షాడో గత జీవితానికి చెందిన కథ ఇది.
షాడోని భారతదేశం నుంచి అవతలికి తీసుకువెడితే అతని జీవితం కుదుటపడుతుందనీ, అనవసరమైన అల్లర్లలో అతను తల దూర్చడం తగ్గిపోతుందనీ భావించి అతన్నిజపాన్ తీసుకువెడతారు రిటైర్డ్ జడ్జి ఛటర్జీ గారు, ఆయన కూతురు మల్లిక.
ఛటర్జీగారి మేనల్లుడు సతీష్ టోక్యో నగరానికి యాభై మైళ్ళ దూరంలో ఉన్న సూచీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో షాడో గంగారాంలకు వుద్యోగాలు యిప్పించాడు. పాత పద్దతులను, అలవాట్లను పునరావృతం చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకొని పనిలో చేరాడు షాడో.
కానీ అక్కడ జరిగే అరాచకాలను ఎదుర్కోకుండా ఉండలేడు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ మానేజర్ని ఎదిరించినందుకు శిక్షగా అడవికి దగ్గరగా ఉండే, జనసంచారం ఏ మాత్రం ఉండని ఓ పంపింగ్ హౌస్ వద్ద షాడోకి, గంగారాంకి డ్యూటీ పడుతుంది. అడవిలోంచి తననెవరో పిలుస్తున్నట్లుగా వినబడి షాడో ఆ గొంతును వెదుక్కుంటూ వెడతాడు. గొరిల్లాల బారిన పడతాడు. ఓ వృద్ధుడైన కుంగ్ఫూ గురువు దర్శనమిచ్చి ఓ అద్భుతమైన పోరాట ప్రక్రియ ద్వారా గొరిల్లాలను తరిమేస్తాడు. షాడో తిరిగి పంపింగ్ హౌస్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ డ్యూటీ చేస్తుండగా, ఓ మహిళ రక్షించమంటూ వచ్చి వేడుకుంటుంది. నింజా రౌడీలు ఆమెను తరుముతూంటారు. ఆమెని రక్షించే క్రమంలో షాడో ఓ నింజా రౌడీని చంపుతాడు. పోలీసులు వెంటబడుతుంటే… పారిపోయి కొరియా దేశంలోకి ప్రవేశిస్తారు షాడో, గంగారాంలు.
వారు కొరియాలోకి ఎందుకు వెళ్ళాల్సివచ్చింది? అక్కడేం సాహసాలు చేసారు? షాడోకి సాయపడిన ఆ వృద్ధ కుంగ్ ఫూ గురువు ఎవ్వరు?
ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.
షాడో అభిమానులకు అత్యంత ప్రీతిపాత్రమైన నవల ఇది. తప్పకుండా చదవాల్సిన ఈ షాడో ఇన్ జపాన్ నవల ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
షాడో ఇన్ జపాన్ On Kinige
కొల్లూరి సోమ శంకర్