మే 2015 ఐదవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే 2015 ఐదవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

Capture29thMay2015

1 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ వరుసగా 2 వారాలుగా
2 ధ్యానము ఆధ్యాత్మిక జీవనము స్వామి యతీశ్వరానంద రీ-ఎంట్రీ
3 ఎవరితో ఎలా మాట్లాడాలి ఉషశ్రీ మరియు గాయత్రీదేవి వరుసగా 3 వారాలుగా
4 నవ్విపోదురుగాక… కాట్రగడ్డ మురారి రీ-ఎంట్రీ
5 చికాగోలో నానమ్మ బి. యస్. రాములు న్యూ-ఎంట్రీ
6 ఎందుకని? ఇందుకని! డా. ఎ.రామచంద్రయ్య న్యూ-ఎంట్రీ
7 రుద్రుడు మధుబాబు వరుసగా 2 వారాలుగా
8 చాణక్య శ్రీ శార్వరి రీ-ఎంట్రీ
9 ఒక వర్షాకాలపు సాయంత్రం యండమూరి వీరేంద్రనాధ్ రీ-ఎంట్రీ
10 జూలియస్ సీజర్ – ప్రజాశక్తి బుక్‌హౌస్ విలియం షేక్‌స్పియర్ న్యూ-ఎంట్రీ

Related Posts:

