భీమాయణం అనేది గ్రాఫిక్ రూపంలో చెప్పబడిన డా. బి. ఆర్. అంబేద్కర్ జీవితచరిత్ర. పార్థాన్ గోండు చిత్రకారులైన దుర్గాబాయి వ్యాం, సుభాష్ వ్యాంలు అద్భుతమైన బొమ్మలు అందించగా, శ్రీవిద్య నటరాజన్, ఎస్. ఆనంద్‌లు కథనం అందించారు. ఈ చిత్రకళ విలక్షణమైనది. దట్టమైన అవుట్లైన్లతోనూ, నీడలతోనూ నిండి వుండే బొమ్మలు, బాధని. క్రూరత్వం పట్ల మునుపు తెలియని వేదనని వ్యక్తం చేస్తాయి. వివక్షకి గురవడానికి దక్షిణాఫ్రికా వెళ్ళాల్సిన అవసరం లేని ఓ వ్యక్తి కథ భీమాయణం. చరిత్ర పుస్తకాలలో భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే పేరుపొందిన వ్యక్తి కథ భీమాయణం. అంబేడ్కర్ అంటరానితనపు అనుభవాలను వెల్లడిస్తునే, దేశంలోని ప్రస్తుత కుల వ్యవస్థని ఎండగడుతుందీ పుస్తకం. ఎనిమిది భాషలలో వెలువడింది ఈ పుస్తకం.
సిఎన్ఎన్ ప్రకటించిన ‘ఐదు అత్యుత్తమ రాజకీయ కామిక్స్ పుస్తకాల్లో భీమాయణం ఒకటిగా నిలిచింది.
భీమాయణం పుస్తకం ఆవిష్కరణ సభ 29 జూలై 2012 నాడు సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు హైదరాబాదులో జరుగుతుంది.
వేదిక: లమాకాన్, సి-బే బిల్డింగ్ తర్వాతి సందు, జివికె మాల్ ఎదురుగా, రోడ్ నెంబరు 1, బంజారా హిల్స్.
మరిన్ని వివరాలకు 9642731329 నెంబరుని సంప్రదించవచ్చు.
* * *
“భీమాయణం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.