మేము ఈ ఆలోచన గురించి ఆలోచించి, చెయ్యగలగము అని నమ్మకం కుదిరినంక, చేస్తే మంచి పని అవుతుంది అని అనుకున్నాక చేసిన మొదటి పని పేరు పెట్టడం. పేరు గురించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నవి. క్లుప్తంగా ఉండాలి, బాగుండాలి, అందరికి నచ్చాలి, .కాం లభించాలి, .ఇన్ కూడా లభించాలి, పుస్తకం కు సంబంధించినదై ఉండాలి. ఇలా మాకు తెలిసిన భాషలలో, ఆ తరువాత కొంచెం తెలిసిన భాషలలో ప్రయత్నించాక చివరకు యాకుత్ భాషలో (వీరినే శఖులు అని కూడా అంటారు) కినిగె అంటే పుస్తకం అని తెలుసుకున్నాము. ఆ పేరు అందరికి నచ్చటం వల్ల, మా కండీషన్లన్నీ మీటవట్టం వల్ల ఒక అధ్యాయం మొదలైంది.