అక్షరమే ‘ప్రపంచం’గా మారిన వేళ…’మన ప్రపంచం’ పుస్తకంపై సమీక్ష

అంశం ఏదైనా అది అక్షరాల వెలుగులో వ్యాస రూపం ధరిస్తే దాని ప్రభావ తీవ్ర తాకిడే వేరు. మనసుల్ని భావోద్వేగంతో కుదిపేస్తుంది. మనుషుల్ని అమితంగా ఆలోచింపజేసి కలచివేస్తుంది. ఈ వేదనకు మూలం వర్తమాన ప్రపంచాన్ని అనుభవంతో కాచి వడబోయడం. సామాజిక వ్యవస్థలోని సంఘర్షణల్ని ఉక్కపోత రూపంలో ఆరబెట్టడం. అలా చెలరేగిన కఠోర వాస్తవ దృశ్యరూపాల మంటలే జీవన సత్యాలుగా ఊపిరిపోసుకుంటాయి. ఇలాంటి సందర్భకోణాల్లోంచి చిత్రికపట్టిన శీర్షికా వ్యాసాల కలబోత నేపథ్యమే ఈ పుస్తక పరిచయ ముఖ చిత్రమైంది. దీని రచయిత దుప్పల రవికుమార్. వ్యాస రచనలో చెయ్యి తిరిగి అనుభవశాలి. ‘సత్యం’ సాయంకాల దినపత్రికలో రెండేళ్ళపాటు ‘వీక్లీకాలమ్’గా ధారావాహికంగా ప్రచురింపబడిన వ్యాస సంకలనమే ఈ ‘‘మన ప్రపంచం’’అనే వ్యాఖ్యాన పుస్తకం. కళింగాంధ్ర గుండె చప్పుడుగా అభివర్ణించే ఈ అక్షర లక్షల సముదాయాన్ని సిక్కోలు బుక్‌ట్రస్ట్ తొలి ప్రచురణగా జనం మధ్యకు దీనిని తీసుకొచ్చి పరిచయం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా రవికుమార్‌గారు చేసిన అక్షర కృషి అంతాఇంతా కాదు. నైతిక విలువలు సమూలంగా అంతరించిపోతున్న సామాజిక వ్యవస్థలో ఒక లక్ష్యానికి కట్టుబడి నిలబడటం అంత తేలిక్కాదు. వృత్తి- ప్రవృత్తిరీత్యా నిబద్ధతను పాటిస్తూ తట్టుకొని ఏటికి ఎదురీదడం సాధారణ విషయం కాదు. చేసే పనిలో విషయముంటేనే అది సాధ్యపడుతుంది. అది రవికుమార్ లాంటి అరుదైన వ్యక్తులకు మాత్రమే రచయితగా చెల్లుతుంది.
మొత్తం 59 వ్యాసాలున్న ఈ సంకలనంలో రవికుమార్‌గారు స్పృశించని అంశంలేదు. సంఘర్షించని సందర్భక్షణం లేదు. చూసి స్పందించని దృశ్యం లేదు. అంతా ఒక ప్రణాళికాబద్ధంగా, వడపోతతో విశే్లణాత్మకంగా సమస్తాన్ని కళ్ళకి కట్టించే ప్రయత్నం చేశారు. అవసరమైనచోట చురుకైన వాతలు పెట్టారు. నిరంతర మెలకువతో చైతన్యపరిచి అంతర్లీనంగా ఉత్తేజితుల్ని చేశారు. ‘వాళ్లంతే’ శీర్షికా వ్యాసంలో ‘‘కేవలం రూపాయి నలిపి వాసన చూపిస్తే మనశ్శరీరాలు అప్పగించే నేటి తరపు జర్నలిస్టుల దౌర్బల్యాన్ని భరించి తీరాలని’’ పత్రికాముఖంగా రచయిత బాహాటంగా ప్రకటించినపుడు రవికుమార్‌లోని అంతర్విముఖత అతనిలోని ‘గట్స్’ని తేటతెల్లపరుస్తుంది.
ఆధ్యాత్మిక గురువులు సచ్చిదానంద, చినజియర్ స్వామి, రవిశంకర్ లాంటి వాళ్ళను ఉదాహరిస్తారు. పాలక-సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా గొంతెత్తి, ఆదివాసుల పక్షాన హక్కులకోసం పోరాటం సలిపి, గుజరాత్ మారణకాండ బాధితుల తరఫున కొమ్ముకాసి నిలబడ్డ బాబాలెంతమంది ఉన్నారని నిలదీస్తారు. ఈ నిబద్ధత వెనుక నిక్కచ్చితనం ప్రతిబింబిస్తుంది. కాకరాపల్లి, సోంపేట వద్ద జరిపిన ప్రజాపోరాటాల స్ఫూర్తిని చైతన్యవాహికగా ప్రవహింపజెయ్యడంలో అందెవేసినతనం కనిపిస్తుంది. అభివృద్ధిపేరుతో ప్రభుత్వం ఆడుతున్న జూదం థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ధర్మాన మూటగట్టుకున్న అపఖ్యాతిని బట్టబయలు చేస్తారు. ఉన్నదున్నట్టుగా కుండబద్దలుకొట్టి నిజాల్ని నిర్భయంగా వెల్లడిచేయడం ఇతని సహజ నైజాన్ని అద్దంపట్టిస్తుంది. పేదాగొప్పల మధ్య తారతమ్యాన్ని ఆర్థిక అసమానత్వం ద్వారా చాటిచెప్పే ప్రయత్నంచేస్తారు రచయిత.
రాజ్యాలను కూల్చడంలో అమెరికా పాశవిక చర్యలను వ్యాసంలో ఎండగడతారు. ఉగ్రవాదం, కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చెయ్యడం, నిరుద్యోగం, పేదరికం లాంటి అంశాలకు జవాబుదారీతనం వహించాల్సి రావడాన్ని గుర్తుచేస్తారు. భాజపా, కాంగ్రెస్, టిడిపి, తెరాస, లోక్‌సత్తాల వైఖరిని ప్రస్ఫుటంగా ప్రతిఫలింపజేస్తారు. మద్యం సిండికేట్, కాంట్రాక్టింగ్, కోస్టల్ కారిడార్, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు, గ్రానైట్ అక్రమ తరలింపు చర్యలు, మత్స్యసంపదల గురించి పూసగుచ్చినట్టు కళ్ళకు కట్టిస్తారు. దేశవ్యాప్త కుంభకోణాలకు అక్షర రూపమిస్తారు. వ్యాపార-మావోయిస్టు వర్గాల కార్యకలాపాలతో ప్రభుత్వ పాలనపై కొరడా ఝుళిపిస్తారు. ప్రపంచీకరణ మనిషిజంపై ఎలాంటి మార్పులను తీసుకొచ్చిందో- నైజీరియన్ రచయిత చినువా అచ్‌బె మాటల్లో వివరిస్తారు. పరారుూకరణ తీరును వ్యక్తీకరిస్తారు. వస్తు సంస్కృతి మోజులో వర్తమాన ప్రపంచ పోకడల తీరును హృద్యంగా ఆవిష్కరిస్తారు. మాతృభాష సంరక్షణోద్యమం ఆవశ్యకతను అంతర్లీనంగా నొక్కిచెబుతారు. శ్రీకాకుళ విప్లవ పోరాటస్ఫూర్తినీ, కథానిలయం ప్రాముఖ్యతనీ ప్రస్తావిస్తారు.
ఇంకా ప్రముఖుల పుస్తక రచనల గురించి వివరణ సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్, రెజాఅస్లాన్, వెండీ డోనిగర్, జితేందర్ భార్గవ, హమీష్ మెక్ డోనాల్డ్‌లతో పూర్తిచేస్తారు వ్యాసకర్త రవికుమార్. ఆంధ్రా- తెలంగాణాలు విడిపోయిన సందర్భాన్ని చారిత్రాత్మక ఘట్టంగాకాక, ఆలోచనాత్మకంగా విశ్లేషించుకోవాల్సిన తీరుతో మన మేథస్సుకు పదును పెడతారు.
అర్థశాస్త్రంలోని కౌటిల్యుడి మాటగా మనకు ఉద్బోధిస్తారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇందులో ఇంకా ఊహకి అందని ప్రశ్నలు, ప్రస్తావించని సందర్భాలు కోకొల్లలుగా మిగిలిపోయాయి. వీటి మూలాల లోతుల్లోకి వెళ్లగలిగితే కంటికి కనిపించని అట్టడుగు చీకటి కోణాలు ఎన్నో బయల్పడే అవకాశముంది. ఈ రచయిత లోచూపుకీ, దిశానిర్దేశత్వానికీ భవిష్యత్తు ఆశావహ దృక్పథంగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించదు. భిన్న కోణాల్లో వ్యాసాలు రాయడంలో ఆరితేరిన దుప్పల రవికుమార్‌గారి సునిశిత పరిశీలనా దృష్టికి, విశ్లేషణా సామర్థ్యానికి ఎలాంటివారైనా దాసోహం పలకాల్సిందే. ఈ పుస్తకాన్ని చదివిన వారందరికి ఆ రకమైన అనుభవం అనుభూతిగా మిగిలిపోతుంది. సులభశైలిలో సరళ భాషలో రాయడంవలన అటు పాఠకుల మెప్పునూ, ఇటు విమర్శకుల ప్రశంసలనూ సమపాళ్ళలో అందుకోగలిగారు రచయిత.

