కినిగె పై మీ మొదటి పుస్తకం చదవటం ఎలా ?

కినిగెను దర్శించండి

 

కినిగె ముఖ పేజీ

మీ పుస్తకాన్ని ఎన్నుకోండి.

పుస్తకం కోసం పైన ఉన్న శోదన పెట్టె ఉపయోగించి వెతక వచ్చు, లేదా ఎడమవైపున ఉన్న రకరకాల జల్లింపు ఐచ్చికాల ద్వారా కావల్సిన పుస్తకాన్ని జల్లెడపట్టి చూడవచ్చు.

ప్రస్తుతానికి మనం మధుబాబు రచించిన చైనీస్ బ్యూటీ పుస్తకం ఎన్నుకుందాం.

చైనీస్ బ్యూటీ బొమ్మపై ఒక నొక్కు నొక్కండి.

ఒక పుస్తకం గురించి మరింత సమాచారం పొందుట

 

మరో పుట తెరుచుకున్నది. మంచిది. దీంట్లో ఏముందో తరిచి చూద్దాం. కవర్ పేజీ, పుస్తకం గురించిన కొంత వివరణ, మరియు ఇతర వివరాలు ఉన్నాయి. కుడివైపు స్క్రాల్ పార్ దిగువకు జరిపి చూద్దాం మరిన్ని వివరాలు కనిపిస్తాయేమో.

 

దిగువ మరి కొన్ని వివరాలు ఉన్నాయి. వాటిని కూడా చదివేద్దాం. ఇంతకీ ఈ పుస్తకం కొనాలా వద్దా. నిర్ణయం తీసుకోటానికి ఇంకేదన్నా పనికొచ్చే సమాచారం ఉందేమో చూద్దాం. అక్కడ కుడివైపున Download Free Preview అని ఒక మీట ఉంది. దాన్ని నొక్కి చూద్దాం.

 

ఉచిత ప్రీవ్యూ (మునుజూపు)

 

ఉచిత ప్రీవ్యూ నొక్కగానే ఏదో జరిగింది. ఏం జరిగింది? లాగిన్ స్క్రీన్ వచ్చింది. మనకు కినిగె పై లాగిన్ లేదే, సరే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం.

కినిగెపై అకౌంట్ సృష్టించుకోవటం

Register అని ఉన్న లింకు నొక్కుదాం.

 

పైన చూపించిన విదంగా మరో తెర తెరుచుకుంది. అక్కడ అడిగిన ఐదారు వివరాలు ఇద్దాం.

 

 

వివరాలు ఇచ్చి సబ్మిట్ నొక్కాక, వేగుకు వెళ్లి చేతనం చేసుకోమంటుంది. తప్పేదేముంది చేతనమవుదాం.

పైన చూపించిన విధంగా నాకు ఒక వేగు వచ్చింది. మీరు కూడా మీరు పైన ఇచ్చిన వేగు చిరునామా చూసుకోండి.

      1.  

ఆ వేగు తెరిచి చూస్తే పైన చూపిన విదంగా కనిపించింది. అక్కడి లింకు నొక్కండి.

 

పైన చూపిన విదంగా విజయవంతంగా చేతనమొందిన మెస్సేజ్ కనిపించింది.

మళ్లా మొదటి కచ్చి http://kinige.com తెరుద్దాం.

చైనీస్ బ్యూటీ బొమ్మపై మరోసారి నొక్కుదాం.

Download Preview మీట మరోసారి నొక్కదాం. మళ్లా లాగిన్ అడుగుతుంది.

అయితే ఈసారి మనకు కినిగెలో సభ్యత్వం ఉంది కదా, ఆ వివరాలు ఎంటర్ చేద్దాం.

లాగిన్ అవ్వటం

 

వివరాలు ప్రవేశపెట్టి గో మీట నొక్కండి.

మళ్లా చైనీస్ బ్యూటీ మన్ని పలకరించిద్ది, మరో పాలి Download Preview మీట నొక్కుదాం.

 

పైన చూపించినట్టు (ఫైర్ ఫాక్స్ లో – మిగతా బ్రౌజర్లలో కూడా తగినట్టు ) కనిపిస్తుంది. మనకు పది పేజీలు ఉచితంగా వచ్చాయి. వాటిని చదువుదాం. బాగానే ఉంది. సరే ఈ పుస్తకం కొని చదవవచ్చు. ఎలా కొనాలి ?

చైనీస్ బ్యూటీ పుట చూస్తే అక్కడ Buy eBook: Rs 50 అని ఒక మీట ఉంది. దాన్ని నొక్కుదాం.

