అనుశృతంగా వస్తున్న పంచాంగ పరిజ్ఞానం దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి అనేక శాస్త్ర సంప్రదాయాలు ఏర్పడినవి.
అందులో దృక్సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ పంచాంగ గణన రచన సాగినది. పంచాంగకర్త బాల్యము నుండి వైఖానస ఆగమ, వాస్తు, జ్యోతిషశాస్త్రాంబుధిలోని అనర్ఘరత్నాలను పాండితీ చిహ్నాలుగా ధారణ చేసికొన్న శశికాంతుడు. స్వతః సిద్ధ అభిలాష, అభినివేశముతో వైఖానస ఆగమ గ్రంధాలను-జ్యోతిష శాస్త్రగ్రంధాలను సమన్వయ దృక్పథంతో ఈ పంచాంగ రచన గావించి యున్నాడు.
జ్యోతిష కళానిధి, తార్కిక గణనవేత్త, అదృష్టతాండవ రచనకర్త అయిన తాండవకృష్ణ చక్రవర్తి అప్రమేయ వైదుష్య విభవముతో ఈ పంచాంగమును కలికితురాయిగా తీర్చిదిద్దినారు.
వైఖానస లోకమునకు ఈ పంచాగం ఒక కరదీపిక వంటిది అని భావించవచ్చు.
- ‘ఆగమ ప్రవర’ వేదాంతం సార్వభౌమ
శ్రీనందన నామ సంవత్సర పంచాంగం On Kinige