–  రాజా, ఆంధ్రభూమి-అక్షర, 14/03/2015.

మన ప్రపంచం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

మన ప్రపంచం on kinige

ManaPrapamcham600

 

Related Posts:

వామపక్ష పోరాట క్రమం… “కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య-నా జ్ఞాపకాలు” పుస్తకంపై సమీక్ష

కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్యగారి జీవితం ఒక ఉద్యమం. ఉద్యమమే వారి జీవితం. కామ్రేడ్ ఎంబీగా చిరపరిచితమైన బసవపున్నయ్యగారి జీవితాన్ని, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాన్ని వేరువేరుగా చూడడం చాలా కష్టం. అసాధ్యం కూడా. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంతో అంతగా మమేకమైన జీవితం బసవపున్నయ్యగారిది. వారి జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది. బాల్యం ఎలా గడిచింది, విద్యార్థి జీవితాన్ని ఎలా గడిపారు. విద్యార్థి లోకానికి ఎలా నాయకత్వం వహించారు అనే దానితో ప్రారంభమై.. రాటుదేలిన కమ్యూనిస్టు నాయకుడిగా ఎలా ఎదిగారు, ఎలాంటి పోరాటాల్లో పాల్గొన్నారు అనేవరకు అనేక విషయాలు ఈ పుస్తకంలో వున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం కమ్యూనిస్టుపార్టీ నిర్వహించిన పోరాటాలు, రూపొందించుకున్న కార్యాచరణలు, ఎత్తుగడలు ఎలాంటివో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టీ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటికి కారణాలు తెలుసుకోవచ్చు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల పట్ల పార్టీవైఖరి, అలాగే ఎన్.జి.రంగా లాంటి నాయకుల పట్ల వైఖరి ఏమిటి? ఆ వైఖరికి కారణాలు ఏమిటి? లాంటి రాజకీయ అంశాలనే కాదు.. కామ్రేడ్ ఎంబీ జీవిత కాలంలోని సామాజిక పరిణామాలను కూడా ఈ పుస్తకం ద్వారా అర్థంచేసుకోవచ్చు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మాటల్లో చెప్పాలంటే.. స్వాతంత్య్ర ఉద్యమంలోను, ఆ తరువాత కాలంలోనూ కమ్యూనిస్టు ఉద్యమప్రాభవం, దాని బలహీనతలను వివరించే పుస్తకం ఇది. ఇది ఏకబిగిన రచించిన పుస్తకం కాదు. కామ్రేడ్ బసవపున్నయ్యగారు వివిధ సందర్భాలలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను ఒక క్రమపద్ధతిలో కూర్చి రూపొందించిన పుస్తకం. ఇది కామ్రేడ్ బసవపున్నయ్యగారి జీవిత చరిత్రకాదు. ఆయన జీవితకాలంలోని రాజకీయ చరిత్ర. ఆయన జీవిత కాలంలోని సామాజిక చరిత్ర. ఆయన జీవితకాలంలోని కమ్యూనిస్టు చరిత్ర.