కినిగె అకౌంట్ రీచార్జ్ చేసుకోవటం

Buy eBook: Rs 50 నొక్కితే ఏమైంది? ఏమవుతుంది. నగదు లెవ్వు అని ఎరుపు రంగు అక్షరాల్లో మెస్సేజ్ వచ్చింది. సరే నగదు ఎలా కట్టాలంట? ఆ మెస్సేజ్ చివరలో క్లిక్ హియర్ అని ఉంది కదా అది నొక్కుదాం.

 

పైన చూపించిన పుట తెరుచుకుంది. అక్కడ మూడు ఐచ్చికాలు ఉన్నాయి.

మొదటిది – ఎవరన్నా మనకు కినిగె గిఫ్ట్ కూపన్ పంపితే వాడవచ్చు.

రెండోది – ప్రధానంగా భారతీయులకు ఇక్కడ రకరకాల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వసతుల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా మన రైల్వే రిజర్వాషన్ ఆన్లైన్లో చేసుకునేటప్పుడు నగదు చెల్లింపులాగా ఉంటుంది.

మూడోది –ప్రధానంగా విదేశాలలో ఉంటున్న భారతీయులకోసం. పది డాలర్లు కడితే పేపాల్ ద్వారా నాలుగు వందలు కినిగె అకౌంటులో రీచార్జ్ అవుతాయి.

మీకు కావాల్సిన ఐచ్చికం ద్వారా రీచార్జ్ చేసుకోండి.

 

పుస్తకం కొనటం

 

రీచార్జ్ చేసుకున్న తరువాత Buy eBook Rs. 50 మీట నొక్కండి.

దిగువ చూపించిన పుట తెరుచుకుంది.

ఏదో దిగుమతి చేసుకోమంటున్నాడు. దిగుమతి చేసుకుందాం.

కానీ ఎలా ఓపెన్ చెయ్యాలి? సరే ఆ కినిగె డౌన్లోడ్ పుటలో ఏమన్నా సహాయం ఉందేమో చూద్దాం. సరిగ్గా చదివితే అక్కడ రెండో లైన్లో అడోబ్ డిజిటల్ ఎడిషన్ దిగుమతి చేసుకోమని చెప్పారు.

అడోబ్ డిజిటల్ ఎడిషన్ ప్రతిష్టాపించుట

ఆ లింకు నొక్కుదాం. బ్రౌజర్లో ఓపెన్ అయింది.

ఆ పేజీలో కుడిపైపున ఉన్న Download లింకు నొక్కితే ఈ దిగువ పుట వస్తుంది.

 

Install మీటను నొక్కుదాం.

 

మరోసారి Install మీట నొక్కుదాం.

 

ఏదో చేస్తుంది.

 

Yes నొక్కి ముందుకు వెళ్దాం.

ఈ దిగువ చూపిన పుటలు కనిపిస్తాయి.

 

 

క్లోజ్ మీట నొక్కండి.

మొదటి సారి అడోబ్ డిజిటల్ ఎడిషన్ మొదలు పెట్టడం -

I Agree మీట నొక్కండి.

 

get an Adobe ID online నొక్కండి.

Create an Adobe Account లింకు నొక్కండి.

Adobe ID  సృష్టించడం

ఇది కొత్త వెగు క్రియేట్ చెయ్యటం లాంటిది. అక్కడ ఎరుపు రంగు నక్షత్రపు రంగు గుర్తు ఉన్న ఫీల్డులు నింపి ముందుకు వెళ్లాలి.

 

Continue నొక్కండి.

మనం మన డిజిటల్ ఎడిషన్ కు మరళి కొత్తగా సృష్టించిన ఐడీలు ఎంటర్ ప్రవేశపెట్టండి.

Done, Finished మీట నొక్కండి.

చాలా దూరం వచ్చాము. ఇంతకీ ఎక్కడ మొదలు పెట్టాము? కినిగెపై చైనీస్ బ్యూటీ వద్ద మొదలు పెట్టాము. మరళా అక్కడికి వెళ్దాము.

http://kinige.com (ఒకవేళ లాగిన్ అయి ఉండకపోతే లాగిన్ అవ్వండి. )

చైనీస్ బ్యూటీ పై నొక్కండి. (కనపడకపోతే, My Books నొక్కండి. )

కినిగెకు మరళి పుస్తకం చదువుదాం.

పైన చూపినట్టు కనిపిస్తుంది. Download Purchased Book మీట నొక్కుదాం. దిగువ చూపిన పుట వస్తుంది.

 

తెరుద్దాం.

 

ఎడమవైపున ఉన్న బద్దె కూడా తొలగించవచ్చు. మధ్యలో ఉన్న బాణం గుర్తుపై డబుల్ క్లిక్ చెయ్యండి.

ఇలా రెండు పేజీల్లో చదవవచ్చు. పైన కుడివైపున ఉన్న మీటలు నొక్కి ప్రయోగం చెయ్యండి.

ఆనంద పఠనం.

 

Related Posts: