Free eBook: కొల్లాయి గట్టితేనేమి? – Mahidhara Rama Mohana Rao

To download free eBook కొల్లాయి గట్టితేనేమి click here now.

కొల్లాయి గట్టితేనేమి? On Kinige

మహీధర రామమోహనరావుగారి ‘కొల్లాయి కట్టితేనేమి?’ నవల చదవటం ఒక గొప్ప అనుభవం. నవలలో కథ ప్రారంభమయ్యే నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుంది. ప్రజలలో పాలకుల పట్ల అసం తృప్తి, జాతీయోద్యమం, మరోవైపు వీటిని అణచటానికి రౌలత్‌ చట్టం, జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ, గాంధీ పిలుపు కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఈ నవలకు నేపథ్యం. జాతీయ ఉద్యమ, భావ బీజాలు, ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత, గాంధీ నాయకత్వం, చరకా మీద నూలు వడకటం నవలకు పూర్వరంగం. గాంధీజీ నడిపిన వివిధ ఉద్యమ రూపాలు ఈ నవలలో చూడవచ్చు.

- ఆంధ్రప్రభ దినపత్రిక, ప్రత్యేక వ్యాసం

* * *

జాతీయోద్యమ కాలంలో ఒకవైపు స్వాతంత్ర్యపోరాటం మరోవైపు సంస్కరణోద్యమం చేతులుకలిపి సాగాయి. ఒకదానికొకటి ఎదురెదురయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రెండు వర్గాల మధ్యనా స్పష్టమయిన విభజనరేఖ లేకపోవడం ఒక విశేషం. పరమ సాంప్రదాయవాదులయి కూడా ఇంగ్లీషు చదువులిచ్చే అధికారం కోసం అర్రులుచాచినవారు ఉన్నారు. మరోవైపు అప్పటి సంఘవ్యవస్థలో గౌరవం దక్కని వాళ్ళు కూడా సంప్రదాయాన్ని ధిక్కరించి ఇంగ్లీషు చదువులకి వెళ్ళినవాళ్ళూ ఉన్నారు. అలాగే భారతీయ సంప్రదాయాభిమానంతో పరసంస్కృతినీ, పరపాలననీ ధిక్కరించిన వారున్నారు. మరొకవైపు ఇంగ్లీషు చదువులిచ్చిన సంస్కారాభిలాషతో సంప్రదాయాలని ప్రశ్నిస్తూనే, మరోవైపు బ్రిటిష్ దౌర్జన్యపాలనని నిరసించిన వారూ ఉన్నారు. ఈ వైవిధ్యమంతా చాలావరకూ యీ నవలలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలోని అనేక చాయలు, ప్రధానపాత్ర రామనాథంలో కనిపించడం చెప్పుకోదగ్గ విషయం. పాత్రచిత్రణలో రచయితకున్న నైపుణ్యానికి ఒక నిదర్శనం

- పుస్తకం.నెట్ వ్యాసం

* * *

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప నవలల సరసన నిలవగలిగి నది ‘కొల్లాయి గట్టితేనేమి?’. ఈ నవలను సుప్రసిద్ధ విమర్శకు డు రాచమల్లు రామచంద్రారెడ్డి ‘ఉత్తమ చారిత్రిక నవల’గా ఎంచి, కీర్తించారు. జార్జ్ లూకాష్ (గ్యోర్గియ్ లుకాచ్) సూత్రీకరించిన ‘చారిత్రిక నవల లక్షణాలు’ ప్రాతిపదికగా తీసుకుని ఆయన ఆ విమర్శ చేశారు. అంతర్జాతీయ స్థాయి సాహిత్య విమర్శ సూత్రాల గీటురాయిపై ఒక తెలుగు నవలను నిగ్గుతేల్చడం -బహుశా- అదే మొదలు. 1964లో వెలువడిన ఈ నవలకు నాలుగేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవలా పురస్కారం అందచేసింది.

- సాక్షి దినపత్రిక వ్యాసం

* * *

కొల్లాయిగట్టితేనేమి నవలకి 1968 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. స్వాతంత్ర్య పోరాటాల మీద మనం చాలా వ్యాసాలు, చారిత్రక సంఘటనల గురించి బాగానే విని ఉంటాం. ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే ఆ సమయంలో అప్పటి మనుష్యుల మధ్య జరిగిన వాస్తవ స్థితిగతుల గురించి ప్రస్తావించటం. వారి మీద గాంధీ గిరి ప్రభావం ఎలా ఉండేది ? అన్న విషయాలు మనం ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు. 1920 నుండి రెండేళ్ళపాటు జరిగిన కథే ఈ నవల.

తెల్లవాళ్ళని తరిమికొట్టడమే కాకుండా ఉన్నవాళ్ళని సంస్కరించుకోవడం కూడా స్వాతంత్రోద్యమంలో భాగమే అని ఈ నవల మనకు చెప్తుంది. నవలతో పాటూ చివరలో వ్యాసాలు తప్పక చదవాల్సిందే! అసలు నవల ఎందుకు వ్రాయాల్సింది ? అని రామమోహనరావు గారి వ్యాసం చదివాక మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి.

- కాలాస్త్రి బ్లాగు నుంచి

* * *

రచయిత గురించి:

మహీధర రామమోహనరావు గారు 1 నవంబరు 1909 నాడు తూర్పు గోదావరి జిల్లా ముంగండ అగ్రహారంలో జన్మించారు. ఆధునిక భావాల కల వ్యక్తులు, పరిసరాల మధ్య పెరగడం వలన రామమోహనరావు చదువుని మధ్యలోనే విడిచి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. వారి గ్రామంలో రాజకీయ కార్యకలాపాలు ఉదృతంగా సాగుతున్న రోజులలో ఆయన మొదట కాంగ్రెస్ లోనూ, తర్వత జయప్రకాశ్ నారాయణ్ పార్టీలోనూ చేరారు. తదుపరి కాలంలో కమ్యూనిస్టుగా మారారు. మానవత, వాస్తవికత ఆయన లక్ష్యాలు. కుల, వర్గ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన కలలు కనేవారు. ఆయన విలేఖరిగా పనిచేసారు. అత్యద్బుతమైన నవలలని రచించారు. రథచక్రాలు, దేశం కోసం, జ్వాలాతోరణం, ఓనమాలు, మృత్యువు నీడల్లో, కత్తులవంతెన వంటివి ఆయన సుప్రసిద్ధ రచనలు.

* * *

కొల్లాయి గట్టితేనేమి? On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>