కినిగె.కాం రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, మీ ఆదరణకి, సహాయానికి, ప్రోత్సాహానికి మా ధన్యవాదాలు.
అంతర్వర్తి
ఇప్పుడు మరింత అందమైన, ప్రపంచ శ్రేణి నాణ్యతతో మా కొత్త అంతర్వర్తిని మీకు పరిచయం చేస్తున్నాము.
ఉచిత కానుక
ఏదైనా ఒక పుస్తకాన్ని కొనండి,దాన్ని మీ మిత్రులతో పంచుకోండి ఉచితంగా!
కినిగె పట్ల మీ ఆదరణకు ఈ సంతోష సమయంలో మరోసారి కృతజ్ఞత తెలుపుతున్నాం. కినిగె.కాం ద్వితీయ వార్షికోత్సవ కాలంలో మీరు కొన్న ఏ ఈ-బుక్నైనా మీకిష్టమైన వ్యక్తితో ఉచితంగా పంచుకోవచ్చు, ఆ ఈ-బుక్‌ని మీకు నచ్చిన వారికి ఉచితంగా బహుకరించవచ్చు. మీకు నచ్చిన దాన్ని మీకిష్టమైన వారితో పంచుకునే బహు చక్కని అవకాశం ఇది!
పేపాల్ సౌలభ్యం
మీరు చేసే కొనుగోళ్ళకు పేపాల్ ద్వారా చెల్లింపు జరపడం మీలో చాలా మందికి వాడుక. మీరు మీ పేపాల్ ఎకౌంట్ ఉపయోగించి కినిగె.కాం పై చెల్లింపులు జరపే సౌలభ్యం కల్పించామిప్పుడు.
ఆదా
డబ్బు ఆదా చేసుకోవడం అందరికీ ఇష్టమే. మీరు డబ్బు ఆదా చేసుకోడానికి మేమో మార్గం చూపుతున్నాం. కినిగె.కాం ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా సురవర తెలుగు కీబోర్డును ప్రత్యేక తగ్గింపు ధరకు అందిస్తున్నాం. ఇది పరిమిత కాలపు ఆఫర్. కొనండి, ఆదా చేసుకోండి. ఈ కీబోర్డు కొనేందుకు ఇక్కడ నొక్కండి.
కినిగె.కాం తరపు నుంచి మీ ప్రతీ ఒక్కరికీ మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెరుగైన సేవలందిస్తామని భరోసా ఇస్తున్నాము.
కినిగె బృందం