రవి వీరెల్లి కవితా సంకలనం “దూప” పై ఆంధ్రజ్యోతి దినపత్రికలోని వ్యాసం ఇది.
* * *
నీ తలపు
ఎక్కడో పచ్చికబయల్లో పారేసుకున్న మన
పాత గురుతులని
ఎదకు ఎరగా వేసి పద పదమని పరుగు పెట్టిస్తుంది
నీ ధ్యాస
స్మృతుల శ్రుతిలో స్వరాలాపన చేస్తున్న నా
హృదయ లయను
గమకాల అంచుల్లో తమకాల ఉయ్యాలలూపుతుంది
నీ ఊహ
మొగ్గలా ముడుచుకున్న జ్ఞాపకాలని బుగ్గరించి
విరబూయించి
అనుభవాల రెక్కల చిరుజల్లుగా చిలకరిస్తుంది.
(‘ఎదురు చూపు’ నుంచి)
తలపు, ధ్యాస, ఊహ- అన్నీ ఎదురుచూస్తున్నాయి. ఆ అలసటలో అలసట లేదు. అసలు వృద్ధాప్యం వచ్చిన అలికిడి కూడా లేదు. దీనికి ‘కవి నిత్యయవ్వనుడ’ని తప్ప మరో అర్థం లేదు.
సమయయంత్రం ముద్రించే
చరిత్ర పుటల్లోకెక్కాలనుకోవడమే
నా స్వార్థం అయితే
నాకే చరిత్రా వద్దు
ఏ పుట్టుకా వద్దు
అవధుల్లేని స్వేచ్ఛ నివ్వు
(ఏ పుట్టుకా వద్దు నుంచి)
చరిత్ర పుటలోకెక్కే స్వార్థం వద్దని మరేం కోరుతున్నాడు? అవధుల్లేని స్వేచ్ఛ కావాలంటున్నాడు, అదీ పుట్టుక లేకుండానే అనుభవించేస్వేచ్ఛ. ఇలాంటి కోరికలేకపోయుంటే రవి ‘దూప’ లాంటి కవిత్వం రాసేవారు కాదేమో- అదీ నలభై ఏళ్ళవయసులో. అయితే, కవిత్వాన్ని నిర్వచించడం కష్టం అంటూనే, రవి కవిత్వం ద్వారా అయినా అదేమిటో వివరించాలని అఫ్సర్ తన ముందు మాటలో విఫలయత్నం చేశారు. ఏది ఏమైనా, తన సుదూర ప్రయాణం గురించే కాదు, ఆ ప్రయాణంలో తాను ఎక్కడ ఆగాలా అనే విషయం గురించీ ఎరుక కలిగివున్నందుకు అభినందించక తప్పదు ఈ కవిరవిని.
– ఆదివారం ఆంధ్రజ్యోతి, 22 జూలై 2012
* * *
‘దూప’ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె ద్వారా ఆర్డర్ చేసి రాయితీతో ప్రింట్ బుక్ పొందచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
దూప On Kinige
appudu palakaa balapaalam,
ippudu paatya pusthakaala, appudappudu ilaa kalasinappudu,manam mahaa grandaalam grandaalayaalam,manameppudu praana snehithulam. _eesu.