“శ్రీ గజానన్ తామన్ గారికి
నమస్కారములు.
మీరు సౌహార్దముతో పంపిన సాకేతరామాయణం చదివి ఆనందించుచున్నాను. కావ్యం అంతా మృదుమధుర శైలిలో చక్కగ నడచినది. ఈ కావ్యంలోని సౌందర్యాన్ని ప్రొ. లక్ష్మణమూర్తిగారు, డా. గండ్ర లక్ష్మణరావుగారు చక్కగా విశదీకరించినారు. శ్రీ సువర్ణ లక్ష్మణ్ రావుగారు శ్రీ సీతారామసేవా సదనం ద్వారా ప్రచురించి సాహితీప్రియులకు ఉత్తమమైన భక్తిరసప్లుమైన కావ్యం అందజేసినారు.
సాకేత రామునికి ఒక్క లక్ష్మణుని సేవ అందితే సాకేత రామాయణానికి ముగ్గురు లక్ష్మణుల సేవ అందినది.
అభినందనములతో
భవదీయుడు
పుల్లెల శ్రీరామచంద్రుడు.”
* * *
శ్రీ గజానన్ తామన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.