– వాసిరెడ్డి , ఆంధ్రభూమి – అక్షర , 25-4-2015.

నా జ్ఞాపకాలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

నా జ్ఞాపకాలు on kinige

NaaGnapakaaluPSBH600

 

Related Posts:

సరికొత్త శిల్పం – ‘ఈ కథకి శిల్పం లేదు’ పుస్తకంపై సమీక్ష

‘కథను చదవడం ఎలా?’ అనే వల్లంపాటి వెంకటసుబ్బయ్య వ్యాసంతో పుస్తకం ప్రారంభం అవుతుంది. తెలివైన పాఠకుడు ఏకాంతంగా చదువుకోడానికి ఉద్దేశించిన సాహిత్య ప్రక్రియ కథ అని వల్లంపాటివారు ఆ వ్యాసంలో సూత్రీకరించారు. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి కథా సంకలనం ‘ఈ కథకి శిల్పం లేదు‘ చదువుతున్నప్పుడు ఆమాట నిజమే అనిపిస్తుంది. కొన్ని కథలైతే, మన మనసును మనమే చదువుతున్న భావన కలిగిస్తాయి. ఈ కథల్లో చెట్లు మాట్లాడతాయి, పర్యావరణం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తాయి. ఏ వ్యక్తికైనా తనను తాను ఎలా వ్యక్తం చేసుకోవాలో తెలియకపోతే ఆ వ్యక్తికి ఎదుగుదల ఉండదు – తరహా సమకాలీన నీతిని బోధిస్తాయి. మానవత్వానికి మాడీ కట్టిన ఎంగటవ్వలు కనిపిస్తారు. సంకలనంలో పదహారు కథలున్నాయి. తన కథలకు మార్కులేయమని పాఠకుల్ని అడుగుతున్నారు రచయిత.

– రమణ, ఈనాడు-ఆదివారం, 12/04/2015.

“ ఈ కథకి శిల్పం లేదు ” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

ఈ కథకి శిల్పం లేదు on kinige

EeKathakiShilpamLedu600

 

 

Related Posts:

  • No Related Posts

విభిన్న కోణం.. “తలుగు” పుస్తకంపై సమీక్ష

డబ్బు చేతులు మారాక, వస్తువు కొన్న వాడిదే. దాని లాభనష్టాల భారమంతా సొంతం చేసుకున్నవాడిపైనే ఉంటుంది. కానీ, అది ఓ వస్తువు కాకుండా ప్రాణి అయితే… చంపేందుకు అమ్మిన గొడ్డు గేదె కాస్తా బతికి బట్టకడితే, పాడిగేదెగా మారితే… అది కొన్నవాడిదే అవుతుందా, లేకపోతే అమ్మిన వాడింటికి దాన్ని మళ్లీ తోలెయ్యాలా? ఇలాంటి సందర్భాల్లో న్యాయం డబ్బున్నవాళ్లవైపే ఉంటుందా లేక పేదోడివైపు మొగ్గుతుందా? – ఇలా అనేకానేక ప్రశ్నలూ సమాధానాల పరంపరగా నడుస్తుంది వేంపల్లె షరీఫ్ రాసిన ‘తలుగు‘ కథ. పేద ముస్లింల జీవితాల ఆధారంగా ప్రాణంపోసిన రచన ఇది. ఇందులో గొడ్డుమాంసాన్ని అమ్మే కటిక వ్యాపారి మనస్తత్వాన్ని భిన్నమైన కోణంలో చూపించే ప్రయత్నం చేశారు రచయిత. తలుగు అంటే రాయలసీమ మాండలికంలో పశువుల మెడకువేసే తాడు. పుస్తకం చివర్లోని షేక్ హుస్సేన్ సత్యాగ్ని వ్యాసం ‘విస్తరిస్తున్న ముస్లిం కథ’ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది.

