“శ్రీ గజానన్ తామన్ గారికి
సమస్కారం.
మీరు ఆప్యాయంగా పంపిన మీ గేయ కావ్యం “సాకేతరామాయణం” అందింది. సంతోషం.
మరాఠీ మహాకవి మాడ్గూళ్కర్ “గీత్ రామాయణ్” కు మీరు చేసిన తెలుగు అనుసృజనం పరమ మౌలికంగా ఉంది.
గేయ చ్ఛందస్సులో వివిధ గతుల్లో ఈ కావ్యాన్ని రూపొందించారు మీరు. భావాలు మూలగ్రంధంలోనివే అయినా వాటిని తెలుగు పదాల్లో మీరు పొదిగిన తీరు శ్లాఘనీయంగా ఉంది.
చక్కని పరిణత కృతిని తెలుగులో అందించిన మీకు నా హార్దికాభినందన.
డా. సి. నారాయణరెడ్డి”
* * *
శ్రీ గజానన్ తమన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.