తిత్వం, అభిరుచులు, కుటుంబ విషయాలకు రమణ అర్ధాంగి శ్రీదేవి, పిల్లలూ అక్షరరూపమిచ్చారు. బాపూరమణల సినిమాలూ, టీవీ సీరియళ్ళ కబుర్లను తన జ్ఞాపకాలతో రంగరించి, మెరుపు సంభాషణలను ఉటంకిస్తూ బీవీయస్ రామారావు రాసిన విశేషాలు బాగున్నాయి. ముళ్ళపూడి కథల్లో, వ్యాసాల్లో ఉన్న వైవిధ్యం గురించి ‘సాహితీ సర్వస్వం’ సంపాదకుడు ఎమ్బీయస్ ప్రసాద్ విశ్లేషించిన తీరు అపూర్వం. ముందుమాటలో తమ సినిమాల గురించి బాపు క్లుప్తంగా, ఆసక్తికరంగా రాసుకొచ్చారు. పుస్తకమంతటా కనపడే అంతస్సూత్రం- బాపు రమణల స్నేహబంధం. అసంపూర్ణంగా మిగిలిపోయిన చిత్తరువును శ్రద్ధతో, ప్రేమతో పూర్తిచేసినట్టు… ముళ్ళపూడికి నివాళిగా రూపొందించిన పుస్తకమిది!

- సీహెచ్.వేణు, ఆదివారం అనుబంధం, 7th  Sep 2014

 

 

 

 

 

 

 

 

కొసరు కొమ్మచ్చి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కొసరు కొమ్మచ్చి on kinige

Related Posts:

సెప్టెంబరు రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు రెండవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 5 వారాలుగా
2 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ వరుసగా 2 వారాలుగా
3 నిశ్శబ్దనాదం మధుబాబు వరుసగా 2 వారాలుగా
4 కొసరు కొమ్మచ్చి మల్టిపుల్ ఆదర్స్ వరుసగా 5 వారాలుగా
5 బాపు బొమ్మల కొలువు బాపు వరుసగా 2 వారాలుగా
6 విపశ్యనా ధ్యాన మార్గదర్శిని జోసఫ్ గోల్ట్‌స్టీన్ న్యూ ఎంట్రీ
7 చాణక్య శ్రీ శార్వరి రీ ఎంట్రీ
8 జంధ్యామారుతం పులగం చిన్నారాయణ వరుసగా 2 వారాలుగా
9 అభినేత్రి సావిత్రి పరుచూరి పద్మ రీ ఎంట్రీ
10 నికృష్టుడి ఆత్మకథ ఆదెళ్ళ శివ కుమార్ రీ ఎంట్రీ

Related Posts:

మూడు దశాబ్దాల కవిత్వ విశ్లేషణ – ‘శివారెడ్డి పీఠికలు’పుస్తకం పై సమీక్ష

ప్రాచీన కాలం నుంచి వేర్వేరు పేర్లతో ‘పీఠికలు’ సాహిత్య ప్రక్రియగా వెలువడుతూ ఉన్నాయి. వాటిలో విశ్లేషణాత్మకమైన, ఆలోచనాత్మకమైన పీఠికలకు కొదవలేదు. ఈ కోవలోకి చెందినవే ‘శివారెడ్డి పీఠికలు‘. కె.శివారెడ్డి గొప్ప కవి. కవిత్వం రాయటం, కవిత్వం గురించి మాట్లాడటమే ఆయన ప్రవృత్తి. తను రాయటమే కాదు, తర్వాతి తరాన్నీ కవులుగా రూపొందించటమూ తన బాధ్యతగానే భావిస్తారు. ప్రసిద్ధుల సాహిత్యం నుంచి వర్ధమాన కవుల రచనల దాకా మొత్తం 86 పీఠికల పుస్తకమిది. విశ్లేషణతోపాటూ విశేష సమాచారమూ ఉంది, ప్రగతిశీల భావాలకే మొగ్గు ఉంది. నవతరం కవులకి ఇదో కవిత్వ వాచకం!

-ద్వా.నా.శాస్త్రి, ఆదివారం అనుబంధం, 31st Aug 2014

 

 

 

 

 

 

 

 

శివారెడ్డి పీఠికలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

శివారెడ్డి పీఠికలు on kinige

Related Posts:

సెప్టెంబరు మొదటివారంలో టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు మొదటివారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 బాపు బొమ్మల కొలువు బాపు రీ ఎంట్రీ
2 కొసరు కొమ్మచ్చి మల్టిపుల్ ఆదర్స్ వరుసగా 4 వారాలుగా
3 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 4 వారాలుగా
4 నిశ్శబ్దనాదం మధుబాబు న్యూ ఎంట్రీ
5 జంధ్యామారుతం పులగం చిన్నారాయణ న్యూ ఎంట్రీ
6 యజ్ఞ వైభవమ్ దర్శనమ్ రీ ఎంట్రీ
7 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ రీ ఎంట్రీ
8 రమణీయ భాగవత కథలు ముళ్ళపూడి వెంకట రమణ రీ ఎంట్రీ
9 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ రీ ఎంట్రీ
10 నవ్విపోదురుగాక… కాట్రగడ్డ మురారి వరుసగా 3 వారాలుగా

Related Posts:

కవికుమారుడి గోస – ‘నీలాగే ఒకడుండేవాడు!’ పుస్తకంపై సమీక్ష

చిక్కని కవిత్వాన్ని ఆస్వాదించాలంటే… ‘కళ్ళకి తెలీని కంటిభాషతో, కాళ్ళకి తెలీని స్పర్శ భాషతో నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం’ చేతనవ్వాలి. నందకిషోర్ ఇవన్నీ మనకు నేర్పిస్తాడీ పుస్తకంలో. ‘అయ్యాం నాట్ ఫేక్’ అని ఒక సమయంలో ఎంత గట్టిగా అరుస్తాడో… వూరికెళ్ళినప్పుడు ప్రియురాళ్ళ చేతుల్లో పిల్లల నవ్వుల్ని చూసి అంతే నర్మగర్భంగా నవ్వుకోనూగలడు. అంతేకాదు, ‘చరిత్ర చూడని వర్తమానంలోకి తననూ, దేశాన్నీ’ తీసుకెళ్ళగలడు. ‘ఒక సంధ్యావస్థ కాలంలోంచి’ అనే ఖండికలో ‘దేవీ’ అంటూ… ‘అనుకోకుండా’ అనే ఖండికలో ‘వెన్నెల స్నేహితా, దుఃఖిత సహచరీ, పువ్వుల సంద్రమా’ అంటూ సంబోధిస్తూ కవిత్వాన్ని కవాతు చేయించిన తర్వాత కూడా ‘నువ్వూ నేనూ అస్తమించేదాకా రాళ్లెట్లా వికసించేదీ, పువ్వులేట్లా బద్దలయ్యేదీ’ రహస్యంగానే ఉంచుతాడు. ఈ పుస్తకంలో నందకిశోర్ ‘కవిత్వాన్ని రాయలేదు ఓ ఆత్మగా ఆవిష్కరించాడు’ అనడం అతిశయోక్తి కాదు!

–వర్చస్వి, ఆదివారం అనుబంధం, 31st Aug 2014

 

 

 

 

 

 

 

 

 

నీలాగే ఒకడుండేవాడు!”పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

నీలాగే ఒకడుండేవాడు! on kinige

 

Related Posts:

  • No Related Posts