– హరిత, ఈనాడు-ఆదివారం, 27/04/2015.

తలుగు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

తలుగు on kinige

Talugu600

 

Related Posts:

మే 2015 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే 2015 నాలుగవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

Capture

1 రుద్రుడు మధుబాబు రీ-ఎంట్రీ
2 నేను మలాలా మీరా న్యూ-ఎంట్రీ
3 ఎవరితో ఎలా మాట్లాడాలి
ఉషశ్రీ మరియు గాయత్రీదేవి వరుసగా 2 వారాలుగా
4 ఇన్‌కమ్ టాక్స్ గైడ్ శ్రీనివాస్ వరుసగా 2 వారాలుగా
5 చాణక్య శ్రీ శార్వరి వరుసగా 3 వారాలుగా
6 ఆధ్యాత్మిక సూక్తులు శైలి న్యూ-ఎంట్రీ
7 మందారమాల సత్యం మందపాటి న్యూ-ఎంట్రీ
8 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ రీ-ఎంట్రీ
9 ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం యండమూరి వీరేంద్రనాధ్ రీ-ఎంట్రీ
10 అజేయుడు-నవల సూర్యదేవర రామమోహన రావు రీ-ఎంట్రీ

Related Posts:

మే2015 మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే2015 మూడవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

Capture

 

1 ఇన్‌కమ్ టాక్స్ గైడ్ శ్రీనివాస్ రీ ఎంట్రీ
2 ఇదండీ మహాభారతం రంగనాయకమ్మ వరుసగా 19 వారాలుగా
3 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరేంద్రనాథ్ రీ ఎంట్రీ
4 ఎవరితో ఎలా మాట్లాడాలి
ఉషశ్రీ మరియు గాయత్రీదేవి రీ-ఎంట్రీ
5 ఆనంద జ్యోతి మధుబాబు రీ-ఎంట్రీ
6 త్రివేణి సూర్యదేవర రామ్మోహనరావు రీ-ఎంట్రీ
7 శబ్బాష్‌రా శంకరా! తనికెళ్ళ భరణి రీ-ఎంట్రీ
8 చాణక్య శ్రీ శార్వరి వరుసగా 2 వారాలుగా
9 పరుసవేది పాలో కొయిలో రీ-ఎంట్రీ
10 ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడటం ఎలా? చక్రవర్తి డి ఎస్ న్యూ-ఎంట్రీ

Related Posts:

సమ్మర్ సూపర్ సేల్ – సురవర తెలుగు కీబోర్డులపై 50% ప్రత్యేక డిస్కౌంటు!

KeyboardSlider

కినిగె సమ్మర్ సూపర్ సేల్ నిన్నటితో ముగిసింది. మరిన్ని ఆఫర్లతో మరోసారి మీ ముందుకు వస్తాం.

Related Posts:

మే 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

మే 2015 రెండవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

Top10_8thMay2015_1

1 పరికిణీ!! తనికెళ్ళ భరణి రీ-ఎంట్రీ
2 రిలేషన్స్ నల్లమోతు శ్రీధర్ వరుసగా 4 వారాలుగా
3 రమణీయ భాగవత కథలు ముళ్ళపూడి వెంకట రమణ న్యూ ఎంట్రీ
4 ఇదండీ మహాభారతం రంగనాయకమ్మ వరుసగా 18 వారాలుగా
5 రుద్రుడు మధుబాబు వరుసగా 6 వారాలుగా
6 ది డైరీ ఆఫ్ మిసెస్ శారద యండమూరి వీరేంద్రనాథ్ వరుసగా 2 వారాలుగా
7 మనోగతం సూర్యదేవర రామమోహన రావు న్యూ ఎంట్రీ
8 చాణక్య శ్రీ శార్వరి రీ ఎంట్రీ
9 కొంచెం ఇష్టం కొంచెం కష్టం పొత్తూరి విజయలక్ష్మీ రీ-ఎంట్రీ
10 సాయంకాలమైంది గొల్లపూడి మారుతీరావు న్యూఎంట్రీ

Related Posts:

  • No Related Posts

కినిగె సమ్మర్ సూపర్ సేల్ ఆఫర్

SummerSale1

 

కినిగె సమ్మర్ సూపర్ సేల్ నిన్నటితో ముగిసింది. మరిన్ని ఆఫర్లతో మరోసారి మీ ముందుకు వస్తాం.

Related Posts: