కొల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్ 1974లో స్థాపించబడింది.
భారతీయ సాహిత్యం కోసం ఎనలేని సేవ చేస్తున్న సంస్థ ఇది. ఒక భాషలో వెలువడిన పుస్తకాన్నిఇతర భాషలలోకి అనువదింపజేసి, ఆ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి.
అన్ని భారతీయ భాషలలోని సాహిత్యకారులను ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా, ఈ సంస్థ 1980 నుంచి వార్షిక పురస్కారాలను అందిస్తోంది.
2011 వ సంవత్సరానికి భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం – తెలుగులో- సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి టి.శ్రీవల్లీరాధిక రచించిన “మహార్ణవం” కథాసంపుటికి – ప్రకటించబడింది.
ది 18 – 19 ఫిభ్రవరి 2012 తేదీలలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి ఈ అవార్డుని స్వీకరించారు. రచయిత్రికి అభినందనలు.
మహర్ణవం కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.