శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య రచించిన జీవన కెరటాలు అనే పుస్తకంపై 10 ఫిబ్రవరి 2011 నాటి ఆంధ్ర్యజ్యోతి దినపత్రిక నవ్య పేజీలో “ఒక ‘పనివాడి’ ఆత్మకథ” అనే శీర్షికతో సమీక్ష వెలువడింది.
ఆత్మకథ ఎక్కువగా రచయితలు, మేధావులు, నాయకులు, కళాకారులు రాసుకుంటుంటారని, ‘పనివాళ్లు’ ఆ పని చేయడం అరుదని సమీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణంలో పనిచేసే ఒక వ్యక్తి వృత్తిఅనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉండచ్చో కేకలతూరి క్రిష్ణయ్య ఆత్మకథ ‘జీవన పోరాటాలు’ చదివితే అర్థమవుతుందని సమీక్షకులు అన్నారు.
క్రిష్ణయ్య 72 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా పాకాల మండలం శంఖంపల్లె గ్రామంలో పుట్టారు. హైస్కూలుతోనే చదువు ఆపేసినా అనుభవంతో ఇంజనీరై దేశవిదేశాల్లో 50 సంవత్సరాలకు పైగా వివిధ ప్రాజెక్టుల్లో పని చేశారు. ఆయన ఆత్మకథలోని కొన్ని భాగాలు సమీక్షలో క్లుప్తంగా ప్రస్తావించారు.
అవసరానికి మించి ఆలోచించి, సమస్యను పెద్దది చేసుకుని భయపడటం వంటి లక్షణాలు వ్యక్తి అభివృద్ధికి ఏ విధంగా ఆటంకంగా నిలుస్తాయో రచయిత ఉదాహరణ ద్వారా చెప్పిన ఘటన ఆసక్తిగా ఉంటుంది.
తాను చేసే వృత్తికి సంబంధించిన పనిలో ఎప్పుడు ఎవరు తన సహాయం కోరినా తప్పక సహాయపడాలని నిర్ణయించుకున్న క్రిష్ణయ్య నేపాల్ ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో చెబుతారు.
ఒక పని చేసేడప్పుడు వృత్తి నిపుణులు ఎంత జాగ్రత్తగా ఉండాలో, శారీరకంగా ఎందుకు ఫిట్‌గా ఉండాలో మరో వృత్తాంతం ద్వారా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
జీవన కెరటాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.
కొల్లూరి సోమ శంకర్